కువైట్, సౌదీ అరేబియా దేశాల్లో చాలా దారుణంగా ఉరిశిక్షలు అమలు చేస్తుంటారు. అంతర్జాతీయ మానవహక్కుల నుంచి ఎన్ని విజ‍్క్షప్తులు వచ్చినా తమ ధోరణి తమదే అన్నట్లుగా ఆయా దేశాలు శిక్షలు అమలు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం కువైట్ కోర్టు హత్యకు పాల్పడినందుకు ఏడుగురికి మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 2017 నుంచి కువైట్లో ప్రముఖ మానవ హక్కుల సంఘాల నుంచి ఉరిశిక్ష రద్దు విషయమై విజ‍్క్షప్తులు వచ్చినా వాటిని పక్కన పెట్టి మరీ ఈ మరణ శిక్షను ఖరారు చేసింది.
ప్రస్తుతం మరణ శిక్ష విధించబడిన వారిలో కువైట్‌కి చెందిన ఒక మహిళ, ఇద్దరు పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్తానీ ఉన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరానికి గానూ సౌదీ అరేబియా పాకిస్తాన్ పౌరులను ఉరితీసినట్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే విధంగా గతంలో సంపన్న గల్ఫ్ దేశంలో జనవరి 25, 2017న ఒక రాజకుటుంబానికి చెందిన ఒకరితో సహా సుమారు ఏడుగురిని ఒకే రోజు ఉరితీయడం పెద్ద పెద్ద కలకలం రేగింది. అప్పటి నుంచి ఉరిశిక్షలు విషయంలో ఆయా దేశాలను పునారాలోచించమంటూ మానవ హక్కుల సంఘాలు అభ్యర్థించాయి.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణమైన ఘటన విషయమై ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ తక్షణమే తాత్కాలికంగా ఉరి శిక్షలను నిలిపివేయాలని కోరింది. ఈ శిక్ష అంతిమ అమానవీయ, అవమానకరమైన శిక్షలుగా పేర్కొంది. అంతేగాదు అమ్మెస్టీ డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ అమ్నా గుయెల్లాలీ ఈ ఉరిశిక్షలను తక్షణమై తాత్కాలికంగా నిలిపేయాలని కువైట్ అధికారులకు ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్, సౌదీ అరేబియాలో ఈ శిక్షలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
అక్కడ ఒకేరోజు ఏకంగా 81 మందిని ఉరి తీశారు. కువైట్‌లో 1960ల మధ్యలో ఈ ఉరిశిక్షలను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి డజన్లకొద్దీ వ్యక్తులను ఉరితీయడం ప్రారంభించింది. వారంతా కూడా హత్యకు పాల్పడినవారు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణకు పాల్పడినవారే. అంతేగాదు కువైట్‌ని రెండున్న దశాబ్దలుగా పాలించిన అల్-సబా కుటుంబ సభ్యులను సైతం అక్కడి కువైట్ కోర్టులు మరణశిక్షలు విధించాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కువైట్ అధికారులకు ఉంది, కానీ నిందితులను ట్రయల్స్‌లోఅంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా విచారించాలని ఇలాంటి శిక్షలు విధించకూడదని ఆమ్నెస్టీ డైరెక్టర్ గుయెల్లాలి చెప్పారు.
(చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్)
Comments
Please login to add a commentAdd a comment