సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్స సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు అతి వేగంతో వెళ్తూ.. ఓ బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావటంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7.30 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాద సమయంలో కారును జితేష్ బుగాని అనే యువకుడు నడిపినట్లు పోలీసులు తెలిపారు. జితేష్ బుగాని తండ్రి ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి అని సమాచారం. కేసు నమోదు చేసిన ఖైరతాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా? లేదా నిర్లక్ష్యమా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment