Madras High Court Says to DGP, Install CCTV in Spa Massage Centers - Sakshi
Sakshi News home page

స్పా, మసాజ్‌ సెంటర్లలో అశ్లీల కార్యక్రమాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Published Wed, Feb 9 2022 5:51 PM | Last Updated on Wed, Feb 9 2022 6:44 PM

Madras High Court Say To DGP, Install CCTV In Spa Massage Centers - Sakshi

సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని మసాజ్‌ సెంటర్లు, స్పా, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని డీజీపీ శైలేంద్ర బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కెమెరాలను కంట్రోల్‌ రూమ్‌లకు అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని పలు మసాజ్‌ సెంటర్లు, స్పాలు, బ్యూటీ క్లబ్‌లు, సెంటర్లు, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సైతం దాడులు చేస్తున్నారు. విల్లుపురంలోని ఓ ఆయుర్వేద చికిత్స కేంద్రంలో పోలీసులు తరచూ నిర్వహిస్తున్న సోదాలను వ్యతిరేకిస్తూ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ విచారణ సమయంలో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. మసాజ్‌ సెంటర్లు, స్పాల ముసుగులో సాగుతున్న కార్యక్రమాలను గుర్తుచేస్తూ, పోలీసులకు సమాచారం వస్తే ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పాలు, మసాజ్‌ సెంటర్లు, ఆయుర్వేద చికిత్స కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఈ మేరకు  ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: Karnataka Hijab Row: హిజాబ్‌ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే..   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement