మసాజ్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సెంటర్ పై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన నగరంలోని అమీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులకు సమాచారం వచ్చింది. ముగ్గురు యువతులతో పాటు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.