
ప్రియురాలిని చున్నీతో హతమార్చిన ప్రియుడు
అనంతపురం జిల్లా: మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మున్నీ(25) అనే మహిళను ఆమె ప్రియుడు చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. వివరాలు.. జిల్లా కేంద్రలోని రాజీవ్‌నగర్‌కు చెందిన మున్నీకి ఇది వరకే వేరొకరితో పెళ్లయింది. మనస్పర్థలతో సంవత్సరం క్రితం విడిపోయి వేరుగా ఉంటోంది. పవన్ అనే యువకుడితో కొంతకాలంగా సహజీవనం చేస్తూ ఉంది.
సహజీవనం చేస్తున్న పవన్, మున్నీ మరొకరితో సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో శనివారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో అనంతపురం శివారులోకి తీసుకెళ్లి పథకం ప్రకారం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.