KHAIRATABAD Ganapati
-
గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. నగరంలో ఇవాళ జరిగిన గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి సీఎంగా నిలిచారు. ఇవాళ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నెంబర్ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారాయన.క్లిక్ చేయండి: ఖైరతాబాద్ శోభాయాత్ర.. నెవర్ భిపోర్ -
ఖైరతాబాద్‌లో కిక్కిరిసిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి దర్శించుకునేందుకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కాగా, ఖైరతాబాద్‌లో బగా గణేష్ దర్శనం భక్తులు బారులు తీరారు. వీకెండ్, నవ రాత్రి ఉత్సవాలు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో గణపతిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగింది. శనివారం మధ్యాహ్నం నుంచి గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో, దర్శనానికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు.. విగ్రహం వద్ద భక్తుల సంఖ్య పెరగడంతో కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెల్ ఫోన్ పోగుట్టుకున్నారని తెలుస్తోంది. బంగారం, పర్సులు, తమ విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో దొంగలు సంచరిస్తున్నారని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. ఇక, రేపు ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఖైరతాబాద్ రూట్లో వచ్చే మెట్రో సర్వీసులు కూడా ఫుల్ అయిపోయాయి. మెట్రోలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. ఇది కూడా చదవండి: హైడ్రాపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు -
సిటీలో 17నే నిమజ్జనం.. ఆరోజే కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలు: సీపీ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17వ తేదీన తెలంగాణలో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ జరుగనుంది. ఈనేపథ్యంలో నిమజ్జనాలకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరలోపే నిమజ్జనం జరుగుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఇదే సమయంలో నిమజ్జనాల కోసం హైదరాబాద్‌లో రూట్స్ పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.కాగా, సీపీ సీవీ ఆనంద్ శనివారం నిమజ్జన ఏర్పాట్ల సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ..విగ్రహాల కోసం అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. బాలాపూర్ గణేషుడి కోసం రూట్ పరిశీలిస్తున్నాం. చిన్న విగ్రహాలు కూడా నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్లు అన్నీ పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు, వైర్లను తొలగించారు.నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. పెండింగ్ పనులు అన్ని ఈరోజు పూర్తవుతాయి. నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. 15వేల సిటీ పోలీసులు, 10వేల మంది డీజీపీ, జిల్లాల నుండి పోలీసులు వస్తున్నారు. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రై కమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశాం. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం 1.30లోపు అవుతుంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకే పూజలు అన్నీ పూర్తి చేసుకుని విగ్రహాన్ని తరలిస్తాం. విగ్రహా నిమజ్జనం కోసం క్రెయిన్‌ను తరలించనున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అలాగే, సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వపరంగా పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుంది. బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో మరో కార్యక్రమం జరుగుతుంది. ఇక, ఎంఐఎం ఆధ్వర్యంలో సౌత్ జోన్లో ర్యాలీ కొనసాగనుంది. పలు కార్యక్రమాలు, ర్యాలీలు, నిమజ్జనాల కోసం బందోబస్తు ఏర్పాటు చేశాం. అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయని భావిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారం: అమ్రపాలి -
లంబో‘ధర’ లడ్డూ!
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఎత్తయిన గణేష్ విగ్రహం (63 అడుగులు) కూడా ఇదే. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తొలిసారిగా 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభించింది. తొలి వేలం పాటలో రూ.450కి దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో ఆ తర్వాత ప్రసాదానికి మరింత డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌నకు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలం పాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది. పోటాపోటీగా వేలం పాటలు.. ► నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా కొనసాగాయి. వినాయకుడి చేతిలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రముఖ మండపాల్లో నిర్వహించిన వేలం పాటల్లో రూ.15 కోట్లకుపైగా ఉత్సవ కమిటీలకు సమకూరినట్లు తెలిసింది. ► ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రూ.5 కోట్లు, ఖైరతాబాద్‌లో రూ. 33.75 లక్షలు, సికింద్రాబాద్‌లో రూ.19 లక్షలు, శేరిలింగంపల్లిలో రూ.1.25 కోట్లు, అంబర్‌పేటలో రూ.25 లక్షలు, మల్కాజిగిరిలో రూ.48 లక్షలు, కుత్బుల్లాపూర్‌లో రూ.2.13 కోట్లు, చార్మినార్ ఏరియాలో రూ.56.88 లక్షలు, ఉప్ప ల్లో 1.50 కోట్లు, సనత్‌నగర్‌లో రూ.12 లక్షలు, గోషామహల్లో రూ.45 లక్షలు, మలక్‌పేటలో రూ.20 లక్షలు, మేడ్చల్‌లో రూ.1.50 కోట్లు, ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ.20 లక్షల వరకు వేలం పాటలు కొనసాగాయి. ► కాగా.. బడంగ్‌పేట వీరాంజ నేయ భక్త సమాజం గణనాథుడి లడ్డూ కూడా రూ.17 లక్షలు.. చేవెళ్ల రచ్చబడం గణేషుడి చేతిలోని లడ్డూ ప్రసాదం రూ.22.11 లక్షలు, ఆదిబట్లలోని చైతన్య యూత్ అసోసియేషన్ వినాయకుడి లడ్డు రూ.12.50 లక్షలు, ఫరూక్నగర్ మండల పరిధిలోని మధురాపూర్ గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని లడ్డు రూ.11.11 లక్షలు, కొంపల్లి అపర్ణ మెడల్స్లోని లడ్డూ ధర రూ.13 లక్షలు పలికింది. ► వేలం పాటలో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని తినడం, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిణీ చేయడం, పంట పొలాల్లో చల్లడం ద్వారా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. అంతే కాదు స్థానికంగా గుర్తింపుతో పాటు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కూడా లభిస్తుండటంతో లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. రూ.1.25 కోట్లు పలికి.. ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతటా విస్తరించింది. ఈ ఏడాది గ్రేటర్లో చిన్నా పెద్దా కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. రెండు మూడేళ్ల క్రితం వరకు బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. తాజాగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డూ ప్రసాదం ఆ రికార్డును బద్దలు కొట్టింది. రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. నిత్యం రికార్డుల్లో నిలిచే బాలాపూర్ లడ్డూ మాత్రం ఈసారి రూ.27 లక్షలు పలికింది. -
దర్శనాలకు బ్రేక్.. రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణపతికి చివరి పూజ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణపతి వద్దకు దర్శనం నిలిపివేశారు. ఇప్పటి వరకు క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఇక, శోభాయాత్రకు ఖైరతాబాద్ గణపతి సిద్ధమవుతున్నాడు. ఈరోజు రాత్రి 12 గంటలకు గణపతికి చివరి పూజ ఉంటుంది. రేపు(గురువారం) ఉదయమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాగా, తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52వేల విద్యుత్ లైట్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు తాగునీటిని అందించడం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం 122 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటుతో అత్యవసర వైద్యసేవల కోసం 15 హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని, అలాగే 33 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమొద్దని సూచించారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్ అలర్ట్ -
ఖైరతాబాద్ మహాగణపతిని తొలిరోజు దర్శించుకున్న 4 లక్షల మంది భక్తులు
ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతికి సోమవారం ఉదయం 11.15 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ప్రాణప్రతిష్ట (కలశపూజ) నిర్వహించిన అనంతరం తమిళిసైతో పాటు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిలు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేశామని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, నిమజ్జనం వరకు ఇదే తరహాలో ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుందన్నారు. కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, సందీప్‌రాజ్, లక్ష్మణ్‌యాదవ్, వీణామాధురి తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఖైరతాబాద్ మహాగణపతిని సోమవారం తొలిరోజు ఏకంగా 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 75 అడుగుల భారీ కండువా, జంధ్యం ఖైరతాబాద్: వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ కండువా, జంధ్యం, గరిక మాలతో పాటు దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి 75 అడుగుల జంధ్యాన్ని, 75 అడుగుల కండువాను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, గరికమాలను ఐఏఎఎస్ అధికారి వెంకటేశ్, లడ్డూ, కరెన్సీ మాలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్ సమర్పించారు. సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి ముత్యాలాభిషేకం చేయించారు. హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ పట్టు వస్త్రాలను, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉదాన యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు గుర్రం కొండయ్య పాల్గొన్నారు. నిమజ్జానికి అన్ని ఏర్పాట్లు: మంత్రి తలసాని ఖైరతాబాద్: అన్ని పండుగలకు ఏర్పాట్లు చేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, నగర కొత్వాల్ సీవీ ఆనంద్‌లతో కలిసి సమావేశం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో కంటే 25 శాతం ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ఠించడంతో అందుకు తగినవిధంగా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాటు జరగకుండా విజయవంతం చేయాలన్నారు. నిమజ్జనం కోసం ఎన్ని క్రేన్లు కావాలన్నా ఏర్పాటు చేస్తామన్నారు. మంటప నిర్వాహకులకు ఏ ప్రాంతంలో నిమజ్జనం చేయాలో సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. బారికేడింగ్, లైటింగ్, జనరేటర్లు అన్నింటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈసారి నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ మీద 90 వేల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. -
ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి సమ్‌థింగ్ స్పెషల్
హైదరాబాద్: ఇంతింలై వటుడింతై అన్నట్లుగా ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమై 69వ సంవత్సరాలకు చేరుకుంది. ఈసారి పర్యావరణ హితంగా పూర్తిగా మట్టితో తయారు చేసిన మహాగణపతి 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. శుక్రవారం సాయంత్రం మహాగణపతికి నేత్రోనిలం (కంటిపాప ఏర్పాటు) కార్యక్రమాన్ని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని వివిధ రూపాల్లో తీర్చి దిద్దుతున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. నా పూర్వజన్మ సుకృతం.. ఖైరతాబాద్ మహాగణపతిని ఏటా వివిధ రూపాల్లో తీర్చిదిద్దే అద్భుత అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. వినాయకచవితి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా మహాగణపతి తయారీకి తప్పక వస్తాను. గత 40 సంవత్సరాలుగా మహాగణపతి సేవలో ఉన్నాను. ఈ సంవత్సరం మట్టితో మహాగణపతి అద్భుతంగా రూపుదిద్దుకుంది. 2020లో మొదటిసారిగా మట్టితో 12 అడుగుల ఎత్తులో.. ఆ తర్వాత 2022లో, 2023.. ఈ సంవత్సరం మట్టితోనే అద్భుతంగా తయారైంది. ఈసారి ప్రత్యేకతలేమిటంటే.. 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పులో, 45 టన్నుల బరువుతో శ్రీ దశమహా విద్యాగణపతిగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు నామకరణం చేసి, ఆయన ఇచ్చిన సూచనల మేరకే రూపు దిద్దుకుంది. ఒక చేతిలో గ్రంథం, వరాహదేవితో కలిసి ఉన్న మహాగణపతికి పూజ చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. మహాగణపతికి ప్రాణ ప్రతిష్ట ఇలా.. నేత్రోనిలనం చేయడం అంటే కంటి పాప అమర్చడం. ఇలా చేయడం వల్ల మహాగణపతికి రూపం వస్తుంది. వినాయక చవితి రోజు కలశ పూజ పూర్తి చేయడం ద్వారా ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. సుదర్శన్ లేని లోటు కనిపించింది.. గత సంవత్సరం వరకు ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఉన్న సింగరి సుదర్శన్ మరణానంతరం ఆయన లేని లోటు కనిపించింది. ఆయన ఆశీర్వాదంతోనే మహాగణపతి పనులను ఎప్పుడూ లేని విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దగ్గరుండి ప్రతీ పని చేస్తూ వచ్చాను. మట్టి వినాయకుడి ప్రత్యేకతలివీ.. మహాగణపతిని రూపొందించడానికి ఒక్క చుక్క పీఓపీ కూడా వాడలేదు. మొదటగా స్టీల్‌తో రూపు తీసుకువచ్చి ఆ తర్వాత జాళీని అమర్చి దానిపై గడ్డి, మట్టితో రెండో లేయర్, దానిపై ఔట్లేన్గా శాండ్, సుతిలి, ఓపీపోట్లు పౌడర్లను కలిపి మరో లేయర్, మట్టి, సుతిలి పౌడర్, బట్టతో మరో లేయర్ అమర్చి దానిపై ఫినిషింగ్ తీసుకువచ్చాం. ఇలా మొత్తం అయిదు లేయర్లు ఉన్నాయి. అయిదు లేయర్లపై వాటర్ పెయింట్స్ వాడటం వల్ల వర్షం నిరంతరంగా 4–5 గంటలు పడినా విగ్రహం ఏమాత్రం కరగదు. ఎలాంటి పగుళ్లకు అవకాశం లేదు. నిమజ్జన సమయంలో వర్షం పడి నా ఏ ఇబ్బందీ ఉండదు. నిమజ్జనం పూర్తిగా జరిగితే 8 గంటల్లో నీటిలో కరుగుతుంది. -
Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి 61 అడుగులు
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే ప్రత్యేకతలకు నిలయం. గత ఏడాది 60 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన మహాగణపతి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 61 అడుగులతో భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించిన కర్రపూజా కార్యక్రమంలో తెలిపారు. ప్రతి యేటా ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులకు మూడు నెలల ముందే నిర్జల ఏకాదశి రోజు కర్రపూజ నిర్వహించి పనులను ప్రారంభిస్తారు. అదే ఆనవాయితీగా బుధవారం సాయంత్రం ఖైరతాబాద్ మహాగణపతి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్రపూజతో విగ్రహ తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. ► 69వ సంవత్సరం సందర్భంగా ఈసారి ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌కు అంకితమిస్తూ 61 అడుగుల మట్టి వినాయకుడిని తయారుచేయాలని నిర్ణయించినట్లు కన్వీనర్ సందీప్‌రాజ్ తెలిపారు. వారం రోజుల్లో మహాగణపతి నమూనాను విడుల చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గత సంవత్సం లాగానే ఈ సంవత్సరం శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్, ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో మట్టి మహాగణపతి తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ► కర్రపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వినాయక ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పూజా కార్యక్రమంలో కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటి కార్యదర్శి భగవంతరావు, ఉపాధ్యక్షుడు కరోడిమల్, లైబ్రరీ చైర్పర్సన్ ప్రసన్న, గణేష్ ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరి సింగరి రాజ్‌కుమార్, దీక్షా చైర్మన్ హన్మంతరావు, దైవాజ్ఞశర్మ, డీసీపీ వెంకటేశ్వర్లు, అడిషనల్ డీపీసీ రమణారెడ్డి, ఏసీపీ సంజీవ్‌కుమార్, సీఐలు సత్తయ్య, నిరంజన్‌రెడ్డి, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటంకాలు సృష్టిస్తే ప్రగతిభవన్లోనే నిమజ్జనాలు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని లేనిపక్షంలో ప్రగతిభవన్ వేదికగా గణేశ్ నిమజ్జనం నిర్వహించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వు లను ఉల్లంఘించే సీఎస్ సోమేశ్‌కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి ఆటంకాలు సృష్టించడం సిగ్గుచేటన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్‌తోపాటు మరికొందరు నేతలతో కలసి సోమవారం ఆయన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 25 కిలోల లడ్డూ ప్రసాదాన్ని బండి సంజయ్ నెత్తిన పెట్టుకొని కొద్దిదూరం నడిచి వెళ్లి మహాగణపతికి సమర్పించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఏటా వినాయక నిమజ్జనాలు ఉద్రిక్త వాతావరణంలో జరుపుకునే దుస్థితి టీఆర్ఎస్ పాలనలో ఏర్పడింది. ఈ ఉత్సవాలు జరుపుకునేందుకు అన్ని అనుమతులు తీసుకున్నాక కూడా ప్రభుత్వం నిమజ్జనాలకు ఆటంకాలు సృష్టిస్తోంది. ఏటా గణేశ్ మండపాల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. హిందువుల పండుగలంటేనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశంగా మారుస్తోంది’ అని ఆరోపించారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు సైతం పాతబస్తీలో రంజాన్ సందర్భంగా ముస్లింలు ర్యాలీలు చేపట్టారని.. బాదం, పిస్తాలు పంచినా తాము అడ్డుకోలేదని చెప్పారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని.. ట్యాంక్‌బండ్ వద్ద ఎలా నిమజ్జనం చేసుకోవాలో తమకు తెలుసన్నారు. సమాజమంతా బాగుండాలని కోరుకునే వాడే నిజ మైన హిందువని, హిందువులంతా సంఘటితం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాగా, ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన పలువురు హోంగార్డులు సంజయ్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. హైకోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలిచ్చినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా రు. ఇందుకు సంజయ్ స్పందిస్తూ కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తేనే హోంగార్డులతోపాటు ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదీ చదవండి: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం.. మెట్రో కిటకిట -
ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ వినాయకుడు వద్ద సందడి
-
ఖైరతాబాద్ గణనాథునికి 100 కేజీల లడ్డూ
సాక్షి, మండపేట: వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణనాథునికి తాపేశ్వరం మడత కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్ 100 కిలోల లడ్డూను కానుకగా అందజేసింది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు స్వామి వారికి లడ్డూను కానుకగా పంపించారు. ఖైరతాబాద్ గణపయ్యకు 2010 నుంచి లడ్డూను కానుకగా మల్లిబాబు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల ప్రారంభానికి పది రోజుల ముందే మల్లిబాబు, సిబ్బంది గణపతి మాలలు ధరించి అత్యంత నియమనిష్టలతో లడ్డూ తయారు చేసేవారు. 2010లో 500 కిలోల లడ్డూ తయారుచేసి పంపగా, విగ్రహ పరిమాణాన్ని బట్టి ఏటా లడ్డూ పరిమాణం పెంచుతూ వచ్చారు. 2011లో 2,400 కిలోల లడ్డూ సమర్పించగా, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు, 2015లో 6 వేల కిలోల లడ్డూను స్వామి వారికి కానుకగా అందజేశారు. లడ్డూలను గణనాథుని చేతిలో ఉంచి, ఉత్సవాలు ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. (ప్రేక్షకులను ఉర్రూతలుగించిన వినాయకుడి పాటలు) 2016లో కమిటీ సూచన మేరకు 500 కిలోల లడ్డూను కానుకగా పంపారు. అయితే ఎంతో నియమనిష్టలతో, తీవ్ర వ్యయప్రయాసాలకోర్చి అందజేసిన లడ్డూ నైవేద్యానికి కమిటీ సరైన రక్షణ కల్పించకపోవడం మల్లిబాబును తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా 2017 ఉత్సవాల నుంచి భారీ లడ్డూ కానుకను నిలిపివేసినా 25 కిలోల లడ్డూ కానుకగా అందజేస్తూ వచ్చారు. కాగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు ఈ ఏడాది ఉత్సవాలకు 100 కిలోల లడ్డూ తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఖైరతాబాద్‌లో తొమ్మిది అడుగుల వినాయకుని విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నట్టు మల్లిబాబు తెలిపారు. లడ్డూను శుక్రవారం ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్‌కు తరలించామన్నారు. -
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ వినాయకుడు
-
‘బలవంతంగా నిమజ్జనం చేయడం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళుతున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం బుధవారం ఉదయం 12 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్‌ను చేరుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి అవుతుందని తెలిపారు. కాగా మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేలా హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్ సాగర్‌లో పూడిక తీశారని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారన్నారు. మొదటి రోజు నుంచి కూడా అధికారులు భక్తులకు, సందర్శకులకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, మేము బలవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం లేదు స్పష్టం చేశారు. ఒకవైపు ముస్లింల పండుగ మొహర్రం జరుగుతోంది.. మరోవైపు వినాయకచవితి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు అన్ని ఏర్పాట్లుచేసి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ ప్రధాన భూమిక పోషిస్తోందని చెప్పారు. క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం సాగర్‌లో నిమజ్జనం అవుతుందని తెలిపారు. -
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న వెంకయ్య
నగరంలోని ఖైరతాబాద్ వినాయకుడిని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆదివారం దర్శించుకున్నారు. మండప నిర్వాహకులు మంత్రులకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఏక దంతుని దర్శించుకున్న అనంతరం నిర్వాహకులు మంత్రులకు గణనాథుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మంత్రులను శాలువాలు కప్పి సత్కరించారు.