సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి దర్శించుకునేందుకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కాగా, ఖైరతాబాద్‌లో బగా గణేష్ దర్శనం భక్తులు బారులు తీరారు. వీకెండ్, నవ రాత్రి ఉత్సవాలు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో గణపతిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగింది. శనివారం మధ్యాహ్నం నుంచి గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో, దర్శనానికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు.
మరోవైపు.. విగ్రహం వద్ద భక్తుల సంఖ్య పెరగడంతో కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెల్ ఫోన్ పోగుట్టుకున్నారని తెలుస్తోంది. బంగారం, పర్సులు, తమ విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో దొంగలు సంచరిస్తున్నారని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. ఇక, రేపు ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఖైరతాబాద్ రూట్‌లో వచ్చే మెట్రో సర్వీసులు కూడా ఫుల్ అయిపోయాయి. మెట్రోలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది.
ఇది కూడా చదవండి: హైడ్రాపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment