human rights groups
-
ఏడుగురికి ఉరి శిక్ష..షాక్‌లో మానవ హక్కుల సంఘాలు
కువైట్, సౌదీ అరేబియా దేశాల్లో చాలా దారుణంగా ఉరిశిక్షలు అమలు చేస్తుంటారు. అంతర్జాతీయ మానవహక్కుల నుంచి ఎన్ని విజ్క్షప్తులు వచ్చినా తమ ధోరణి తమదే అన్నట్లుగా ఆయా దేశాలు శిక్షలు అమలు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం కువైట్ కోర్టు హత్యకు పాల్పడినందుకు ఏడుగురికి మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 2017 నుంచి కువైట్‌లో ప్రముఖ మానవ హక్కుల సంఘాల నుంచి ఉరిశిక్ష రద్దు విషయమై విజ్క్షప్తులు వచ్చినా వాటిని పక్కన పెట్టి మరీ ఈ మరణ శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం మరణ శిక్ష విధించబడిన వారిలో కువైట్‌కి చెందిన ఒక మహిళ, ఇద్దరు పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్తానీ ఉన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరానికి గానూ సౌదీ అరేబియా పాకిస్తాన్ పౌరులను ఉరితీసినట్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే విధంగా గతంలో సంపన్న గల్ఫ్ దేశంలో జనవరి 25, 2017న ఒక రాజకుటుంబానికి చెందిన ఒకరితో సహా సుమారు ఏడుగురిని ఒకే రోజు ఉరితీయడం పెద్ద పెద్ద కలకలం రేగింది. అప్పటి నుంచి ఉరిశిక్షలు విషయంలో ఆయా దేశాలను పునారాలోచించమంటూ మానవ హక్కుల సంఘాలు అభ్యర్థించాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణమైన ఘటన విషయమై ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ తక్షణమే తాత్కాలికంగా ఉరి శిక్షలను నిలిపివేయాలని కోరింది. ఈ శిక్ష అంతిమ అమానవీయ, అవమానకరమైన శిక్షలుగా పేర్కొంది. అంతేగాదు అమ్మెస్టీ డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ అమ్నా గుయెల్లాలీ ఈ ఉరిశిక్షలను తక్షణమై తాత్కాలికంగా నిలిపేయాలని కువైట్ అధికారులకు ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్, సౌదీ అరేబియాలో ఈ శిక్షలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఒకేరోజు ఏకంగా 81 మందిని ఉరి తీశారు. కువైట్‌లో 1960ల మధ్యలో ఈ ఉరిశిక్షలను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి డజన్లకొద్దీ వ్యక్తులను ఉరితీయడం ప్రారంభించింది. వారంతా కూడా హత్యకు పాల్పడినవారు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణకు పాల్పడినవారే. అంతేగాదు కువైట్‌ని రెండున్న దశాబ్దలుగా పాలించిన అల్-సబా కుటుంబ సభ్యులను సైతం అక్కడి కువైట్ కోర్టులు మరణశిక్షలు విధించాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కువైట్ అధికారులకు ఉంది, కానీ నిందితులను ట్రయల్స్‌లోఅంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా విచారించాలని ఇలాంటి శిక్షలు విధించకూడదని ఆమ్నెస్టీ డైరెక్టర్ గుయెల్లాలి చెప్పారు. (చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్) -
రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి
స్టాక్‌హోం : మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్‌లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. మానవ హక్కుల కోసం వారి విశేష కృషికి గానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది. నోబెల్ శాంతి పురస్కారం లభించిన వారు తమ స్వదేశాల్లో ప్రజల కోసం పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అధికార దుర్వినియోగాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ.. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు తెలిపింది. ‘యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపారు. శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఎంతో కృషి చేశారు.’ అని పేర్కొంది కమిటీ. ఇప్పటికే ఈ ఏడాదికి గాను వైద్య, భౌతిక, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార విజేతల పేర్లను ప్రకటించింది కమిటీ. ఇదీ చదవండి: ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్ -
అవి హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్..!
సాక్షి, చెన్నై: వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాల లభ్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తమిళ కూలీల మృతదేహాలను తమిళనాడు పోలీసులకు అప్పగించారు. అయితే వారి మరణం పై తమిళ మానవ హక్కుల సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ తమిళ మానవ హక్కుల సంఘాలు మృతదేహాలను పరిశీలించాయి. అయితే మానవ హక్కుల సంఘాలు పోలీసులను తీవ్రంగా విమర్శించాయి. ఇది ఆంధ్రా పోలీసులు చేసిన హత్యలే అని తమిళ సంఘాలు ఆరోపించాయి. ఈ విషయంపై తమిళనాడు పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం మృతదేహాలను తీసుకెళ్ళుతున్నాం. మా ప్రభుత్వం ఆదేశాల మేరకు భవిష్యత్‌లో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. 3లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన కుటుంబాలను అదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అంతేకాక చనిపోయిన వారికి ఒక్కొక్కరికి మూడు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని తమిళ ప్రభుత్వం ప్రకటించింది. -
మీ నోళ్లు తెరవరేం.. అవి ప్రాణాలు కావా?
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దారుణ మారణకాండలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించినా మానవహక్కుల సంఘాలు ఎందుకు నోళ్లు తెరవడం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అడవుల్లో దాక్కుంటూ విధ్వంసం సృష్టిస్తున్న మావోయిస్టులది పిరికిపందల చర్య అని ఆయన మండిపడ్డారు. జాతి మొత్తం ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి చెందినా.. సానుభూతి పరులు, మానవహక్కుల సంఘాలు మాత్రం సోమవారం నుంచి ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని అడిగారు. ఎవరైనా ఒక తీవ్రవాది లేదా ఉగ్రవాదిని పోలీసులు చంపితే వెంటనే చాలా తీవ్రంగా స్పందించే ఈ వర్గాలు.. ఇంత పెద్ద మొత్తంలో జవాన్లు మరణించినా ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. మానవ హక్కుల న్యాయవాదుల నుంచి అందుతున్న మద్దతుతోనే మావోయిస్టులు ఇలాంటి హింసాత్మక చర్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నిరుపేద వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తుండటంతో మావోయిస్టులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉండటం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వెంకయ్య నాయుడు చెప్పారు. వీళ్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం సేవ చేస్తున్నారని, ఈ క్రమంలో వాళ్లు తమ అమూల్యమైన జీవితాలనే పణంగా పెట్టారని తెలిపారు. వాళ్ల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత రీతిలో ఆదుకుంటాయని మంత్రి వివరించారు. -
54% పెరిగిన మరణశిక్షలు
గతేడాది చైనా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల్లోనే 90 శాతం.. 22 దేశాల్లో 1,634 మందికి మరణశిక్ష ఇస్లామాబాద్: మరణశిక్షలు నిషేధించాలంటూ ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ 2015లో ఆశ్చర్యకరంగా వాటి సంఖ్య 54 శాతం పెరిగింది. అత్యధికంగా మరణశిక్షలు విధిస్తున్న దేశాల జాబితాలో చైనా, ఇరాన్, పాకిస్తాన్, సౌదీఅరేబియా, అమెరికాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇక మొదటి మూడు దేశాల్లోనే దాదాపు 90 శాతం మరణశిక్షలు అమలయినట్లు వెల్లడించింది. 2014లో 22 దేశాల్లో 1,061 మరణశిక్షలు అమలుకాగా, 2015లో ఈ సంఖ్య 1,634కు పెరిగిందని తెలిపింది. 1989 తర్వాత గతేడాదే అత్యధికంగా మరణశిక్షలు విధించారు. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో మరణశిక్షలు విధిస్తున్నారని, అయితే వాటి వివరాలను ఆ దేశం గోప్యంగా ఉంచుతోందని ఆమ్నెస్టీ వివరించింది. డిసెంబర్16, 2014లో పెషావర్‌లో పాఠశాలపై ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మరణశిక్షపై నిషేధాన్ని ఎత్తేసి.. 2015లో 326 మందిని ఉరి తీసిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో మరణశిక్షను నిషేధించారు. గతేడాది దాదాపు 61 దేశాల్లో 1,998 మరణశిక్షలు నమోదయ్యాయి. భారత్‌లో ఒక మరణశిక్ష.. 257 మంది మృతిచెందిన 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ను గతేడాది జూలై 30న నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. అలాగే గతేడాది వివిధ కేసుల కింద దాదాపు 75 మందికి ఉరిశిక్ష విధించాలని తీర్పునిచ్చారు. క్రిమినల్ కోడ్ సవరణల కింద అత్యాచార కేసుల్లో నలుగురికి ఉరిశిక్ష ఖరారు చేశారు. మొత్తంగా 2015 చివరకు దాదాపు 320 మందికి ఉరిశిక్ష పెండింగ్‌లోఉంది.