
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై సైఫాబాద్ పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ షాదన్ కళాశాల ఎదురుగా చింతలబస్తీ మార్గంలో ‘టీఎనీ్టఏ బ్యూటీ పార్లర్ అండ్ స్పా’ సెంటర్ నడుస్తోంది. ఈ సెంటర్‌కు మసాజ్ కోసం వచ్చిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో విధుల్లో ఉన్న రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్ చంచల్ బాబు, సైఫాబా ద్‌కు చెందిన ఇద్దరు ఎస్‌ఐలు, పలువురు సిబ్బందితో ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత ఓ కానిస్టేబుల్‌ను పంపి బేరం కుదుర్చుకున్నాక అతను సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాడులు చేశారు. అక్కడ నిర్వాహకులు హీనా తబస్సుమ్, జైనబ్ తబస్సుమ్‌తో పాటు విటులు మొయినుద్దీన్, పుర్కాన్‌అలీ, సాజిద్‌ఆలీ, మొయిన్ మహబూబ్ హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారితో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పీటా చట్టం కింద నిర్వాహకులు, విటులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: గచ్చిబౌలి హోటల్‌లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment