ameer pet
-
మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్ : మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో అమీర్‌పేటలోని మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్ మళ్ళింపులు విధించారు. ఇవి గురువారం నుంచి 45 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరించాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం కోరారు. ►ఎర్రగడ్డ, అమీర్‌పేట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాహనాలను ఎస్సార్‌నగర్‌లోని ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి ఎస్సార్‌నగర్ ఠాణా, ఎస్సార్‌నగర్ టి జంక్షన్, సత్యం థియేటర్, దుర్గామాత టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మార్గం వన్‌వేగా ఉండే నేపథ్యంలో దీనికి వ్యతిరేక దిశలో వాహనాలు అనుమతించరు. ►ఫతేనగర్ నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను సత్యం థియేటర్ వైపు అనుమతించరు. వీటిని బల్కంపేట ఆర్ అండ్ బీ ఆఫీస్, డీకే రోడ్, జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్ మీదుగా పంపిస్తారు. ►ఎర్రగడ్డ వైపు నుంచి మధురానగర్, కళ్యాణ్‌నగర్ వైపు వెళ్ళే తేలికపాటి వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఉమేష్ చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి కుడి వైపునకు భారీ వాహనాలను ఎడమ వైపునకు మళ్లిస్తారు. ►జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్, అమీర్‌పేట–సోనాబాయ్ టెంపుల్ మధ్య ఇరుకైన రోడ్డు కావడంతో దీన్ని వన్‌వేగా చేస్తున్నారు. సోనాబాయ్ టెంపుల్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. ►బేగంపేట నుంచి ఎస్సార్‌గనర్, యూసుఫ్‌గూడ వైపు వెళ్ళే వాహనాలను సత్యం థియేటర్ వైపు అనుమతించరు. వీటిని దుర్గామాత దేవాలయం నుంచి మైత్రివనం వైపు మళ్ళిస్తారు. ►ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా, ఎస్సార్‌నగర్ టి జంక్షన్ మధ్య ఉన్న బై లైన్ రోడ్స్‌లో కమ్యూనిటీ హాల్ రోడ్ మినహా మిగిలినవి మూసేస్తారు. ►అమీర్‌పేట జంక్షన్ నుంచి మైత్రివనం, ఎస్సార్‌నగర్ వైపు వెళ్ళే వాహనాలు యథావిధిగా ప్రయాణిస్తాయి. ►ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తగిన రూట్లు ఎంపిక చేసుకుంటే మంచిది. -
మసాజ్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సెంటర్ పై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని అమీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులకు సమాచారం వచ్చింది. ముగ్గురు యువతులతో పాటు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భవనంపై నుంచి పడి యువతి మృతి
హైదరాబాద్: భవనంపై నుంచి పడి ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని అమీర్‌పేట్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. విజయా డయాగ్నసిస్‌లో టెక్నిషియన్‌గా పని చేస్తోన్న అరుణ అనే యువతి భవనం పై నుంచి పడి మృతి చెందింది. ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పై నుంచి జారిపడిందా లేక ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కేరళకు వాసిగా గుర్తించారు. -
అమీర్ పేట బిగ్ బజార్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలో రద్దీ ప్రాంతమైన అమీర్ పేట బిగ్ బజార్ లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్తానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఈ సంఘటనతో బిగ్ జజార్ సిబ్బంది, జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
అమీర్‌పేటలో అగ్నిప్రమాదం
-
హైదరాబాద్; అమీర్‌పేటలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలో సవేరా హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నిత్యం జనసమ్మర్థం ఉండే మైత్రీవనం ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. మైత్రీవనం వద్ద జనం భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.