స్టాక్‌హోం : మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్‌లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. మానవ హక్కుల కోసం వారి విశేష కృషికి గానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది.
నోబెల్ శాంతి పురస్కారం లభించిన వారు తమ స్వదేశాల్లో ప్రజల కోసం పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అధికార దుర్వినియోగాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ.. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు తెలిపింది. ‘యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపారు. శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఎంతో కృషి చేశారు.’ అని పేర్కొంది కమిటీ. ఇప్పటికే ఈ ఏడాదికి గాను వైద్య, భౌతిక, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార విజేతల పేర్లను ప్రకటించింది కమిటీ.
ఇదీ చదవండి: ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్
Comments
Please login to add a commentAdd a comment