తన భార్యతో పాటు మరో వ్యక్తిపై ఉన్న అనుమానం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. హైదరాబాద్ సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తులసీనగర్లో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర ఉందన్న అనుమానంతో ఆమె భర్త రవి.. సిద్ధూ అనే ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు.
అంతేకాదు, అతడి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి.. గోనెసంచిలో వేసి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం రవి, అతడి భార్య కూడా పోలీసుల అదుపులో ఉన్నారు.
ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం!
Published Wed, Jan 15 2014 9:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement