executes
-
కిమ్ అరాచకం: 30 మంది ప్రభుత్వ అధికారులకు ఉరి.. ఎందుకంటే!
ఉత్తర కొరియాలో ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఆ ఘటనల్లో సుమారు 4 వేల మంది మరణించినట్లు, దాదాపు 5 వేల మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు.ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 మంది అధికారులను ఉరి తీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసిట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణ శిక్ష విధించినట్లు తమ కథనాల్లో వెల్లడించింది.కాగా ఇటీవల చాగాంగ్ ప్రావిన్సులో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు.ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అయితే గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. -
ఏడుగురికి ఉరి శిక్ష..షాక్‌లో మానవ హక్కుల సంఘాలు
కువైట్, సౌదీ అరేబియా దేశాల్లో చాలా దారుణంగా ఉరిశిక్షలు అమలు చేస్తుంటారు. అంతర్జాతీయ మానవహక్కుల నుంచి ఎన్ని విజ్క్షప్తులు వచ్చినా తమ ధోరణి తమదే అన్నట్లుగా ఆయా దేశాలు శిక్షలు అమలు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం కువైట్ కోర్టు హత్యకు పాల్పడినందుకు ఏడుగురికి మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 2017 నుంచి కువైట్‌లో ప్రముఖ మానవ హక్కుల సంఘాల నుంచి ఉరిశిక్ష రద్దు విషయమై విజ్క్షప్తులు వచ్చినా వాటిని పక్కన పెట్టి మరీ ఈ మరణ శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం మరణ శిక్ష విధించబడిన వారిలో కువైట్‌కి చెందిన ఒక మహిళ, ఇద్దరు పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్తానీ ఉన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరానికి గానూ సౌదీ అరేబియా పాకిస్తాన్ పౌరులను ఉరితీసినట్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే విధంగా గతంలో సంపన్న గల్ఫ్ దేశంలో జనవరి 25, 2017న ఒక రాజకుటుంబానికి చెందిన ఒకరితో సహా సుమారు ఏడుగురిని ఒకే రోజు ఉరితీయడం పెద్ద పెద్ద కలకలం రేగింది. అప్పటి నుంచి ఉరిశిక్షలు విషయంలో ఆయా దేశాలను పునారాలోచించమంటూ మానవ హక్కుల సంఘాలు అభ్యర్థించాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణమైన ఘటన విషయమై ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ తక్షణమే తాత్కాలికంగా ఉరి శిక్షలను నిలిపివేయాలని కోరింది. ఈ శిక్ష అంతిమ అమానవీయ, అవమానకరమైన శిక్షలుగా పేర్కొంది. అంతేగాదు అమ్మెస్టీ డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ అమ్నా గుయెల్లాలీ ఈ ఉరిశిక్షలను తక్షణమై తాత్కాలికంగా నిలిపేయాలని కువైట్ అధికారులకు ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్, సౌదీ అరేబియాలో ఈ శిక్షలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఒకేరోజు ఏకంగా 81 మందిని ఉరి తీశారు. కువైట్‌లో 1960ల మధ్యలో ఈ ఉరిశిక్షలను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి డజన్లకొద్దీ వ్యక్తులను ఉరితీయడం ప్రారంభించింది. వారంతా కూడా హత్యకు పాల్పడినవారు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణకు పాల్పడినవారే. అంతేగాదు కువైట్‌ని రెండున్న దశాబ్దలుగా పాలించిన అల్-సబా కుటుంబ సభ్యులను సైతం అక్కడి కువైట్ కోర్టులు మరణశిక్షలు విధించాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కువైట్ అధికారులకు ఉంది, కానీ నిందితులను ట్రయల్స్‌లోఅంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా విచారించాలని ఇలాంటి శిక్షలు విధించకూడదని ఆమ్నెస్టీ డైరెక్టర్ గుయెల్లాలి చెప్పారు. (చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్) -
అణు శాస్త్రవేత్తను ఉరి తీశారు
టెహ్రాన్: అమెరికా కోసం గూఢచర్యం నిర్వహిస్తున్నాడనే ఆరోపణల కింద అరెస్టు చేసిన ప్రముఖ అణుశాస్త్రవేత్త శహ్రామ్ అమిరిని ఉరి తీసినట్లు ఇరాన్ ప్రభుత్వ సంస్థలు స్పష్టం చేశాయి. ఇరాన్ అణుకార్యక్రమం గురించిన కీలక సమాచారాన్ని బయటకు లీక్ చేశాడనే ఆగ్రహంతో ఆయనను ఉరి తీసినట్లు ప్రకటించాయి. సౌదీ అరేబియాలో ఆయన 2009లో కిడ్నాప్ కు గురై అనంతరం అమెరికాలో కనిపించారు. తిరిగి 2010లో ఇరాన్ కు వచ్చారు. ఆ సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వ బలగాల వద్దే ఉన్న శహ్రామ్ ను ఉరి తీసి తమ ఇంటికి మృతదేహాన్ని పంపించినట్లు అతడి తల్లి దండ్రులు చెప్పారు. అతడి మెడ చుట్టు తాడు బిగించిన గుర్తు ఉందని వివరించారు. 1977లో జన్మించిన శహ్రామ్ 2009లో మక్కా యాత్రకు వెళ్లి కనిపించకుండా పోయాడు. అనంతరం అతడు అమెరికాలోని ఓ రహస్య ప్రాంతంలో ఉండి అనంతరం ఇరాన్ కు వచ్చాడంట. అలా రహస్యంగా ఉన్న సమయంలోనే అతడు ఇరాన్ అణు కార్యక్రమాలను లీక్ చేశాడని ఆరోపించి ఇరాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. -
వారిలో నలుగురికి మరణశిక్ష అమలు..
జకార్త: అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో మరణశిక్ష విధించబడిన 14 మందిలో నలుగురికి ఇండొనేషియా ప్రభుత్వం శుక్రవారం మరణశిక్ష అమలుచేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్రికన్లతో పాటు ఓ ఇండోనేషియా పౌరుడు ఉన్నారని అధికారులు వెల్లడించారు. దీంతో భారత్‌కు చెందిన గురుదీప్ సింగ్ కుటుంబంలో ఆందోళన మొదలైంది. గురుదీప్ సింగ్ కూడా డ్రగ్స్ అక్రమరవాణా కేసులో ఇండొనేషియాలోని కోర్టుచే మరణశిక్ష విధించబడిన 14 మంది నిందితుల్లో ఒకడు. 2004లో న్యూజిలాండ్‌లో వర్క్ వీసా కోసం ప్రయత్నించిన గురుదీప్ సింగ్.. ఓ ఏజెంట్ చేతిలో మోసపోయి అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ విషయంలో సహకరిస్తామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురుదీప్ కుటుంబానికి గురువారం హామీ ఇచ్చారు. అయితే 14 మంది నిందితుల్లో నలుగురికి మరణశిక్ష అమలు చేయడంతో పాటు.. తరువాతి దశలో మరో 10 మందికి కూడా మరణశిక్ష అమలు చేయనున్నట్లు ఇండొనేషియా అధికారుల చెప్పడంతో గురుదీప్ కుటుంబ సభ్యుల్లో కలవరం మొదలైంది. ఆఫ్రికన్ పౌరులకు మరణశిక్షలు అమలుచేయడం పట్ల ఇండొనేషియా అధికారులు తొందరపాటుగా వ్యవహరించారన్న విమర్శలు వెలువడుతున్నాయి. అయితే.. డ్రగ్స్ అక్రమరవాణాకు పాల్పడిన వారిపట్ల ఇండొనేషియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని డిప్యూటీ అటార్నీ జనరల్ నూర్ రిచ్మండ్ తెలిపారు. -
బాలుని హత్యకేసులో దోషికి ఉరి అమలు
కరాచీ: ఏడేళ్ల బాలున్ని హత్య చేసిన కేసులో షెఫాకత్ హుస్సేన్‌కి పాకిస్తాన్ ఉరిశిక్ష అమలు చేసింది. 2004లో కరాచీకి చెందిన ఏడేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో షెఫాకత్ దోషిగా కోర్టు నిర్ధారించి ఉరిశిక్ష విదించింది. అయితే నాలుగుసార్లు ఉరి అమలు చివరి క్షణాల్లో వాయిదా పడుతూ వచ్చింది. ఆ సంఘటన జరిగిన సమయంలో షెఫాకత్ వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే అని, మైనర్ కావడం వల్ల ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని అతని తరఫు న్యాయవాదులు కోరారు. ఆ హత్య కూడా కావాలని చేసింది కాదని, అసంకల్పితంగా జరిగిందని కోర్టుకు తెలిపారు. దీనికి ప్రపంచ మానవ హక్కుల సంఘం వాళ్లు కూడా అండగా నిలిచినా వీటన్నిటినీ తోసి పుచ్చి సోమవారం అర్ధ రాత్రి కరాచీ జైలులో ఉరి అమలు చేసినట్టు అధికారులు తెలిపారు. న్యాయపరమైన కారణాలతో ఈ సంవత్సరంలోనే ఇప్పటికే నాలుగు సార్లు షెకావత్ ఉరి వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పటికే న్యాయస్థానం వీలైనన్ని అవకాశాలు కూడా కల్పించిందని, కానీ హత్య అతను చేయలేదని నిరూపించుకోవడంలో సరైన ఆధారాలు సమర్పించలేకపోయాడని అందుకే ఉరిశిక్ష అమలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అనేక వాయిదాలు, క్షమాభిక్ష పిటీషన్లు, అంతర్జాతీయ సహకారం, ఏవీ కూడా అతని మరణశిక్షన ఆపలేకపోయాయి.150 మంది మరణానికి కారణమైన పెషావర్ స్కూల్ బాంబు పేలుడు అనంతరం 2008నుంచి అమలులో ఉన్న ఉరిశిక్ష నిషేధాన్ని డిసెంబర్2014 నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం ఎత్తివేసింది. -
పారిపోయారని హతమార్చారు..
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామ్ రాజ్యం పేరిట భీతావహం సృష్టిస్తున్న ఐఎస్ ఉగ్రవాదుల రాక్షసకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తన సంస్థలోని నలుగురు సీనియర్ కమాండర్స్ను శుక్రవారం ఉరితీసింది. ఇరాక్ లోన్ ఉత్తర ప్రావిన్స్‌లోని సలాహుద్దీన్ కు చెందిన అధికారులు ఇరాక్ ప్రభుత్వ దళాలతో జరిగిన ఘర్షణల సందర్భంగా పారిపోయినందుకుగాను ఈ శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. తీవ్ర భయోత్పాతం సృష్టించిన ఈ సంఘటన రాజధాని బాగ్దాద్ కు సమీపంలోని షిర్ఖిత్ లో చోటు చేసుకుంది. ఐఎస్ సంస్థ చీఫ్ ఇబ్రహీం- అల్- సమర్రా అలియాస్ అబు బకర్ బాగ్దాది ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. గత ఫిబ్రవరిలో కూడా సుమారు రెండు డజన్ల మంది మిలిటెంట్లను ఈ కారణంగానే ఉరి తీసిన సంగతి తెలిసిందే.