నడిరోడ్డుపై భర్తకు భార్య దేహశుద్ధి | Wife beats husband on street road at Nalgonda district | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై భర్తకు భార్య దేహశుద్ధి

Published Sat, Dec 6 2014 3:50 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Wife beats husband on street road at Nalgonda district

నల్గొండ జిల్లా: వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. బంధువులతో కలిసి నడిరోడ్డుపైనే కట్టుకున్న వాడిని చితకబాదింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది. శ్రీనివాస్‌బాబు-అరుణకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్లుగా సాఫీగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాల కాపురంగా మారింది. దీంతో ఆరేళ్ల నుంచి భార్యభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

ఈ క్రమంలో శ్రీనివాస్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్యను తరచూ వేధింపులకు గురిచేశాడు. దీంతో విసిగిపోయిన భార్య... భర్త ఇంటికెళ్లింది. వేరే మహిళతో కలిసి ఉండటం చూసి.. అతన్ని బయటకు ఈడ్చి దేహశుద్ధి చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది.. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement