illegal activities
-
బ్యూటీ పార్లర్లో మసాజ్‌లు
ఏలూరు టౌన్: ఏలూరు టూటౌన్ ప్రాంతంలోని బ్యూటీపార్లర్‌పై పోలీసులు మంగళవారం దాడులు చేశారు. బ్యూటీపార్లర్‌లో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో టూటౌన్ సీఐ వైవీ రమణ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. గత కొంత కాలంగా ఎస్ఎస్ బ్యూటీ పార్లర్ పేరుతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నిర్వాహకుడు నాగార్జునతోపాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బ్యూటీ పార్లర్ పేరుతో నిర్వహించే ఈ సెంటర్లో బాడీ మసాజ్ చేస్తున్నారని, ఇతర ప్రాంతాలకు చెందిన యువతులను తీసుకువచ్చి ఇలాంటి పనులు చేయిస్తున్నారని సమాచారం. అదుపులోకి తీసుకున్నవారిలో విజయవాడకు చెందిన ఒక మహిళతోపాటు, యువతులు ఉన్నారు. దాడుల సమయంలో నిర్వాహకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ప్రతీ నెలా పోలీసులు దాడులు చేయకుండా ఒక వ్యక్తికి డబ్బులు చెల్లిస్తున్నానని, ఎందుకు దాడులు చేస్తున్నారంటూ ప్రశ్నించినట్లు సమాచారం. పోలీసులను మేనేజ్ చేసేందుకు రూ.30 వేలు నిర్వాహకుడి నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. గతంలోనూ అతనిపై ఏలూరు టూటౌన్ పరిధిలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు ప్రతీ నెలా డబ్బులు ఇవ్వాలంటూ పేకాట శిబిరాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారి నుంచి డబ్బులు వసూలు చేయటంలో అతను సిద్ధహస్తుడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏలూరు త్రీటౌన్ పరిధిలోనూ కొంత కాలం క్రితం పేకాట శిబిరాన్ని నిర్వహించగా, పోలీసుల ఒత్తిడితో మానుకున్నట్లు తెలుస్తోంది. -
33 ఏళ్ల తర్వాత మళ్లీ ‘వ్యభిచారం’!
నిజామాబాద్ జిల్లా: మూడు దశాబ్దాల క్రితం... దేశం మొత్తం ఆ ఊరి గురించే మాట్లాడుకుంది. అండర్ గ్రౌండ్లలో బంధించి మరీ అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజలు తిరగబడడంతో ఆ ముఠా ఊరు విడిచి పరారైంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే ముఠా సంచారం ఆ ఊరిని ఆందోళనకు గురి చేస్తోంది. నందిపేటలో.. గ్రామస్తుల కృషితో అంతమైన వ్యభిచార వృత్తి మళ్లీ మొదలైంది. ఊరి జనం దాడి చేయడంతో పారిపోయిన వ్యభిచార గృహాల నిర్వాహకులు మళ్లీ అక్కడ అడుగుపెట్టారు. అయితే కూలీ పనులు చేసుకుని బతుకుతామని బతిమాలి.. తిరిగి పాత వ్యవహారాలనే వెలగబెడున్నారు. నందిపేట సమీపంలోని లక్కంపల్లి ప్రాంతంలో వీళ్లు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నివాసాలు మళ్లీ వ్యభిచార కేంద్రాలుగా మారాయి. అమ్మాయిలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి బలవంతంగా ఈ రొంపిలోకి దింపుతున్నారు. ఐదు రోజుల క్రితం పోలీసులు దాడులు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.33 ఏళ్ల కిందట ఏం జరిగిందంటే.. 1992లో 13 ఏళ్ల బాలికను చిత్రహింసలు పెడుతూ వ్యభిచార రొంపిలోకి దింపడానికి ప్రయత్నించాగా ఆమె తప్పించుకుని ప్రజలను రక్షించాలని వేడుకుంది. దీంతో.. వ్యభిచార కూపాలపై గ్రామస్తులంతా దాడులు చేసి నిర్వాహకులను పరిగెత్తించారు. వారి ఇళ్లను తగులబెట్టి, నిర్వాహకులను తరిమి కొట్టారు. ఈ కూపంలో ఇరుక్కున్న అమ్మాయిలకు విముక్తి కల్పించారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అండర్ గ్రౌండ్ గదుల్లో అమ్మాయిలను బంధించి వ్యభిచార కూపంలోకి దించేందుకు చిత్రహింసలు పెట్టేవారని, వినకపోతే చంపడానికి కూడా వెనుకాడబోయే వారు కాదని తేలింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా.. ఆంగ్ల, హిందీ ప్రముఖ పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి. -
Gachibowli: విదేశీ యువతులతో వ్యభిచారం
గచ్చిబౌలి: విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. మంగళవారం రాత్రి టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ఇంట్లో గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఒక విటుడు, 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. టాంజానియా, కజికిస్తాన్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
TDP ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
-
దెందులూరులో పరాకాష్టకు చేరిన చింతమనేని అరాచకాలు
-
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి
న్యూఢిల్లీ: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సీసీపీఏ సూచించింది. అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీని జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రకటనలు, ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సీసీపీఏ పేర్కొంది. ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు నేరుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలు ఇస్తున్నాయి‘ అని సీసీపీఏ తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలను బలపర్చడమనే ది ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా యువతపై, తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది. వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని సీసీపీఏ తెలిపింది. చట్టవిరుద్ధమైన వాటిని ఏ రకంగా ప్రమోట్ చేసినా ఆయా కార్యకలాపాల్లో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. -
బాబూ! ఆ డబ్బెక్కడిది?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించింది. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీన ఈ నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ జాతీయ ఇంగ్లిష్ దినపత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఇన్ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఆగస్టు 4న చంద్రబాబుకు జారీ చేసిన ఈ షోకాజ్ నోటీసులపై ఆ పత్రిక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక ప్రచురించిన కథనం మేరకు వివరాలివీ... మనోజ్ వాసుదేవ్ సోదాల్లో విషయం వెలుగులోకి... మనోజ్ వాసుదేవ్పార్థసాని 2017 నుంచీ షాపూర్జీ పల్లోంజీ సంస్థ పాల్గొనే టెండర్ల ప్రక్రియలో చురుగ్గా ఉంటున్నారు. ఆ సంస్థ తరఫున ఈయనే మధ్యవర్తిగా వ్యవహారాలు నడిపేవారు. ఈయనకు చెందిన మనోజ్ పార్థసాని అసోసియేట్స్ కార్యాలయంలో 2019లో ఐటీ శాఖ అధికారులు జరిపిన సోదాలతో చంద్రబాబు నాయుడు గుట్టుగా సాగించిన అవినీతి బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల పేరుతో షాపూర్జీ పల్లోంజీ నుంచి భారీ ఎత్తున నగదును తరలించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించారని కూడా గతంలో ఐటీశాఖ తన నివేదికలో వెల్లడించింది. సోదాల సమయంలో కొన్ని మెసేజ్‌లు, వాట్సాప్ చాటింగ్స్, ఎక్సెల్ షీట్లను మనోజ్ వాసుదేవ్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, అందులో కొన్ని ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీల నుంచి నగదును అక్రమంగా తరలించి ‘మీకు చేరుస్తున్నాం’ అని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నట్లు ఐటీ శాఖ వివరించింది. ఆ నోటీసుల ప్రకారం మనోజ్ పార్థసాని చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్‌తో 2016 నుంచీ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని శ్రీనివాస్ తనను అడిగినట్లు కూడా మనోజ్ వాసుదేవ్ అప్పట్లో వెల్లడించారని ఐటీ పేర్కొంది. అయితే షాపుర్జీ పల్లోంజీ సంస్థ బడా కార్పొరేట్ కంపెనీ కనక... డబ్బును తరలించడానికి వారంతా కలిసి ఓ తెలివైన మార్గాన్ని ఎంచుకున్నారు. వాస్తవంగా ఎటువంటి పనులు చేయకుండానే షాపూర్జీ పల్లోంజీ నుంచి వివిధ ప్రాజెక్టులు చేసినట్లుగా షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులు పెట్టి ఆయా కంపెనీలకు నగదును తరలించారు. ఈ విషయాన్ని 2019 నవంబరు 1న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మనోజ్ పార్థసాని తెలియజేశారు. కేవలం షాపుర్జీ పల్లోంజీయే కాకుండా ఎల్అండ్టీ వంటి ఇన్ఫ్రా కంపెనీల నుంచి ఫోనిక్స్ ఇన్ఫ్రా, పోర్ ట్రేడింగ్ వంటి షెల్ కంపెనీలకు నకిలీ బిల్లుల ఆధారంగా నగదును తరలించినట్లు ఐటీ శాఖకు అర్థమయింది. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆ డబ్బుకు లెక్కలు చెప్పాలని, అవి ఎలా వచ్చాయో తెలియజేయాలని బాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. శ్రీనివాస్ నుంచి చంద్రబాబు నాయుడుకు నగదు చేరినట్లుగా ధ్రువీకరించే ఆధారాలను, నేరాన్ని ధ్రువపరిచే వివిధ సందేశాలు, చాట్లు, ఇంకా ఎక్సెల్ షీట్లను సైతం సెర్చ్ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ సాక్ష్యాలను మనోజ్ వాసుదేవ్‌కు చూపించి విచారించగా ఇన్ఫ్రా కంపెనీల నుంచి బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును ఎలా తరలించారన్న విధానాన్ని మొత్తం వివరించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ బోగస్ కంపెనీల ద్వారా తరలించిన నగదు ద్వారా అంతిమంగా లబ్థి పొందింది చంద్రబాబేనని ఐటీ శాఖ పేర్కొంది. మనోజ్ వాసుదేవ్ ద్వారా సబ్‌కాంట్రాక్టుల ద్వారా అందుకున్న రూ.118,98,13,207 మొత్తాన్ని 2020–21లో వచ్చిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. అమిత్ షాను బాబు కలవటంపై అనుమానాలు!! 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడుతూ నానా తంటాలూ పడుతున్న వేళ ఈ నోటీసులు రావటంపై ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌లో చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కావటాన్ని కూడా హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రస్తావించింది. ఈ నోటీసుల విషయమై తాము అటు చంద్రబాబు నాయుడిని, ఇటు కేంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖలను ఈ మెయిల్ ద్వారా సంప్రదించామని, ఎవ్వరూ స్పందించలేదని కూడా పత్రిక వెల్లడించింది. లెక్క తేలని మొత్తం రూ.2,000 కోట్లు అమరావతిలో రాజధాని పేరిట తాత్కాలిక భవనాలను నిర్మించిన చంద్రబాబు... అందులో భారీ కుంభకోణానికి తెగబడినట్లు తాజా ఐటీ నోటీసులతో మరోసారి బట్టబయలైంది. తాత్కాలిక నిర్మాణాల పేరుతో పనుల అంచనా విలువలను భారీగా పెంచేసి అడ్డగోలుగా దోపిడీ చేసిన వైనాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. తాత్కాలిక సచివాలయాన్ని రూ.181 కోట్లతో పూర్తి చేయాలని తొలుత అంచనా వేసుకుంటే దాన్ని పెంచుకుంటూ రూ.1,151 కోట్లు ఖర్చు చేశారంటే... అంచనాలు ఎన్ని రెట్లు పెంచారో, అడ్డగోలు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తేలిగ్గానే అర్థమవుతుంది. 2020, ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.2,000 కోట్ల వరకు లెక్క చూపని ఆదాయానికి సంబంధించిన లావాదేవీలు బయటకు తీసిన విషయాన్ని ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులతో సహా అప్పట్లోనే ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఒకే కంప్యూటర్ నుంచి ఆయా సంస్థలకు చెందిన బిల్లుల చెల్లింపులు, ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. చంద్రబాబు కొండంత అవినీతి చేస్తే మచ్చుకు రూ.2,000 కోట్లు మాత్రమే బయటకు వచ్చాయని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని భారీ మొత్తాలు వెలుగులోకి వస్తాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అడ్డగోలు వాదన... బాబుకు అలవాటే!! చంద్రబాబు నాయుడికైనా, రామోజీరావుకైనా అడ్డంగా వాదించటం పెన్నుతో పెట్టిన విద్య. ఎందుకంటే వీళ్లను ఎవరైనా ‘మీరు ఈ నేరం చేశారా?’ అని అడిగితే... తాము చేస్తే చేశామనో, లేకపోతే చేయలేదనో వీళ్లు నేరుగా చెప్పరు. చేసిన నేరాన్ని తప్పించుకోవటానికి ముందుగా ఎదుటి వ్యక్తికి తమను అడిగే అర్హత లేదనో, లేకపోతే తమకు ఆ చట్టం వర్తించదనో, లేకపోతే ఫలానా చట్టం ప్రకారం తమను ప్రశ్నించజాలరనో ఎదురు తిరుగుతారు. అలా... కేసును దశాబ్దాల పాటు సాగదీస్తారు. పైపెచ్చు తమపై ఎలాంటి కేసులూ రుజువు కాలేదని, తాము శుద్ధపూసలమని చెబుతుంటారు. అసలు విచారణ జరగనిస్తే కదా... వీళ్లు తప్పు చేశారో లేదో తేలటానికి!!. ఇదే రీతిలో ఐటీ శాఖ నోటీసులకు కూడా చంద్రబాబు నాయుడు విచిత్రమైన సమాధానమిచ్చారు. సోదాల్లో చంద్రబాబు నాయుడి పాత్రను బయటపెట్టే ఆధారాలు లభించటంతో... నేరుగా ఆయన ఖాతాల్లోకి ఎంత ముడుపులు వెళ్లాయనే విషయమై ఒక అంచనాకు వచ్చి... అది ఎలా వచ్చిందో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు దానికి నేరుగా సమాధానమివ్వకుండా... తనకు నోటీసులిచ్చే అధికారం సదరు సెంట్రల్ సర్కిల్ అధికారికి లేదంటూ జవాబిచ్చారు. దాన్ని పరిశీలించిన ఐటీ శాఖ... సెక్షన్లను ఉటంకిస్తూ సదరు కేసును ఆ అధికార పరిధి ఉన్న డిప్యూటీ కమిషనర్‌కు బదిలీ చేస్తూ... డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. దీన్ని అక్రమ ఆదాయంగా పేర్కొంటూ చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల్లో ప్రశి్నంచింది. ఇది కూడా చదవండి: ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం జగన్‌కు యూనిసెఫ్ టీమ్ అభినందన -
Hyderabad: పంజాగుట్టలో స్పా ముసుగులో వ్యభిచారం.. 20 మంది అరెస్టు
పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులతో పాటు, విటులను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–1 నవీన్‌నగర్‌లో స్పా ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు పంజగుట్ట పోలీసుల సహకారంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యభిచారం కేంద్రం నిర్వాహకులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అక్షయ్ అలియాస్ వినయ్, అదే ప్రాంతానికి చెందిన సబ్ ఆర్గనైజర్ ఆర్.శృతి, అందులో ఉద్యోగం చేసే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 20 మంది యువతులను కాపాడారు. విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!
సాక్షి,పెనుకొండ: మండలంలోని శెట్టిపల్లికి చెందిన సిద్దయ్య టీడీపీ మండల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి, ఆయన అల్లుడు శశిభూషణ్‌కు నమ్మిన బంటు. పైకి రాజకీయ నేతగా కనిపించే సిద్దయ్య... చేసేదంతా అక్రమ దందానే. ఏళ్లుగా కర్ణాటక మద్యం అక్రమంగా జిల్లాకు తెచ్చి సొమ్ముచేసుకుంటున్నట్లు పచ్చ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్యే, అతని అల్లుడి పేర్లు చెప్పి మద్యం దందా జోరుగా సాగించాడు. అనంతపురంలో కాపురం..శెట్టిపల్లి నుంచి దందా.. అక్రమార్జనే పరమావధిగా పనిచేసిన సిద్దయ్య టీడీపీ హయాంలో అడ్డంగా సంపాదించాడు. అధికారులు ఎవరైనా దృష్టి సారిస్తే బీకే పేరు చెప్పి తప్పించుకునేవాడు. కానీ రాష్ర్టంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సిద్దయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పోలీసులకు భయపడి మకాం అనంతపురానికి మార్చాడు. అక్కడి నుంచే తన స్వగ్రామం శెట్టిపల్లిలో వ్యవహారాలు నడిపేవాడు. మూడేళ్లుగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తూ గ్రామీణుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. పగలంతా అనంతపురంలో ఖద్దరు దుస్తుల్లో కనిపించే సిద్దయ్య, రాత్రి కాగానే జిల్లా సరిహద్దులోని కర్ణాటకలోని మద్యం షాపుల్లో సరుకు కొని తన స్వగ్రామానికి తరలించేవాడు. అతను స్థానికంగా కనిపించపోవడంతో పోలీసులూ పెద్దగా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆధిపత్య పోరుతోనే... టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే సిద్దయ్య పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎవరినీ సంప్రదించకుండానే సిద్దయ్యను పార్టీ మండల కన్వీనర్‌గా ప్రకటించారు. దీంతో మండల కన్వీనర్ రేసులో ఉన్న నేతలంతా రగిలిపోయారు. కర్ణాటక మద్యం తెచ్చుకుని అమ్ముకునే సిద్దయ్యకు మండల కన్వీనర్ పోస్టు ఇవ్వడం ఏమిటని బీకేని కొందరు ప్రశ్నించారు. ఆయన పట్టించుకోకపోవడంతో పలువురు నేతలు టీడీపీకే చెందిన ఓ నాయకురాలి వర్గంలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలనూ ఎవరికి వారు నిర్వహిస్తూ ఆధిపత్య పోరు సాగించారు. పలు కార్యక్రమాల్లో సిద్దయ్యపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఉప్పందించిన ‘పచ్చ’ నేతలు.. సిద్దయ్య అక్రమ మద్యం దందా చేయడం...అలాంటి వ్యక్తికి బీకే సహకరిస్తూ మండల కన్వీనర్ పదవి ఇవ్వడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సిద్దయ్య కర్ణాటక మద్యం దందాపై పోలీసులకు పలుమార్లు ఉప్పందించినట్లు తెలుస్తోంది. అయితే మద్యం దందాలో ఆరితేరిపోయిన సిద్దయ్య... ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దయ్య తన అనుచరులతో కలిసి కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తీసుకువస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో బీకే వ్యతిరేక వర్గంలోని వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రి 12 గంటల ప్రాంతంలో మరవపల్లి సమీపంలో సిద్దయ్యతో పాటు అతని అనుచరులు పెనుకొండకు చెందిన దూదేకుల బాషా, ధర్మవరానికి చెందిన బిర్రు ప్రశాంత్‌కుమార్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కృష్ణారెడ్డిని పట్టుకున్నారు. మద్యం బాక్సులతో పాటు కారు, ద్విచక్ర వాహనం స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు కూడా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తమకు వచ్చిన పక్కా సమాచారంతోనే దాడి చేసినట్లు పేర్కొనడం విశేషం. కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలే టార్గెట్.. తన అనుచరులతో కలిసి కర్ణాటక అక్రమ మద్యం దందాను అత్యంత గుట్టుగా నిర్వహిస్తున్న సిద్దయ్య... కొత్తచెరువు–పుట్టపర్తి మండలాల్లోని పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మద్యాన్ని శెట్టిపల్లికి తీసుకువచ్చిన వెంటనే తన అనుచరులతో కలిసి గ్రామాల్లో... తమకు అనుకూలంగా ఉన్న మద్యం వ్యాపారులకు చేరవేసే వాడని తెలిసింది. తాను పెనుకొండ మండల టీడీపీ కన్వీనర్ కావడం వల్ల ఆ మండలంలో వ్యాపారం చేస్తే తెలిసిపోతుందని భావించే...పక్కన ఉన్న కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా అనంతపురం నుంచే ఫోన్ ద్వారా నడిపేవాడని తెలుస్తోంది. సంబరాల్లో మరో వర్గం.. మద్యం అక్రమ రవాణా చేస్తూ సిద్దయ్య పట్టుబడటంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు స్థానిక హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో సమావేశమై ఆనందోత్సాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోన్లలోనూ ‘సిద్దయ్య...దొరికిపోయాడు’ అని సంతోషంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ నాయకురాలికి ఫోన్లో తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. (చదవండి: సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్) -
భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. బోర్డు సభ్యులు పేర్లు బయటపెట్టకుండా హర్భజన్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ క్రికెట్లో కలకలం రేపింది. పీసీఏ చీఫ్ అడ్వైజర్‌గా ఉన్న భజ్జీ చేసిన వ్యాఖ్యలే తాజాగా నిజమయ్యాయి. పీసీఏ అధ్యక్షుడిగా ఉన్న గుల్జార్ ఇందర్ సింగ్ చహల్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశాడు. పీసీఏలో గుల్జార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గుల్జార్ సహా అతని బృందం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మే నెలలో పీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన గుల్జార్‌కు ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుల్జార్ చహల్ పేర్కొన్నారు. ఇక హర్భజన్ రాసిన లేఖలో ఏముందంటే.. ''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్.. -
చైనా ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రపంచవ్యాప్తంగా రహస్య పోలీస్ స్టేషన్లు!
బీజింగ్: గ్లోబల్ సూపర్‌పవర్‌గా ఎదగాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అభివృద్ధి చెందిన కెనడా, ఐర్లాండ్ వంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అక్రమంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ రహస్య పోలీస్ స్టేషన్లపై సంచలన విషయాలు వెల్లడించింది ఓ నివేదిక. ఈ అంశంపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడా వ్యాప్తంగా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో(పీఎస్బీ) అనుబంధంగానే అలాంటి అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ రిపోర్టికా..స్థానిక మీడియాతో వెల్లడించింది. చైనా విరోధులను నిలువరించేందుకు ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గ్రేటర్ టొరొంటే ప్రాంతంలోనే ఇలాంటివి మూడు స్టేషన్లు ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా పలు దేశాల్లో ఎన్నికలను సైతం చైనా ప్రభావితం చేస్తోందని సంచనల విషయాలు వెల్లడించింది. 21 దేశాల్లో 30 అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చైనాలోని ఫుఝో పోలీసులు తెలిపారని రిపోర్టికా పేర్కొంది. ఉక్రెయిన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాల్లోనూ చైనా పోలీస్ స్టేషన్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారని తెలిపింది. ఆయా దేశాల్లోని పలువురు నేతలు చైనా ప్రబల్యాన్ని ప్రశ్నిస్తున్నారని, మానవ హక్కులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రిపోర్టికా పేర్కొంది. మరోవైపు.. స్వదేశంలో భద్రత పేరుతో ప్రజలను అణచివేస్తున్న తీరుపై అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నారు మానవ హక్కుల ప్రచారకర్తలు. ఇదీ చదవండి: జనంలోకి జిన్‌పింగ్ -
తప్పు చేస్తే జైలుకి పంపారు.. మళ్లీ అక్కడ కూడా అదే తంతు!
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రంలో ఏ జైలులోనైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే అందుకు సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేయాల్సి వస్తుందని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. శనివారం వికాససౌధలో ఇటీవల ఏర్పాటైన కారాగృహ అభివృద్ధి మండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు. జైళ్లు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కారాగృహంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగళూరు పరప్పన అగ్రహార, బెళగావిలోని హిండలగ, బళ్లారి జైలులో నిరంతరం అక్రమ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జైలులో నిందితులపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పునరావృతం కారాదని, ముందు ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనల్లో 15 మందిని సస్పెండ్ చేసి 30 మందిని బదిలీ చేసినట్లు చెప్పారు. సమావేశంలో డీజీపీ ప్రవీణ్ సూద్, జైళ్ల మండలి కార్యదర్శి అలోక్ మోహన్, హోమ్‌శాఖ కార్యదర్శి రజనీశ్ గోయల్ పాల్గొన్నారు. ఎస్ఐ స్కాంలో ఎవరినీ వదలం ఎస్ఐ ఉద్యోగాల స్కాంపై నిష్పాక్షపాతంగా విచారణ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కూడా బహిరంగం చేస్తానని హోంమంత్రి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా అక్రమాల కేసులో ఏడీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఇందులో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదన్నారు. డబ్బులిచ్చినవారు, తీసుకున్నవారు, మధ్యవర్తులపై కూడ కఠిన చర్యలు తీసుకుంటామని, సీఐడీకి సంపూర్ణ అధికారమిచ్చామని చెప్పారు. చదవండి: తమిళనాడులో టెన్షన్.. టెన్షన్.. స్కూల్ బస్సులను తగలబెట్టారు: సీఎం వార్నింగ్ -
హైదరాబాద్ శివారులో కోడిపందాల కలకలం
-
Kuppam: బరి తెగించిన టీడీపీ నేతలు.. అంతా వారి కనుసన్నల్లోనే..
కుప్పం(చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మట్టిని నీటితో శుభ్రం చేయడం ద్వారా కృత్రిమ ఇసుకను తయారు చేసి అమ్మేసుకుంటున్నారు. నాణ్యత లేని ఈ ఇసుకతో కట్టిన నిర్మాణాలు కుప్ప కూలడం ఖాయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక కొరత ఏర్పడడంతో ఆ పార్టీ నేతలే విచ్చలవిడిగా కృతిమ ఇసుక తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయా కేంద్రాల్లో యథేచ్ఛగా ఇసుక తయారు చేస్తుండడం గమనార్హం. టీడీపీ స్థానిక నేతల కనుసన్నల్లోనే దందా సాగుతున్నట్లు ఆయా ప్రాంత ప్రజలు వెల్లడిస్తున్నారు. చదవండి: టీడీపీకి ఊపిరి పోయాలనుకోవడం పవన్ అవివేకం ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలు పట్టణంలో ఒక్క ట్రాక్టర్ కృత్రిమ ఇసుకను రూ.2 వేల నుంచి 3 వేల వరకు విక్రయిస్తున్నారు. అక్కమార్కులు పగటి సమయంలో రోడ్డు మార్గాలను పరిశీలించుకుంటారు. ఉదయం 4 నుంచి 9 గంటల్లోపు ఎక్కడికి చేర్చాలో అక్కడికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తారు. ప్రతి రోజూ రాత్రి వేళల్లో ఇసుక తయారు చేసుకోవడం, తెల్లవారు జామున అనుకున్న మార్గంలో తరలించేయడం కొన్నేళ్లుగా సాగిస్తున్నారు. రవాణాకు 70 వాహనాలు కృత్రిమ ఇసుక రవాణా చేసేందుకు కుప్పంలో 70 వరకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్లు తెలిసిది. ఈ వాహనాల యజమానులు పట్టణంలోని గుడుపల్లె క్రాస్, విజలాపురం క్రాస్, మల్లానూరు క్రాస్, దళవాయి కొత్తపల్లి క్రాస్‌లో నిలబడి రవాణాను పర్యవేక్షిస్తుంటారు. ఒక్కో ట్రాక్టర్ యాజమాని మామూళ్ల కింద అధికారులకు నెలకు రూ.12 వేలు చొప్పున చెలిస్తున్నట్లు సమాచారం. 70 ట్రాక్టర్లకు మొత్తం కలిపి ఇసుక రవాణాకు ఇబ్బంది కలగకుండా పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు వాటాలు అందిస్తున్నట్లు వారే బహిరంగంగా చెబుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళ గస్తీకి వెళ్లే పోలీసు సిబ్బంది అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులకు దిక్కులేదు ఎన్నో ఏళ్ల తర్వాత జలకళ సంతరించుకున్న చెరువులను ఇసుక మాఫియా వదలడంలేదు. ఇసుక తయారీ కోసం ఇష్టారాజ్యంగా నీరు తోడేస్తోంది. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. పోలీసులు తమకు ఫిర్యాదు చేసిన వారిని రెవెన్యూ అధికారుల దగ్గరకు, వారు విద్యుత్ శాఖకు అక్కడి సిబ్బంది గనుల శాఖను సంప్రదించాలని వంతులు వేసుకుని పంపేసి చేతులు దులిపేసుకుంటున్నారు. 20 రోజుల క్రితం గుడపల్లె గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారికి ఎదురైన అనుభవమే ఇది. ఇష్టారాజ్యంగా విద్యుత్ చౌర్యం ఇసుక తయారీకి విద్యుత్ అవసరం. వ్యవసాయ బోర్లకు త్రీ ఫేజ్ విద్యుత్ ఉంటేనే మోటార్లు పనిచేస్తాయి. అయితే ఆధునిక పద్ధతులను వినియోగించుకుని సింగిల్ ఫేజ్ విద్యుత్‌తో నడిచే మోటార్లు అమర్చుకున్నారు. కరెంటు తీగలకు రాత్రి వేళల్లో కొక్కీలు తగిలించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. గుండ్లసాగరం వద్ద అక్రమంగా విద్యుత్ తీగలకు కోక్కీలు తగిలించిన దృశ్యం ఇవే కీలకం కుప్పం పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి ఇసుక తయారీ కేంద్రాలను నడుపుతున్నారు. కృష్ణదాసన పల్లె పంచాయతీ టీడీపీ యువత అధ్యక్షుడికి గొల్లపల్లె, యానాదనపల్లె, కృష్ణదాసనపల్లెల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. పరమసముద్రం, వరమనూరు, గట్టప్పనాయపల్లి, డీకే పల్లె, పీబీనత్తం గ్రామాల్లో టీడీపీ నాయకులే తయారీ కేంద్రాలు నడిపిస్తున్నారు. గుడుపల్లె మండలం గుండ్లసాగరం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, క్రియాశీల కార్యకర్త ముగ్గురూ కలసి దర్జాగా దందా నడుపుతున్నారు. అగరంలో టీడీపీ బూత్ కన్వీనర్లు, యామనూరు, పీబీవాడ, శెట్టిపల్లె, కంచి బందార్లపల్లె గ్రామాల్లో స్థానికంగా ఉన్న టీడీపీ కేడర్ కృత్రిమ ఇసుక దందా సాగిస్తోంది. పెద్దసంఖ్యలో తయారీ కేంద్రాలు కుప్పం నియోజకవర్గంలో సుమారు 56కు పైగా కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని నడిపేది ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకులే. వ్యవసాయ బోర్లు, చెరువులు, బావులు అందుబాటులో ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడకు మట్టిని తోలుకుంటారు. అక్కడ మోటార్లతో మట్టిని శుభ్రం చేసి వచ్చే ఇసుకను వేల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తయారీని ప్రభుత్వం నిషేధించినా కుప్పంలో మాత్రం యథేచ్ఛగా దందా సాగుతోంది. -
Hyderabad: అద్దె ఇల్లు చూసేందుకు వచ్చి... ఇంట్లోనే సన్నిహితంగా
సాక్షి, అమీర్‌పేట: అద్దె ఇల్లు కావాలంటూ వచ్చిన ఓ యువజంట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఎస్ఆర్నగర్లో సోమవారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఉదయం ఓ యువతి, యువకుడు ఇల్లు అద్దెకు కావాలని యజమాని వద్దకు వచ్చారు. లోపల ఇంటిని చూసేందుకు రెండో అంతస్తుకు వెళ్లారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో యజమాని పైకి వెళ్లాడు. ఇంట్లో ఇద్దరూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారి పోయారు. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చదవండి: (భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే..?) -
రేవంత్ రెడ్డి సవాల్‌పై స్పందించిన మంత్రి పువ్వాడ.. దేనికైనా రెడీ!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాలుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. భూములు కబ్జా చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని వెల్లడించారు. సీబీఐతోనైనా విచారణ చేయించుకోవచ్చని సూచించారు రేవంత్ రెడ్డి ఒక ఐటమ్ అని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చిన నువ్వా.. నా గురించి మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడని, సుపారీ ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని రేవంత్‌పై మండిపడ్డారు. అలాగే ఈనెల 29 తర్వాత సాయి గణేష్ ఘటనపై మాట్లాడుతానని.. కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు. చదవండి👉 అందుకే కాంగ్రెస్‌లో చేరడం లేదు: ప్రశాంత్ కిషోర్ కాగా అంతకముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పువ్వాడ ఓ సైకోనని, అతనికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈడీ కేసులు, కాంగ్రెస్ కార్యకర్తల మృతి, మమత కాలేజీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు. దమ్ముంటే పువ్వాడే తనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంత్రి పువ్వాడ వేధింపులు తాళలేకే బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్ ఆరోపించారు.మంత్రి పువ్వాడ తమ కులాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించాడు. మంత్రి వల్ల కమ్మ కులానికి చెడ్డపేరు వస్తుందని, అతన్ని కులం నుంచి బహిష్కరించాలని కమ్మపెద్దలను రేవంత్ కోరారు. చదవండి👉 కమలం వికసించేనా?.. కేడర్ ఉన్నా లీడర్ల మధ్య సఖ్యత కరువు! -
స్పా, మసాజ్ సెంటర్లలో అశ్లీల కార్యక్రమాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని మసాజ్ సెంటర్లు, స్పా, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని డీజీపీ శైలేంద్ర బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కెమెరాలను కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని పలు మసాజ్ సెంటర్లు, స్పాలు, బ్యూటీ క్లబ్‌లు, సెంటర్లు, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సైతం దాడులు చేస్తున్నారు. విల్లుపురంలోని ఓ ఆయుర్వేద చికిత్స కేంద్రంలో పోలీసులు తరచూ నిర్వహిస్తున్న సోదాలను వ్యతిరేకిస్తూ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. మసాజ్ సెంటర్లు, స్పాల ముసుగులో సాగుతున్న కార్యక్రమాలను గుర్తుచేస్తూ, పోలీసులకు సమాచారం వస్తే ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పాలు, మసాజ్ సెంటర్లు, ఆయుర్వేద చికిత్స కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే.. -
ఈ స్టేషన్ నాదిరో.. ఎక్కడికి బదిలీ చేసినా మళ్లీ అదే స్టేషన్‌కు
అది కదిరి సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్. అక్కడ పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ తన చాతుర్యంతో ఓ ప్రజాప్రతినిధి అండ సంపాదించారు. పోలీసు శాఖలోని ఉన్నతాధికారులను ఎలా మాయ చేస్తున్నారో గానీ.. ఎక్కడికి బదిలీ చేసినా మళ్లీ అదే స్టేషన్‌కు తిరిగొస్తున్నారు. పైగా ఓ పోలీసు ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉండటంతో స్టేషన్‌నే అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యోగంలో చేరే సమయంలో తాము సామాన్యులకు రక్షణగా ఉంటామని ప్రమాణం చేస్తారు. ప్రజలతో ఎలా మాట్లాడాలి.. కేసులను ఎలా పరిష్కరించాలో తగిన శిక్షణ కూడా పొందుతారు. కానీ కదిరి సబ్ డివిజన్ పరిధిలోని ఓ స్టేషన్లో పనిచేస్తున్న అధికారి మాత్రం ఇలా చేస్తే తనకేంటి లాభమంటూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులను వేధించే రౌడీలకు, భూ ఆక్రమణదారులకు, మట్కా, గుట్కా ముఠాలకు, గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారు. ప్రజలను గౌరవించడం అటుంచి తోటి ఉద్యోగులను కూడా వేధిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఆయా స్టేషన్ల అధికారులు చాలామంది బదిలీ కావడం రివాజు. కానీ ఆయన మాత్రం బదిలీ అయినా ప్రజాప్రతినిధుల అండతో కొన్నాళ్లకే యథాస్థానానికి తిరిగొస్తున్నారు. స్టేషన్‌ను అడ్డాగా చేసుకుని సివిల్ పంచాయితీలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నా ఎవరూ చర్య తీసుకునే పరిస్థితి లేదని అక్కడ పనిచేసే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ పేర్కొనడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగించారు. అప్పట్లో వారి ఆశీస్సులతోనే ఇక్కడ పనిచేసినట్లు తెలిసింది. అలాగే టీడీపీ నేతల వద్ద తనకు ఉన్న పలుకుబడితో పలువురు పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పించారనే ప్రచారం కూడా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో ఆ అధికారి యథేచ్ఛగా సెటిల్మెంట్లు చేస్తూ స్టేషన్లోనే అన్నీ చక్కబెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇవిగో నిదర్శనాలు ఇటీవల ముదిగుబ్బ వ్యక్తికి సంబంధించిన రూ.3 కోట్ల స్థల పంచాయితీకి సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ పంచాయితీ వాయిదా పడింది. తర్వాత కొన్ని రోజులకు ఇదే పంచాయితీని ఓ పార్టీకి చెందిన నేత సెటిల్ చేయడంతో సదరు అధికారి అతనికి ఫోన్ చేసి... ‘ఆ పంచాయితీ చేసినందుకు మీకు రూ.20 లక్షలు అడ్వాన్సు ముట్టిందటగా’ అంటూ ఆరా తీశారు. జూలై మొదటి వారంలో కదిరి పట్టణంలోని ఓ ఇంట్లో పేకాడుతున్నట్లు డయల్ 100కు సమాచారం అందింది. తనిఖీకి వెళ్లిన పోలీసు అధికారికి అక్కడ కానిస్టేబుళ్లు పేకాట ఆడుతూ కనిపించారు. అయితే.. పేకాట ఏమీ జరగలేదని, మన కానిస్టేబుళ్లే మద్యం తాగుతున్నారంటూ పై అధికారులకు సమాధానం చెప్పి.. రూ.లక్షల్లో ఉన్న పేకాట సొమ్మును తాను తీసుకెళ్లినట్లు తెలిసింది. పట్టణంలోని మట్కా, పేకాట రాయుళ్లు, గుట్కా వ్యాపారులు, స్థానికంగా లాటరీ టికెట్లు ముద్రించి ఫలితాలను వెల్లడిస్తున్న వారికి సదరు అధికారి అండదండలు అందిస్తున్నారు. ఇందుకు గాను ప్రతినెలా మట్కా నిర్వాహకుల నుంచి రూ.3 లక్షలు, గుట్కా వ్యాపారుల నుంచి రూ.2 లక్షలు, లాటరీ టికెట్లు విక్రయించే ముఠా నుంచి రూ.3 లక్షలు, బస్టాండుకు సమీపంలోని ఓ లాడ్జీలో పేకాటరాయుళ్ల నుంచి రూ. లక్ష మామూళ్లు తీసుకుంటున్నారు. ఇందులో సంబంధిత స్టేషన్ ఉన్నతాధికారులకూ వాటాలు ఉన్నట్లు సమాచారం. పట్టణం మీదుగా నిత్యం గ్రానైట్ లారీలు, ప్రైవేటు బస్సులు వెళ్తుంటాయి. ప్రైవేటు బస్సుల యజమానుల నుంచి నెలకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి కూడా పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకుంటున్నారు. గతంలో ఓ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఎర్రచందనం వాహనాలను బోర్డర్ దాటించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఈ పోలీసులు పరువు తీస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్/ జవహర్‌నగర్ : నిఘా కెమెరాల సంఖ్యలో దేశంలోనే ప్రథమ స్థానం... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం...రికార్డు స్థాయి రెస్పాన్స్ టైమ్... పోలీసు విభాగం ఓ పక్క ఇలా ప్రగతి పంథాలో దూసుకుపోతుంటే... కొందరు సిబ్బంది మాత్రం డిపార్ట్మెంట్ పరువును తీసేస్తున్నారు. అవినీతి ఆరోపణలు, సివిల్ వివాదాలను దాటి అసాంఘిక కార్యకలాపాలు, వేధింపుల వరకు వెళ్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిపై వేటు పడగా.. తాజాగా జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ సబ్– ఇన్స్పెక్టర్ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో అవినీతి.. ఆపై భూ వివాదాలు... ఒకప్పుడు పోలీసుల పేరు చెప్పగానే అవి నీతి కార్యకలాపాలు గుర్తుకు వచ్చేవి. నెల వారీ మామూళ్లు, కేసుల్లో కాసుల దందాలతో అడ్డగోలుగా రెచ్చిపోయే వారు. రాజధానిలో రియ ల్ బూమ్ పెరిగిన తర్వాత వీరి ఫోకస్ మామూళ్ల వసూలుతో పాటు రియ ల్ దందాలపై పడింది. భూ వివాదాల్లో తలదూర్చడం, కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగడంతో పాటు కొన్ని సందర్భాల్లో పోలీసులే వివాదాలను సృష్టించి లాభపడ్డారు. 2014 వరకు ఈ వ్యవహారాలు జోరుగా సాగాయి. ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరం... ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలు పోలీసు విభాగంపై చెరగని మచ్చలు తెస్తున్నాయి. మహిళల్ని వేధించిన ఇన్స్పెక్టర్ ఒకరైతే... భార్యతో విభేదాలతో మరొకరు రచ్చకెక్కారు. తాజాగా తమ దగ్గర పని చేసే మహిళా కానిస్టేబుళ్ల పైనే కన్నేసి రచ్చకెక్కుతున్నారు. తాజా బ్యాచ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ను వేధించిన లాలాగూడ ఇన్స్పెక్టర్ ఓ రకంగా పరువు తీశాడు. జవహర్‌నగర్ ఎస్ఐ అనిల్ అయితే మరో అడుగు ముందుకు వేసి ఓ మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి, లోబర్చుకున్నాడు. ఆమెతో కలిసి కీసర పరిధిలోని ఓ రిసార్టులో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ ఉదంతాలు పోలీసు విభాగంపై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి -
రామగిరి ఠాణా.. అక్రమాలకు ఠికానా!
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది గట్టు వామనరావు, పీవీ నాగమణి దంపతుల హత్య విషయంలో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్.. స్థానికంగా పేరున్న ఓ ప్రజాప్రతినిధి, అతడి అనుచరులు చేసే పంచాయతీలకు అడ్డాగా మారిందని కల్వచర్ల గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్‌కు చేరిన వివాదాల్లో సదరు ప్రజాప్రతినిధి అనుచరులు జోక్యం చేసుకోవడం ఆనవాయితీగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కోర్టుకు వెళ్లేవి చాలా తక్కువ. భూ వివాదాలు, కుటుంబ సమస్యల విషయంలో ఠాణా మెట్లెక్కిన వారి చేతి చమురు వదలాల్సిందే. విషయం తెలవగానే సదరు నేత అనుచరులు వాలిపోతారు. ఎవరో ఒకరి పక్షం వహిస్తారు. వారు ఎవరి పక్షాన నిలిస్తే వారికి స్టేషన్ సిబ్బంది పూర్తిగా సహకరిస్తారు. బాధితుల్లో ముందుగా వెళ్లి సదరు నేత అనుచరులను ప్రసన్నం చేసుకుంటారో వారిదే పైచేయి అవుతుంది. అతడి మాటే ‘సత్యం’.. ఆపై ‘మహేంద్ర’జాలం.. రామగిరి పోలీస్‌స్టేషన్‌లో కల్వచర్లకు చెందిన ఓ నేత సదరు ముఖ్య అనుచరుడిదే హవా. స్థానిక ప్రజాప్రతినిధికి అతడు కుడిభుజం అన్న ప్రచారం ఉంది. అందుకే స్టేషన్లో అతడు ఎంత చెబితే అంత. ఆయన ఆదేశాలు వారిపై ‘మహేంద్ర’జాలంలా పనిచేస్తాయి. రామగిరి పోలీసులు, సదరు నేత కలసి 2019లో రామగిరి పోలీస్ స్టేషన్ వేదికగా ఓ భారీ సెటిల్మెంట్ చేశారని సమాచారం. తన ఎన్నారై భర్త వేధిస్తున్నాడంటూ రామగిరి పోలీసులను ఓ యువతి ఆశ్రయించింది. ఈ విషయలో కల్వచర్ల స్థానిక నేత జోక్యం చేసుకున్నాడు. అంతే సీన్ మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించాలి లేదా కేసు నమోదు చేయాలి. ఇవేమీ చేయలేదు. 2019 నవంబర్ 22న కౌన్సెలింగ్ పేరిట ఆ ఎన్నారై భర్తను ఠాణాకు పిలిపించారు. తనకు ఆరోగ్యం బాగా లేదని ఆ ఎన్నారై చెబుతున్నా.. అతడిని గంటల పాటు మోకాళ్లపై నిల్చోబెట్టారు. స్టేషన్లో గుంజీలు తీయించారు. రకరకాల కేసులు పెడతామని, కెరీర్ నాశనం చేస్తామని, జీవితంలో తిరిగి అమెరికా వెళ్లకుండా చేస్తామని బెదిరించారు. వాస్తవానికి ఆ యువకుడికి అమెరికాలో మరో మూడేళ్ల పాటు వీసా ఉంది. దీంతో భయపడ్డ బాధితుడు కాళ్లబేరానికి వచ్చాడు. బాధితురాలితో రాజీకి రావాలని అందుకు రూ.50 లక్షలు ముట్టజెప్పాలని సదరు నేత, రామగిరి పోలీసులు తీర్పు చెప్పారు. తాను అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడి.. ఆఖరికి యువతికి రూ.30 లక్షలు ఇవ్వాలని డీల్ క్లోజ్ చేశారు. చేసేదిలేక బాధితుడు సరేనన్నాడు. తర్వాత ఎన్నారై నుంచి రూ.50 వేలు తీసుకున్నారు. భారీగా వసూలు చేసి ఇచ్చినందుకు సదరు యువతి తండ్రి వద్ద నుంచి కూడా తమ వాటాను పోలీసులు, సదరు నేత పంచుకున్నారు. ఇలాంటి ఉదంతాలకు అక్కడ లెక్కేలేదు. అర కిలోమీటర్‌లోపే హత్య.. మొత్తం వ్యవహారంలో ఓ నేతపై తీవ్ర విమర్శలు వస్తుండటం.. అతడికి, అతడి అనుచరులకు బాగా పట్టున్న రామగిరి పోలీస్స్టేషన్పరిధిలోనే జంటహత్యలు జరగడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గట్టు వామనరావును అతడికి తెలియకుండానే నిందితులు మంథని నుంచి వెంబడిస్తూ వచ్చారు. మంథని కోర్టు నుంచి హత్యలు జరిగిన ఘటనాస్థలానికి మధ్య దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రదేశానికి ముందు మంథని ఠాణా, అది దాటాక కమాన్‌పూర్ ఠాణా పరిధి ఉంటాయి. ఈ రెండు స్టేషన్ల పరిధిలోనూ అడవి, నిర్మానుష్య ప్రాంతాలు అధికం. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నిత్యం రద్దీగా ఉండే రామగిరి పీఎస్ పరిధిలో హత్యలు చేయడం, అది కూడా మరో అర కిలోమీటరు దూరంలో స్టేషన్ పరిధి ముగుస్తుందనగా ఘటన జరగడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామగిరి పోలీసుల అండ చూసుకునే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో క్రైం సీన్ (నేరం జరిగిన ప్రదేశం)లో సాక్ష్యాధారాల సేకరణకు పోలీసులు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానిక నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా అర్ధరాత్రి వెళ్లి క్రైం సీన్ వద్ద ట్రాఫిక్ కోన్స్ పెట్టడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
రెక్కలు విరిగి.. నకనకలాడిపోతున్న వెలగ కోడి
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటోంది.... ముప్పై ఏళ్ల కిందట తెలుగు సినీ అభిమానులను ఓ రేంజ్లో ఉర్రూత లూగించిన ఈ పాటను ఇప్పుడు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విషయానికి వచ్చే సరికి ఇదిగో ఇలా చదువుకోవాలి– రెక్కలు విరిగి నకనకలాడి అల్లాడిపోతున్న వెలగకోడి... ఎక్కడైనా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు పేరు చెబితే వెంటనే ఆ ప్రాంత అభివృద్ధి గుర్తుకు రావాలి... ఆ ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో చేసిన మంచి పనులు జ్ఞప్తికి రావాలి.. నియోజకవర్గ ప్రజలకు చేసిన ఎన్నో మేళ్ళు స్ఫురణకు రావాలి.. కానీ మూడు దఫాలుగా విశాఖ తూర్పున వెలగబెడుతున్న రామకృష్ణ పేరు చెప్పగానే... కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు. పంచాయితీలు.. ఇంతకుమించి ఆయన వెలగబెట్టిందేమన్నా ఉందా అంటే సొంత పార్టీ నేతలు కూడా నిజాయితీగా ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి.. ప్రభుత్వం ఉన్నా.. దాదాపు పదేళ్లు అడ్డగోలుగా నియోజకవర్గంపై పడిపోయి అందినకాడికి దోచేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారైంది. అసలేమయింది అనుకుంటున్నారా... అయితే పూర్తి వివరాల కోసం లోపలికి రండి.. సాక్షి, విశాఖపట్నం : అధికారం దన్నుతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గతంలో ఇష్టారాజ్యంగా చేసిన దందాలు, వ్యవహారాలు, దౌర్జన్యాలకు దాదాపు 20 నెలలుగా అడ్డుకట్ట పడింది. విజయవాడ మాజీ శాసనసభ్యుడు, దివంగత వంగవీటి మోహన్‌రంగా హత్యకేసులో మూడో నిందితునిగా పరారై ఇక్కడకి వలసొచ్చి.. ఆనక ’పరిస్థితులు’ కలసి రావడంతో ఎమ్మెల్యే గిరీ వెలగబెడుతున్న వెలగపూడి.. విశాఖ సంస్కృతికిపై తనదైన విషాన్ని చిమ్ముతూ వచ్చారు. ► ముందుగా చెప్పాలంటే కోడి పందేలు... గోదావరి జిల్లాల్లో పెద్ద పండక్కి ఆనవాయితీగా జరిగే సంప్రదాయ కోడి పందేలకు వెలగపూడి ఇక్కడ జూదం ముసుగు వేసి తెరలేపారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలకు భిన్నంగా అడ్డగోలుగా కోడిపందేలను దగ్గరుండి నిర్వహించేవారు. ఈ వ్యవహారాలపై 2018లో సాక్షిలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో అదే ఏడాది కోడి పందేల కేసులో వెలగపూడి అభిమానం సంఘం నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జూదం మాటున జరిగే కోడిపందేలకు పూర్తి స్థాయిలో అడ్డు కట్ట పడింది. ఐదారేళ్ళుగా కోడి పందేల బరులుతో విష సంస్కృతితో అల్లాడిన తూర్పు నియోజకవర్గంలో గతేడాది ఒక్క బరి కూడా గీయలేదు. ఇలా వెలగ’కోడి’కి పూర్తిగా రెక్కలు విరిగాయనే చెప్పాలి. ► ఇక వెలగపూడి బ్యాచ్ చేసే దందాలకు ఏడాదిన్నరగా పూర్తిగా బ్రేక్ పడింది. తూర్పున అడ్డు అదుపు లేకుండా వెలగపూడి అనుచరులు.. షాపులు, వాణిజ్య వ్యాపార సంస్థలకు పెట్టే ’ఇండెంట్స్’ లేకుండా పోయాయి. ► ఇది మరో భారీ దెబ్బ... దశాబ్దాల మద్యం మాఫియాకు ముకుతాడు పడింది. ఏడాదిన్నర కిందట వరకు ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే కాదు.. నగరం మొత్తంమీద మద్యం మాఫియాకు వెలగపూడే నాయకత్వం వహించే వారు. లెక్కకు మించిన బార్ అండ్ రెస్టారెంట్లలో వాటాలున్నా... బినామీల పేరిట సొంతంగా నాలుగు షాపులు, రెండు బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వహించే వారు. ఆరిలోవ, పెదగదిలి, ఎంవీపీ కాలనీ, జగదాంబ సెంటర్లలో షాపులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట, ఓల్డ్ టౌన్లో బార్లు ఉండేవి. జగదాంబ సెంటర్లో షాపు స్వయంగా వెలగపూడి కుటుంబసభ్యుల పేరిటే ఉండేది. ఆయా షాపుల్లో కల్తీ మద్యం ఏరులై పారినా దాదాపు పదేళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు. ఆ క్రమంలోనే వెలగపూడి చిట్టాలోని షాపుల్లో వరుసగా కల్తీ మద్యం విక్రయిస్తున్న దాఖలాలు బయటపడ్డాయి. కేసులు నమోదు చేసి పాత్రధారులను అరెస్టు చేశారు. వెంటనే సూత్రధారి వెలగపూడి బయటకు వచ్చి నానాయాగీ చేశారు. వెంకోజిపాలెంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న విషయం బయటపడి కేసులు రాస్తే వెలగపూడి సీరియస్‌గా చేసిన ’యాక్షన్’ నవ్వులు పూయించింది. స్టేషన్ వద్దనే నిద్ర చేసి హడావుడి చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దరిమిలా నూతన మద్యం పాలసీ నేపథ్యంలో వెలగపూడి పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణను నుంచి తప్పుకున్నట్టే చెప్పాలి. అంటే దాదాపు 20ఏళ్లుగా మద్యం మహమ్మారితోనే వ్యాపారం.. కాదు కాదు... ఆ ముసుగులో దందాలు చేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే చెక్ పడింది. ► ఇక తాజాగా వెలగపూడి భూదందాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. వెలగపూడి భార్య పేరిట రుషికొండలో బీచ్ రోడ్డు సర్వే నెంబరు 21లో గెడ్డ పక్కన ఆక్రమించిన ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్‌ను.. చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించారు. ► ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విశాఖ తూర్పు ప్రజలు హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే... అన్ని అక్రమాల రెక్కలు తెగిన వెలగ’కోడి’ మాత్రం గిల గిలా కొట్టుకుంటోందని అంటున్నారు. అందుకే సదరు వెలగపూడి... విశాఖ సమగ్రాభివృద్ధిని కాంక్షించే రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డిపై లేనిపోని ఆయాసంతో అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని పచ్చ బ్యాచే ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. ఇంకెవరికైనా ఎనీ డౌట్స్.?. -
కదులుతున్న ‘పాముల పుట్ట’
సాక్షి, హైదరాబాద్/కీసర/అల్వాల్ : ఉన్నతాధికారుల ద్వారా మాత్రమే వెలువడే డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్‌ఫైల్స్‌ను సైతం నకిలీవి సృష్టించి లంచాలు మరుగుతున్నారంటే రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో తిష్టవేసి కూర్చుందో అర్థం చేసుకోవచ్చు. ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజు వ్యవహారంలో కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కీసర మండలం రాంపల్లి దాయరలో పట్టాదారు, కౌలుదారుల మధ్య భూ వివాదం నడుస్తోంది. 19 ఎకరాలకు సంబంధించిన వివాదంలో 8 ఎకరాలకు సంబంధించి పట్టాదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అందుకు అనుగుణంగా ఆ భూమిని వారి పేరు మీదకు మార్చాల్సి ఉంది. మరో 11 ఎకరాల వివాదం ఆర్డీఓ పరిధిలో ఉంది. 8 ఎకరాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తహసీల్దార్‌ను సంప్రదించి ఈ భూమిని పట్టాదారుల పేర చేయాలని కోరారు. దీనికి తహసీల్దార్ రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన, మేడ్చల్ కలెక్టర్ ద్వారా వెలువడాల్సిన డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్ ఫైల్‌ను తన కార్యాలయంలోనే తయారుచేసి, వాటిని తీసుకొని తహసీల్దార్ నాగరాజు రియల్టర్ కందాడి అంజిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. అప్పటికే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ అక్కడ డబ్బులతో ఉన్నారు. దీనిపై ఉప్పందుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. పత్రాలు సృష్టించినట్టు అంగీకారం! తహసీల్దార్, వీఆర్ఏ, రియల్టర్లను శనివారం ఏసీబీ కార్యాలయంలో విచారించారు. కలెక్టర్ పేరిట పత్రాలు సృష్టించినట్టు తహసీల్దార్ ఈ విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. ఇందులో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది ప్రమేయం ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇదే భూమికి సంబంధించిన 11 ఎకరాలకు ఆర్డీఓ నుంచి ఆదేశాలు రానున్నట్టు విచారణలో తహసీల్దార్ చెప్పినట్లు సమాచారం. కాగా, శనివారం ఉదయం కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సీఐలు గంగాధర్, నాగేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ గదిలో ఉన్న రికార్డులు, కంప్యూటర్ రికార్డులు, ఇటీవల తహసీల్దార్ చేసిన ముటేషన్లు, రికార్డుల మార్పులు, చేర్పులు, ఫైళ్ల క్లియరెన్స్‌ను పరిశీలించారు. రాంపల్లి దాయరలోని సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల భూములకు సంబంధించిన కాస్రా పహాణీ నుంచి ఇప్పటివరకు పహాణీ రికార్డులు, నాగరాజు తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాక రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులు తదితర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్‌డిస్క్, తహసీల్దార్ బీరువాలో లభించిన పలు ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించి, కొన్నిటిని వెంట తీసుకెళ్లారు. కార్యాలయంలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, ఆర్ఐ శశికళ ఇతర సిబ్బందిని ప్రశ్నించారు. బార్గా పెంట్‌హౌస్ టెంపుల్ అల్వాల్‌లో గల కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. రూ. 28 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారం లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం శామీర్‌పేట డిప్యూటీ తహసీల్దార్ ఉన్న సమయంలో ఇదే ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ పలు ఆస్తుల దస్తావేజులు దొరికాయి. ఇంటిపైని పెంట్‌హౌస్‌ను బార్ గా మలిచారు. పెద్ద మొత్తంలో లభ్యమైన విదేశీ మద్యాన్ని చూసి అధికారులు కంగుతిన్నారు. మూడంతస్తుల ఈ భవనంలో కింది ఫ్లోర్లను అద్దెకు ఇవ్వగా మొదటి అంతస్తులో నాగరాజు ఉంటున్నారు. నాగరాజు వద్దే ఆ భూముల రికార్డులు: ఆర్డీఓ రాంపల్లిదాయరలోని సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల వివాదాస్పద భూములకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులన్నీ తహసీల్దార్ నాగరాజు వద్దే ఉన్నాయని కీసర ఆర్డీఓ రవికుమార్ తెలిపారు. ఈ వివాదాస్పద భూముల్లోని ఐదెకరాలను ఏసీబీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఓ ఉన్నతాధికారి రాంపల్లిదాయరకు చెందిన రైతుల నుంచి కొన్నారని, ఆయనకు గతం లో పట్టాదారు పాసుపుస్తకాలు కూడా రెవెన్యూ కార్యాలయం నుంచి ఇచ్చారన్నారు. కాగా కీసర తహసీల్దార్ నాగరాజు ఇటీవల ఈ పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేయాలని ఓ ఫైల్ తయారు చేసి తమ కార్యాలయానికి పంపాడన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశామన్నారు. ఈ భూములకు సంబంధించిన రికార్డుల మార్పుచేర్పుల్లో తహసీల్దార్ పాత్రపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. -
అవినీతికి పడగలెత్తిన నాగరాజు
సాక్షి, మేడ్చల్ జిల్లా : అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. నాగరాజు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ , ఘట్కేసర్, హయత్‌నగర్, శామీర్‌పేట, కూకట్పల్లి, కీసర మండలాల్లో టైపిస్టుగా, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్‌గా పనిచేశారు. దాదాపు రెండేళ్లు కీసరలో పనిచేసిన సందర్భంలో ఆయన అవినీతిపై ఆరోపణలు అంతులేకుం డా ఉన్నాయి. కీసర, కీసర దాయర, చీర్యాల, భోగారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, రాంపల్లిదాయర గ్రామాలతోపాటు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మట్టి నుంచి మొదలుకుని రికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రైతుబంధు వరకు దేన్ని వదలకుండా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. రియల్ వెంచర్లు, ప్లాట్లుగా మారిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేసి రైతుబంధు వచ్చేలా చేశారనే ఆరోపణలున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి అహ్మద్‌గూడలోని అసైన్డ్ భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో ఇంటి యాజమాని వద్ద నుంచి అప్పటి మహిళా వీఆర్ఓ, వీఆర్ఏ సాయంతో రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2011లో శామీర్‌పేట మండలంలో డీటీగా పనిచేసినపుడు వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడిచేసి జైలుకు పంపారు. 25 ఏళ్లుగా ఆ భూముల వివాదం.. ప్రస్తుతం నాగరాజు పట్టుబడటానికి కారణమైన రాంపల్లిదాయర రెవెన్యూ పరిధిలోని 53 ఎకరాల భూములకు సంబంధించి షరీఫ్, గాలిజంగ్ తదితర 20 మంది కుటుంబసభ్యులకు, రాంపల్లి దాయర గ్రామానికి చెందిన వేల్పుల ఆంజనేయులు, నర్సింగ్‌రావు, శ్రీనివాస్ మరో 25 మంది కుటుంబాల మధ్య 25 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ సర్వేనంబర్లలోని 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధిం చి ఇరువర్గాల మధ్య భూవివాదంపై హైకోర్టు స్థాయిలో విచారణ కొనసాగుతుండగా, మిగతా భూములకు సంబంధించి కొందరికి ఓఆర్సీలు అందజేసినట్లు తెలుస్తోంది. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రియల్టర్ బ్రోకర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్ తదితరులు భూమార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి కీసర తహసీల్దార్ నాగరాజుతో రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్నటు తెలుస్తున్నది. కూకట్‌పల్లిలోనూ అదేతీరు.. కూకట్పల్లి తహసీల్దార్‌గా 2017 జూన్ 20న బాధ్యతలు చేపట్టిన నాగరాజు ఏడాది పాటు ఇక్కడ పనిచేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యేందుకు సహకరించారనే ఫిర్యాదులు వచ్చాయి. సర్వే నంబర్ 91లో చిత్తారమ్మ ఆలయానికి చెందిన భూమిని సర్వే నంబర్ 90 పేరుతో కబ్జాదారులకు రిజిస్ట్రేషన్ చేయటం వివాదాస్పదమైం ది. కూకట్‌పల్లిలో సర్వే నంబర్ 1007 హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సుమారు 340 ఎకరాల భూమిలో ఓ నిర్మాణ సంస్థకు అనుకూలంగా మ్యుటేషన్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని నోటీసులు జారీ చేయటం సైతం అప్పట్లో వివాదాస్పదమైంది. -
టీడీపీ నాయకుడి లాడ్జిలో వ్యభిచారం
చిత్తూరు, వి.కోట : మండలంలో వ్యభిచార ముఠా గుట్టును వి.కోట పోలీసులు రట్టు చేశారు. సీఐ యతీంద్ర తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన (టీడీపీ నాయకుడికి సంబంధించిన ) లాడ్జి మేనజర్‌గా పనిచేస్తున్న నగేష్, వి.కోటకు చెందిన నరేంద్రబాబు పలమనేరు చెందిన పర్వీన్‌తో రహస్యంగా ఒప్పదం కుదుర్చుకుని వి.కోటలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహించేవారు. ఆదివారం రాత్రి వి.కోటకు చెందిన సతీష్ అనే విటుడిని లాడ్జికి రప్పించి ఓ యువతితో వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించారు. రాత్రి పలువురితో కలసి బురఖాతో వెళుతున్న యువతిని చూసిన పరిసరాల ముస్లిం యువకులు వారిని అడ్డగించగా వ్యభిచార విషయం బయటపడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు లార్డికి చేరుకోగా, యువతి, యువకులతో సహా ముఠా సభ్యులు పరారయ్యారు. సోమవారం ఉదయం లాడ్జి మేనేజర్ నాగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న వైనాన్ని అతడు వెల్లడించాడు. లాడ్జి మేనేజర్ నాగేష్ , గంగవరానికి చెందిన పర్వీన్, వి.కోట నాగేంద్రబాబు, విటుడు సతీష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. వ్యభిచార నిర్వహణకు సంబంధించి కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మసాజ్ సెంటర్‌కు వీఐపీలు, పోలీసులు
చెన్నై,టీ.నగర్: నాగర్‌కోవిల్‌లో పని చేస్తున్న మసాజ్ సెంటర్‌కు వీఐపీలు, పోలీసు శాఖలో ఉన్న అధికారులు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. కోట్టార్‌లో పని చేస్తున్న ఒక మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ శ్రీనాథ్‌కు సమాచారం అందింది. ఏఎస్పీ జవహర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ జరిపారు. దీంతో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా మసాజ్ సెంటర్లో చొరబడగా ముగ్గురు మహిళలు కనిపించారు. వారి వద్ద విచారణ జరపగా మసాజ్ సెంటర్ పేరుతో యువకులను రప్పించి వ్యభిచారం జరుపుతున్నట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉన్న ముగ్గురు యువతులను, యువకుడిని పట్టుకుని విచాణ జరిపారు. సదరు యువతులు తిరువణ్ణామలై జిల్లా ఆరణి, పాండిచ్చేరి, తిరుపూర్ ప్రాంతానికి చెందిన వారుగా తెలిసింది. పట్టుబడిన యువకుడు కేరళ రాష్ట్రం ఇడిక్కి ప్రాంతానికి చెందిన అలగ్జాండర్ (20)గా గుర్తించారు. ఆన్లైన్ ద్వారా ప్రకటనలు చేసి, కస్టమర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఏఎస్పీ జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ మసాజ్ సెంటర్ నాగర్‌కోయిల్ సెంటర్లో ఉండడంతో పలు ముఖ్య ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, పోలీసు అధికారులు ఈ మసాజ్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వస్తున్నట్టు తెలిసింది. ఈ మసాజ్ సెంటర్లో ప్యాకేజ్ సిస్టమ్‌లో నగదు వసూలు చేస్తున్నారు. పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
'సీఐడీ విచారణ జరిపిస్తే నిజస్వరూపం తెలుస్తుంది'
సాక్షి, అనంతపురం : మంత్రిగా ఉన్న సమయంలో పరిటాల సునీత అనేక అక్రమాలకు పాల్పడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె అవినీతిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సునీత తన కుటుంబసభ్యులతో కలిసి వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. సీఐడీ విచారణ జరిపిస్తే ఆమె నిజస్వరూపం మొత్తం బయటపడుతుందని, పౌరసరఫలా శాఖ కాంట్రాక్టులన్నీ ఆమె తన బినామీలకే కట్టబెట్టారని మండిపడ్డారు. జంగాలపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాంలను నంద్యాలకు మార్చడంతో ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. (చంద్రబాబు.. అప్పుడు ఎందుకు జోలె పట్టలేదు?) -
'కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ ఆయనే'
సాక్షి, విశాఖ : పొట్టిశ్రీరాములు జయంతి రోజున బండారు సత్యనారాయణ తప్పతాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేయడం దారుణమని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు పేర్కొన్నారు. మా తాతల నుంచి ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి కబ్జాకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాపై బురద జల్లేందుకు ప్రెస్మీట్లు పెట్టి తప్పుడు వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. 2016లో టీడీపీ హయాంలో సివీఎస్ రంగారావు నేతృత్వంలో పరిశీలించిన వ్యవసాయ భూములను, చెరువులను మేము కబ్జా చేశామని చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. మా గౌరవాన్ని కించపరిచినందుకు మేము లీగల్‌గా కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. పోలీస్ క్వార్టర్స్
ఒకప్పుడు రక్షక భటుల నివాసాలు. కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. రక్షక భటులు అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పగలు రాత్రి తేడా లేకుండా పోకిరీలు అక్కడ చేరి బహిరంగంగా మద్య సేవనం చేస్తున్నారు. మద్యం మత్తులో అటుగా వెళ్లే మహిళలు, యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పలుమార్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో బెంబేలెత్తుతున్నారు. సాక్షి, నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని మూలాపేటలో పాత పోలీసు క్వార్టర్స్ (గ్యాస్ గోదాము ముందు వైపు) భవనాలు పోకిరీలకు అడ్డాగా మారాయి. గతంలో పోలీసు సిబ్బంది నివాసం ఉండేవారు. దీంతో అక్కడి ప్రజలు నిర్భయంగా జీవించేవారు. కాలక్రమేణా క్వార్టర్స్ శిథిలావస్థకు చేరడంతో అక్కడున్న వారందరూ నూతనంగా మూలాపేట, నవాబుపేటల్లో నిర్మించిన పోలీసు క్వార్టర్స్‌కు వెళ్లిపోయారు. దీంతో వాటి ఆలనా పాలనా పట్టించుకునేవారు కరువయ్యారు. క్వార్టర్స్‌కు ఉన్న కిటికీలు, తలుపులను సైతం కొందరు అపహరించుకుని వెళ్లారు. చుట్టు పక్కల ఏపుగా చెట్లు పెరిగాయి. భవనం గది లోపల, పైన ఖాళీ మద్యం బాటిళ్లు ఈ క్రమంలో అసాంఘిక శక్తులు ఆ క్వార్టర్స్‌ను ఆవాసాలుగా చేసుకుని జోరుగా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నిత్యం ఆ క్వార్టర్స్ భవనాల్లోకి చేరి మద్య సేవనం చేస్తున్నారు. శిథిల క్వార్టర్స్ భవనాల్లో పేకాట, వ్యభిచారం తదితర కార్యక్రమాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు రిక్షా కార్మికులు, స్థానికేతరులు శిథిల భవనాల్లో తలదాచుకుంటూ గంజాయి వంటి మత్తు పదార్థాలను తాగుతున్నారు. మొక్కుబడి గస్తీ చర్యలు క్వార్టర్స్‌కు సమీపంలో ప్రజల నివాసాలు ఉన్నాయి. వారి పిల్లలు క్వార్టర్స్ మీదుగానే విద్యాసంస్థలకు వెళ్లాల్సి ఉంది. దీంతో అసాంఘిక శక్తులు అటుగా వెళ్లే విద్యార్థినులను, మహిళలు, యువతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకటి, రెండు రోజులు పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించి ఆపై అటు వైపునకు వెళ్లడం మానేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసాంఘిక శక్తులు, అల్లరి మూకలు యథేచ్ఛగా విజృంభిస్తున్నాయి. తాజాగా రెండు రోజుల కిందట ఓ విద్యార్థినిని కొందరు వ్యక్తులు తరుముకుంటూ వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. బాధిత బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. దీంతో బాధిత బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి కన్నీటి పర్యంతమైంది. బాలిక కావడం విషయం బయటకు పొక్కితే ఎక్కడ పరువు పోతుందోనని వారు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహసించలేదు. ఈ తరహా ఘటనలు అనేకం ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతా«ధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
వలలోకి దించుతాయ్.. ఈ వెబ్సైట్లతో జాగ్రత్త!!
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): తియ్యటి మాటలతో యువకులను వలలో వేసుకుంటున్న వెబ్సైట్ నిర్వాహకులు కోలకతాలో కుప్పలు తెప్పలుగా ఉన్నారని సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపారు. శనివారం ఆయన కోల్‌కతాలో ఒక కాల్‌సెంటర్‌పై దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి సోమవారం నగరానికి చేరుకున్న సీఐ వి. గోపీనాథ్ సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపం అనే వ్యక్తి ఈ తరహా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న వీటిపై కోల్‌కతా పోలీసులకు అవగాహన లేదన్నారు. విశాఖ పోలీసుల చొరవతోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఆరు నెలల క్రితం బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న తాము గతంలో రెండుసార్లు కోల్‌కతా వెళ్లి ప్రయత్నించినా ఆచూకీ తెలియరాలేదన్నారు. స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డులు, గుర్తింపుకార్డులు మూడవసారి పకడ్బందీగా ప్రయత్నం చేయటంతో గుర్తించగలిగామని సీఐ గోపీనాథ్ వివరించారు. ఇందులో యువతులను కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకుంటున్నారని, తరువాత వారిని తమకు అనుకూలంగా మార్చి ఈ తరహా మోసాలకు గురి చేస్తున్నారని, అందుకు టార్గెట్లు, కమిషన్లు, బహుమతులు ఎరచూపి యువతులను వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. కాల్‌సెంటర్‌పై దాడి చేసి నప్పుడు 23 మంది యువతులతో పాటు, ఒక హెచ్ఆర్, ఆఫీస్ బాయ్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని అలిపూర్లో ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని తెలిపారు. వారి దగ్గర నుంచి 40 వరకు బేసిక్ ఫోన్లు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రూటర్, హార్డ్ డిస్కు, కొన్ని సిమ్‌లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు డిసెంబర్ 6న నగరంలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. వెబ్సైట్లతో జాగ్రత్త.. ఇంటర్నెట్లో పలు వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా పీపుల్ ఫ్రెండ్స్, కిన్ కీ, హానీ పికప్, ఫ్యాషన్, హాట్ టెంప్టేషన్ వంటి వెబ్సైట్లు ఉన్నాయన్నారు. చాలా వరకు తాము చేసిన దాడులతో వాటిని నియంత్రించగలిగామని తెలిపారు. ముఖ్యంగా వీరి వలలో నగరానికి చెందిన కొన్ని విభాగాల్లో ఉన్నతాధికారులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వివరించారు. యువత, ఉత్సాహవంతులు ఇలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. తేనెలా మాట్లాడుతూ నెమ్మదిగా తమ వలలోకి దించి వారి నుంచి లక్షల్లో డబ్బులు కాజేయటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు
సాక్షి, బాసర : అసాంఘిక కార్యకలాపాలకు బాసర ట్రిపుల్ ఐటీ అడ్డాగా మారింది. చీకటి పడగానే విద్యార్థుల వసతి గృహాల సమీపంలో ప్రైవేట్ క్యాంటీన్ వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాసలీలలు సాగిస్తున్నారు. తాజాగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు నేపాల్ దేశానికి చెందిన వ్యక్తి కాగా, మరొకరు స్థానిక మహిళగా గుర్తించారు. వీరివురు ట్రిపుల్ ఐటీ ప్రైవేట్ క్యాంటీన్లో పనిచేసే వ్యక్తులుగా నిర్ధారించారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం క్యాంపస్ పరిధిలో ప్రైవేట్ క్యాంటీన్లు నడపకూడదన్న రూల్స్ అతిక్రమించి క్యాంటీన్‌ను నడుపుతున్నారు. అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తయితే.. వేరే దేశమైన నేపాల్ వ్యక్తిని కుక్‌గా పెట్టుకొని, ఇలాంటి చర్యలకు ఒడిగట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 7వేల మంది విద్యార్థులు చదివే ప్రదేశంలో, అందులోనూ పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉన్న చోట ఇలాంటి సంఘటనలు జరగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో తీస్తున్న సాక్షి కెమెరామెన్ నుంచి కెమెరా లాక్కొని మీడియా పట్ల బాసర ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తిని దాబాలో దారుణంగా హత్య చేశారు. ఆ కేసులో ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. -
ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు
-
అటవీశాఖలో అవినీతికి చెక్!
సాక్షి, పశ్చిమగోదావరి: కలప రవాణాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ కోన రామకృష్ణ, చింతలపూడి ఏరియా డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ కృష్ణవేణిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిపై విచారణకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గురువారం ఆదేశించారు. ఈమేరకు అధికారులకు ఉత్తర్వులు అందాయి. వివరాల్లోకి వెళితే.. గత నెల 20న చింతలపూడి తాలూకా ఎర్రగుంటపల్లిలో కలపను అక్రమంగా రవాణా చేస్తున్న లారీను గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ... ఈ ఘటనపై డివిజినల్ మేనేజర్ కె.రామలింగారెడ్డిని విచారణ అధికారిగా (విజిలెన్స్) నియమించింది. పైస్థాయి అధికారులు జరిపిన దర్యాప్తులో ప్రభుత్వం ప్రతిపాదించిన కలప కొలతలు కాకుండా.. ఇతర సైజుల్లో కలప అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తేటతెల్లమైంది. దీంతో ఎప్పటినుంచో అధికారులు కుమ్మక్కై జరుపుతున్న ఈ అవినీతి బాగోతానికి ఫుల్స్టాప్ పడింది. -
అటవీశాఖలో అవినీతికి చెక్
సాక్షి, ఒంగోలు : కలప పర్మిట్ల జారీలో దండిగా అక్రమార్జన సాగుతోంది. వందలు, వేలు కాదు రూ.లక్షల్లోనే చేతులు మారుతున్నాయి. జిల్లాలో ఏటా రూ.200 కోట్ల మేర లావాదేవీలు జరుగుతుంటే ఇందులో హీనపక్షం రూ.20 కోట్లపైనే అవినీతి, కొందరు అధికారుల అక్రమార్జన దందా కొనసాగుతోంది. రంపం కోత యంత్రం యజమానులు, అడితి నిర్వాహకులు, కలప చిరు వ్యాపారులు ఈ దందాను అతి భారంగానే భరిస్తున్నారు. అటవీ అధికారులు దండుకొనే మొత్తాలకు సంభందిత వ్యాపారులు అదనంగా మరి కొంత అ‘ధనం’ మొత్తాలను కలిపి కలప కొనుగోలుదార్ల నెత్తిన మోపుతున్నారు. ప్రతి స్థాయిలోనూ జరిగే ఈ వసూళ్లు తంతుతో రూ. వందల్లో అయ్యే ఖర్చు రూ.వేలల్లోకి పోతుంది. అసలు ధర కన్నా రెండు,మూడు రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వినియోగదారునికి అంతిమంగా ఈ మొత్తం పెను భారంగా మారుతోంది.ప్రతి నిర్మాణానికి కలప అవసరం నేపథ్యంలో ఇప్పటికి నడుస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధి కారి ప్రతీప్‌కుమార్ కార్యాలయాన్ని అవినీ తి రహిత కార్యాలయంగా నామఫలకాన్ని ఏర్పా టు చేశారు. అన్ని అటవీ క్షేత్రాధికారుల కార్యాలయాల్లోనూ ఇదే తరహాలో నో కరప్షన్ ఆఫీసు లుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవడానికి అటవీ శాఖలోని అన్ని లావాదేవీలు ఇక పాదర్శకంగా జరిగే విధంగా మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో మొదటి మార్పు కీలకమైన కలప రవాణా పర్మిట్ల జారీని ఆన్లైన్ చేయాలన్నది తలంపు. కలప రవాణా లో చెట్టు నరికిన దగ్గర నుంచి వివిధ స్థాయిల్లో రూపాంతరం చెంది చివరి స్థాయికి చేరే సరికి వివిధ హోదాల్లోని ఉద్యోగుల చేతులు తడిపే పద్ధతికి త్వరలోనే అడ్డుకట్టపడనుంది. సీఎం దృష్టికి ఆన్లైన్ విధానం కలప మాన్యువల్ పర్మిట్ల జారీలో జరుగుతున్న తంతు గురించి అటవీ ఉన్నతాధికారులు గుర్తించారు. అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్.ప్రతీప్‌కుమార్ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసినప్పుడు ఈ నూతన విధానం గురించి సీఎంతో చర్చించారు. పర్మిట్లను ఆన్లైన్లో ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పారదర్శక విధానం అమలులో ఉంటుందని అన్నారు. సత్వరం పర్మిట్లు జారీ అవుతాయన్నారు. దీనిపై సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. త్వరలోనే పర్మిట్లను ఆన్లైన్ పద్దతిలో ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు ప్రతీప్‌కుమార్ కార్యాచరణకు పూనుకున్నారు.8వ తేదీన ఒంగోలుకు వచ్చి ఇక్కడ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఆరు సర్కిళ్లల్లోనూ తాను పర్యటించి త్వరలోనే ఇందుకు సంభందించిన మార్గదర్శకాలను తయారు చేస్తామని అన్నారు. త్వరలోనే పర్మి ట్ల జారీ విధానంతో పాటు అటవీ శాఖలోని వివిధ లావాదేవీలన్నీ ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయన్న సంకేతాలను ఇచ్చారు. ఇకపై అన్ని లావాదేవీల్లో అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నందున ఇక ఈ విధానానికి చెల్లుచీటీ ఇచ్చి పాదర్శక విధానం ఆన్‌లైన్‌కు శ్రీకారం చుట్టడానికి కార్యాచరణకు పూనుకున్నారు. -
దందాల దాల్‌సూరీ!
మెరిమిశెట్టి సురేష్‌కుమార్ అలియాస్ దాల్మిల్ సూరి. దందాలకు...మోసాలకు కేరాఫ్ అడ్రస్. మాటలతో మభ్యపెట్టడం. రూ.కోట్లు కొట్టేయడం ఇతనికి వెన్నతోపెట్టిన విద్య. టీడీపీ హయాంలో భార్య జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేయగా... అధికారం అడ్డుపెట్టుకుని ఎందరినో మోసం చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు తీసుకుని తప్పించుకు తిరిగాడు. ఎవరికైనా ఎదురుపడినా మాటలతో తప్పించుకుంటాడు. ఇలా ఎందరికో మస్కా కొట్టిన అతను ...ఇప్పుడు ఓ కేసులో నంద్యాల సబ్‌జైలులో ఊచలులెక్కిస్తున్నాడు. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో చూసిన బాధితులు ఒక్కొక్కరుగా కొత్తచెరువు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. – కొత్తచెరువు సాక్షి, అనంతపురం : మెరిమిశెట్టి సురేష్‌కుమార్ కొత్తచెరువులోని ధర్మవరం రోడ్డులో శ్రీవెంకటేశ్వర గ్లోబుల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్ ఏర్పాటు చేశాడు. తన పేరుతో వివిధ ప్రాంతాల్లో దాల్‌మిల్లులు ఉన్నాయంటూ మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల రైతులు, వ్యాపారుల నుంచి బియ్యం, బేడలు, చక్కెర, వడ్లు, వేరుశెనగ, మెక్కజొన్న తదితర వాటిని కొనుగోలు చేయడం...వాటిని ఇతరులకు విక్రయించడం ఇతని వ్యాపారం. అన్నీ బాగానే ఉన్నా...రైతుల నుంచి సరుకు తీసుకునే దాల్మిల్ సూరి ఆ తర్వాత వారికి డబ్బులు ఎగ్గొట్టేవాడు. అదే విధంగా కొన్ని ఫ్యాక్టరీలకు ముడిసి సరుకు సరఫరా చేస్తానని అడ్వాన్స్‌గా రూ.లక్షల్లో డబ్బులు తీసుకోవడం... ఆ తర్వాత ఎగ్గొట్టేవాడు. ఇలా ఇప్పటికే ఎందరినో మోసం చేసి రూ.కోట్లు కూడబెట్టాడు. టీడీపీ హయాంలో పెచ్చుమీరిన ఆగడాలు 2014లో తన భార్య మహాలక్ష్మిని టీడీపీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేయించిన సూరి...ఆమె విజయం సాధించడంతో మరింతగా రెచ్చి పోయాడు. అప్పటి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అండతో ఎందరికో మస్కా కొట్టాడు. దీంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినా...అప్పుడు అతనిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. మరికొందరు మాత్రం అధికార పార్టీ అండ చూసుకుని ఆ మాత్రం ధైర్యం కూడా చేయలేకపోయాడు. పదేళ్లలోనే రూ.కోట్లకు ఎదిగిన వైనం సాధారణ మధ్యతరగతికి చెందిన దాల్మిల్ సూరికి ఒకప్పుడు ద్విచక్రవాహనం కూడా ఉండేది కాదు. కానీ పదేళ్లు గిర్రున తిరిగేసరికి అత్యంత విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. తన అనుచరుల పేరుతోనూ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టేవాడు. ఇలా అనుచరులను కూడా మోసం చేశాడు. సూరికి ఓ తమ్ముడు ఉండగా...అతను కూడా అన్నబాటలోనే నడిచాడు. బెంగళూరు, హైదరాబాద్‌లలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలిస్తానని నిరుద్యోగులతో డబ్బులు వసూలు చేసి ఎందరో జీవితాలను నాశనం చేశాడు. నంద్యాల సబ్‌జైలులో ఊచలు లెక్కిస్తూ... దాల్మిల్ సూరి నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీకి మెటీరియల్ అందజేసేందుకు ఫ్యాక్టరీ యజమాని సుజల నుంచి రూ.20 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. సమయానికి మెటీరియల్ సప్లై చేయకపోగా, డబ్బు తిరిగి చెల్లించకపోవటంతో సుజల స్థానిక త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్‌పై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈనెల 23న అరెస్ట్ చేసి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ లావణ్య ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించగా.. పోలీసులు సబ్‌జైల్‌కు తరలించారు. అక్కడ కడుపునొప్పి అంటూ డ్రామా ఆడిన సూరి...నంద్యాల ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసీ గదిలో సేదదీరాడు. అయితే అదే సమయంలో జైలును తనిఖీ చేసిన మెజిస్ట్రేట్ లావణ్య...అక్కడ రిమాండ్ ఖైదీ దాల్మిల్ సూరి లేకపోవడం గమనించి జైలు అధికారులు ప్రశ్నించగా..అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించినట్లు వారు చెప్పారు. దీంతో ఆమె నేరుగా ఆస్పత్రికి వెళ్లి రాజభోగాలు అనుభవిస్తున్న సూరిని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటన గురించి పత్రికల ద్వారా తెలుసుకున్న దాల్మిల్ సూరి బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోలీసు స్టేషన్ మెట్లెక్కుతున్నారు. అతను చేసిన మోసాల గురించి ఏకరువు పెడుతున్నారు. కొత్తచెరువు పీఎస్‌లో నమోదైన కేసులు రాజస్తాన్‌కు చెందిన శేఖర్ అనే వ్యాపారి నుంచి రూ. 40 లక్షల విలువైన వేరుశనగ కాయలు కొనుగోలు చేసి. రూ.18 లక్షలు మాత్రమే ఇచ్చాడు. మిగతా రూ. 22 లక్షలు ఇవ్వకుండ మోసగించినట్లు సదరు వ్యాపారి 2018లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. జొన్నలు సరఫరా చేస్తానని చెప్పి కోయంబత్తూరుకు చెందిన సెంథిల్‌కుమార్ అనే వ్యాపారి వద్ద నుంచి రూ.17 లక్షలు డబ్బులు తీసుకున్న సూరి... జొన్నలు సరఫరా చేయలేదు. దీంతో దాల్మిల్ సూరి తనను మోసం చేశాడని సెంథిల్‌కుమార్ 2019లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సిరిగుప్ప, బళ్లారికి చెందిన వ్యాపారులు బద్రీనారాయణకు బియ్యం సరఫరా చేస్తానని చెప్పి... అతని నుంచి రూ. 80 లక్షలు తీసుకున్న సూరి..బియ్యం పంపలేదు. దీంతో సదరు వ్యాపారులు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కొత్తచెరువు ఆంధ్రాబ్యాంకులో రుణాలు తీసుకుని కట్టకపోవడం...పలువురికి చెక్కులిచ్చి అవి బౌన్స్ అయిన ఘటనలపై కూడా దాల్మిల్ సూరిపై కేసులు నమోదై ఉన్నాయి. బాధితులు ఫిర్యాదు చేయవచ్చు దాల్మిల్ సూరి బాధితులు ఎవరైనా సరే కొత్తచెరువు పోలీస్‌స్టేషన్‌లో గాని వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. చట్టప్రకారం కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకుంటాం. – బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సీఐ -
దాడులు సరే.. చర్యలేవి?
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అక్రమ మెడికల్ దుకాణాల నిర్వహణపై ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లావ్యాప్తంగా 1500 వరకు మెడికల్ షాపులు ఉండగా వీటికి ఆకస్మికంగా తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు సంబంధిత శాఖ దాడులు చేస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో కేసుల నమోదు నామమాత్రంగానే ఉంది. నెలవారిగా ఆకస్మిక తనిఖీలను పరిశీలిస్తే చర్యలు తీసుకున్న ఘటనలు కేవలం నెలకు ఒకటి చొప్పున నమోదు అవుతున్నాయి. ఇదీ అక్కడ పరిస్థితి ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఔషధ నియంత్రణ శాఖ 447 ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 85 మెడికల్ షాపులను గుర్తించారు. ఇందులో 82 షాపులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం 24 మెడికల్ షాపులకు తాత్కాలికంగా సీజ్ చేశారు. కోర్టులో మాత్రం నమోదు అయిన కేసుల సంఖ్య మూడు మాత్రమే. మిగత కేసుల వివరాలను పరిశీలిస్తే వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఈ విషయంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనియన్ నాయకుల జోక్యంతో కేసుల నమోదులో ఆలసత్వం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు అనేకం ఉన్నాయి. ఆర్ఎంపీ వైద్యులు అనుబంధంగా మెడికల్ షాపులను నిర్వహిస్తున్నరు. వీటిని కూడా అధికారులు చూసి, చూడనట్లుగా వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సరస్వతినగర్‌లో కొద్దిరోజుల కిందట ఓ ప్రైవేట్ ఆసుపత్రి అనుమతి లేకుండా ఏర్పడింది. ఇందులో మెడికల్‌ను ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖకు సమాచారం అందించగా వారు చర్యలు తీసుకోకుండానే వదిలివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఖలీల్వాడిలో గతంలో ఆకస్మికంగా దాడులు జరిపిన అధికారులు సుమారు 8 నెలలు అవుతున్న చర్యలు చేపట్టలేదు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మెడికల్‌షాపులపై కన్నెత్తి చూడడం లేదు. -
అసైన్డ్ భూములు హాంఫట్
సాక్షి, పటాన్చెరు: నియోజకవర్గంలో భూముల విలువ అమాంతంగా పెరిగిపోతుంది. దీంతో అక్రమార్కుల కన్ను అసైన్డ్ భూములపై పడింది. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పటాన్‌చెరుమండలం పరిధిలోని చిట్కుల్, ముత్తంగి గ్రామాల శివారులోని అసైన్డ్ భూములను దర్జాగా కబ్జా చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. రెండు గ్రామాల శివారులో ఉండటం మూలంగా కబ్జాదారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముత్తంగి పరిధిలోని సర్వేనెంబర్ 540లో ఉన్న అసైన్డ్ భూమిని చిట్కుల్ పరిధిలోని ఓ వెంచర్లో కలుపుకొని దస్తావేజులను సృష్టించారు. ఇక ఆ దస్తావేజులతో ముత్తంగి పంచాయతీ నుంచి ఇంటి నెంబర్లు తీసుకుని రెండెకరాల భూమిని దర్జాగా కబ్జా చేశారు. ఆ భూముల క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఆ స్థలం విలువ రూ.12 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ భూమిని కాపాడాలని ముత్తంగిలోని స్థానికులు కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవలె ముత్తంగిలో నిర్వహించిన ఓ గ్రామ సభలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. స్థానిక కార్యదర్శిని ప్రజలు నిలదీశారు. పట్టా భూములకే ఇంటి నిర్మాణాలకు అనుమతులు దొరకడం లేదని కాని అసైన్డ్ భూమికి ఇంటినెంబర్లు ఎలా వచ్చాయంటూ వారు నిలదీశారు. అయితే స్థానిక కార్యదర్శి మాత్రం తనకే సంబంధం లేదని చేతులెత్తేశారు. వాస్తవానికి గ్రామ హద్దురాళ్లు ఇతర ఆనవాళ్లను బట్టి ఆ భూమి ముత్తంగిదేనని స్థానిక గ్రామ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ అసైన్డ్ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు చిట్కుల్ నుంచి అనుమతులు పొందారని అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా తమ ప్రైవేటు సంభాషణల్లో అసైన్డ్ భూమి అన్యాక్రాంతం అయ్యిందని ఒప్పుకుంటున్నారు. అయితే ఓ వెంచర్ నిర్వాహకులు ఆ భూమిని తమ పరిధిలోకి చేర్చుకొని దానికి ఇంటి నెంబర్ పొందారని చెప్తున్నారు. సర్వే నెంబర్ 540లో దుంపల్లి విఠలయ్య, పిచ్చకుంట్ల లక్ష్మయ్యకు దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణం అసైన్డ్ భూములు ఉన్నాయి. దుంపల్లి విఠలయ్య మృతి చెందారు. ఆయన సతీమణి సుగుణమ్మ పేరు మీద నేటికీ పాస్‌బుక్‌లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం రెండు గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూమి ఉందనే అంశంపై సర్వే చేయించి తగిన చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూములను అమ్ముకోవడం, కొనడం నేరం. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – యాదగిరిరెడ్డి, తహసీల్దార్,పటాన్చెరు ఇంటి నంబర్లు ఇవ్వలేదు అసైన్డ్ భూమి ఏ గ్రామ పరిధిలో ఉందనేది తేల్చాల్సి ఉంది. ఆ భూమిలోని ఇళ్లకు ఈ పంచాయతీ నుంచి ఇంటి నంబర్ ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు ఆ భూమి ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో తేల్చితే తప్ప చర్యలు తీసుకోలేం. – కిషోర్, గ్రామ కార్యదర్శి, ముత్తంగి అలాంటిది మా దృష్టికి రాలేదు మా దృష్టికి అలాంటి అంశం రాలేదు. వివరాలు తెలుకొని చర్యలు తీసుకుంటాం. నా హయాంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. గతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నాం. –సంజయ్, కార్యదర్శి చిట్కుల్ -
గీత దాటిన సబ్ జైలర్
సాక్షి, కల్వకుర్తి(నాగర్‌కర్నూల్) : విధుల పట్ల నిర్లక్ష్యం, అక్రమార్కులతో కుమ్మక్కు, తోటి ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన వెరసి కల్వకుర్తి సబ్‌జైలర్ సుధాకర్‌రెడ్డిపై వేటుకు కారణమైంది. కల్వకుర్తి సబ్ జైలర్‌గా మంథని నుంచి సుధాకర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి విధుల పట్ల అంటిముట్టనట్లుగా ఉన్న ఈయన సబ్‌జైలర్ నుంచి ఎస్ఐగా మారి తన పరిధి దాటి ఇసుక అక్రమార్కుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐ అవతారం ఎత్తి.. సబ్ జైలర్‌గా విధులు నిర్వహించాల్సిన సుధాకర్‌రెడ్డి దారితప్పి ఎస్ఐగా అవతారం ఎత్తి ఇసుక అక్రమార్కుల దగ్గర అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ దందా నిర్వహిస్తున్నారు. కొంతమంది సిబ్బందిని తన అక్రమాలకు అండగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని ఇసుక వ్యాపారు లకు ఫోన్లు చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇసుక ట్రా క్టర్లు సీజ్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు సబ్ జైలర్ సుధాకర్‌రెడ్డి మంథనిలో విధులు నిర్వహించిన సమయంలో అనేక ఆరోపణలు రావడంతో కల్వకుర్తికి బదిలీ చేశా రు. ఇక్కడ కూడా విధులు నిర్వహిస్తూ ఒక ఇసుక వ్యాపారిని డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత వ్యా పారి సబ్‌జైలర్ ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం కల్వకుర్తికి వచ్చి సమగ్ర విచారణ జరిపారు. సుధాకర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యాన్ని గుర్తించిన అధికారుల నివేదిక మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేయడంతోపాటు సుధాకర్‌రెడ్డిని హెడ్‌క్వార్టర్ వదిలి పోకూడదనే ఆదేశాలిచ్చారు. సబ్ జైలర్ వ్యవహారం కల్వకుర్తి ప్రాంతంలో కలకలం రేకెత్తించింది. -
పట్టా కావాలా నాయనా !
సాక్షి, పలమనేరు(చిత్తురు) : ఇంటి పట్టా కావాలంటే అధికారుల చుట్టూ తిరిగేరోజులు పోయాయి. కాసులిస్తే ప్రభుత్వ స్థలాలకు నివేశిత ధ్రువపత్రాలు, అనుభవ ద్రువపత్రాలు కూడా ఇళ్ల వద్దకే నడుచుకుంటూ వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు, గడ్డూరు ఇందిరమ్మ కాలనీలో ఈ తంతు జరిగినట్లు తెలిసింది. ఈ అక్రమాలపై పత్రికల్లో పలు కథనాలు రావడంతో స్పందిందన అధికారులు ఎన్నికలకు ముందు విచారణ కూడా చేపట్టారు. నకిలీ పట్టాలు భారీగానే ఉన్నట్లు విచారణలో అధికారులు సైతం గుర్తించారు. అయితే కొందరు కీలక వ్యక్తులు ఈ నివేదికను తొక్కిపెట్టారనే ఆరోపణలున్నాయి. అక్రమాలు ఇలా.. స్థానిక ఇందిరమ్మ కాలనీల్లోని ఖాళీస్థలాలు, అప్పటికే పట్టాలుపొంది ఇల్లు కట్టని స్థలాలు, పునాదుల దశలో ఆగినవాటిని లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమాలు సాగాయి. కాలనీల్లో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాన్ని ఎంచుకుని అక్కడ ఇతర వ్యక్తులద్వారా నిర్మాణాలను చేపట్టడం చేశారు. దీంతో అసలైన పట్టాదారు అక్కడికొచ్చి తనకు పట్టా ఉందని చెబితే దాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలనకు తీసుకోవడం జరిగింది. అయితే వారిచ్చిన పట్టాలేక అనుభవ ధ్రువపత్రాన్ని ఫోర్జరీ చేసి ఇతరుల పేరిట మార్చినట్లు తెలుస్తోంది. ఈవిధంగా ఇప్పటికే 200కు పైగా నకిలీ పట్టాలు చలామణిలో ఉన్నట్టు సమాచారం. 20 మంది కీలక సూత్రధారులు.. గత ఆరేళ్లలో సాగిన నకిలీ పట్టాల కుంభకోణంలో ఇరువురు రాజకీయ నాయకులు, ఇరువురు వీఆర్వోలు( ప్రస్తుతం బదిలీ అయ్యారు), ఓ సర్వేయర్ సహాయకుడు, ఓ రిటైర్డ్ వీఆర్వో సాయంతో మిగిలినవారు కలసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. నకిలీపట్టాల తయారీ కోసం ఖాళీ అనుభవ ధ్రువపత్రాలు, తహసీల్దార్ సీలు, కార్యాలయపు రౌండ్ సీలు తదితరాలను వీరే తయారు చేసుకున్నట్లు తెలు స్తోంది. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన ఇందిరమ్మ కాలనీ ఎఫ్‌ఎంబీలు సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇప్పటికీ ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో బయటపడినా ? ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలపై దినప్రతికల్లో పలు కథనాలు గతంలో ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపించారు. ఇందులోనూ ఈ విషయం బయటపడిం ది. దీంతోవారు ఓ నివేదికను సైతం సిద్ధం చేశా రు. అయితే తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుం దోనని గ్రహించిన కొందరు కీలక వ్యక్తులు దీన్ని ఎన్నికలకు ముందే తొక్కిపెట్టినట్టు సమాచారం. మళ్లీ వెలుగులోకి.. పట్టణానికి చెందిన రఘు అనే ప్రభుత్వ ఉద్యోగి దొంగపట్టాలపై ఆరాతీసి సుమారు 20 నకిలీ పట్టాలను ఇటీవలే సేకరించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులిచ్చినా న్యాయం జరగదని భావించారు. వీటిని సోషల్ మీడియాలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడతో పాటు జిల్లా అధికారులకు పోస్టింగులు పెట్టారు. దీంతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కుల కన్ను.. గంటావూరు కాలనీలో ఇప్పటికీ ప్రభుత్వ స్థలం 12 ఎకరాలదాకా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సంబంధిత స్కెచ్‌లో ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో చూసి అక్కడ తమకు కావాల్సిన వారికి ఇళ్లు కట్టుకునేందుకు కొందరు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటి నివేశన పట్టాలను ఇవ్వడం లేదు. దీంతో 2008 నుంచి 2013 సంవత్సరాల్లో జారీ అయినట్లు అనుభవ పత్రాలను సృష్టించే పనుల్లో అక్రమార్కులు నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ కాలనీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలు చేపట్టాల్సి ఉందని పట్టణవాసులు కోరుతున్నారు. -
ఇందిరా జైసింగ్ నివాసంలో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ : విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై సీబీఐ గురువారం దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ నివాసం, ఎన్జీవో ఆఫీస్, ముంబయిలోని మరో ఆఫీసులో గురువారం ఉదయం 5గంటలకు దాడులు నిర్వహించినట్లు సీబీఐ పేర్కొంది. లాయర్స్ కలెక్టివ్ పేరిట ఎన్జీవోను స్థాపించి విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆనంద్‌గ్రోవర్ పై కేసు నమోదైనట్లు వెల్లడించింది. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ 'లాయర్ కలెక్టివ్' ఎన్జీవో సంస్థ ద్వారా దాదాపు రూ.32 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఫిర్యాదులో ఇందిరా జైసింగ్‌ను నిందితురాలిగా పేర్కొనలేదని, కానీ లాయర్స్ కలెక్టివ్ నుంచి ఆమెకు రూ.96.60లక్షలు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ స్పష్టం చేసింది. మరోవైపు ఇందిరా జైసింగ్ 2009 నుంచి 2014 వరకు అదనపు సొలిసిటర్గా భాద్యతలు నిర్వహించిన సమయంలో తన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను హోంశాఖ అనుమతి లేకుండానే ఎన్జీవో సంస్థ నుంచి పొందినట్లు సీబీఐ తెలిపింది. సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ పై సీబీఐ నిర్వహించిన దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ' రాజ్యాంగ విలువలను కాపాడడానికి వాళ్ల జీవితం మొత్తాన్ని అంకితం చేశారని, అటువంటి వారిపై అభియోగం మోపడం చాలా భాదాకరమని' కేజ్రీవాల్ ట్విటర్లో పేర్కొన్నారు. -
ఆ నిధుల్నీ వదల్లేదు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : రైతులను ఆదుకునేందుకు ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం గత ఎన్నికల్లో తాయిలాల కోసం వారి కష్టార్జితాన్ని పణంగా పెట్టింది. సాగుబడి లేక దిగాలుగా ఉన్న రైతులకు సాయం చేయాల్సింది పోయి వారికి ఇవ్వాల్సిన బిల్లులను ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు వినియోగిందింది. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కరువు ఛాయలు కనిపిస్తున్నా ప్రత్యామ్నాయాల కోసం ప్రతిపాదనలు చేస్తుంటే... బిల్లులు రాని పనులెందుకని రైతాంగం ప్రశ్నిస్తోంది. వ్యవసాయం కష్టమయినప్పుడు, ఖరీఫ్, రబీల సాగుకు వర్షాభావం ఎదురయినప్పుడు, చినుకు జాడ లేక ఇబ్బందులకు గురయినప్పుడు రైతులను ఆదుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం భూ సార సంరక్షణ పనులు. ఇందుకోసం ఏటా ప్రణాళిక ప్రకారం కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే ఏటా ప్రణాళికలు రూపొందించి వ్యవసాయం ఇబ్బందయిన ప్రాంతాల్లో గొర్రెల పెంపకం, కూరగాయల సేద్యం, చెక్‌డ్యాంల నిర్మాణాలతో రైతులను ఆదుకోవాలి. ఈ పనులకు సంబంధించి విడుదలయిన నిధులను రైతాంగానికి కాకుండా ఇతర పనులకు మళ్లిస్తే.. ఇక రైతులు ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నారు. రైతులకు అందని బిల్లులు అన్ని రంగాలనూ ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం ఉప్పెనలా వచ్చి పడుతున్న ఎన్నికలను చూసి బెదిరిపోయింది. చేసేది లేక ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకోవాలని ఎక్కడెక్కడ ఉన్న బడ్జెట్‌నూ తాయిలాలకోసం మళ్లించేసింది. చివరకు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు విడుదలయిన ప్రత్యామ్నాయ వనరులనూ వదల్లేదు. దీనివల్ల ఆరు క్లస్టర్లకు చెందిన రైతులకు చెల్లించాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు చెందిన రూ. 99 లక్షలు ఇప్పుడు అందకుండా పోయాయి. భూసార సంరక్షణ విభాగం బొబ్బిలి పరిధిలో పనులకోసం 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.101లక్షలు మంజూరయ్యా యి. ఈ నిధులతో బాడంగి, మెంటాడ, సాలూ రు, కొత్తవలస, మెరకముడిదాం క్లస్టర్లలో గొర్రెల పెంపకం, కాయగూరల సాగు, చెక్ డ్యాంల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. ఈ క్లస్టర్ల పరిధిలోని రైతులకు 50 శాతం సబ్సిడీ కింద బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ బిల్లులు పెట్టిన వాటిలో దాదాపు 50 శాతం పూర్తవ్వకుండానే మిగతా బిల్లులు నిలిచిపోయాయి. మంజూరయిన రూ.101లక్షల్లో కేవలం రూ. 60లక్షలు మాత్రమే బిల్లులు అయ్యాయి. మిగతా రూ.40 లక్షలు చెల్లించలేదు. ఎందుకని ఆరాతీస్తే ఈ బిల్లులను పసుపు కుంకుమ కోసం మళ్లించేసినట్టు తేలింది. ఇక 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. కోటీ 18లక్షల బడ్జెట్ విడుదలయింది. ఈ నిధులతో రామభద్రపురం, దత్తిరాజేరు, ఎల్కోట, కురుపాం, గుర్ల, బాడంగి క్లస్టర్ల పరిధిలో పలు వ్యవసాయ పనులు చేపట్టారు. ఇందులో నేటికీ రూ.59 లక్షల బిల్లులు కాలేదు. ఏమని అడిగితే ఎన్నికల ముందు ఈ నిధులను సీఎఫ్ఎంఎస్ ద్వారా ఇతర పద్దుల కోసం గత ప్రభుత్వం మళ్లించిందని తేలింది. బిల్లులు రావాల్సి ఉంది ఇలా జిల్లాలో 2016–17 సంవత్సరానికి చెందిన రూ.40లక్షలు, 2017–18 సంవత్సరానికి చెందిన రూ. 59 లక్షలు మొత్తం రూ.99లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాలకోసం నిత్యం రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. భూ సంరక్షణ పనుల కింద రెండేళ్లుగా వివిధ క్లస్టర్లలో పనులు చేపడుతున్నాం. 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.20లక్షలు, 2017–18 సంవత్సరానికి రూ.25లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే రైతులకు చెల్లించాలని వారి బ్యాంకు అకౌంట్ల పేరున బిల్లులు చెల్లించాలని ట్రెజరీకి సమర్పించాం. కానీ బిల్లులు అవలేదు. బిల్లులకోసం ఎదురు చూస్తున్నాం. – పి.చంద్రశేఖర బాబు, ఏడీ, భూ సంరక్షణ విభాగం, బొబ్బిలి -
టీడీపీ ‘అక్రమాల అడ్డా’
సాక్షి, జలుమూరు(శ్రీకాకుళం) : కాదేదీ అవినీతికి అనర్హం అన్న రీతిలో గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న తెలుగుదేశం నాయకుల అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సహజ వనరులను కొల్లగొ ట్టి కోట్లు గడించిన టీడీపీ నేతలు.. ఆఖరుకు పింఛ న్ల కోసం కులాలను కూడా మార్చేసి అవినీతికి తెరతీశారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్లు మంజూరు కావడం, ఇతర రాయితీలు లభిస్తుండటంతో వారి ధ్రువపత్రాలను ఇతర కులస్తులకు అ క్రమ మార్గంలో అందించి వసూళ్లకు పాల్పడ్డారు. చక్రం తిప్పిన తెలుగు తమ్ముళ్లు! నరసన్నపేట నియోజకవర్గంలో గంగపుత్రులకు దక్కాల్సిన పింఛన్లు, ఇతర పథకాలు ఇతర కులస్తులు తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో పొందుతున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక తిమడాం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత చక్రం తిప్పి పింఛన్లు మంజూరు చేయించాడని సమాచారం. దీనికి చెన్నాయవలసకు చెందిన మత్య్సకార యువకుడు అంతా తానై వ్యవహరించి మత్య్సకా ర ధ్రువపత్రాలను సిద్ధం చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ అక్రమాలే.. గతంలో ఇదే నాయకుడు తిమడాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఇసుక అక్రమ రవాణా, నీరు చెట్టు పనులు, తుఫాన్ పరిహారం, విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ కూడా అప్పటి ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మత్స్యకారులకు చెందిన పింఛన్లు తమ సామాజిక వర్గానికి మంజూరు చేయించుకోవడం గమనార్హం. తిమడాం, లచ్చన్నపేట, గొటివాడ, రావిపాడు, అక్కురాడ కాలనీ తదితర గ్రామాల్లో సుమారు 20 మంది వరకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు తెలిసింది. తిమడాంలో వెలమల నాగమయ్య, ముద్దాడ మల్లేశ్వరరావు, పంచిరెడ్డి గడ్డయ్య, దూసి లక్ష్మీనారాయణ, యండమూడి రాము, పిల్లల శిమ్యయ్య, నవిరి రాజారావు తదితరులకు మత్స్యకార ధ్రువపత్రాలు మంజూరయ్యాయి. వాస్తవంగా వీరంతా వేరే కులాలకు చెందిన వారు. మూడు నాలుగు గ్రామాల్లోనే 20 మంది వరకూ బయటపడితే మండల వ్యాప్తంగా ఎంతమంది ఉంటారన్నదానిపై దర్యాప్తు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పింఛను లబ్ధిదారులు వేర్వేరు గ్రామాలకు చెందినవారైన ఈ అక్రమ పింఛన్లు మాత్రం చెన్నాయవలస నుంచే మంజూరు కావడం విశేషం. అధికారులపై ఒత్తిడి! వాస్తవంగా మత్స్యకారులకు పింఛన్లు మంజూరు చేయాలంటే ఆ శాఖ అభివృద్ధి అధికారి ఆమోదం కావాలి. ఇందుకోసం తగిన ధ్రువపత్రాలను పరిశీలించాలి. బోటు రిజిస్ట్రేషన్, మత్స్యకార సంఘాల గుర్తింపుకార్డు, రేషన్, ఆధార్‌కార్డు, సాగరం, స్వదేశీ మత్స్యకార వృత్తిలో ఉన్నారా లేదా అనే విషయం ధ్రువీకరించాలి. ముఖ్యంగా మత్స్యశాఖలో ధ్రువపత్రాలు ఇచ్చే సమయంలో కార్యాలయం రికార్డు, సీరియల్ నంబరు ఉంటాయి. ఇవేవీ లేకుండా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, జలుమూరు మండల పరిధిలో మంజూరైన ఈ తరహా పింఛన్లు తొలగించేందుకు సదరు టీడీపీ నాయకుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కకముందే పింఛన్లు తొలగించాలని మండల పరిషత్‌తోపాటు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. సంతకాలు ఫోర్జరీ చేశారు నరసన్నపేట నియోజకవర్గంలో మత్స్యకారులు కాని వారిని మత్స్యకారులుగా గుర్తించి పిం ఛన్లు మంజూరు చేసిన సంగతి నాకు తెలియ దు. కుల ధ్రువీకరణ పత్రాల్లో ఉన్న సంతకాలు నావి కావు. నాతో పాటు అంతకుముందున్న అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. మత్స్యకారుడి గుర్తింపు కార్డును చూడకుండానే ధ్రువపత్రాలు ఇచ్చేసినట్టుంది. పొరపాట్లను సరిదిద్దుతాం. – పి.శాంతారావు, మత్స్యశాఖ పర్యవేక్షణాధికారి -
రాబందూ... చూశావా ఈ విందు
క్షమించు రాబందూ... మన్నించండి గద్దల్లారా ... అక్రమార్కులు ఎక్కడ అవినీతి చేసినా గద్దల్లా తన్నుకుపోయారు... గద్దల్లా పొడుచుకుతిన్నారు ... రాబందుల్లా మెక్కేశారని ఏ పాపం ఎరుగని మీతో ఈ అవినీతి నేతలను సరిపోల్చుతున్నాం. పొట్ట నింపుకోడానికి చేస్తున్న మీ పనిని కూడా మేం తప్పుపడుతున్నాం. మీ ఆకలి తీరాక ఆ జోలికే పోరు...రేపటి కోసం సంపాదించుకోవాలనే ఆత్రమే మీకు ఉండదు. కానీ గతంలో దండిగా సంపాదించినా... ఇంకా...ఇంకా అంటూ జిల్లాలోని టీడీపీ నేతలు ఆత్యాశతో అభివృద్ధి పనుల పేరిట అక్రమాలకు పాల్ప డ్డారు. తినడంలో మీతో పోటీ పడుతున్నారు. సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి) : స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) పేరుతో జిల్లాకు మంజూరైన నిధులతో టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు. రూ.229 కోట్ల నిధుల్లో రూ.111 కోట్ల మేరకు ఖర్చు చేసేసి ప్రజాధనాన్ని లూటీ చేసేశారు. ఇంకో ఏడాది ఎన్నికలు రాకుండా ఉండి ఉంటే ఆ నిధులను కూడా గుటకాయ స్వాహా చేసేసేవారే. ఈ తంతును పసిగట్టిన సీఎం జగన్మోహన్రెడ్డి ‘చెక్’ పెట్టడంతో కోట్ల రూపాయలకుపైగా నిధులు దుర్వినియోగం కాకుండా ఆగిపోయాయి. ఎక్కడ ఆ అవినీతి బయటపడుతుందోనని ‘అభివృద్ధిని అడ్డుకుంటున్నార’ంటూ తెలుగు తమ్ముళ్లు కొంగొత్త గోల చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఆయన అనుచరులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన వైనాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్ద మొత్తాలను టెండర్లుగా పిలిస్తే పోటీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో నామినేటెడ్ పద్ధతిలో పనులను దక్కించుకొని భారీగా నిధులు దోచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న పనులనే ముక్కలు ముక్కలుగా చేసి, విలువను తగ్గించి అప్పనంగా కట్టబెట్టేయడంతో పనులు చేయకుండానే నిధులు కొట్టేసే వ్యూహ రచన చేసి కొంతమేర సఫలీకృతులయ్యారు. ఇంతలో ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ దోపిడీకి బ్రేక్ పడింది. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన టీడీపీ నేతల పేరున కూడా నిధులు విడుదల చేశారు. నిధులు మంజూరు చేయించుకోండి...నచ్చినంత దోచుకోండి అన్నట్టుగా ప్రజాధనాన్ని గంపగుత్తగా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ధారాదత్తం చేశారు. ఇలా గత ఐదేళ్లలో తన పార్టీ ఎమ్మెల్యేలకు రూ. 242.60 కోట్ల మేర కేటాయించారు. అంతటితో ఆగకుండా తమ ఎమ్మెల్యేలు సూచనల మేరకు పనులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇంకేముంది టీడీపీ నేతలు చెలరేగిపోయి నచ్చినట్టుగా పనుల ప్రతిపాదనలు తయారు చేయించి, వాటికి మంజూరు చేయించుకుని, నిధులు ఇష్టారీతిన వాడుకున్నారు. నిబంధనల మేరకైతే రూ.5 లక్షల విలువ దాటితే సంబంధిత పనులకు విధిగా టెండర్లు పిలవాలి. ఓపెన్ టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి కాంట్రాక్ట్ అప్పగించాలి. ఇలా చేస్తే అన్ని పార్టీలకు చెందిన వారు టెండర్లలో పోటీ పడతారని, ఏకపక్షంగా తమ వారికి పనులు దక్కవనే ఉద్దేశంతో వర్క్ విలువను రూ.5 లక్షలు దాటకుండా ఇంజినీరింగ్ అధికారుల ద్వారా డిజైన్ చేయించారు. సంవత్సరాల వారీగా ఎస్డీఎఫ్ వినియోగ అధికారిక వివరాలివి ( సంవత్సరం మంజూరైననిధులు (కోట్లలో) పూర్తయిన పనులు ఖర్చు చేసిననిధులు (కోట్లలో) 2015–16 28.00 641 25.30 2016–17 43.29 729 27.93 2017–18 88.94 1594 46.16 2018–19 69.18 343 11.99 229.41 3307 111.38 వాస్తవానికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువున్న పనులు అనేకం ఉన్నాయి. అయితే, వాటికి టెండరు పిలవాల్సి వస్తుందని ఒకే వర్క్‌ను ఆరేడు భాగాలు (ముక్కలు ముక్కలు)గా చేసి పనుల ప్రతిపదనలు తయారు చేయించి, వాటిని మంజూరు చేసేలా అధికారులపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఎక్కడే వర్క్ జరిగిందో తెలియని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ఒకే వర్క్‌ను చూపించి రెండు మూడు బిల్లులు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక వర్క్‌ను తూర్పు నుంచి పడమరకు వైపునకు, అదే వర్క్‌ను పడమర వైపు నుంచి తూర్పునకు చూపించి రెండేసి బిల్లులు చేసుకున్నారన్న వాదనలున్నాయి. ఇలా పంచి పెట్టిన పనులను నామేకే వాస్తేగా చేసి, కొన్ని పనులకు పైపై మెరుగులు దిద్ది పెద్ద ఎత్తున నిధులు దోచేశారు. ఎన్నికలకు ముందు హడావుడి ఎన్నికల ముందు నాయకులకు తాయిలాలుగా మరింత ఎరవేసే యత్నం ఎమ్మెల్యేలు చేశారు. అంతకుముందు సంవత్సరాల్లో బేరం కుదరక ఆగిన పనులను, మరికొన్ని ఎన్నికలకు ముందు సీఎం చేత మంజూరు చేయించుకున్న పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు హడావుడి చేశారు. అయితే, ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో కొందరు సానుకూలంగా వ్యవహరించగా, మరికొందరు ఎన్నికలప్పుడు ఎందుకింత హడావుడి అని సహకరించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 1935 పనులు ప్రారంభ దశలో ఉండగా, రూ.52.02 కోట్ల విలువైన పనులు ప్రారంభం కాకుండా ఉండిపోయాయి. ప్రారంభ దశలో ఉన్న పనులకు దాదాపు రూ.60 కోట్ల వరకు చెల్లింపులు జరిగిపోవడం గమనార్హం. కొత్త ప్రభుత్వ ఆదేశాలతోవందల కోట్ల దోపిడీకి బ్రేక్ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఇంజినీరింగ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, టెండర్లు పిలవకుండా నామినేటేడ్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల పనులను ఏకపక్షంగా కట్టబెట్టి దోచిపెట్టారని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిలోనే గుర్తించారు. అధికారుల ద్వారా రప్పించుకున్న నివేదికల ఆధారంగా చేసుకుని ఇంజినీరింగ్ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో 25 శాతంలోపు జరిగిన పనులకు బిల్లులు చెల్లింపులు చేయకుండా ఆపాలని, ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో ప్రారంభ దశలో ఉన్న 1935 పనులు దోపిడీకి గురికాకుండా ఆగాయి. అలాగే, ప్రారంభం కాని 1268 పనులకు సంబంధించిన రూ.52.02 కోట్ల నిధులు మంజూరు కాకుండా నిలిపివేశారు. ప్రభుత్వం అప్రమత్తం కాకపోయి ఉంటే సందట్లో సడేమియాలా వీటిని కూడా ఊదేసేవారు. -
అక్రమాల అడ్డా.. నడిగడ్డ!
సాక్షి, గద్వాల క్రైం: అక్రమార్కుల ధాటికి జోగుళాంబ గద్వాల జిల్లాలోని విలువైన సంపద లూఠీ అవుతోంది. అమాయక ప్రజలను గారడీ మాటలతో మోసం చేసి మల్టీలెవల్ స్కీంల పేరిట రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఉన్నత విద్యకు తక్కువ ఫీజంటూ చెప్పి రూ.లక్షలు దండుకున్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్నలకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మి సొమ్ము చేసుకున్న ముఠాలు, రూ.100కు రూ.10 వడ్డీ వసూలు చేసే జలగలు, అనుమతుల పేరిట, అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు, ఇసుక, మట్టి తవ్వకాలు.. ప్రభుత్వ, దేవాదాయ, ఇనాం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలు.. గుట్కా, మట్కా, గంజాయి, సారా, కల్తీ కల్లు విక్రయాలు, యువతను పెడదోవ పట్టించే బెట్టింగ్, పేదల బియ్యం పక్కదారితోపాటు పలు చీకటి దందాలకు నడిగడ్డ అడ్డాగా మారింది. ఇక కేసుల పరిష్కారం కోసం బాధితులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకు కొత్తగా వచ్చే ఎస్పీపైనే ప్రజలు కోటి ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో నడిగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, చీకటి వ్యాపారాలపై ప్రత్యేక కథనం.. పాత కేసుల పురోగతి సాధ్యమేనా? 2018లో నకిలీ పాస్ పుస్తకాల విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుమారు 10 వేల నకిలీ పాస్ పుస్తకాలు బయటపడ్డాయి. ఈ కేసులు ఇందులో దళారీ నుంచి రాజకీయ నాయకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారులు సైతం చిక్కి జైలు జీవితం గడిపారు. ఇక కేసు అనుకున్న స్థాయిలో విచారణ జరగకపోవడం, కీలక సూత్రదారులు బయటకు రాకపోవడంతో మిస్టరీగా మిగిలింది. నకిలీ విత్తనాలు జిల్లాలో సీడ్ కాటన్ (పత్తి) పంటలను రైతులు ఎక్కువ శాతం పండించడం, విత్తన తయారీకి జాతీయ స్థాయిలో గద్వాలకు పేరు ఉంది. అయితే ఇక్కడే జాదుగాళ్లు నకిలీ విత్తనాలకు తెరలేపారు. ఫలితంగా సీడ్‌పత్తి పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోగా.. పలువురు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు. వ్యవసాయాధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలను నాటడంతోనే పంట దిగుబడి రాలేదని ధ్రువీకరించారు. ఈ విషయమై అప్పటి కలెక్టర్ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్ ప్రత్యేకంగా దృష్టిసారించడంతో జిల్లా యంత్రాగం ఒక్కసారిగా నకిలీ విత్తనాల ముఠా సభ్యుల స్థావరాలపై దాడులు చేసి నకిలీ పత్తి విత్తనాల కేసులను వెలుగులోకి తెచ్చారు. ఈ విత్తనాల తయారీలో పలు బడా కంపెనీలు, సీడ్‌పత్తి వ్యాపారులు, దళారులను అదుపులోకి తీసుకుని వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ సీడ్‌పత్తి విత్తనాలతోపాటు మిర్చి, ఇతరత్రా కంపెనీలపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే వివిధ కారణాలతో ఈ కేసుల విషయంలో కూడా ఎలాంటి పురోగతి కనిపించలేదు. వడ్డీ జలగలు.. అవసరాలకు అప్పులు చేసేందుకు సామాన్యులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే వారిని నిలువునా ముంచుతున్నారు. రూ.100కు రూ.10 వడ్డీ వసూలు చేయడం గమనార్హం. అప్పు తీసుకుని సకాలంలో వడ్డీలు చెల్లించలేక ఉన్న కొందరు ఆస్తులను తాకట్టు పెట్టి నేటికీ సతమతమవుతున్నారు. 2017లో అప్పటి ఎస్పీ వద్దకు బాధితులు ఫిర్యాదు చేయడంతో జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. ఇచ్చిన అప్పులకు కట్టిన వడ్డీలను అంచనా వేయగా రూ.కోట్లలో తేలింది. ఈ విషయమై ప్రముఖ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసుల్లో కూడా తీవ్ర జాప్యం జరిగిందన్న విమర్శలున్నాయి. విలువైన సంపద ఖాళీ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల పరిసర ప్రాంతాల నుంచి జాతీయ సంపదైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ వనరులను కాపాల్సిన ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు సంఘాల నాయకులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీస్‌శాఖ ప్రత్యేక సిబ్బందితో ఇసుక వ్యాపారానికి కాస్త చెక్ పెట్టారు. ఈ దందాలో పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటడంతో నామమాత్రపు చర్యలు తప్ప కఠిన చర్యలు లేవని ప్రజలు ఆరోపణ. అలాగే మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జిల్లాలో జరుగుతున్నాయి. అక్రమార్కుల ధాటికి గుట్టలు సైతం ఖాళీ అవుతున్నాయి. ఇక అక్రమ దందాను నిలువరించేందుకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పీడీఎస్ బియ్యం సైతం పక్కదారి పడుతుంది. నిషేధిత మత్తు పదార్థాలు నిషేధిత మత్తు పదార్ధాల దందా సైతం జిల్లాలో జోరుగా సాగుతుంది. గంజాయి సాగు కూడా గుట్టుగా సాగిస్తున్నారు. ముఖ్యంగా అయిజ, గద్వాల, నదితీర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి పలు రాష్ట్రాలకు కూడ ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. కల్తీ కల్లు, సారా, మద్యం కూడా జిల్లాలో జోరుగా నడుస్తుంది. ఇక రాయిచూర్ నుంచి గద్వాల మీదుగా ప్రతిరోజు గుట్కాను అక్రమంగా తరలిస్తున్నారు. తెరపైకి పలువురి పేర్లు జిల్లా ఎస్పీ ఎవరనే విషయంపై ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా సింధుశర్మ, మల్లారెడ్డి, శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నారాయణపేట, వనపర్తి ఎస్పీల పేర్లు సైతం ప్రచారంలోకి వచ్చాయి. గత నెల 30న పదవీ రమణ పొందిన లక్ష్మీనాయక్ స్థానంలో అదే రోజే వనపర్తి ఎస్పీ అపూర్వారావుకు ఇన్చార్జ్ ఎస్పీగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఏర్పాటు తర్వాత.. జోగుళాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు నుంచి పలు చికటీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్ అక్రమార్కుల దందాలపై తనదైన ముద్ర వేసి చాలా వరకు అడ్డుకట్ట వేశారు. ఇక 2018 మార్చి నెలలో ఎస్పీ విజయ్‌కుమార్ బదిలీ పై వెళ్లారు. అప్పటి నుంచి జిల్లాలో పలు దందాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.ఈ క్రమంలోనే గత నెల 30న జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ పదవీ విరమణ పొందడంతో జిల్లా బాస్ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎస్పీపైనే ఈ బాధ్యతలన్నీ పడనున్నాయి చర్యలు తీసుకుంటాం అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను దోచుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. గతంలో నమోదైన కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులను తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – అపూర్వరావు, ఇన్చార్జ్ ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
ఉట్టి చేతులతో ఎలా ?
కుమురం భీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ చేసిన దాడిని మరవకముందే మళ్లీ అదే తరహా ఘటన పొరుగు జిల్లాల్లో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో కొందరు మంగళవారం సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పోడుభూములు, కలప అక్రమ రవాణా సందర్భంగా ఇలాంటివి అనేకం జరిగాయి. అటవీ అధికారులు మహబూబాబాద్, గూడూరు, నర్సంపేట కొత్తగూడ ప్రాంతాల్లో 2004 నుంచి 2015 వరకు 1,206 మందిపై కేసులు నమోదు చేసి 211 మందిపై చార్జ్‌షీట్æ కూడా దాఖలు చేశారు. పదేపదే సంఘటనలు జరుగుతున్నా.. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీస్టేషన్ల ఏర్పాటు, ఆయుధాల కేటాయింపు, అటవీశాఖ రీ–ఆర్గనేజేషన్ వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ,వరంగల్ : అడవుల సంరక్షణకు ఆయుధాలు అనివార్యమని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నా.. ఆచరణరూపం దాల్చడం లేదు. అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరినప్పుడు మాత్రమే ఆయుధాల ప్రస్తావన తెరమీదకు వస్తుండగా ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా కారణమేమిటో తెలియదు కానీ అంతగా స్పందన ఉండటం లేదని అధికారులు చెబుతున్నారు. ఆరేళ్ల కిందట చోటుచేసుకున్న వరుస సంఘటనల్లో స్మగ్లర్ల చేతిలో అటవీశాఖ ఉద్యోగులు మృతి చెందిన విషయం విదితమే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులను హతమార్చడం.. అంతకు ముందు నిజామాబాద్‌తో పాటు జిల్లాలోని పెంబి అడవుల్లో బీట్ ఆఫీసర్ సత్యనారాయణను చంపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పోలీసు, అటవీ, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు సైతం పాల్గొన్నారు. ఆ చర్చలు, సమీక్షల సందర్భంగా అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను నిరోధించడంతో పాటు అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అటవీ సిబ్బంది చేతికి ఆయుధాలు అందుతాయని ఆశించారు. అటకెక్కిన పునర్విభజన డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పని భారం, ఒత్తిడి తగ్గించేందుకు అట వీశాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టేందుకు కమిటీ వేసింది. కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికా రి నర్పట్ సింగ్ అధ్యయనం చేసిన 2011లో పలు ప్రతి పాదనలు సమర్పించారు. ప్రస్తుతం ఒక్కో మండలంలో 1,473 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. దానిని 750 స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గించి, ఒక్కో మండలంలో మూడు నుంచి నాలుగు రేంజ్‌లు, సెక్షన్లు పెంచి తే బీట్ ఆఫీసర్ల పరిధి 25 చదరపు కిలోమీటర్ల నుంచి 15 చదరపు కిలోమీటర్లకు తగ్గుతుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌లో... ఉమ్మడి వరంగల్‌లో ఈ ప్రతిపాదనలు అమలైతే భారీ పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించారు. అదే జరిగితే ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మండలాలు, రేంజ్‌ల సంఖ్య పెరగాల్సి ఉంది. అటవీశాఖ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మండలాల సంఖ్య మూడు నుంచి ఐదుకు, రేంజ్‌లు 13 నుంచి 16కు పెంచాలని సూచించారు. వరంగల్ ఉత్తరం, వరంగల్ దక్షిణ మండలాలతో పాటు ఒక వన్యప్రాణుల సంరక్షణ డివిజన్లను విభజించి... వరంగల్ ఉత్తరం, ఏటూరునాగారం, వరంగల్ దక్షిణం, నర్సంపేట, మహబూబాబాద్ డివిజన్ల ఏర్పాటుకు సిఫారసు చేశారు. అలాగే, టెరిటోరియల్, వైల్డ్‌లైఫ్ డివిజన్లను ఒక్కటిగా మార్చాలని పేర్కొన్నారు. వరంగల్ ఉత్తర మండలం పరిధిలో ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం, మంగపేట, పస్రా, ములుగు, భూపాలపల్లి, పరకాల, మంగపేట రేంజ్‌లకు తోడు నర్సంపేట పరిధిలో కొత్తగూడకు తోడు పాకాల, వరంగల్ పరిధిలో వరంగల్, హన్మకొండ రేంజ్‌లుగా మార్చడంతో పాటు జనగామలో మరొకటి ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికివీటికి తోడు పాతవి మహబూబాబాద్, గూడూరు రేంజ్‌లు పనిచేస్తాయి. అయితే ఈ ప్రతిపాదనలు, సూచనలను అమలుకు నోచుకోలేదు. ఇక ఇప్పటికే స్మగ్లర్ల ధాటికి అడవి తగ్గిపోగా.. మిగిలిన మిగిలిన అడవులను పరిరక్షించడమే కాకుండా తమను తాము రక్షించుకునేందుకు అటవీశాఖ చేసిన ఆయుధాల ప్రతిపాదనకు తోడు ‘అటవీ స్టేషన్ల’ ఏర్పాటు కూడా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. -
పౌర సరఫరాలపై నిఘా
సాక్షి, కాకినాడ : అవినీతికి నిలయాలుగా... అక్రమాల దందాలకు ఆలవాలాలుగా...అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాలుగా మారిన పౌర సరఫరాల గోదాములపై నిఘా కన్ను పడనుంది. ప్రజా పంపిణీలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలకు కూడా అడ్డుకట్ట వేయడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా పౌరసరఫరాల గోదాముల్లో అక్రమాలకు చెక్ పెట్టడడంలో భాగంగా నిఘా కెమెరాలను అమర్చుతున్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి గోదాములు కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. కాకినాడ, రావులపాలెంలో సొంత గోదాములున్నాయి. వీటి నుంచి జిల్లాలోని 2,666 చౌకధరల దుకాణాలకు నిత్యావసర సరకులను రవాణా చేస్తున్నారు. నెలనెలా రూ.400 కోట్లకు తగ్గకుండా నిత్యావసర సరకులు నిల్వ ఉంచుతున్నారు. వీటిని కాంట్రాక్టర్ల వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారంలోనే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గోదాము రికార్డుల్లో ఉన్న సరుకు మొత్తాలకు వాస్తవంగా ఉన్న సరకు నిల్వలకు భారీగానే తేడాలు ఉంటుంటాయి. ఇంత జరుగుతున్నా ఇంతకాలం అడిగే నాథుడే కరువయ్యాడు. తెల్ల రేషన్ కార్డుపై మంచి బియ్యం అందించాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఇక నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిఘాను పట్టిష్టం చేసి అక్రమాలకు చెక్ పెట్టే ప్రక్రియకు పకడ్బందీగా శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రం నుంచే పర్యవేక్షణ మండల స్థాయి గోదాముల పరిధిలో కెమేరాలను అమర్చి అక్కడ నిత్యం జరిగే లావాదేవీలను జిల్లా కేంద్ర స్థాయిలోనే పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో మండల స్థాయి గోదాముల్లో కెమెరాలను అమర్చారు. ఈ గోదాముల్లో 24 గంటలపాటు ఈ కెమెరాలు ఆన్‌లోనే ఉంటాయి. కెమేరాల నుంచి ఆధారాలు కావాల్సి వచ్చినా తీసుకొనే విధంగా రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఈ పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. డీఎం నిత్యం ఇక్కడి నుంచి మండల స్థాయి లావాదేవీలను పర్యవేక్షించాలి. మండల స్థాయిలో ఏమి జరుగుతుందో డీఎం పర్యవేక్షిస్తే.. డీఎం కార్యాలయం నుంచి మండల స్థాయిలోని లావాదేవీలన్నీ ఎండీ కార్యాలయంలో పర్యవేక్షించే విధంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మోసాలు ఇక చెల్లవు జిల్లాలోని మండల స్థాయి గోదాముల నుంచి 16,43,584 తెల్లకార్డులున్న లబ్ధిదారులకు బియ్యం 20,222 మెట్రిక్ టన్నులు, పంచదార 830 క్వింటాళ్లు, కందిపప్పు 165 మెట్రిక్ టన్నులు, రాగులు 500 టన్నులు, జొన్నలు 150 టన్నులు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని పలు గోదాముల్లో బియ్యం, కందిపప్పు మాయంపై కేసులు నమోదైఉన్నాయి. ఇప్పటికీ కొందరు ఉద్యోగులపై కేసులు, విచారణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మండల స్థాయి గోదాముల నుంచి ఇచ్చే సరుకుల్లో తూకాల్లో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై ఇక నుంచి నిఘా, పర్యవేక్షణ పెరగనుంది. మండల స్థాయిలో ఉన్న రికార్డుల పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన గోదాముల్లో ఉన్న తేడాలను బయటకు తీయనున్నారు. ఏ సమాచారం కావాలన్నా, ఎలాంటి సమాచారం అవసరమున్నా వెంటనే తీసుకొనే విధంగా మండల స్థాయి నుంచి డీఎం కార్యాలానికి అనుసంధాన వ్యవస్థను మరింత పటిష్ట పరచనున్నారు. తూకాల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టనున్నారు. అడ్డగోలుగా వ్యవహరించే అధికారులపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకొనే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిఘా అమలులో పౌరసరఫరాల ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నిఘా వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చారు. ఇందుకోసం కెమెరాల బిగింపు కార్యక్రమం పూర్తయిందని పౌర సరఫరాల డీఎం ఇ.జయరాములు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె గోదాములున్న చోట్ల సొంత గోదాములు నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్కడ కూడా కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీనిని క్రమేణా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సీఎంఆర్ విధానానికి వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లోనే వ్యవస్థను అన్ని విధాలుగా పటిష్ట పరుస్తామని చెప్పారు. ఈ కెమెరాల వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కోట్ల రూపాయల దుర్వినియోగానికి చెక్ పెట్టినట్టవుతుందని పలువురు భావిస్తున్నారు. -
కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. సంతకవిటి మండలం కృష్ణంవలస గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో గాయపడిన బాధిత కుంటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా దాడి కారణంగా కార్యకర్తల ఇళ్లలో విరిగిపోయిన తలుపులు, కిటికీలు, టీవీలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు గూండాలు మాదిరిగా అమాయక ప్రజల ఇళ్లపై దాడులకు తెగబడడం దారుణమన్నారు. గత ఐదేళ్లుగా చేసిన దాడులకు ప్రతిఫలంగా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మర్చిపోయారా అంటూ దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీలో చేరినందుకు కక్షగట్టి దాడులకు పాల్పడితే క్షమించేదిలేదని హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులని కఠినంగా శిక్షించాలని రాజాం రూరల్ సీఐ పి.శ్రీనివాసరావుకు ఆదేశించారు. గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బాధితుల కన్నీరుమున్నీరు ఎమ్మెల్యే కంబాల జోగులు ఎదుట కృష్ణంవలస గ్రామానికి చెందిన కె.సూర్యారావు, దాసరి సింహాచలం, బాలకృష్ణ తదితర బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు, చిన్నారులు కన్నీరుమున్నీరయ్యారు. తమను చంపేస్తామని, ఊర్లో ఉండనీయకుండా చేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని వాపోయారు. జగన్మోహన్రెడ్డికి ఓటు వేసినందుకు గ్రామంలో తమకు ప్రాణహాని ఉందని తెలియజేశారు. తమకు ఎటువంటి హాని జరగకుండా చూడాలని కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే జోగులు సీఐతో మాట్లాడి భయపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహనరావు, పార్టీ మండల కన్వీనర్ గురుగుబెల్లి స్వామినాయుడు, పార్టీ నాయకులు కనకల సన్యాసినాయుడు, రాగోలు రమేష్‌నాయుడు, చెలికాన మహేశ్‌బాబు, వావిలపల్లి వెంకటేశ్వర్లు, రూపిటి శ్రీరామమూర్తి, పప్పల గణపతి, పొన్నాడ ప్రసాదరావు, వావిలపల్లి రమణారావు, దవళ నర్శింహమూర్తి, పైల వెంకటనాయుడు, యడ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడా ఆక్ర‘మనదే’..!
‘అక్రమ నిర్మాణాలు సమాజాభివృద్ధికి చేటు... నిబంధనలకు తిలోదకాలిచ్చిననిర్మాణాలు ప్రమాదకరం. ఇవి పర్యావరణానికి ముప్పు కానున్నాయి. వీటిని సహించకూడదు. అమరావతిలో చేపట్టిన ‘ప్రజా వేదిక’తో మొదలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కట్టడాల కూల్చివేత పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అలజడి మొదలైంది. ఇన్నాళ్లూ టీడీపీ నేతల ఒత్తిళ్లతో చూసీ చూడనట్టు వదిలేసిన వారిలో కలవరం పట్టుకుంది. అక్రమార్కుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. జిల్లాలో అక్రమ నిర్మాణాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... సాక్షి, కాకినాడ : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’?...నాడు రాష్ట్రాధినేత అక్రమ నిర్మాణాలు సాగిస్తే...ఆ అక్రమ భవనాల్లో మకాం పెడితే...తామేమీ తక్కువ కాదన్నట్టుగా ఆ ‘బాబు’ బాటలో అడుగులేసినవారంతా రెచ్చిపోయి అక్రమాలకు తెగబడతారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకుని చెలరేగిపోతారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే అక్రమ నిర్మాణాలు చేపట్టి, అందులో కాపురం ఉంటే మిగతా వారు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా టీడీపీ హయాంలో అక్రమ నిర్మాణాలకు తెరదీశారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, అను మతులు తీసుకోకుండా ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు చేపట్టారు. జిల్లాలోని మున్సిపాల్టీల పరిధిలోనే ప్రస్తుతానికి 2,367 అక్రమ భవనాలు ఉన్నాయి. వీటిన్నింటినీ మున్సిపల్ అధికారులు అధికారికంగా గుర్తించారు. అంటే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టే. ఇక, గుర్తించనవి ఎన్నో... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయంతో అక్రమ కట్టడదారుల్లో గుబులు రేగుతోంది. సీఎం నిర్ణయంతో అలజడి జిల్లాలో ఒక్క మున్సిపాల్టీల్లోనే 2,367 అక్రమ కట్టడాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారో స్పష్టమవుతోంది. నేతలకు ముడుపులిచ్చి అడ్డగోలుగా ఖాళీ ఉన్న చోట ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టేసిన పరిస్థితులున్నాయి. మేమున్నాం...మీకెందుకు...ఖాళీ స్థలముంటే కట్టేయండని భరోసా ఇచ్చి అక్రమ నిర్మాణాలను పరోక్షంగా ప్రోత్సహించారు. అడ్డుతగిలిన అధికారులపై ఒత్తిడి చేసి, దారికి రాకపోతే బదిలీ చేసి తమ పని కానిచ్చేసిన పరిస్థితులున్నాయి. తొమ్మిది మున్సిపాల్టీల్లోనూ, మూడు నగర పంచాయతీల్లో 2,367 అక్రమ కట్టడాలు ఉన్నాయంటే జిల్లా వ్యాప్తంగా ఇంకెన్ని ఉంటాయో అవగతం చేసుకోవచ్చు. ఇవి కూడా అధికారికంగా గుర్తించినవి. అంటే ఇవన్నీ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టే. ఇక, నేతల ఒత్తిళ్లతో గుర్తించనివి ఎన్ని ఉన్నాయో వారికే తెలియాలి. సీఎం జగన్ ఆదేశాలతో అధికార యంత్రాంగం అడుగులు ఎంత బలంగా పడనున్నాయో వేచి చూడాల్సిందే. ఆదేశాలు ఇస్తున్నాం మున్సిపాల్టీ పరిధిలో తమకొచ్చిన నివేదికల ప్రకారం అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. ఎంతటివారినైనా వదిలేది లేదు. – మధుకుమార్, మున్సిపల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, రాజమహేంద్రవరం -
ఆగని అక్రమాలు..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఏసీబీ అధికారులు దాడులు చేసినా.. ప్రైవేట్ వ్యక్తులను విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా, కార్యాలయాల సమయంలోనే విధులను నిర్వహించాలని చెప్పినా.. లంచాలు వసూలు చేయొద్దని ఆదేశించినా..అధికారుల తీరు మారడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఇదే అదనుగా కార్యాలయాల్లో అక్రమాలకు అంతులేకుండా పోయింది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల పెత్తనం పెచ్చుమీరి పోతోంది. వీరికి సబ్‌రిజిస్ట్రార్లతోపాటు అందులో పనిచేసే సిబ్బంది వారు నియమించుకున్న ప్రైవేట్ సిబ్బంది పూర్తి అండదండలు అందిస్తున్నారనేది బహిరంగ సత్యం. ‘ఏసీబీ’ తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలు.. భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల అక్రమాలు వెలుగు చూశాయి. యాదగిరిగుట్ట కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో రిజిస్ట్రేషన్ల సందర్భంగా జరుగుతున్న అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి. వందలాది డాక్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా సబ్‌రిజిస్ట్రార్ వద్ద పెండింగ్‌లో ఉండడం ఇక్కడ కొసమెరుపు. రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేస్తూ బీబీనగర్ అధికారుల ఉదాంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గతంలో భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఆక్రమించిన బినామీ భూములను జిరాక్స్ కాపీలతో రిజిస్ట్రేషన్ చేస్తూ రిజిస్ట్రార్ జైలుకు వెళ్లారు. ఇలా జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడ్డూఅదుపు లేకుండా అక్రమాల పర్వం జోరుగా సాగుతోంది. పలు కార్యాలయాల్లో అక్రమాల జాతరే.. భువనగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, బీబీనగర్, చౌటుప్పల్, మోత్కూర్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాల జాతర కొనసాగుతోంది. ఆయా కార్యాలయాల చుట్టూ డాక్యుమెంట్ రైటర్లు తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. వీటిని తొలగించే ప్రయత్నం ఎవరివల్ల కావడం లేదు. ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగానే అధికారులు వెంటనే డాక్యుమెంట్ రైటర్ల వద్దకు పంపిస్తారు. వారి వద్ద నుంచే డాక్యుమెంట్లు, చలాన్లు చెల్లిస్తారు. భూమికి ఉన్న విలువను బట్టి ప్లాటు, ఎకరాల్లో రిజిస్ట్రేషన్లకు వంతుల వారీగా డబ్బులు నిర్ణయించి రైటర్లే వసూలు చేస్తారు. ఇక్కడ అంతా రైటర్లదే హవా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి వద్ద డాక్యుమెంట్ల వారిగా రేట్లు నిర్ణయిస్తారు. సమస్యాత్మక భూములుంటే.. సమస్యాత్మక భూములు ఉంటే వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేదంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాదని పక్కన పెట్టేస్తారు. రకరకాల కారణాలతో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. సామాన్యుడు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. లంచం ఇవ్వకపోతే అన్ని సక్రమంగా ఉన్న రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. సమస్యలు లేకున్నా సృష్టించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. అయితే జిరాక్స్ కాపీలపై తప్పుడు ధ్రువపత్రాలు, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చేయడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోడాక్యుమెంట్ రైటర్లకు డబ్బులు ముట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ తతంగం అంతా పూర్తి చేస్తారు. ఏరోజుకారోజు వచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా సాయంత్రం అధికారులు, ఉద్యోగులు లె క్కలు చూసుకుని వాటాలు పంచుకుని ఇంటికి వెళ్తారు. కార్యాలయాల చుట్టూ అద్దె భవనాలు.. భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. అలాగే యాదగిరిగుట్టలో కొనసాగుతున్న కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు విచ్చలవిడిగా వెలిశాయి. జిల్లాలో ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్ రైటర్లు గదులను అద్దెకు తీసుకుని పాగా వేశారు. కొన్నిచోట్ల ఇతరులకు అద్దె భవనాలు దొరక్కకుండా డాక్యుమెంట్ రైటర్లే కార్యాలయాల చుట్టుపక్కల గల భవనాలకు అద్దెలు చెల్లిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రికార్డులు పంపించరు.. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే ఆ డాక్యుమెంట్ల రికార్డులను స్కానింగ్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి నేరుగా యజమానికి చేరవేయాలి. కానీ ప్రతి చోట అలా జరగడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు తాము చేయించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తీసుకుని తమ వద్దే ఉంచుకుని పంపిస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బీబీనగర్‌లో రాత్రి పొద్దుపోయే వరకు.. బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడురోజుల క్రితం రాత్రి 10గంటలు దాటిన రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు ఉండడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ వ్యక్తులను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి విధి నిర్వహణ కోసం రానీయవద్దని ఇటీవల ఆశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు డాక్యుమెంటర్ల అనుచరులు ఏసీబీకి పట్టుబడ్డారు. పలు అవకతవకలకు కారణం అవుతున్న ప్రైవేట్ సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో కార్యాలయంలోకి అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే విధి నిర్వహణ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్ కొనసాగడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలేనని ఆరోపణలు ఉన్నా యి. అయితే మధ్యాహ్నం సర్వర్ పని చేయకపోవడం వల్లే అనుమతి తీసుకుని పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేశామని అధికారులు సంజాయిషీ ఇస్తున్నారు. తారస్థాయికి చేరిన అవినీతి.. భువనగిరి, బీబీనగర్, రామన్నపేట, యాదగిరిగుట్ట, మోత్కూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయిలో కొనసాగుతోంది. జిల్లాలో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్లాట్లు, భూములు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో రియల్టర్లు తొందరగా పని పూర్తి చేయడం, కొన్నిచోట్ల ప్రభుత్వ భూములు, సమస్యాత్మక భూములు రిజిస్ట్రేషన్లు చేయించడం కోసం పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజేబుతున్నారు. యాదగిరిగుట్టలో.. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన తరువాత ఇక్కడ పని చేసిన సబ్ రిజిస్ట్రార్ వాహిద్‌ను నల్లగొండకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హుజూర్నగర్ నుంచి సైదులును ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆయన తరువాత హైదరాబాద్ నుంచి జహంగీర్ వచ్చారు. ఆయన్ని కూడా మార్చి ప్రస్తుతం దేవరకొండ నుంచి శ్రీనివాస్‌రావును సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నారు. వీరితోపాటు ముగ్గురు అధికారులను బదిలీ చేశారు. ఇప్పటికే పదిరోజుల వ్యవధిలో జిల్లా రిజిస్ట్రార్, ఆడిట్ డీఆర్లు తనిఖీలు చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా.. పైచిత్రం యాదగిరిగుట్టలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. ఇటీవల రాజాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, భూమిని భాగాలుగా విభజించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇక్కడకి వచ్చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న డాక్యుమెంట్ రైటర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుతోపాటు అదనంగా మరో రూ.20వేలు అధికారులకు చెల్లించాలని తెలిపారు. దీంతో సదరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయి కదా ఎందుకు చెల్లించాలని అడగ్గా తనకేమీ తెలియదని అంతా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు జరుగుతుందని సదరు రైటర్ సెలవిచ్చారు. అయితే అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే అక్కడనుంచి వెనుదిరిగిపోయారు. యాదగిరి గుట్టలో ఒక్కచోటే కాదు జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తతంగం కొనసాగుతోంది. -
పేరుకే పోలీస్..వృత్తి మాత్రం దొంగతనం
ఆయనో పోలీస్. ఖాకీ డ్రెస్‌ను అడ్డంగా పెట్టుకుని దందాలు సాగిస్తున్నాడు. దోచుకున్న దొంగలనే దోచుకోవడం నుంచి తాను పనిచేసే పోలీస్‌స్టేషన్ పాత భవనం నుంచి విలువైన టేకు కలపను దొంగలించడం వరకు అత్యంత వివాదాస్పద వ్యవహారాలు నెరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై పోస్టుల్లో కొనసాగుతున్న ఆయన కింగ్ మేకర్‌గా మారి స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని డమ్మీ చేసి, అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. తన దందాలకు కానిస్టేబుళ్లను వాడుకుంటున్నాడని సిబ్బంది వాపోతున్నారు. టీడీపీ మద్దతుదారుడిగా వ్యవహరిస్తూ బోగోలు మండలంలోని పలు గ్రామాల్లో రాజకీయ కక్షలకు ప్రేరేపించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, కావలి(నెల్లూరు) : కావలి సబ్ డివిజన్ పరిధిలోని బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న ఆళ్ల శ్రీనివాసులు అవినీతి, దందాలు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. దొంగతనాలు చేసే దొంగలను పట్టుకోవాల్సిన సదరు ఏఎస్సై ఏకంగా తాను పనిచేసే పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి శిథిలావస్థకు చేరిన బ్రిటిష్ కాలం నాటి భవనంలోని విలువైన టేకు కలపను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుని వెళ్లిన వైనం ఇప్పుడు ఆ శాఖలో అలజడి సృష్టిస్తోంది. కప్పరాళ్లతిప్పలో బ్రిటిష్ కాలంలో పోలీస్‌స్టేషన్ భవనాన్ని నిర్మించారు. వందల ఏళ్ల నాటి కప్పరాళ్లతిప్ప పోలీస్‌స్టేషన్ నిర్మాణంలో అత్యంత నాణ్యత, గట్టిదనం కలిగిన టేకును వినియోగించారు. కాగా ఈ పోలీస్‌స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరుకొంది. దీంతో నూతన భవనాన్ని నిర్మించడంతో అక్కడే కార్యకలాపాలు సాగిస్తున్నారు. సదరు ఏఎస్సై తన సొంతూరు వింజమూరులో కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇంటికి అవసరమైన కలప కోసం పాత పోలీస్‌స్టేషన్ భవనంలోని అత్యంత విలువైన టేకు దూలాలను గడ్డి మాటున ట్రాక్టర్లు, ఆటోల్లో తరలించుకుపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇప్పటికే సర్కిల్, సబ్ డివిజనల్ పోలీస్ బాస్‌ల దృష్టికి కూడా వెళ్లడం, స్థానిక ప్రజానీకానికి సైతం తెలియడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద పోలీస్‌గా పేరు రెండేళ్లుగా కప్పరాళ్లతిప్ప పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఆళ్ల శ్రీనివాసులు అత్యంత వివాదాస్పదమైన పోలీస్‌గా పేరు గడించారు. ప్రతి ఒక్క వ్యవహారంలో తలదూర్చడం, నేరగాళ్లకు వత్తాసు పలకడం, పోలీసుల కార్యకలాపాలను నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు తెలియజేయడం వంటి ఒప్పందాలు చేసుకొంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే ఇతర సిబ్బంది తన వ్యవహారాలకు సహకరించకుంటే వారికి సమస్యలు సృష్టిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతని ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు సిబ్బంది సెలవు పెట్ట వెళ్లిపోయినట్లు తెలిసింది. బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎస్సైను నియమించారు. అతనికి పోలీస్ విధులు కొత్త కావడంతో ఆయన్ను డమ్మీ చేసి అంతా తానై స్టేషన్ ఏఎస్సై వ్యవహారాలు నెరుపుతున్నట్లు పోలీస్ సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఎవరైనా ఈ ఏఎస్సై చెప్పినట్లుగా నడుచుకోవాలని, లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏఎస్సై అంటే పోలీస్ సిబ్బందే హడలి పోతుంటారు. ఈ పోలీస్‌స్టేషన్‌లో అంతా ఈయన పెత్తనమే కావడంతో పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన అత్యంత విలువైన కలపను దర్జాగా తరలించుకుని పోతున్నా.. స్టేషన్ బాస్‌తో సహా మిగతా సిబ్బంది సైతం నోరు మెదపలేకపోతున్నారని తెలిసింది. ఇక పోలీస్‌స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు ముందు తనను కలుసుకోవాలని, అలా చేయకుండా వారిని టార్గెట్ చేసుకొని మరిన్ని ఇబ్బందులు పెట్టడానికి నిందితులతో చేతులు కలిపి పబ్బం గడుపుకుంటాడని విమర్శలు ఉన్నాయి. దొంగలే ఇతని టార్గెట్ కప్పరాళ్లతిప్ప అంటే చిన్న చిన్న దొంగల నుంచి గజ దొంగల ఊరనే పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక్కడి స్థానికులు కొందరు వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీరితో ఈ పోలీస్‌కు ఏ టూ జెడ్ పరిచయం. ఎక్కడెక్కడో దొంగతనాలు చేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్న దొంగల విషయాన్ని తెలుసుకుని వారి నుంచి పెద్ద పెద్ద మొత్తాల్లోనే డబ్బులు తీసుకుని వారికి అండదండలు అందిస్తున్నాడనే ఆరోపణలు లేకపోలేదు. ఈ దొంగలను వెతుక్కుంటూ వచ్చే పరాయి జిల్లాలు, రాష్ట్రాల పోలీసుల సమాచారాన్ని ముందుగానే ఉప్పందించి తప్పిస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బయట దొంగతనాలకు పాల్పడుతున్న స్థానికులు ఏటా డిసెంబరులో క్రిస్మస్ సందర్భంగా స్వగ్రామానికి చేరుకుంటారు. వారే ఇతని టార్గెట్. దొంగగా ముద్రపడిన ప్రతి వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది డిసెంబరులో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30 వేల వంతున సుమారు రూ.12 లక్షలు మామూళ్లు వసూలు చేసినట్లు తెలిసింది. కప్పరాళ్లతిప్పకు చెందిన ఒక దొంగ సహకారంతో ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఏఎస్సైకు ఈ దొంగ తన ఇంటిపై ఒక గది కట్టించి అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు కూడా తెలిసింది. ఇటీవల ఒక దొంగను పట్టుకుంటే అతని వద్ద ముప్పావు కేజీ బంగారం, వజ్రాల వాచీ దొరికింది. వాటితో పాటు ఆ దొంగ దగ్గర నుంచి రూ.60 వేల డబ్బులు కూడా గుంజినట్లు విశ్వసనీయ సమాచారం. కప్పరాళ్లతిప్పకు చెందిన చదువుకునే విద్యార్థుల వద్ద నుంచి దొంగల దగ్గర కొన్నారంటూ బెదిరించి ఆరు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
అక్రమాల అడ్డాగా ఆటోనగర్
సాక్షి, పిడుగురాళ్ల(గుంటూరు) : అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయారు. అందినకాడికి దండుకునేందుకు ఆటోనగర్‌ను అడ్డాగా మార్చేశారు. యూనియన్లపైనా పెత్తనం చెలాయించారు. ఆటోనగర్‌లో ప్లాట్లు ఇస్తామంటూ మెకానిక్‌ల వద్ద నుంచి అక్షరాలా అరకోటి వసూలు చేశారు. తీరా చూస్తే టీడీపీ జెండా పట్టుకున్న వారికే ప్లాట్లంటూ మెలిపెట్టారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. ఐదేళ్లు గడిచినా ఒక్క ప్లాటూ కేటాయించకుండానే కాలయాపన చేశారు. ఆశతో చెల్లించిన సొమ్ము ఆవిరి చేసేశారంటూ మెకానిక్‌లు లబోదిబోమంటున్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు సమీపంలో సుమారు 11.83 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటు చేసేందుకు 2007లో మోటారు ఫీల్డ్ ఆటోనగర్ వర్కర్స్ సంక్షేమ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి స్థాపించారు. టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఆటోనగర్‌పై పెత్తనం చెలాయించారు. అప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన వ్యక్తితో పాటు కొందరు సభ్యులు ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామంటూ నమ్మబలికారు. సంఘంలో ఉన్న మెకానిక్‌ల వద్ద సుమారు రూ.20 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ ఆటోనగర్ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంతో ప్రశ్నించిన వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన వైఎస్సార్ సీపీ కి చెందిన కరిముల్లాను తొలగించేందుకు అతని పేరుతో ఫోర్జరీ సంతకం పెట్టి యూనియన్ రద్దు చేసేశారు. పాత యూనియన్ను రద్దు చేసి తిరిగి నూతన అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. మరో రూ.50 లక్షలు వసూలు చేసినటీడీపీ నేతలు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ బడా నాయకుల కన్ను ఆటోనగర్‌పై పడింది. పార్టీకి చెందిన కొందరు మెకానిక్‌లను రంగంలోకి దించి ఆటోనగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేశారు. టీడీపీ నాయకులు పిడుగురాళ్ల మోటారు ఫీల్డ్ వర్కర్స్ సంక్షేమ సంఘం అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. మెకానిక్‌లకు ప్లాట్లను కేటాయిస్తామంటూ ప్రచారం చేశారు. ఆటోనగర్‌లో మొత్తం 185 ప్లాట్లు మాత్రమే ఉండగా.. టీడీపీ నేతలు ఏకంగా 250 మంది నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేసేశారు. మొదటగా రూ.150, రూ.500, రూ.2500, రూ.6 వేలు, రూ.11 వేలు.. ఇలా ఒక్కొక్కరి నుంచి మొత్తం రూ.20,150 చొప్పున మొత్తం రూ.50,37,500 వసూలు చేశారు. మెకానిక్‌ల పేరుతో ప్లాట్లు స్వాహా ఇంత మొత్తంలో వసూలు చేసినా.. టీడీపీ నేతలకు మాత్రం ఆటోనగర్ స్థలంపై కన్ను పడింది. పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మెకానిక్‌లుగా మారిపోయారు. వారి పేరు మీద రెండు మూడు ప్లాట్లు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా దాదాపు 15 నుంచి 20 ప్లాట్లు కొట్టేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. వాస్తవానికి సాధారణంగా లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు. కానీ టీడీపీ నేతలు మాత్రం రహదారి పక్కనే ఉన్న వాటిని తమ ఖాతాలో వేసేసుకున్నారు. చాకలికుంట ప్రాంతాన్ని ఏకంగా వాటర్ ట్యాంక్ ఏరియాగా మార్చి తప్పుడు లేఅవుట్లను సిద్ధం చేసిన సదరు పచ్చనేతలు తమని మోసం చేసి డబ్బులు దండుకున్నారని మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జెండాలు కడితేనే ఆటోనగర్‌లో ప్లాట్లు ఇస్తామంటూ వైఎస్సార్ సీపీ మెకానిక్‌లకు బెదిరింపులకు గురిచేశారు. కొంతమందిపై బహిరంగంగానే చేయిచేసుకున్నారు. కానీ.. ఇంతవరకూ అసలైన మెకానిక్కు మాత్రం ఒక్క ప్లాట్ కూడా కేటాయించలేదు. ప్రక్షాళన దిశగా ఎమ్మెల్యే కాసు అడుగులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆటోనగర్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టీడీపీ నేతలు చేసిన అక్రమాలని తవ్వి తీసి.. అర్హులైన ప్రతి మెకానిక్కు ఆటోనగర్‌లో స్థానం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆటోనగర్ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లను వేగంగా నిర్వహిస్తున్నారు. మెకానిక్‌ల కలను నిజం చేసేందుకు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆటోనగర్ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయని మెకానిక్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడ్డంగా దోచుకున్నారు టీడీపీ హయాంలో ఆటోనగర్ మెకానిక్‌లను టీడీపీ నాయకులు అడ్డంగా దోచుకున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ స్థానం కల్పిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి మా కలను నిజం చేయబోతున్నారు. అందుకే ఇప్పుడు నూతనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఆటోనగర్ వర్కర్స్ సంక్షేమ సంఘం పిడుగురాళ్ల పేరు మీద ఆటోనగర్‌ను రిజిస్ట్రేషన్ చేయించాము. త్వరలోనే మా కల నెరవేరబోతుంది. – షేక్ కరిముల్లా మేస్త్రి, పిడుగురాళ్ల ప్లాట్ల పేరుతో మోసం చేశారు పట్టణంలో లారీలకు పని చేయాలంటే స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆటోనగర్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం. టీడీపీ హయాంలో వేలకు వేలు వసూలు చేసి మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాకు ఆటోనగర్ రాబోతున్నందుకు సంతోషిస్తున్నాం. – షేక్ షరీఫ్, లారీ కమాన్కట్ట మేస్త్రి, పిడుగురాళ్ల అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆటోనగర్ నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం రోడ్ల నిర్మాణ పనులు, డ్రైనేజీ పనులు నిర్వహిస్తున్నాం. త్వరలోనే అర్హులైన మెకానిక్‌ల జాబితాను సిద్ధం చేసి వారికి ప్లాట్లను కేటాయిస్తాం. నూతన ప్రభుత్వంలో ఆటోనగర్ నిర్మాణం జరుగుతుంది. - పీవీ రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, గుంటూరు -
బరి తెగించిన టీడీపీ నాయకులు
సాక్షి, గుంటూరు : ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరింది. మరి కొద్ది గంటల్లో జరిగే పోలింగ్‌కు ఇటు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు సర్వం సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు పోటా పోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి జరిగే పోలింగ్‌లో ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొందరు డబ్బు, మద్యం, చీరలు, క్రీడా సామగ్రి, ఇతర వస్తువులతో ఓటర్లను ఆకట్టుకున్నారు. మరి కొందరు సాధారణ ఓట్లతో పాటు కులాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలకు చెందిన ఓట్లను గుంపగుత్తుగా పొందేందుకు పకడ్బందీగా ముందుకు సాగారు. ఈ మేరకు ఆయా వర్గాలకు వారం రోజుల ముందే అన్ని వనరులను సమకూర్చారు. పోలింగ్ రోజున ఎక్కువ మొత్తంలో ఓట్లను సంపాదించుకునేందుకు వ్యూహరచనలు పన్నారు. అయితే ఎన్నికల వేళ ఓటర్లకు పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. అభ్యర్ధులు ఇచ్చే నోటు(డబ్బు)తీసుకుంటే భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది..తీసుకోకుండా నిజాయితీగా ఓటేస్తే ఏ విధంగా వ్యవహరించవచ్చు.. అనే అంశాలు ఓటర్లలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండింటి మధ్య తేడా, స్వార్థ, నిస్వార్థపరులను గమనించి ఓటేస్తే బాగుంటుందని మేధావులు చెబుతున్నారు. టీడీపీ కుయుక్తులు స్వార్ధ రాజకీయాలతో.. ధనార్జనే ధ్యేయంగా రాష్ట్రంలో టీడీపీ పాలన సాగించింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో భూకబ్జాలు, వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడింది. 2014 ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన 630 హామీలను నెరవేర్చక పోవడంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో అధికారంలో ఉంటేనే ఏదైనా సాధ్యమని, ఏదైనా చేయగలమని గురువారం జరగనున్న సాధారణ ఎన్నికలలో ఎలాగైనా గెలిచేందుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గ అభ్యర్థులతో రూ.1500 నుంచి రూ.10 వేల వరకు ఓటుకు వెలకడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది. మాట వినకుంటే బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రశ్నించే హక్కు ఉండదు ఎన్నికల సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నోట్లు వెదజల్లుతున్నారు. ప్రత్యర్థి పార్టీకి ధీటుగా డబ్బు మూటలను ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల నేతలు ఇచ్చే రూ.500, రూ.1000 డబ్బును తీసుకుంటే తర్వాత మన సమస్యలను వారికి చెప్పే పరిస్థితి ఉండదు. నిజాయితీ పాలకులు అరుదు శాసన సభ ఎన్నికలు అంటేనే రూ.లక్షలు, కోట్లు ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి పోటీకి సాధారణ వ్యక్తులు రావడం అరుదుగా ఉంటుంది. అయితే ఆర్థికంగా స్థిరపడిన వారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరించిన వారు తర్వాత ప్రజల కోసం నిజాయితీగా పని చేస్తారనే విషయంలో నమ్మకం తక్కువ. కొంతమంది మాత్రం ఎన్నికల ఖర్చుతో సంబంధం లేకుండా ప్రజా సేవ కోసం ముందుకు సాగుతారు. చులకనభావం ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గెలిచిన వారిలో కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటర్లను చులకనభావంగా చూసే అవకాశముంది. ఎన్నికల్లో మీరు నోటు తీసుకుని ఓటు వేశారు కదా.. అనే భావనతో ఓటర్లను పట్టించుకోరు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది. సమస్యలతో సహజీవనం.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో కొందరు మంచి వారుంటారు. మరి కొందరు పదవిని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించేవారుంటారు. అయితే డబ్బులు తీసుకుని ఓటేస్తే తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను గట్టిగా అడగే పరిస్థితి ఉండదు. తద్వారా సమస్యలతో సహజీవనం చేయాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి సాధ్యం ఓటర్లకు డబ్బులు పంచకుండా గెలిచిన వారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతారు. అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. మరోసారి గెలవాలనే తాపత్రయంతో సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతారు. -
వేమూరులో ‘నక్కా’ వారి అవినీతి జిత్తులు
సాక్షి, గుంటూరు : అయనో అవినీతి మాంత్రికుడు.. మంత్రి పదవి రాకముందే అక్రమాలకు తెరతీసిన తాంత్రికుడు.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని హాంఫట్ అంటూ కాజేశాడు. రాక రాక వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దండుకున్నాడు. వేమూరు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లపై మారీచుడిలా వాలాడు. ప్రజలకు ఉచితం పేరుతో ఇసుకను ఆయాచితంగా దోచుకున్నాడు. లారీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తూ అక్రమాల దందా కొనసాగించాడు. మంత్రి పదవి వచ్చాక మరింత రెచ్చిపోయాడు. తన అనుచరగణంతో జిల్లా వ్యాప్తంగా దందాకు తెరతీశాడు. గుంటూరులో బెక్కర్ కాంపౌండ్ స్థలాన్ని ఆక్రమించేశాడు. కారుచౌకగా ఏఈఎల్సీ ఆస్తుల లీజు దక్కించుకున్నాడు. మంత్రి ఆధ్వర్యంలో తవ్విన గుంతల్లో పడి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. ఆ కుటుంబాల ఉసురుపోసుకున్నాడు మంత్రి నక్కా ఆనందబాబు. ఇసుక అమ్మకాల్లో రూ. 200 కోట్లకుపైనే... ఇసుక తవ్వకాలపై మంత్రి ఆనందబాబును తిప్పలకట్టలో మహిళల నిలదీత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వేమూరు నియోజకర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో ఇసుక అమ్మకాల ద్వారా మంత్రి నక్కా ఆనందబాబు రూ. 200 కోట్లకుపైనే గడించారని నియోజకవర్గంలో విమర్శలున్నాయి. నదీ గర్భశోకం మిగిల్చి ఇసుకను పిండి రూ. కోట్లకు కోట్లు దండుకోవడంలో సిద్ధహస్తుడిగా మంత్రి పేరు గడించారు. ఇసుక మాఫియాకు మంత్రే మూలంగా మారి తన బినామీలతో తవ్వకాలు జరిపించి అక్రమార్జనకు నాంది పలికారు. 2011 నుంచి 2013 మధ్య కాలంలో కొల్లూరు మండలం జువ్వలపాలెంలో ప్రభుత్వం పాట నిర్వహించిన క్వారీని తన బినామీలకు దక్కేలా చక్రం తిప్పి ఇసుక దందాకు తెర తీశారు. జువ్వలపాలెంలో అనుమతులు ఉంటే గాజుల్లంకలో సైతం రెండేళ్లపాటు రేయింబవళ్లు అనధికారిక క్వారీని నడిపించారు. భట్టిప్రోలు మండలం కాకుల డొంక, ఓలేరు ప్రాంతాల్లో మంత్రి కనుసన్నల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. అప్పట్లో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇసుక పాటలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో 2013–2014 మధ్య కాలంలో తన బినామీలను రంగంలోకి దింపి కొత్త తరహా ఇసుక వ్యాపారానికి బీజం వేశారు. ఏడాది క్రితం గుంటూరులో కీలక నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న టీడీపీ నాయకుడు కుమారుడు సైతం ఈపూరులో క్వారీ నిర్వహించి రూ. కోట్లు గడించాడు. బెక్కర్ కాంపౌండ్‌లో స్థలం బొక్కేశారు గుంటూరు నగరంలోని మహిమ గార్డెన్స్ బెక్కర్ కాంపౌండ్‌లో స్థలాన్ని సైతం మంత్రి నక్కా ఆనందబాబు కారు చౌకగా బొక్కేశారు. ఈ స్థలాన్ని కాజేయడం కోసం బెక్కర్ కాంపౌండ్‌ను లీజుకు తీసుకున్న బాబూప్రకాశ్తో... టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఒప్పందం చేసుకున్నారు. ఆ స్థలం తమకు కేటాయిస్తేనే లీజుకు తీసుకున్న స్థలాన్ని చర్చికి అప్పగిస్తానంటూ షరతులతో కూడిన ప్రతిపాదనను చర్చి ముందు పెట్టారు. ఈ షరతులకు తలొగ్గిన చర్చి పెద్దలు 2015 జూలై 22న భీమవరం బేతనీపేట లూథరన్ చర్చిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో.. షరతులను అంగీకరించి, టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు స్థలం కేటాయించడానికి అంగీకారం తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు తన పేరిట చర్చి ఇవ్వాలనుకున్న 4400 గజాల స్థలాన్ని తన సోదరుడు నక్కా ప్రసాద్‌బాబు పేరిట ఇవ్వాలని కోరారు. ప్రసాద్‌బాబు పేరిట 4400 గజాల స్థలాన్ని.. గజం రూ. 12 వేల చొప్పున చర్చి విక్రయించింది. మొత్తం స్థలం విలువ రూ.5.28 కోట్లకుగాను నక్కా ప్రసాద్ సంఘానికి అందించిన సేవలకుగాను రూ.3.28 లక్షలు మినహాయించారు. ఈ లెక్కన కేవలం రూ. 2 కోట్లకు 4400 గజాల స్థలాన్ని తన బినామీ అయిన సోదరుడి పేరు మీద ఆనందబాబు కొట్టేశారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ గజం రూ.4 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ప్రకారం స్థలం విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. ఈ చర్చి భూమిని కొట్టేయడం వెనక నక్కా చక్రం తిప్పారని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కారుచౌకగా ఏఈఎల్సీ ఆస్తుల లీజు.. కుగ్లర్ ఆసుపత్రి కుగ్లర్ హాస్పిటల్ 6.95 ఎకరాల స్థలాన్ని కారు చౌకగా నక్కా ఆనందబాబు లీజు కొట్టేశాడు. కుగ్లర్ ఆసుపత్రి స్థలం లీజు ధర మార్కెట్లో రూ. 50 లక్షలకుపైగా పలుకుతుంది. అలాంటి స్థలాన్ని ఆనందబాబు సతీమణి చింతబత్తుని సత్యరత్నకుమారి పేరు మీద సంవత్సరానికి రూ.10 వేలు చొప్పున 2006–2036 వరకూ లీజుకు తీసుకున్నారు. కారు చౌకగా కొట్టేసిన నక్కా ఆనందబాబు లీజు డబ్బును చర్చి అకౌంట్లో కట్టిన దాఖలాలే లేవని ఆరోపణలున్నాయి. ఇదే తరహాలో గుంట గ్రౌండ్ స్థలాన్ని సైతం ఆనందబాబు తన బినామీ అయిన సోదరుడు ప్రసాద్ పేరున లీజుకు తీసుకుంటున్నారు. ఆరేడేళ్లుగా గ్రౌండ్‌ను లీజుకు తీసుకుంటున్న ఆయన గత సంవత్సరం వరకూ మార్చి, ఏప్రిల్, మే నెలలకుగాను రూ. 5 లక్షలు లీజుగా చెల్లించేవారు. గత ఏడాది సంఘ సభ్యులు వ్యతిరేకించడంతో లీజు ధరను రూ. 20 లక్షలకు పెంచినట్టు సమాచారం. కారు చౌకగా లీజుకు కొట్టేస్తున్న గుంట గ్రౌండ్ స్థలాన్ని ఎగ్జిబిషన్లు, ప్రైవేట్ కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆనందబాబు ఏడాదికి రూ.10 కోట్ల వరకూ గడిస్తున్నారని విమర్శలున్నాయి. గుంటూరు నగరంలోని గ్రాండ్ నాగార్జున హోటల్ స్థలాన్ని 1981–2030 వరకు మంత్రి నక్కా ఆనంద్‌బాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య లీజ్ కొనసాగుతుంది. దీనికి సంత్సరానికి లీజ్ రూ.33,333 చెల్లిస్తున్నారు. -
ఉప్పులేటి వాడ..అవినీతి చీడ
సాక్షి, కృష్ణా : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అన్న చందంగా సాగిపోయింది ఆ ఎమ్మెల్యే తీరు. అడ్డూ అదుపులేని అవినీతి పర్వం.. ఇసుక, బుసక, మట్టి తవ్వకాల నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకూ అన్నింటా దోచుకో, దాచుకో.. పామర్రు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నైతిక విలువలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీ పంచన చేరి అందుకున్న తాయిలాలు ఒక ఎత్తయితే.. ఆమె కనుసన్నల్లో అక్రమార్జనకు ద్వారాలు తెరుచుకున్న వైనం మరొక ఎత్తు... కనీసం నమ్మి ఓట్లేసిన దళితులను సైతం పట్టించుకోకుండా.. సొంత లాభమే అజెండాగా పాలన సాగిస్తున్న పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అవినీతి అంకంపై ‘సాక్షి’ ఫోకస్. చినబాబుకు వాటాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వస్థలం నిమ్మకూరులో అడుగడుగునా అవినీతి దర్శనమిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ప్రభుత్వం వివిధ పనుల కోసం రూ.15 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో సుమారు రూ.7 కోట్లు అభివృద్ధి పనుల ముసుగులో తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకెళ్లినట్లు తెలుస్తోంది. మండల అధ్యక్షుడు కనుసన్నల్లోనే ఈ అవినీతి జరిగినట్లు కొందరు పేర్కొంటున్నారు. ఇందులో చినబాబుకు మూడో వంతు వాటా వెళ్లినట్లు తెలుస్తోంది. చెరువు తవ్వకంలో రూ.కోటి స్వాహా.. నిమ్మకూరు గ్రామంలోకి ప్రవేశించేటప్పుడు చెరువు దర్శనమిస్తుంది. ఈ చెరువును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్ది చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని చెప్పారు. అయితే నీరు–చెట్టు కింద నిబంధనలకు విరుద్ధంగా సుమారు 25,000 ట్రక్కుల మట్టిని తవ్వి, ఒక్కొక్క ట్రక్కు రూ.400 చొప్పున మండలాధ్యక్షుడు యథేచ్ఛగా విక్రయించుకున్నారు. దీని ద్వారా సుమారు రూ.కోటి సంపాదించారు. తన స్వస్థలంతో పాటు పక్కనే ఉన్న పోరంబోకు స్థలం సుమారు 10 సెంట్లు ఆక్రమించుకుని చెరువు మట్టితో నింపి ప్లాట్లుగా విభజించి విక్రయించుకుని మరో రూ.10 లక్షలు వెనకేసుకున్నారు. చెరువు తవ్వినందుకు మరో రూ.8 లక్షలు ప్రభుత్వం నుంచి తవ్వకం కింద తీసుకున్నారు. ఉన్న రోడ్లపైనే సిమెంట్ రోడ్లు వేసి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నిమ్మకూరులో సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పుడు ఆ రోడ్లపైనే సిమెంట్ పూత పూశారు. రోడ్లకు ఇరువైపులా ఒక అడుగు మేర సిమెంట్ రోడ్లు వేసి మొత్తం రోడ్లు వేసినట్లుగా చూపి సుమారు రూ.కోటిన్నర వరకు టీడీపీ నేతలు దండుకున్నారు. హాస్పిటల్ లేదు.. అనుబంధ రోడ్లు వచ్చాయి.. నిమ్మకూరు దాని చుట్టు పక్కల గ్రామాలకు కలిపి రూ.4.5 కోట్లతో 30 పడకల హాస్పటల్‌ను రెండేళ్ల కిందట అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌కు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడికి మధ్య బేరాలు కుదరక శంకుస్థాపన దశలోనే ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయింది. అయితే ఈ ఆస్పత్రికి అనుబంధంగా నిమ్మకూరు–మత్రిపాలెం, నిభానుపూడి, వడ్రపూడి తదితర ప్రాంతాలను కలుపుతూ రూ.6 కోట్లతో రోడ్లు వేశారు. ఇందులో సుమారు రూ.2 కోట్ల వరకు చేతులు మారాయి. రూ.5 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరగ్గా ఇందులోనూ రూ.2 కోట్లు తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి వెళ్లాయి. అవినీతి గురించి అధికారులకు తెలిసినా సాక్షాత్తూ చిన్నబాబుతో మండల నాయకులు టచ్‌లో ఉండటంతో మౌనంగా ఉన్నారు. నిమ్మకూరు పార్టీ నాయకులే పనులు మంజూరు చేయించుకుని, వారే చేసుకుని, వారే బిల్లులు పెట్టుకున్నారని, అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారని స్థానికులు చెబుతున్నారు. కల్పన ‘కారు’ కక్కుర్తి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆశతో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంది. పేదలకు అందాల్సిన పథకాలను వదిలిపెట్టలేదు. కేంద్రం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా సబ్సిడీపై మంజూరు చేసిన ఇన్నోవా వాహనాన్ని తన బినామీ పేరుతో తీసుకొని దర్జాగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు పాతర.. ఎమ్మెల్యే అనుచరుడు, మువ్వా గ్రామానికి చెందిన వ్యక్తి ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా దాదాపు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16 టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపి ఎల్లో ప్లేట్ ఉంచాలి. కానీ ఆ కారు నంబరు వైట్ బోర్డు కింద కేటాయించారు. ఈ తతంగం వెనుక ఎమ్మెల్యే ఉండటంతో రవాణా శాఖ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరుతో50 శాతం నిధులు బొక్కేశారు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు పామర్రు నియోజకవర్గంలో టీడీపీ నేతల దోపిడీ పర్వం కొనసాగింది. ఇసుక, మట్టి, మద్యం తదితరాల్లో రూ.కోట్లు దండుకున్నారు. 2015–16లో నీరు–చెట్టు పథకం కింద నియోజకవర్గంలో 15 చెరువులను రూ.3 కోట్లు వెచ్చించి తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఈ పనుల్లో 50 శాతం నిధులు నొక్కేశారు. చెరువుల నుంచి తవ్విన మట్టిన సైతం రైతులకు ఉచితంగా ఇవ్వకుండా ట్రాక్టరుకు రూ.500 చొప్పున వసూలు చేశారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు ఇసుక క్వారీ అధికార పార్టీ నేతలకు కాసులవర్షం కురిపించింది. ఇసుక కోసం వచ్చే వాహనదారుల నుంచి బాట పనుల పేరుతో సుమారు ఏడాది పాటు ఆ పార్టీ నేతలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో ట్రాక్టర్ డ్రైవర్ వద్ద రూ.100 చొప్పున, రోజుకి 500 నుంచి 600 వాహనాల వద్ద డబ్బును వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షల చొప్పున నాలుగున్నరేళ్లు రూ.5.20 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. ఇసుక అమ్మకాలకు మరో ధర నిర్ణయించి రూ.కోట్లు దండుకున్నారు. సుమారు రూ.1.20 కోట్ల సొమ్ము అధికార పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేత, దిగువ శ్రేణి నాయకులు కలిసి స్వాహా చేశారు. రొయ్యూరులోని కృష్ణా నదీ గర్భంలోని పట్టా భూముల్లో జరిగిన ఇసుక తవ్వకాల్లో కూడా అధికార పార్టీ నేతల మధ్య రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వం నుంచి అందాల్సిన కార్పొరేషన్ రుణాలు, పింఛన్లు, పక్కా గృహాలు, ఆదరణ వంటి పథకాల అమలులో తమకు అనుకూలమైన వారికే దక్కేలా తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పారు. ఈ రుణాలు ఇప్పించే పేరిట కూడా తమ్ముళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. చాలా మండలాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పిన వారికే ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ పేదల నుంచి వసూళ్లు చేశారు. ఈ మొత్తం రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది. -
అవినీతి..అక్రమాల్లో ‘రాజా’ ది గ్రేట్
సాక్షి, తెనాలి : ఆంధ్రాప్యారిస్ తారల తళుకులతో, కళాకారుల కౌసల్యంలో వాసికెక్కిన పట్టణం.. ఐదేళ్లుగా ఆలపాటి అంతులేని అవినీతిలో మకిలీ అయ్యింది. అభివృద్ధి మాటున అడ్డగోలు దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొల్లిపర మండలంలోని రీచ్‌లతో తవ్విన ఇసుక.. పేదలకు చేరకుండా అడ్డదారుల్లో తరలింది. ఉచితమనే మాట అనుచితమై.. అది రాజావారి ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితైంది. ఎమ్మెల్యే అండదండలతో టీడీపీ నేతలు సాగించిన కబ్జాకాండకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇదేమని ప్రశ్నించిన గొంతులను అక్రమ కేసులు నొక్కేశాయి. సహజ వనరులు ఎమ్మెల్యే ఆలపాటి రాజా అక్రమాల దెబ్బకు గుల్లయ్యాయి. కాసుల రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. నిలదీయాల్సిన అధికారులకు బెదిరింపులు, మామూళ్లు నజరానాగా మారి.. ఆలపాటి అంతులేని అవినీతికి ఎర్రతివాచీ పరిచాయి. అధికార అండతో అక్రమ నిర్మాణాలు గుంటూరు నగరంలోని విద్యానగర్‌లో ఎన్నారై ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ ఆలపాటి రాజాకు చెందింది కావడంతో రోడ్డుపైకి అక్రమంగా రెండు షాపులను నిర్మించేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. నిరుపేదలు చిన్న రేకుల షెడ్డు నిర్మిస్తేనే పెద్ద తప్పు చేసినట్లు హడావుడి చేసి తొలగించే టౌన్ ప్లానింగ్ అధికారులు.. దీనిపై చెయ్యి వేసేందుకు కూడా సాహసించలేకపోయారు. నగరం నడిబొడ్డున అరండల్‌పేట 12వ లైను ఎదురుగా ఉన్న గ్రాండ్ నాగార్జున హోటల్ సెల్లార్లో బార్‌ను నడుపుతున్నప్పటికీ అధికారులు ఎవరూ అడ్డుచెప్పని పరిస్థితి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ పెరిగిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సెల్లార్లో పార్క్ చేయాల్సిన వాహనాలను రోడ్డుపైనే పెడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం సదరు హోటల్ ఆలపాటి రాజాకు చెందింది కావడమే. పంట పొలాల దురాక్రమణ తెనాలి రూరల్ మండలం కఠెవరంలో తినీతినకా ఆస్తులు కూడబెట్టిన ఒకరు పాతికేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. అతడి ఏకైక కుమారుడు సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ కుటుంబానికి వారసులు ఎవరూ లేరు. కఠెవరం పరిధిలో 14 ఎకరాల పంట భూములపై హక్కుల కోసం కొందరు కోర్టును ఆశ్రయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దృష్టి ఆ భూములపై పడింది. కోర్టులో వాజ్యం నడుపుతున్న వారికి తలా కొంత ముట్టజెప్పి, తన పార్టీకి చెందిన బినామీల పేరిట రిజిస్టర్ చేయించారు. వీరిలో విశాఖకు చెందిన బినామీ కూడా ఉన్నారు. ఆ విధంగా రూ.2 కోట్లలోపు ఖర్చుతో రూ.70 కోట్ల విలువైన పంట పొలాలను సొంతం చేసుకున్నారు. నీరు–చెట్టు పథకం కింద తెనాలి రూరల్ మండలం మల్లెపాడులో 11 ఎకరాల చెరువు ఆక్రమణలకుపోగా ప్రస్తుతం ఏడెకరాల్లో ఉంది. రెండేళ్లకోసారి చేపల వేలం ద్వారా పంచాయతీకి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల ఆదాయం సమకూరేది. వేలం లేకుండా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర కనుసన్నల్లో తెలుగుదేశం నేత, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రావి రామ్మోహన్ నేతృత్వంలో ఇక్కడ మట్టి తవ్వకాలు సాగించారు. మూడు నాలుగు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి అమ్ముకున్నారు. ఇలా మట్టి తవ్వకాల్లో అ«ధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర కోటి రూపాయలకుపైగా గడించారు. రెండేళ్లలో కొల్లిపర మండలం కొల్లిపర, పిడపర్రు, వల్లభాపురం, అన్నవరం, తూములూరు, దావులూరు, పిడపర్తిపాలెం, శిరిపురం, కుంచవరం, చక్రాయపాలెం, అత్తోట, అత్తోట యాదవపాలెం గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. కేవలం కొల్లిపర మండలంలోనే ఎమ్మెల్యే ఆయన బినామీలు రూ.2.50 కోట్లను ఆర్జించారు. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువుల తవ్వకాల్లో అధికార పార్టీ నేతల్లో కలహాల కుంపటి రగిలిన సందర్భాలు లేకపోలేదు. తెనాలి మండలం కంచర్లపాలెంలో 5 ఎకరాల ఊరచెరువులో ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులు మట్టి తవ్వారు. 5600 ట్రక్కుల మట్టిని తీసి ఒక్కో ట్రక్కు రూ.600 చొప్పున అమ్మేశారు. పూడికతీతతో రూ.35 లక్షల ఆదాయం సమకూరగా, రూ.6 లక్షలతో చెరువు చుట్టూ కంచె వేయించారు. మిగిలిన సొమ్ము తమ జేబుల్లో వేసుకున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద నీరు–చెట్టు పథకం కింద ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమంగా తవ్వుకున్న మట్టి విలువ రూ.6 కోట్లపైమాటే! అమాయకుల్ని బలి తీసుకున్న ఇసుక ట్రాక్టర్లు.. ఎడతెరిపిలేని ఇసుక ట్రాక్టర్ల పరుగులో పొలం నుంచి ఇంటికి వస్తున్న మున్నంగికి చెందిన వంగా శేషిరెడ్డిని ఓ ఇసుక ట్రాక్టరు బలి తీసుకుంది. గత ఏప్రిల్ 23న ఈ దుర్ఘటన జరగ్గా.. అంతకు రెండు నెలల ముందు ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో అదే గ్రామస్తురాలైన కనపాల విశ్రాంతమ్మ విగతజీవురాలైంది. దీనిపై గ్రామస్తులు తిరుగుబాటు చేసి వల్లభాపురం రేవులో ఉచిత ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయించారు. ఇదే రేవులో ఇసుక తవ్వకాలను ప్రశ్నించారనే ఆగ్రహంతో టీడీపీ నేతల అనుచరులు వల్లభాపురానికి చెందిన అవుతు చంద్రశేఖరరెడ్డిపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర రెడ్డి బొటనవేలు తెగిపోయింది. ముందు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తెలుగుదేశం నేతల జోక్యంతో సాధారణ దాడి కేసుగా మార్చారు. ఎగ్జిబిషన్లకు అనుమతులు.. సుప్రీం కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సొసైటీ, కళాశాల యాజమాన్యం వివాదాస్పద స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి అనుమతించింది. స్థలం తమ చేతిలో ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పుకోవడానికి, ఆ మేరకు ఆధారాలు సంపాదించుకోవడానికి వీలుగా అధికార బలంతో ఎగ్జిబిషన్, శుభకార్యాల నిర్వహణకు స్థలాన్ని ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ. 15 కోట్లకుపైనే పలుకుతోంది. భారీ ఇసుక దోపిడీ... 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే ఆలపాటి కనుసన్నల్లో కృష్ణానది భూముల్లో మేట పేరుతో అవినీతి వేట సాగింది. గోరంత భూమికి అనుమతులు తీసుకొని, కొండంత మేర ఆక్రమించటం, ఆ పరిధిలో ఇసుకను తవ్వేసుకొని రూ. కోట్ల రూపాయలను పిండుకోవడం ఈ నాలుగున్నరేళ్లలో పరిపాటిగా మారింది. కొల్లిపర మండం అన్నవరం పరిధిలో కేవలం 1.70 ఎకరాల్లో ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు పొందారు. కానీ 30 ఎకరాలకుపైగానే తవ్వేసి రూ. 20 కోట్లు ఎమ్మెల్యే దండుకున్నారన్నది బహిరంగ రహస్యం. పాత బొమ్మువానిపాలెం ఉచిత ఇసుక రేవు గుంటూరుకు చెందిన తెలుగుదేశం నేత నల్లమోతు శ్రీను కనుసన్నల్లో నడిచింది. అనుమతులకు మించి ఇక్కడ కూడా 21 ఎకరాల్లో ఇసుక తవ్వుకుని రూ. 10 కోట్లు సంపాదించారు. 2016లో డ్వాక్రా మహిళల పేరిట రూ.3 కోట్ల విలువైన ఇసుకను ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన బినామీలు తవ్వి అమ్ముకున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద నాలుగున్నరేళ్లలో కృష్ణానదిలో ఇసుక తవ్వి ఎమ్మెల్యే రూ. 200 కోట్లు గడించారు. -
పొన్నూరులో ధూళిపాళ్ల దందా
సాక్షి, పొన్నూరు : ధూళిపాళ్ల నరేంద్రను పొన్నూరు ప్రజలు ఐదుసార్లు ఆశీర్వదించారు.. అయినా నియోజకవర్గంపై ఆయనకు కొంచెమైనా ఆపేక్ష ఉండదు.. అభివృద్ధి ఆనవాళ్లు కనిపించకపోయినా అవినీతి ఆగడాలకు కొదవలేదు. సంగం డెయిరీని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు అడ్డూ అదుపూ లేదు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసుల దందాకు అడ్టుకట్ట లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా నీరు–చెట్టు పేరుతో సాగించిన దోపిడీకి అంతే లేదు. ఎమ్మెల్యే అండతో, అధికార అహంకారంతో టీడీపీ నేతల అక్రమార్జనకు ఆనకట్ట లేదు. ప్రతి పనిలో కమీషన్లకు తెగబడిన ఎమ్మెల్యే తీరుపై ప్రశ్నించని గొంతు లేదు. ఐదేళ్ల పాలనలో కోట్ల రూపాయల దండుకున్న ఎమ్మెల్యే అవినీతిపై భగ్గుమనని ఊరూవాడా లేదు. 3.89 ఎకరాలు.. రూ.5కోట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోల్కత్తా – చెన్నై జాతీయ రహదారి సమీపంలోని పెదకాకాని మండలం నంబూరులోని సర్వే నంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని కబ్జా చేశారు. తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మారినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640 లలో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొదటగా పుల్లయ్య కుమారుడు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్‌కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీ) రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్లు పుట్టించారు. ఆ తరువాత ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవరపుల్లయ్య విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బీ6, బీ7, బీ8 సబ్ డివిజన్లుగా విభజించి దేవరపుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ ధర సుమారు రూ. 5 కోట్ల వరకు పలుకుతుంది. దీనికి తోడు పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారు. 10 ఎకరాలు 1994లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. పది ఎకరాల సంగం డెయిరీ భూమిని ఎమ్మెల్యే ట్రస్ట్‌కు అక్రమంగా తరలించారు. చట్ట ప్రకారం డెయిరీ ఆస్తులను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత అక్కడ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టు ఆసుపత్రి నిర్మించారు. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని 2016లో 9 మంది పాడి రైతులు జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో పాల ఉత్పత్తిదారుల కోసం ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఆస్పత్రి సేవలను వినియోగిస్తామని యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ, ఆసుపత్రికి ఎమ్మెల్యే నరేంద్ర సతీమణి జ్యోతిర్మయిని ఎండీగా వ్యవహరించడం గమనార్హం. చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి గ్రామంలో 25 ఎకరాల పెద్ద చెరువును ఎమ్మెల్యే క్వారీగా మార్చే యత్నాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు రావి వెంకట రమణ అడ్డుకున్నారు. వైఎస్ జగన్‌ను ఆ ప్రాంతానికి తీసుకురావడంతో తవ్వకాలు నిలిపేశారు. తాడేపల్లి రూరల్ కొలనుకొండలో అటవీ శాఖ భూమిలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకున్న వ్యక్తిని సురేంద్ర బెదిరించి క్వారీ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న వారిని కూడా భయపెట్టారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ రూ.కోట్ల దోచేశారు. చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాల ద్వారా రూ.10 కోట్లు దండుకున్నారు. పొన్నూరు మండలంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. చింతలపూడి పరిధిలోపాడి రైతులు తమ సంఘం నిధులతో 30 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. అందులో నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరు మీద కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండపానికి ఎంపీ ల్యాడ్స్ కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. కానీ ఆ కల్యాణ మండపం ప్రభుత్వ ఆధీనంలో లేదు. కానీ, నరేంద్రకుమార్ తల్లి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి సుమారు 150 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కో కార్యక్రమానికి రూ. 70 వేలు నుంచి రూ. లక్ష వరకు అద్దె వసూలు చేస్తారు. వెనిగండ్లలోని ప్రభుత్వ భూమిలో ప్రజలలు విరాళాలతో నిర్మించుకున్న కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే మూయించారు. -
నూజీవీడులో అవినీతి ముద్దర
సాక్షి, కృష్ణా : అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా అనే ధీమాతో తన అనుచరులతో కలిసి అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు.. ‘నీరు–చెట్టు’లో మట్టి దోపిడీకి తెరతీశారు.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మట్టి అక్రమ తరలింపులోనే ఈయన, అనుచరులు రూ.100 కోట్లు వెనకేశారంటే ఈయన నడిపిన దందా ఏమిటో అర్థమవుతోంది.. ఈయన వెంట ఉన్న చోటామోటా నాయకులకు ఒకప్పుడు ఏమీ లేకపోగా నేడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. ఒక్క మట్టిదోపిడే కాకుండా ఇసుక అక్రమ రవాణా, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో కమీషన్లు, పేదలకు ఇచ్చే కార్పొరేషన్ రుణాల్లో వసూళ్ల దందా, చివరకు మరుగుదొడ్ల కేటాయింపు, నిర్మాణంలోనూ అవినీతి కంపు.. ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా అన్నిరంగాల్లో తన దందా కొనసాగించారు. ఆయనే నూజివీడు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. అగ్నికి ఆజ్యం తోడైనట్లు పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ తమ్మిలేరులోనూ తన హవా కొనసాగించడంతో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగి ఏరులు, చెరువులు తమ రూపునే కోల్పోయిన దుస్థితి ఏర్పడింది. చింతమనేని హవా.. ముసునూరు మండలాన్ని ఆనుకొని ఉన్న తమ్మిలేరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుకదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఇంటివద్ద అవసరం కోసం ఒక ట్రక్కు ఇసుకను తెచ్చుకుంటుంటే ట్రాక్టర్లను సీజ్‌చేసి జరిమానాలు విధించే అధికారులు, ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడరు. బలివే సమీపంలోని రంగంపేట వద్ద చింతమనేని ఇసుక దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపధ్యంలోనే అప్పటి ముసునూరు తహసీల్దార్ దోనవల్లి వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే లోపూడి, గుళ్లపూడి, వలసపల్లి, యల్లాపురం, రంగంపేట, బలివేల వద్ద నుంచి ముసునూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లిగంగారామ్, చిల్లబోయినపల్లి బుజ్జి తదితరులు ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జించారు. ఈ అక్రమార్జనలోనూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రూ. కోట్లు కప్పం కట్టినట్లు సమాచారం. నీరు– చెట్టు పనుల్లో రూ.100కోట్లు లూటీ నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో మట్టిని విచ్చలవిడిగా విక్రయించి అధికారపార్టీ నాయకులు రూ.100 కోట్ల పైన లూఠీ చేశారు. నాలుగున్నరేళ్లలో నూజివీడు మండలంలో రూ.28 కోట్లు, ముసునూరు మండలంలో రూ.24 కోట్లు, చాట్రాయి మండలంలో రూ.6 కోట్లు, ఆగిరిపల్లి మండలంలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.63కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనిలో పొక్లెయిన్‌కు లోడింగ్ ఖర్చు కింద క్యూబిక్ మీటర్‌కు రూ.29 చొప్పున ప్రభుత్వం చెల్లించగా, టీడీపీ నాయకులు చెరువులలో మట్టిని ట్రక్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించుకున్నారు. దాదాపు వేలాది ట్రిప్పుల మట్టిని విక్రయించి రూ.100కోట్ల పైనే దోచుకున్నారు. ప్రభుత్వమే నీరు–చెట్టు కింద లోడింగ్‌కు రూ.60కోట్ల వరకు చెల్లించిందంటే మట్టిని అమ్ముకోవడం ద్వారా ఎంత విక్రయించారో అర్ధమవుతోంది. నూజివీడు మండలంలోని చెరువుల్లోని మట్టి అంతా రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు వెంచర్ల నిర్వాహకులకు, పట్టణంలోని నివేశన స్థలాలకు తోలి విక్రయించుకున్నారు. అంతేగాకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను సైతం నీరు చెట్టు పనుల్లో చేపట్టినట్టుగా చూపించి దోచుకున్నారు. టీడీపీ నాయకులు చేసిన మట్టి దందాతో కొన్ని చెరువులు తమ రూపురేఖలనే కోల్పోవడం గమనార్హం. చాట్రాయి పెద్దచెరువు, దీప చెరువుల్లో రూ.30లక్షలతో చేసిన పనులను తూతూమంత్రంగా చేసి లక్షలు దోచుకున్నారు. పోలవరం మట్టి మాఫియా పోలవరం కుడికాలువపైన ఉన్న మట్టిని అధికార టీడీపీకి చెందిన మట్టిమాఫియా లక్షలాది క్యూబిక్ మీటర్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జించారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా తరలించారు. తవ్విన మట్టిని తవ్వినట్టే విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడి మట్టి పల్లెర్లమూడి పరిధిలో ఉన్న క్వారీ గోతులకు, పలువురు రైతుల తోటలకు,హనుమాన్‌జంక్షన్, గుడివాడ వంటి దూరప్రాంతాలకు తరలిపోయింది. ఈ గ్రామ పరిధిలో ఎర్రచెరువుకు ఎగువభాగాన ఉన్న దాదాపు 15 ఎకరాల క్వారీ గోతులను పూడ్చివేశారు. ఈ గోతులు 20 నుంచి 25 అడుగుల లోతులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వతే 8.30లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టి రాగా అందులో దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. క్యూబిక్‌మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో మట్టిని అమ్ముకున్నారు. ఏలూరు ఎంపీకి అనుచరుడిగా చెప్పుకునే టీడీపీకి చెందిన పల్లెర్లమూడికి చెందిన గ్రామనాయకుడు మట్టిని అమ్ముకోవడంలో కీలకపాత్ర పోషించాడు. పనుల్లో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా సాగించి రూ. కోట్లు పోగేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన నాటి నుంచి ఈ దందా మరింత పెరిగి ప్రతి పనిలో 10శాతం వరకు కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ కమీషన్ల దందా కోసం కావాలనే వేరే డివిజన్లో పనిచేసే పంచాయతీరాజ్ డీఈని నూజివీడు డివిజన్‌కు ఇన్చార్జి ఈఈగా నియమించినట్లు సమాచారం. ఉపాధిహామీ, జడ్పీ, ఎంపీ నిధులు, ఇతర గ్రాంట్లు ద్వారా వచ్చే నిధులు కలిపి నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.42కోట్లు పనులు జరగగా, ఈ ఏడాదికి రూ.33కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో 10 శాతం కమీషన్ రూపంలో ముద్దరబోయినకు దక్కినట్లు సమాచారం. ఇదే కాకుండా తన బినామీలతో నీరు–చెట్టు పనుల్లో భాగంగా చెరువుల్లో తవ్విన మట్టిని విక్రయించి పోగేసిన సొమ్ములోనూ ఆయనకు పెద్ద ఎత్తున వాటా ఉన్నట్లు తెలుస్తోంది. -
కొమ్మాలపాటి అవినీతిలో మేటి
సాక్షి, గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఇసుక దందా వరకు.. సదావర్తి సత్రం భూములను చేజిక్కించుకోవడం నుంచి ఎర్ర మట్టి దోపిడీ వరకు.. బెట్టింగ్ మాఫీయా నుంచి ‘నీరు–చెట్టు’లో అవినీతి వరకు.. కాదేది ఆయన అక్రమార్జనకు అనర్హం. కన్నుపడితే దౌర్జన్యం చేయడం ఖాయం. ఒక సామాన్య వ్యక్తి నుంచి నేడు రూ.కోట్లకు పడగెత్తిన రాజకీయ నాయకుడిగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సాగించిన అవినీతి కథలు రాయాలంటే పుస్తకాలే చాలవేమో. కృష్ణమ్మ నది గర్భంలో డ్రెడ్జర్లతో భారీ లోతులో ఇసుక తవ్వకాలు జరిపి.. అమాయక ప్రాణాలను బలిగొన్నా.. బినామీల పేరుతో గ్రావెల్ కొట్టేసినా ఆయనకే చెల్లింది. ఇలా ఇందు లేదు అందు లేదు.. ఎందెందు వెతికినా అందందే అవినీతిని విస్తరించి.. మద్యాన్ని ఎరులై పారించిన ప్రజాప్రతినిధి కొమ్మాలపాటి. రాజధాని ప్రాంతఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ అండతో ఇసుక మాఫియాను నడుపుతూ వేల కోట్లు దోచేశారు కొమ్మాలపాటి శ్రీధర్. అందులో చినబాబు వాటాపోను సుమారు రూ. 500 కోట్లకుపైగా వెనకేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన ప్రతి చోటా ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించి రెవెన్యూ అధికారుల ద్వారా సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దశాబ్దాల క్రితం పట్టాలు ఇచ్చిన భూములను సైతం చెరబట్టారు. నీరు–చెట్టు పేరుతో మట్టిని బొక్కేయడంతోపాటు, అమరావతి మండలంలో అతి ఖరీదైన ఎర్ర మట్టిని తవ్వేసి సుమారుగా రూ. 100 కోట్లు దండుకున్నారు. నియోజవకర్గంలో మద్యం దుకాణాల వద్ద 20 శాతం వాటా గుంజేసుకుంటున్నారు. ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి సుమారుగా 25 మందికిపైగా అమాయకులు బలయ్యారు. అయినా కొమ్మాలపాటి ధనదాహం మాత్రం తీర లేదు. అమరావతి, అచ్చంపేట మండలాల్లో అక్రమంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణా కోసం కృష్ణా నది మధ్యలో నుంచి రోడ్డు నిర్మించారు. నీరు–చెట్టులో అవినీతి ప్రవాహం.. నీరు–చెట్లు కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటికి బంగారు బాతుగా మారింది. పథకం పేరుతో నియోజకవర్గంలోని మండలాల్లో నిధులను ఎమ్మెల్యే భారీగా మింగేశారు. బెల్లంకొండ మండలంలో నందిరాజుపాలెం గ్రామానికి చెందిన ఎస్సీలు 28 సంవత్సరాలుగా 40 ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 40 ఎకరాలు ఆక్రమించుకొని వాటిలో 10 ఎకరాల్లో నీరు– చెట్టు కింద మట్టిని తవ్వి అవినీతికి పాల్పడ్డారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆయన అనుచరులు రూ. 30 కోట్ల వరకూ మట్టిని మింగేశారు. ప్రజల ప్రాణాలను బలిగొన్నారు... నాలుగున్నరేళ్లలో కొమ్మాలపాటి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 2016 ఆగస్టు 16న కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు, గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు ప్రాంతాన్ని కలిపే కృష్ణా నది పాయలో పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు చనిపోయారు కృష్ణానదిలో తీసిన భారీ గోతిలో ఓ విద్యార్థి మునుగుతుండగా, పక్కన ఉన్న తోటి విద్యార్థులు అతనిని రక్షించేందుకు వెళ్ళి వారు సైతం మృత్యువాత పడిన సంఘటన ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అదే ఏడాది గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు శివారులో ఉన్న కృష్ణా నదిలో జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఐదుగురు యువకులు ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి జల సమాధయ్యారు. 2017 జనవరి 15న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఇసుక కోసం తవ్విన గోతుల్లో పడి మృత్యువాత పడ్డ వారంతా 20 ఏళ్లులోపు. మీటరు (మూడు అడుగులు) లోతుకంటే ఎక్కువ తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కృష్ణానదిలో 20 అడుగులు తవ్వేశారు. ఇసుక తవ్వకాలకు యంత్రాలు వినియోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం జీవోలు జారీ చేసినా ఇసుకాసురులు మాత్రం అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కీలక బుకీ మాదినేని బాలజీ కొమ్మాలపాటి శ్రీధర్ మామ మాదినేని సుబ్బయ్య కుమారుడు కావడం గమనార్హం. బాలాజీ సొంతగా బోర్డు నడుపుతూ ఆన్లైన్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు లైన్ ఇస్తూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు. ఇతని జోలికి పోలీసులు వెళ్ళకుండా కొమ్మాలపాటి చూసుకుంటారు. బాలాజీ తమ వద్ద భూములు, స్థలాలు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ అనేక మంది బాధితులు 2016 డిసెంబర్లో అప్పటి గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. క్రికెట్ బుకీల ఆట కట్టించేందుకు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావు ఇద్దరు డీఎస్పీలు, ఎస్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బెట్టింగ్ బుకీల కోసం వేట సాగించారు. ఈ బృందం కీలక బుకీ బాలాజీతోపాటు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని పూర్తి స్థాయిలో విచారించడంతో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చాయి. వీరు ఇచ్చిన సమాచారంతో బాలాజీ సోదరుడు, అమరావతికి చెందిన మండల స్థాయి టీడీపీ నేతతోపాటు జిల్లాలోని అనేక మంది కీలక క్రికెట్ బుకీల పాత్ర ఉన్నట్లు తేలింది. బాలాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి బావమరిది కావడంతో వారి జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఆ మరుసటి రోజు ఐదుగురు క్రికెట్ బెట్టర్లను అరెస్టు చూపించారు. అందులో కీలక బుకీ బాలాజీ ఎవరనేది కూడా విలేకరులకు చెప్పకుండా.. కనీసం కోర్టులో హాజరు పర్చకుండా 41 నోటీసు ఇచ్చి వదిలేశారు. అమరావతిలో గతంలో పేకాట కూడా నిర్వహించారు. ఎర్ర మట్టి దోపిడీ.. అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములలో కోట్లాది రూపాయల ఎర్ర గ్రావెల్ దోచుకున్నారు. ఎమ్మెల్యే బినామీలైన పెదకూరపాడు మండలం కంభంపాడుకు చెందిన మాదినేని సుబ్బయ్య కుమారుడు శ్రీనివాసరావు, పెదకూరపాడుకు చెందిన ఏటుకూరి గంగాధరరావు ఈ భూముల్లో తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ భూములు కలిగిన ఎండ్రాయి, లేమల్లె గ్రామాలకు చెందిన షేక్ మస్తాన్‌బీ డీకె పట్టా రద్దు చేయిస్తామని బెదిరించి సర్వే నెంబరు 95/1, 95/2లో ఉన్న 1.98 ఎకరాలు లేమల్లెలోని మేకల యేసోబుకు చెందిన 96/2లో ఉన్న ఎకరం భూమిని మాదినేని శ్రీనివాసరావు లీజుకు రాయించుకున్నాడు. దీంతోపాటుగా 2013 నవంబరు 23వ తేదీన చనిపోయిన కట్టెపోగు వందనం భార్య చిట్టెమ్మ పేరు మీద 96/2 నంబరులో ఉన్న 1.25 ఎకరాల భూమిని కూడా 2017 ఏప్రిల్ 1న నోటరీ అఫిడవిట్ ఇచ్చినట్లు ఏటుకూరి గంగాధరరావు పేరు మీద ఫోర్జరి చేసి లీజు అగ్రిమెంట్ సృష్టించినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆర్సీ నెం.402/2017బీ అర్డరులో డీకే పట్టాగా పేర్కొన్న భూములు మైనింగ్ మెమో నెం.1418/టీపీలో మాత్రం పట్టా భూమి అని చూపించారు. మొత్తం మీద 6150 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేశారు. ప్రస్తుతం కర్లపూడి ఎస్సీ కాలనీకి దగ్గరలో ఉన్న గంగమ్మచెరువు వద్ద ప్రత్తిపాటి బేబమ్మ, ప్రత్తిపాటి బూదమ్మలకు పూర్వార్జితంగా సంక్రమించిన రెండు ఎకరాల భూమిని కొమ్మాలపాటి బంధువులు కొనుగోలు చేసి అక్రమ తవ్వకాలకు తెర తీశారు. -
రేపల్లెలో అవినీతి భూపాలుడు
సాక్షి, గుంటూరు : రేపల్లె తీరాన అవినీతి తిమింగలంలా మారారు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మడ అడవులను అడ్డగోలుగా ఆక్రమించేశారు. అధికారులను బెదిరించి రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాలను కైవసం చేసుకున్నారు. రేపల్లెలో భూపాలుడి అవతారమెత్తి కోట్ల రూపాయలు దండుకున్నారు. మరో వైపు మత్స్యకారుల నోటికాడ కూడు లాక్కుని కృష్ణానదిలో ఇసుకను తవ్వేశారు. ప్రజలకు అందాల్సిన ఇసుకను అడ్డదారుల్లో తరలించి అధిక మొత్తానికి అమ్మేసుకున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలను పోగేసుకున్నారు.కిడ్నాపర్లు, హంతకులకు కొమ్ముకాస్తూ బాధితుల ఉసురుపోసుకుంటున్నారు. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులను చెరబట్టి మట్టిని మింగేశారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా సహజ వనరులను లూటీ చేశారు ఎమ్మెల్యే అనగాని. అధికారం దక్కగానే భూ కుంభకోణాలు.. పెనుమూడి రేవులో డ్రెడ్జర్లతో అక్రమంగా తవ్వుతున్న ఇసుక కనుచూపు మేరలో ఖాళీగా ఉన్న అటవీ భూములపై టీడీపీ నాయకుల కన్ను పడింది. 2014లో అధికారం చేపట్టిన ఐదు నెలల్లో అధికారులను బెదిరించి ఏకంగా 15.13 ఎకరాల అటవీ భూమికి పట్టాలు సృష్టించారు. దీంతోపాటు అదే ప్రాంతంలోని మరో పది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి చెరువులను తవ్వి ఆక్వా సాగుకు సిద్ధం చేశారు. నిజాంపట్నం మండల ఆముదాలపల్లి పంచాయతీ పరిధిలోని చింతరేవులోని అటవీ భూమి 583 సర్వే నంబరులోని 15.13 ఎకరాలను ఎమ్మెల్యే బినామీలు ఆరుగురి పేరున 10–11–2014 తేదీన అప్పటి తహసీల్దారు రవికుమార్ పట్టాలు ఇచ్చారు. ఇసుక అమ్మకాల్లో రూ. 250 కోట్లు... అధికార పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇసుక, మట్టిని దోపిడీ చేసి కోట్ల రూపాయలు గడించాడు. పెనుమూడి రేవులో మ్యాన్యువల్‌గా ఇసుకను తరలించుకునే విధంగా కలెక్టర్ మత్స్యకారులకు కల్పించిన అవకాశాలను.. వారికి దక్కకుండా అడ్డుకుని అక్రమ దందాకు తెరతీశారు. చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం, రేపల్లె, రేపల్లె రూరల్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ డ్రెజ్జర్లను వినియోగించిన ఇసుకను తరలించి సుమారు రూ.250 కోట్లు దండుకున్నారు. తమ పొట్టగొడుతున్నారని అనేక సందర్భాళ్లో మత్స్యకారులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు రేపల్లె, భట్టిప్రోలు మెయిన్ డ్రెయిన్ల ఆధునికీకరణలో భాగంగా తవ్విన ఇసుకను సైతం అమ్ముకుని రూ. కోటి రూపాయలు కొట్టేశారు. విద్యార్థుల భవితవ్యంతో ఆటలు పాలిటెక్నిక్ కళాశాల సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణారావు ఉన్న హయాంలో తీర ప్రాంత విద్యార్థుల భవితవ్యం కోసం పట్టణంలో 2010లో పాలిటెక్నిక్ కళాశాల నెలకొల్పేందుకు కృషి చేశారు. నూతన భవనాల నిర్మాణానికి కావలసిన రూ.4.61 కోట్లు కేటాయించారు. ఈ బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. అనంతరం ఎన్నికలు రావటంతో పాలకులు మారారు. పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఏ ఏటికాయేడు జాప్యం జరుగుతుండటంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. దీంతో కాస్తంత కదిలిన పాలకపక్ష ప్రజాప్రతినిధులు, అధికారులు 2016 జనవరిలో పనులు ప్రారంభించి 2016–17 విద్యా సంవత్సరంలో నూతన భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా భవ నిర్మాణ పనులకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. బినామీలకు బ్యాంకు రుణాలు.. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తన బినామీల పేరుతో రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసగించారు. దీనిపై సమగ్ర విచారణకు శ్రీకారం చుట్టిన అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అంతే ఆ విచారణ మధ్యలోనే నిలిచిపోయింది. అక్రమంగా మత్స్యకార రుణాలు... ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను చూపుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ రుణాలు పొందారు. ఇలా సుమారు రూ. 6 కోట్లు తమ ఖాతాల్లో ఎమ్మెల్యే, ఆయన బినామీలు జమ చేసుకున్నారు. దీనిపై విచారణ నిర్వహించిన అధికారులను అధికారంతో కట్టడి చేశారు. ఎస్టీ అధికారి బలి... ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుల సొంత భూమిగా 1బీ అడంగల్‌లో నమోదవడంపై అప్పటి తహసీల్దార్ మోహనకృష్ణపై అధికారులు చర్యలు తీసుకున్నారు. రిటైర్డ్ అనంతరం తహశీల్దార్‌కు రావల్సిన బెనిఫిట్స్‌ను ఇప్పటికీ ఇవ్వలేదు. గతంలో పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా బెంగళూరు కేంద్రంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ 1బీ అడంగల్‌లో తన బినామీల పేర్లు నమోదు చేయించి అప్పటి తహసీల్దార్‌పై నేరాన్ని మోపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్డ్ తరువాత బెనిఫిట్స్ రాకపోవటంతో ఎస్టీ అధికారిని బలి చేశారని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. వసూల్ రాజా ప్రభుత్వంలో ప్రతి పోస్టుకూ భారీ స్థాయిలో సొమ్ము దండుకున్నారు అనగాని. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు రూ. 4–రూ.7 లక్షలు, విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగానికి రూ.7–రూ.10 లక్షలు, ఆయా పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.రూ.2 లక్షలు, న్యూట్రీషన్ పోస్టులకు రూ.1–రూ.1.50 లక్షల వరకూ స్వయంగా ఎమ్మెల్యే సోదరుడు అనగాని శివప్రసాద్ వసూళ్లు చేసినట్లు బహిరంగానే చెబుతున్నారు. తమ వద్ద సొమ్ము తీసుకుని పోస్టు ఇవ్వలేదంటూ ఇటీవల జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్న అనగాని సత్యప్రసాద్‌ను చెరుకుపల్లి మండలం కుంచాలవారిపాలెంలో బాధితులు నిలదీశారు. నిజాంపట్నం మండలం తోటపాలెంలో అంగన్వాడీ పోస్టులకు ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా వేలం నిర్వహించి అత్యధికంగా రూ.10 లక్షలు వసూలు చేశాడు. దీనిపై టీడీపీ నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. జూదాలకు నిలయంగా.. రేపల్లె నియోజకవర్గాన్ని జూదాలకు నిలయంగా మార్చిన ఘనత అనగాని సత్యప్రసాద్‌కు దక్కుతుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కుటుంబాలతో ఆనందంగా గడిపే సంస్కృతి నుంచి జూదాలకు పరుగుతీసే విధంగా మార్చారు. ఇలా ఎన్నో కుటుంబాల ఉసురుపోకున్నారని మహిళలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో పేకాట, బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తూ ఆయన సోదరుడు నెలవారీ మామూళ్ల వసూలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కనుసన్నల్లో ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయ ముసుగులో కోడి పందేలు, పేకాటలను భారీగా నిర్వహిస్తున్నారు. చెరుకుపల్లి మండలంలోని తూర్పుపాలెంలో 2018లో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కోడి పందేల బరిని ఏర్పాటు చేశారు. మూడురోజుల పాటు జాదాల నిర్వహణకు సుమారు రూ. 50 కోట్ల వరకు దండుకున్నారు. -
ప్రజాధనాన్ని ‘కొల్లు’గొట్టి
సాక్షి, కృష్షా : అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి కాదు అవినీతికి పాల్పడటానికి అని తెలుగుదేశం పార్టీ నాయకులు నిజం చేసి చూపారు. గడిచిన ఐదేళ్లలో మచిలీపట్నం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేకపోయినా.. అవినీతి సామ్రాజ్యాన్ని మంత్రి కొల్లు రవీంద్ర నిర్మించారు. కాంట్రాక్టు పనైనా, ఉద్యోగమైనా, మట్టి, ఇసుక, ఇలా సొంత లాభం లేకుండా ఏ పనీ చేయలేదు. పర్సంటేజీలు ముట్టచెబితే చాలు ఎలాంటి వ్యవహారమైనా క్షణాల్లో పరిష్క రిస్తారు. అంతేనా సహజ వనరులను దోచేస్తారు.. అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యం చేస్తారు.. సహజ వనరులకు రక్షణగా ఉండాల్సిన పాలకులే భక్షకులుగా మారారు. ప్రజాధనాన్ని సంరక్షించాల్సిన వారే.. అక్రమంగా బొక్కేశారు. ఇలా ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలు లూటీ చేశారు. కరకట్ట నిర్మాణం నాసిరకంగా చేపట్టడంతో జారిపోతున్న కట్టమట్టి మంత్రి కొల్లు రవీంద్ర అనుంగ అనుచరులైన కుర్రా నరేంద్ర, కొల్లూరి శివలు సైతం ఐదేళ్లుగా కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం. గతంలో ఏమీ లేని నరేంద్ర ప్రస్తుతం విజయవాడ నగరంలో రూ.5 కోట్ల విలువ చేసే 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్, మరో రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా బందరు పోర్టు పరిధిలోని ల్యాండ్ పూలింగ్‌లో ఉన్న భూములను తక్కువ ధరకు 15 ఎకరాల మేరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని విలువ ఎకరం రూ.15 లక్షలుండగా రూ.2.25 కోట్లు పలుకుతున్నాయి. రాజధాని అమరావతి పరిధిలో సైతం రూ.6 కోట్లు విలువ చేసే భూములు కొనుగోలు చేశారంటే ఏ మేరకు దండుకున్నారో అర్థం అవుతోంది. ఇందులో మంత్రికి సైతం వాటాలు ఉన్నట్లు తెలిసింది. మరో అనుచరుడు కొల్లూరి శివ మాత్రం తానేమీ తీసిపోని విధంగా అక్రమాలకు తెగడబ్డారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో రూ.4 కోట్లు విలువ చేసే కమర్షియల్ బిల్డింగ్ ఉంది. మచిలీపట్నంలో సైతం రూ.కోట్లు విలువ చేసే ఇళ్లు సైతం కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే మంత్రి, మంత్రి అనుచరులు ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి దోపిడీలకు తెగబడ్డారో అవగతం అవుతోంది. ఎక్సైజ్‌లో కుమ్మేశారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 నుంచి రూ.40 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఇలా మంత్రిగా ఉన్న రెండేళ్లలో రూ. 60 నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి తెర లేపారు. బార్లు, బ్రాందీ షాపులపై ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తారు. దాడుల్లో షాపుల లైసెన్స్ రద్దు చేయిస్తానని బెదిరింపులకు దిగుతారు. అనంతరం మంత్రి అనుచరులైన కుర్రా నరేంద్ర, కొల్లూరి శివలు రంగంలోకి దిగుతారు. షాపు లైసెన్స్ తిరిగి పునరుద్ధరిస్తామని షాపు యజమానుల వద్ద నమ్మబలుకుతారు. ఇలా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారంతో సుమారు రూ.15 కోట్లకు పైగా దండుకున్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖలో డిజిటలైజేషన్ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్ టెండర్ల అనంతరమే ప్రభుత్వ పెద్దలకు రూ.5 కోట్ల కమీషన్ చెల్లించాడు. అది చాలదన్నట్లు తాను సంతకం పెట్టానని, తనకేమైనా చూడాలని సదరు కాంట్రాక్టర్ వద్ద మంత్రి రూ.2 కోట్లు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ స్టేషన్ల నుంచి ప్రతి నెలా మామూళ్లు వసూలు చేసేవారు. ఈ తంతు మొత్తం తన పీఏ స్వయంగా చూసుకునే వాడని ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి జిల్లా నుంచి నెలకు రూ.2 లక్షలు చొప్పున రెండేళ్లకు రూ.52 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గుట్టుగా గుట్కా దందా నిషేధిత గుట్కా వ్యాపారం మంత్రి అనుచరులు, ఓ పీఏ కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులను పావులుగా వాడుకుని మిగిలిన విక్రయదారులపై పోలీసులతో దాడులు చేయించి వ్యాపారాన్ని మూయించేశారు. స్వయంగా మంత్రి అనుచరులే భీమవరం నుంచి ప్రతి రోజూ రూ.3 లక్షలు విలువ చేసే సరుకు దిగుమతి చేసుకోవడం.. బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని 150 బడ్డీ కొట్లకు సరుకు సరఫరా చేస్తుంటారు. ప్యాకెట్ రూ.5కు కొనుగోలు చేయడం.. బడ్డీ కొట్లకు రూ.10కి విక్రయించి రూ.లక్షలు గడిస్తున్నారు. ఇది చాలదన్నట్లు గుట్కా విక్రయించే బడ్డీ కొట్లకు సరఫరా చేయడం.. తిరిగి ఏ కొట్టుకు సరుకు అందించామన్న సమాచారం పోలీసులకు చెప్పడం.. వారిపై దాడులు చేయిస్తున్నారు. ఇదే అదునుగా సెటిల్ మెంట్లకు దిగుతున్నారు. ఒక్కో బట్టీ నిర్వాహకుడి వద్ద పోలీసులకు ఇవ్వాలని రూ.లక్ష వసూలు చేయడం అందులో రూ.40 వేలు దిగమింగుతున్నారు. గత రెండేళ్లలో ఒక్కో బట్టీ నిర్వాహకుడిపై మూడు సార్లు పోలీసు దాడులు చేయించారు. దాడుల్లో పోలీసులకు ముట్టజెప్పిన మొత్తం పోగా.. మంత్రి అనుచరులు, ఓ పీఏ రూ.1.20 కోట్ల వరకు దండుకున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో గుట్కాను ఆర్‌పేట పోలిస్ స్టేషన్ పరిధిలో గుట్కా విక్రయిస్తున్న వారి నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి పీఏ స్టేషన్‌కు వెళ్లి సరకు తీసుకెళ్లేలా చేశారంటే గుట్కా వ్యాపారానికి అండదండలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది. రైస్ మిల్లులోనూ అంతే.. కొల్లు రవీంద్రకు చెందిన రైస్‌మిల్ ధాన్యం కొనుగోలు అనంతరం ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు వాటిని ఆడించి నిర్దేశించిన సమయంలో ప్రభుత్వానికి బియ్యం అప్పజెప్పాలి. నిబంధనల మేరకు కమీషన్ తీసుకోవాలని. కానీ మంత్రి ఇలాఖాలో మాత్రం అలాంటి పప్పులు ఉడకడం లేదు. మంత్రి తన సొంత రైస్ మిల్లును అడ్డాగా పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి పాసు పుస్తకాలు బలవంతంగా తీసుకోవడం.. రూ.3 కోట్లు విలువైన ధాన్యం కొన్నట్లు దొంగ లెక్కలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వానికి ధాన్యం అప్పజెప్పాల్సిన నిర్ణీత సమయం కంటే అదనంగా తీసుకుంటున్నారు. ఈ వ్యవధిలో బహిరంగ విపణిలో స్టోర్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా ధాన్యం సరఫరా పేరిట రవాణా చార్జీలు సైతం పొందుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఇదే తంతు నడుపుతూ సుమారు రూ.3 కోట్ల వరకు దిగమించినట్లు తెలిసింది. దీనిపై సీబీఐ అధికారులు లోతైన విచారణ జరిపితే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది. భారీగా ఆస్తులు గోపాల్‌నగర్ శ్మశానాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు నాలుగేళ్లు దండుకున్న అక్రమ సంపాదనతో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఇవన్నీ బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్, బందరులో రూ.6 కోట్ల విలువ చేసే స్థలాలు కొనుగోలు చేశారు. కృత్తివెన్ను మండలంలో రాంబాబు, రంగా, పవన్, గుప్తాలను బినామీలుగా పెట్టి 38 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ భూమి రిజిస్ట్రేషన్ విలువ రూ.2.80 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.6.84 కోట్లు పలుకుతోంది. బందరు మండలంలోని రాడార్ కేంద్రం వద్ద పల్లపాటి సుబ్రహ్మణ్యంను బినామీగా పెట్టి 40 ఎకరాల స్థలం(22–ఏ) తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఎకరం రూ.15 లక్షలు చొప్పున రూ.6 కోట్లు విలువ చేసే స్థలం కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లో సైతం రూ.కోట్లు విలువ చేసే స్థలాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి ప్రాంతంలో సైతం రూ.కోట్లు విలువ చేసే పొలాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్రమాల్లో మరికొన్ని.. రూ.లక్ష విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుకు రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా నాలుగేళ్లుగా రూ.కోటి వరకు స్వాహా చేశారు. ఒక్కో రైతు రథం ట్రాక్టర్ మంజూరుకు లబ్ధిదారుడి నుంచి రూ.30 వేలు, ట్రాక్టర్ కంపెనీ నుంచి రూ.30 వేలు గుంజుతున్నారు. 112 రైతు రథాలకు సంబంధించి రూ.62 లక్షలు దండుకున్నారు. అదనపు తరగతి నిర్మాణాల్లో ఒక్కో గదికి రూ.40 వేలు చోప్పున నాలుగున్నరేళ్లుగా 25 గదులకు సంబంధించి రూ.10 లక్షలు దండుకున్నారు. రూ.1.50 కోట్లు బీనామీ పేర్లతో కాల్‌మనీకి తిప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చి ఏళ్లయినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో ప్రశ్నించిన సదరు అభ్యర్థికి రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్లో లోన్ ఇప్పిస్తానని చెప్పారు. మంత్రి అనుచరుడు కన్నా ప్రసాద్ బినామీగా బందరు పట్టణంలో చేపట్టిన డివైడర్ గ్రిల్ వర్క్‌లో రూ.లక్షలు స్వాహా చేశారు. అంతేగాక బీచ్‌ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో సీఎం పర్యటనలో సైతం భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. -
బెజవాడలో ‘బొండా’.. అవినీతి కొండ
సాక్షి, విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. నియోజకవర్గం మొత్తం కనుసైగతో శాసించేవారు. అధికారంలోకి వచ్చింది మొదలు భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో విచ్చలవిడిగా అక్రమాలు చేపట్టారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతికి పచ్చ జెండా ఊపింది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని దర్జాగా కబ్జా చేశారు. ఏదైనా పని జరగాలన్నా.. కాంట్రాక్టు దక్కాలన్నా ఆయన అనుమతి కావాల్సిందే. వీరికి కప్పం కట్టందే ఏ వ్యవహారం నడవదు. కాంట్రాక్టు పనైనా, ఉద్యోగమైనా ఏదైనా నగదు ముట్టజెప్పితే ఎలాంటి వ్యవహారమైన క్షణాల్లో సెటిల్ చేసేస్తారు. అధికారం అండతో ఐదేళ్లుగా బొండా ఉమామహేశ్వరరావు అక్రమ దందా కొనసాగించి రూ.కోట్లు కొల్లగొట్టారు. అక్రమాలు, అరాచకాలు కండ్రిక కాలనీలో జర్నలిస్టులకు ఇళ్ల పేరుతో ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1720 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నిం చారు. స్థానికుల ఆందోళనతో వెనక్కుతగ్గారు. 43వ డివిజన్లోని దుర్గాగ్రహారంలో క్యాన్సర్ బా«ధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను ఎమ్మెల్యే అనుచరులు కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉమా వెనుక ఉండి తన అనుచరులతో దౌర్జన్యం చేయించినట్లు సమాచారం. బొండా ఉమా ప్రధాన అనుచరుడు, కార్పొరేటర్ నందెపు జగదీష్ పాయకాపురంలో కళ్లం విజయలక్ష్మి, లంకిరెడ్డి సాంబిరెడ్డికి చెందిన సర్వే నెం.62/1, 62/2లో 0.49 సెంట్ల భూమికి సంబంధించి తప్పుడు వీలునామా సృష్టించి, తన పేర, తన కుటుంబ సభ్యుల పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాధితులు కోర్టులో కేసు వేయడంతో దిగువ కోర్టులో కార్పొరేటర్ కేసు ఉపసంహరించుకున్నాడు. ఈ కబ్జా వ్యవహారం వెనుక ఉమా హస్తం ఉంది. స్థలం ప్రస్తుతం యజమాని చేతిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్స్ రద్దు కాలేదు. ఈ స్థలం విలువ రూ.10 కోట్లు ఉంటుంది. నందెపు జగదీష్ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. తెనాలికి చెందిన సుబ్బు అనే రౌడీ షీటర్‌తో బొండా ఉమామహేశ్వరరావు సంబంధాలు కొనసాగించారు. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ బొండా, మరికొందరు టీడీపీ నాయకుల పేర్లు చెప్పారు. తెలంగాణ పోలీసులు సుబ్బుపై అక్రమ ఆయుధాల కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో రౌడీ షీటర్ సుబ్బు పట్టపగలు దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు సృష్టించారు. ట్రాన్స్‌పోర్టు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని దాడికి యత్నించారు. అడ్డుగా వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గన్‌మెన్‌పై దాడి చేశారు. సత్యనారాయణపురంలోని కల్యాణ మండపాన్ని అధికార పార్టీ నాయకులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిం చి విఫలమయ్యారు. బ్రాహ్మణ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో వెనక్కుతగ్గారు. న్యూరాజరాజేశ్వరీపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా ఆక్రమించేందుకు ప్రయత్నించారు. పాయకాపురంలో రవీంద్ర థియేటర్ పక్కన ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన రూ.కోట్ల విలువైన భూములను తన ప్రధాన అనుచరుడు.. కార్పొరేటర్ జగదీ‹ష్‌తో కలిసి కాజేసేందుకు చూశారు. పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతానికి చెందిన దాదాపు మూడు ఎకరాల వరకూ ఉన్న ఆ కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటికి ఇంటి పట్టాలను సైతం పుట్టిం చేందుకు యత్నించారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. అనుయాయుల తీరు అంతే.. ఇందిరానాయక్ నగర్లో బుడమేరుకు అనుకుని ఉన్న ఓ వ్యక్తి స్థలంలో నిర్మించిన ప్రహరీని దౌర్జన్యంగా కూలగొట్టి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందులోనూ ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకరు గతంలో ఓ ఉపాధ్యాయురాలిని బెదిరించారు. అతను సివిల్ సప్లయ్ కార్యాలయంలోనూ చక్రం తిప్పి అక్రమాలకు పాల్పడ్డాడు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. ఇతను ఓ వివాహితను లోబరచుకున్నాడు. ఆ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే పనిచేస్తుంటాయి. రికార్డులు తారుమారు చేసి, సదరు భూములను అనుచరుల పేర రిజిస్ట్రేషన్ చేయించిన దాఖలాలు ఉన్నాయి. సింగ్‌నగర్ ప్రాంతంలో వందల కొద్ది అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టాలన్నా కార్పొరేటర్లు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లైతే రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వీటిలో ఎమ్మెల్యేకు వాటా వెళుతోంది. జాగా కనిపిస్తే పాగా ఎమ్మెల్యే బొండా, తన అనుయాయులైన కార్పొరేటర్లు అందిన కాడికి దోచుకోవటమే పరమావధిగా పనిచేస్తున్నారు. రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరులోపలకి ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నారు. ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడు వ్యాయామశాల పెట్టుకోవడానికి ధారాదత్తం చేశారు. 44వ డివిజన్లో కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలను సైతం విక్రయించారు. సదరు కార్పొరేటర్ హౌస్‌ఫర్ ఆల్ ఇళ్లను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. తాజాగా 46వ డివిజన్ అంబేడ్కర్ కాలనీలో కాల్వగట్టు స్థలాన్ని వ్యాయామశాల కోసం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సింగ్‌నగర్‌లో కోట్ల విలువైన భూమి.. మాగంటి బాబు.. ఎమ్మెల్యే బొండా ఉమాకు అత్యంత సన్నిహితుడు. స్వాతంత్య్ర సమరయోధుని భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతో పాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమాకు అన్ని దందాల్లోనూ మాగంటి బాబే కీలకంగా వ్యవహరిస్తుంటారన్నది బహిరంగ రహస్యమే. తాజాగా విజయవాడ సింగనగర్లోని రూ.30 కోట్లు భూదందాలో కూడా ఆయనే కీలక పాత్రధారి కావడం గమనార్హం. వాస్తవానికి ఆ భూమిని 2005లోనే 21 మంది సామాన్యులు ప్లాట్లు రూపంలో కొనుగోలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం భూముల ధరలు అమాంతంగా పెరగడంతో ఆ భూమి మార్కెట్ విలువ రూ.30 కోట్లకు చేరుకుంది. దీంతో టీడీపీ నేతల కన్ను ఆ భూమిపై పడింది. ఎమ్మెల్యే బొండా ఉమాకు అత్యంత సన్నిహితుడైన మాగంటి బాబుతోపాటు మరికొందరు ఆ భూమి తమదంటూ కొత్త వాదనను లేవదీశారు. మాగంటి బాబు, మరికొందరు 2015లో ఆ భూమిలోకి ప్రవేశించి ప్లాట్లుగా వేసి ఉన్న హద్దు రాళ్లను తొలగించేశారు. తమ భూమిలో ఇతరులు ప్రవేశించడంపై ఆ 21 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా తాము ఆ భూమిని 2007లోనే కొనుగోలు చేశామని కొన్ని పత్రాలు చూపించ డంతో వారు హతాశులయ్యారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సింగ్‌నగర్ పోలీసులు ఆ భూమి ఆక్రమణదారులపై కేసు నమోదు చేయాల్సివచ్చింది. కానీ వారంతా బొండాకు సన్నిహితులు కావడంతో పోలీసులు వారికే కొమ్ముకాస్తుండటం గమనార్హం. అసలు యజమానులు ఎన్నిసార్లు ఆ భూమిలో హద్దురాళ్లు పాతుతున్నా వెంటనే తొలగిస్తున్నారు. ఆ భూమిని చదును చేయాలని భావిస్తుంటే అడ్డుకుంటున్నారు. భూమిలోకి అడుగుపెడితే సహించేది లేదని బెదిరిస్తున్నారు. -
ప్రత్తిపాటి @ ప్రజాధనం లూటీ
సాక్షి, గుంటూరు : మన నియోజకవర్గ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చింది. ఇక ప్రతి మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని నాలుగేళ్ల క్రితం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు భావించారు. ప్రత్తిపాట్టి పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు పదవి వచ్చిన దగ్గర నుంచి అవినీతి జడలు విప్పింది. ఊరూవాడా అక్రమాలు జోరు పెరిగింది. నీరు– చెట్టు పథకం మంత్రితోపాటు ఆయన అనుచరులకు వరంగా మారింది. అధికారం అండ ఉండడంతో పత్తి కొనుగోలులో గోల్మాల్ చేశారు. అవినీతి తోడేళ్లుగా మారి గ్రావెల్‌ను మింగేస్తూ.. అందినకాడిని మట్టి బొక్కేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ప్రాణాలు ఆరిపోతుంటే.. ఆ సంస్థ భూములు అన్యాయంగా చెరబట్టారు. అక్రమాలపై ప్రశ్నించి జర్నలిస్టుల కలాల కంఠానికి ఉరి బిగించారు. మంత్రి భార్య రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజలను పీడించారు. అన్ని శాఖల అధికారులను గుప్పిట్లో పెట్టుకుని కమీషన్లు దండుకున్నారు. ఇలా ఐదేళ్ల పాలనలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. మొత్తంగా చిలకలూపేట నియోజకవర్గంలో అభివృద్ధికి పాతరేసి.. అవినీతి, అక్రమాలు, అరాచకాల కోటగా మార్చేశారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు... ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్ భూమి ఉంది. గతంలో వెంచర్లు వేసి భూమి అభివృద్ధి చేయటానికి సంస్థ వీటిని కొనుగోలు చేసింది. ఈ భూమి అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్ డైరెక్టర్ కనుకొల్లు ఉదయదినాకర్ పేరుపై రిజిస్టర్ అయ్యింది. అగ్రి గోల్డ్ భాగస్వామి అయిన ఇతని వద్ద నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మ (ప్రత్తిపాటి వెంకటకుమారి) 2015 జనవరి 19వ తేదీన ఖాతా నంబర్ 525, సర్వే నంబర్లు 104–6, 104–5,104–4,104–3,104–1,103–2ల ప్రకారం మొత్తం 6.19 ఎకరాలను కొనుగోలు చేశారు. తిరిగి గతేడాది ఏప్రిల్ 17వ తేదీ అగ్రి ప్రాజెక్టు సంస్థకు చెందిన బండా శ్రీనివాసబాబు నుంచి సర్వే నంబర్ 101–1లోని 5.44 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అదే రోజు అంటే ఏప్రిల్ 17వ తేదీ మంత్రిప్రగడ విజయ్‌కుమార్ వద్ద నుంచి సర్వే నంబర్లు 104–1,104–2,104–3 ద్వారా 2.60 ఎకరాలు, సర్వే నంబర్ 104–4లో ఉన్న 0.57 ఎకరాలను కొనుగోలు చేశారు. మొత్తం అగ్రిగోల్డ్‌కి చెందిన 14.81 ఎకరాల భూమిని మంత్రి సతీమణి పేరుపై కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన మొత్తం భూమిని అదే ఏడాది జూన్ 4వ తేదీన గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు విక్రయించారు. అగ్రి గోల్డ్ భూమిని రహస్యంగా భాగస్వాములు వేరే వ్యక్తులకు ఎకరా రూ.32 లక్షలకు అమ్మటానికి వ్యవహారం నడిచింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు వ్యక్తులతో అగ్రిమెంటు కూడా రాయించుకున్నారు. విషయం తెలిసిన మంత్రి వీరిని బెదిరించి అగ్రిమెంట్లు రద్దు చేయించారు. తాను కేవలం ఎకరాకు రూ.20 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పటంతో గత్యంతరం లేక నష్టానికి మంత్రికి భూములు అమ్మారు. భూములు కొన్న మంత్రి జూన్‌లో ఇవే భూములను ఎకరాకు రూ.52 లక్షలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు మంత్రికి లాభంగా దక్కాయి. అక్షరం గొంతు నొక్కి చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్ శంకర్‌పై(హత్యకు గురైనప్పుడు ఆంధ్రప్రభ ఆర్సీ ఇన్చార్జి) 2014 నవంబర్ 25వ తేదీన తెలుగు యువత పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దిబోయిన శివ, మరో ముగ్గురు దాడి చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి శంకర్ మృతి చెందాడు. తొలుత ఆధారాలు లేవని కేసు మూసివేసేందుకు ప్రయత్నించగా.. జర్నలిస్టు సంఘాలు పోరాటం చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరు కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారులను మాత్రం అరెస్టు చేయ లేదు. సీసీఐలో భారీ కుంభకోణం 2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డుల ద్వారా ఈ కుంభకోణం జరిగింది. విశాఖపట్టణం నుంచి గుంటూరు వచ్చిన సీబీఐ అధికారుల బృందం సీసీఐ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. అప్పట్లో జరిగిన పత్తి కుంభకోణంలో దాదాపు రూ.540 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా 43 మార్కెట్ యార్డుల్లో పత్తికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి. అయితే ముందే రైతుల నుంచి వ్యాపారులు, దళారీలు పత్తి క్వింటాకు రూ. 3 వేలలోపు కొని రూ. 4 వేలు, రూ.4100 చొప్పున సీసీఐకి విక్రయించారు. కొనుగోలు చేసిన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకురాకుండా గ్రామాల నుంచే నేరుగా జిన్నింగ్ మిల్లులకు తరలించారు. ఈ వ్యవహారంలో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు. గ్రామాల నుంచి వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. కాటా వేయని పత్తికి కాటా వేసినట్లు చార్జీలు, మార్కెట్ యార్డుల నుంచి సీసీఐ జిన్నింగ్ చేయించే మిల్లులకు పత్తిని తరలించినట్లు రవాణా చార్జీలు ఖర్చు రాసి డబ్బులు దండుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత పత్తి కొనుగోలు సంస్థ (సీసీఐ)లో జరిగిన అవినీతి ప్రభుత్వాన్ని కుదిపేసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో కంటితుడుపుగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ అనంతరం 2016 నవంబర్‌లో చిలకలూరిపేట మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి కే నాగవేణి సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 మంది మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేశారు. కప్పం కట్టనిదే ఫైల్ కదలదు చిలకలూరిపేట నియోజకవర్గంలో రెవెన్యూ, మున్సిపల్ ఇలా ఏ కార్యాలయంలో ఫైల్ కదలాలన్నా మేడమ్‌ను కలిసి కప్పం కట్టాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ ఎకరాకు రూ.1 లక్ష వసూలు చేస్తున్నారు. మంచినీటి సరఫరా పేరుతో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల వరకు దండుకున్నారు. ఎంత పెద్ద వర్క్ అయినా మూడు, నాలుగు భాగాలుగా విభజించి ఒక్కరికే నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ భారీగా ముడుపులు తీసుకున్నారు. బాణా సంచా వ్యాపారుల నుంచి ఏటా రూ. కోటి చొప్పున ఇప్పటి వరకు రూ. 5 కోట్లు, పాన్ పరాగ్, గుట్కా హోల్‌సేల్ వ్యాపారుల నుంచి రూ. 3 కోట్లు వసూలు చేశారు. గుంటూరులో కల్తీ కారం తయారీదారులను బెదిరించి రూ. 8 కోట్లు దండుకున్నారు. నకిలీ విత్తనాల కుంభకోణం సైతం వీరి కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. విత్తనాలను బ్లాక్ చేసి కిలో లక్ష రూపాయలకు అమ్మించారు. అతి ఖరీదైన భూమి కబ్జా చిలకలూరిపేటలోని ఓగేరు వాగు పక్కనే ఉన్న సుమారు ఎకరాల స్థలాన్ని మంత్రి పుల్లారావు అనుచరులు ఆక్రమించి ప్లాట్లు వేసేశారు. 12 ఏళ్ళ క్రితం వాగు నుంచి వరద నీరు పట్టణంలోకి రాకుండా కరకట్టలు నిర్మించారు. ఆ సమయంలో అక్కడ ఎస్టీలు కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. దీంతో కొంత స్థలాన్ని వదిలేసి కరకట్ట నిర్మించారు. ఇది మంత్రి అనుచరులకు వరంగా మారింది. తమ పూర్వీకుల పేరుతో పట్టాలు ఉన్నట్లుగా సృష్టించి మంత్రి అండదండలతో పూర్ణాసింగ్, మాధవ్‌సింగ్, శంబుసింగ్ అనే వ్యక్తులు ఆక్రమించి ప్లాట్లు వేశారు. సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే స్థలం కబ్జాకు గురైంది. మంత్రి కన్నుపడిన యడవల్లి భూముల్లో గ్రానైట్ విలువ : రూ. 3000 కోట్లు పేదల బియ్యం రవాణాలో అక్రమాలు : రూ. 200 కోట్లు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో గ్రావెల్ దోపిడీ : రూ.500 కోట్లు మున్సిపల్ పనుల్లో మంత్రి భార్య కమీషన్ : రూ.150 కోట్లు పేట కేంద్రంగా సీసీఐ కుంభకోణం : రూ. 540 కోట్లురూ. టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను అడ్డుపెట్టుకుని దోచుకున్న మొత్తం : 150 కోట్లు అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలులో లబ్ధి : సుమారు 5 కోట్లు -
బోడె ప్రసాద్@కబ్జాల..కాలకేయ!
సాక్షి,అమరావతి : అధికారం అండతో అందినకాడికి దండుకున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అతని అనుచరులు సాగించిన అక్రమాలు, అరాచకాలు, భూకబ్జాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. ప్రతి పనికి పర్సంటేజి విధించి కమీషన్ల దందాకు తెరలేపారు.. బోడె, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగ పరీక్ష రాయించిన మేధావి.. ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లి డిగ్రీ అర్హత కోసం దూరవిద్యలో పరీక్షకు తాను హాజరు కాకుండా మరో యువకుడితో రాయించిన ఘనత బోడె ప్రసాద్‌ది. వాస్తవానికి ఎమ్మెల్యే పదో తరగతి పాసై పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ అయ్యారు. బీటెక్ బిల్డప్‌ను జనాల్లో ఇచ్చారు. అయితే తన విద్యార్హతను పెంచుకునే విషయంలో పరీక్ష రాసే సత్తా లేక దూరవిద్యలో డిగ్రీ చేయాలని సన్నిహిత వర్గాల ద్వారా కసరత్తు చేశారు. ఇందులో భాగంగా అతను విదేశాల్లో ఉన్నా పోరంకిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో దొంగ పరీక్ష రాయించేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కళాశాలకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడు పరారయ్యాడు. అయితే పరీక్షకు హాల్ టిక్కెట్ జారీ, పరీక్షకు హాజరైనట్లు సంతకం కూడా ఉంది. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించినా జరిగిన వాస్తవాలను చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఉచిత ఇసుక..కాసుల వేట.. అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది. తొలుత చోడవరంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. కూలీలతోనే లోడింగ్ చేయించాలనే నిబంధన ఉన్నా, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నదీగర్భంలో పొక్లెయిన్లతో ఇసుక తోడి ప్రైవేటు ర్యాంపుల గుండా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లారీలు, ట్రాక్టర్లలో ఇసుక రవాణా సాగించారు. వేరే వ్యక్తులు క్వారీలోకి వెళ్లి ఉచిత ఇసుకను తీసుకునే అవకాశం లేకుండా అధికార పార్టీ గుత్తాధిపత్యంగా ఇసుక క్వారీలను తమ ఆధీనంలో ఉంచుకుంది. నిత్యం వెయ్యి నుంచి 1600 వరకూ ట్రాక్టర్లలో ఇసుక రవాణా సాగించినట్లు అంచనా. తద్వారా ఎమ్మెల్యే బోడె వర్గం రూ.కోట్లు అక్రమార్జన చేసినట్లు సమాచారం. ‘వసూల్ రాజా’ స్వయంగా ఆయనే ఒక బిల్డర్ అయి ఉండి, బిల్డర్లకు ఉన్న బాధలు మరిచి ఎమ్మెల్యేగా తనకు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని బిల్డర్ల నుంచి రూ.3 కోట్లు అక్రమంగా వసూలు చేశారు. గ్రూప్ హౌస్‌ల నిర్మాణాలు లక్ష్యంగా వసూలు దందా నడిపారు. ఒక్కో ఫ్లాట్‌కి రూ.40 వేలు నుంచి రూ.60 వేలు వసూలు చేశారు. ఓ బిల్డర్ వద్ద ఏకంగా ముక్కుపిండి మరీ రూ.80 లక్షలు వసూలు చేశారు. అభివృద్ధి తన లక్ష్యమని ప్రజల్ని నమ్మిస్తూ వసూలు చేసిన డబ్బుతో గ్రామంలో అభివృద్ధి చేపడతామని ఈ దందా నడిపారు. కృష్ణానదిలో ఇసుక, బుసక తెచ్చి రహదారులు నిర్మించి ఎంతో గొప్పగా తానే అభివృద్ధి చేశానని మభ్యపెట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సీఆర్డీఏ, పంచాయతీలు, ఇతర శాఖల నిధులు నుంచి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు జరగాల్సి ఉండగా నిధులు సమీకరించటంలో వైఫల్యం చెందారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బిల్డర్ల నుంచి వసూలు చేశానని, తాను సచ్చీలుడనని అభివృద్ధికే తాను డబ్బు వసూలు చేశానని సభలు, సమావేశాలు, బహిరంగ సభల్లో గొప్పగా చెప్పుకోవటం, ప్రజల్ని నమ్మించే యత్నం చేయటం ఈయనకే చెల్లింది. ఇసుక రవాణాలో కమీషన్ల దందా టీడీపీ నేతలు ఇసుకను ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఉచిత ఇసుక విధానం అర్థమే మార్చేశారు. అడ్డగోలుగా ఇసుక తవ్వేసి కోట్లు గడించారు. దీనిలో కీలక సూత్రధారి అధికార పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఆయన అండ చూసుకుని అతని ముఖ్య అనుచరులు. ఇది బహిరంగ రహస్యమే. అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెనమలూరు మండలం పెద పులిపాక కేంద్రంగా ఉన్న క్వారీలో అమ్మకాలు చేపట్టారు. నిత్యం 400 నుంచి 600 ట్రాక్టర్లు, లారీల్లో ఇక్కడి నుంచి రవాణా సాగించేవి. క్వారీలో లోడింగ్ పనులను మాత్రం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన బినామీల పేరుతో పొక్లెయిన్లను ఏర్పాటు చేయించారనే విమర్శ ఉంది. నిత్యం ఈ క్వారీలో వాహనాల క్యూ ఉండగానే దొడ్డిదారిన 50కు పైగా ట్రాక్టర్లు, లారీలు ఇసుక లోడింగ్ చేయించటం, అధిక ధరకు అమ్ముకునేవారు. తెలంగాణ, గోదావరి జిల్లాలకు సైతం ఇక్కడి నుంచి ఇసుకను రవాణా సాగించారు. లారీ ఇసుక రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకూ అప్పట్లో ధర పలికింది. సుమారు ఏడాదిన్నర పాటు యథేచ్ఛగా ఇసుక అక్రమ లోడింగ్, రవాణా ఇక్కడి నుంచి సాగింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఇసుక అక్రమ వ్యాపారంపై కోర్టుకు వెళ్లారు. దీంతో ఇసుక రవాణా ఆగింది. అక్రమాలకు అండ.. యనమలకుదురు, పెద పులిపాక గ్రామ పంచాయతీల్లో జరిగిన భారీ కుంభకోణాలకు సంబంధించి చర్యలు తీసుకోకుండా బోడె అడ్డుగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. యనమలకుదురులో అక్రమ భవన నిర్మాణ ప్లాన్లు, పారిశుద్ధ్య పనులకు అక్రమంగా సామగ్రి కొనుగోళ్లు ఇలా ఈ పంచాయతీలో రూ.కోటికి పైగా అక్రమాలు జరిగాయి. పెదపులిపాకలో రూ.70 లక్షలు నిధులు దుర్వినియోగం జరిగినా ఇప్పటి వరకూ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుండా అటకెక్కించేశారు. యనమలకుదురు గ్రామంలో సుమారు 700 దొంగ ప్లాన్ జారీకి రూ.2 కోట్లు చేతులు మారాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరిగినా వాస్తవాలు మాత్రం వెలుగులోకి రాలేదు. -
కర్నూలులో పెరిగిపోతున్న టీడీపీ ఆగడాలు
-
హింసానందం..? ఓ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో అధికారి ఇష్టారాజ్యం
సాక్షి, అమరావతిబ్యూరో : బెజవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీసు అధికారులు గాడి తప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తూ.. సొంత లాభం చూసుకుంటూ కాసుల వేటకు తెరలేపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విజయవాడ తూర్పు డివిజన్లో ఓ సర్కిల్ స్టేషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారి కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. మామూళ్లు దండుకోవడానికి ఓ ప్రత్యేక టీమ్‌నే ఏర్పాటు చేయడంపై పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజాయితీగా పనిచేస్తున్న కిందస్థాయి సిబ్బందిపై చిరుబుర్రులాడటం.. నెలవారీ టార్గెట్లు విధించడంతో ఈ పోరు తట్టుకోలేక.. ఆయన కింద పనిచేస్తోన్న ఇద్దరు ఎస్ఐలు సెలవులో వెళ్లినట్లు సమాచారం. బెజవాడకు కూతవేటు దూరంలో ఉంటుందా సర్కిల్ స్టేషన్. ఆ సర్కిల్ పరిధిలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటి పర్యవేక్షణ బాధ్యతలు చూసే సీఐ ఆయా స్టేషన్లకు వస్తున్నారంటే అక్కడ పనిచేసే సిబ్బందికి చెమటలు పడుతున్నాయి. వచ్చీరావడంతోనే ఆయన అందుకునే తిట్లదండకానికి బెంబేలెత్తాల్సిన పరిస్థితి. చీటికిమాటికి ఆయన స్టేషన్లకు వచ్చి.. సిబ్బందిని చులకనచేసి మాట్లాడటం.. సాటి అధికారులపైనా సూటిపోటి మాటలతో హింసించడం పరిపాటిగా మారింది. ఇక ఆయన వచ్చిన సమయంలో స్టేషన్ వద్ద గుంపులు గుంపులుగా ప్రజలు కనిపిస్తే మాత్రం సిబ్బందిపై శివాలెత్తిపోతారు. గతంలో ఆ అధికారి పనిచేసిన స్టేషన్లలో ఇదేవిధంగా వ్యవహరించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినట్లు సమాచారం. సీఐ కింద ముగ్గురు ఐడబ్ల్యూలు.. ఓ ఏఎస్ఐ! సాధారణంగా ప్రతి స్టేషన్లోనూ ఓ హెడ్‌కానిస్టేబుల్, సీఐ కింద ఇన్స్పెక్టర్ రైటర్(ఐడబ్ల్యూ)గా పనిచేస్తుంటారు. కానీ ఈయన మాత్రం ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లను పెట్టుకున్నారు. వీరితోపాటు గతంలో రైటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఓ కానిస్టేబుల్‌ను సైతం అతనికి సహాయకుడిగా తీసుకున్నారు. నెలవారీ మామూళ్లు ఎవరెవరి నుంచి వస్తాయి.. వసూళ్లు ఎలా చేస్తారు.. వంటి అంశాలపై ఆ కానిస్టేబుల్‌కు బాగా అవగాహన ఉండటంతోనే ఆయనను తన వద్ద నియమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మరో స్టేషన్లో పనిచేస్తోన్న ఓ ఏఎస్ఐను సైతం సీఐ సర్కిల్ స్టేషన్లో వివిధ పనులకు అనధికారికంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది. సర్కిల్ స్టేష¯Œలో పనిచేసే సిబ్బంది ఇప్పుడు ఏఎస్ఐకు సైతం బయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అతను రోజువారీగా స్టేషన్ పరిధిలో కేసుల నమోదు, పర్యవేక్షణ తదితర పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆ స్టేషన్ పరిధిలోని ఓ దుకాణంలో పనిచేసే గుమాస్తా ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను చేసిన అప్పును ఎప్పుడు తీరుస్తారని యజమాని ప్రశ్నించినందుకే ఆ గుమాస్తా ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసి.. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు వినికిడి. కానిస్టేబుల్‌తో కుమారుడికి ట్యూషన్.. తన స్టేషన్లో పనిచేస్తోన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌ను ఇంటర్మీడియెట్ చదివే తన కుమారుడికి ట్యూషన్ చెప్పే పనులకు వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇంజినీరింగ్ చదివిన కానిస్టేబుల్‌కు ఇప్పుడు అతనికి ట్యూషన్ చెప్పడమే డ్యూటీగా మారింది. ఆయనకు మరో డ్యూటీలేవీ వేయకుండా సీఐ ఇంటివద్దే పనులు చేయించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇద్దరు అధికారుల మధ్య నలిగిపోతున్న ఎస్ఐలు.. సర్కిల్ ఇన్స్పెక్టర్ వేధింపులతో సతమతవుతున్న ఎస్ఐలకు.. డివిజన్ స్థాయి ఉన్నతాధికారితోనూ తలనొప్పిగా మారింది. ఒకవైపు చీటికిమాటికి సీఐ చీవాట్లు పెడుతుండటం.. మరోవైపు డివిజన్‌స్థాయి అధికారి పెండింగ్ ఫైళ్లు చూసే పేరిట చులకనభావంతో మాట్లాడటంతో ఎస్ఐలు ఆ సర్కిల్లో పనిచేయడం కన్నా.. ఎక్కడైనా సెక్యూరిటీగార్డుగా పనిచేసుకోవడం మేలని బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి. సీఐ దెబ్బకు సెలవుపై వెళ్లి ఇటీవలే విధుల్లో చేరిన ఓ ఎస్ఐ రెండు రోజులు తిరక్కముందే మళ్లీ సెలవుపై వెళ్లిపోయారు. మరో ఎస్‌ఐది ఇదే పరిస్థితి. గతంలో ఆయనపై సీఐ ఆగ్రహంగా సెల్‌ఫోన్ విసిరివేయడంతో మనస్తాపం చెంది సెలవుపై వెళ్లిపోయాడు. ఇటీవలే విధుల్లో చేరాడు. పై అధికారులకు సమాచారం నిల్! ఆ సర్కిల్ పరిధిలో ఇంత జరుగుతున్నా.. సమాచారం కమిషనరేట్ పరిధికి చేరకపోవడం విడ్డూరం. ఇక్కడ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగి వాటిని తొక్కిపెట్టడం వల్లే పైస్థాయి అధికారులకు ఇక్కడి విషయాలేవీ తెలియడం లేదని సిబ్బంది నుంచి సమాచారం. -
గల్లీకో గలీజు సెంటర్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : సందీప్.. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.. కొద్దిరోజులుగా కాలేజీ అయిపోగానే నేరుగా ఇంటికి రావడం లేదు.. సెలవు రోజుల్లో కూడా పని ఉందంటూ స్నేహితులతో బయటకు వెళ్తున్నాడు.. అనుమానం వచ్చిన తండ్రి ఓరోజు సందీప్‌కు తెలియకుండా ఫాలో అయ్యాడు. తన ఇంటికి సమీపంలోనే మణికొండలో ఓ మసాజ్ పార్లర్‌కు సందీప్ వెళ్తున్నట్లు గుర్తించాడు. ఆయన బ్యాంక్ ఖాతా లావాదేవీలు పరిశీలించగా రెండు నెలల్లోనే డెబిట్ కార్డు ద్వారా ఆ మసాజ్ పార్లర్‌కు 28 సార్లు రూ.2,500 చొప్పున రూ.70 వేలు చెల్లించినట్లు బయటపడింది! ఆదాయ పన్ను శాఖలో సీనియర్ అధికారి హోదాలో ఉన్న ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారి ఒకరికి ఈ విషయం చెప్పారు. అదే రోజు సాయంత్రం పార్లర్‌పై దాడి చేసి నిర్వాహకులతోపాటు డజనుకుపైగా యువతులను అరెస్టు చేశారు. దీపక్ కుమార్... మెహదీపట్నంకు చెందిన ఈయన ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నారు.. ఎంబీఏ చదువుతున్న తన కుమారుడికి సప్లిమెంటరీ క్రెడిట్ కార్డు ఇప్పించారు. తనకు వచ్చిన బిల్లులో కుమారుడి క్రెడిట్ కార్డు ద్వారా జరిపిన లావాదేవీలు చూసి దీపక్ ఆశ్చర్యపోయాడు. డీ ప్లస్ సెలూన్ అండ్ స్పా పేరుతో ఒకే నెలలో తన కుమారుడు రూ.27,500 ఖర్చు చేయడాన్ని చూసి కంగుతిన్నాడు. ఆరా తీస్తే మసాజ్ కోసం ఆ డబ్బు ఖర్చు చేశాడని తేలింది. డీ ప్లస్ సెలూన్ అండ్ స్పా పేరుతో హైదరాబాద్‌లో 20కి పైగా బ్రాంచీలు ఉండగా, బంజారాహిల్స్‌లోనే ఐదు ఉన్నాయి! రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో ‘మసాజ్’సంస్కృతి జోరుగా వ్యాప్తి చెందింది. వేలాది మంది యువత వీటి బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్నారు. కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పంపుతున్న సొమ్మును మసాజ్ పార్లర్లకు ఖర్చు చేస్తున్నారు. మహిళలు మసాజ్ చేస్తారంటూ ఇంటర్నెట్లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా విద్యాసంస్థల వద్ద ఏజెంట్లను పెట్టి మరీ కొన్ని సెంటర్లు ప్రచారం చేస్తున్నాయి. నగరాల్లో తల్లిదండ్రులు ఇస్తున్న పాకెట్ మనీకి తోడు ఇతరత్రా అప్పులు చేసి వీటి బారిన పడుతున్న యువకులు ఎందరో ఉన్నారు. రాజధానిలోని పలు పార్లర్లపై ‘సాక్షి’దృష్టి సారించగా.. వాటిలో జోరుగా అనైతిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తేలింది. కాలేజీల వద్ద ఏజెంట్లను పెట్టుకొని మరీ.. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి మాత్రమే కాదు.. నగరం నలుమూలలా మసాజ్ పార్లర్లు విస్తరించి ఉన్నాయి. ఇంటర్నెట్లో దొరికిన వివరాలు, ఓ పోలీసు అధికారి అందించిన సమాచారాన్ని క్రోడీకరించి చూడగా.. సుమారు 4 వేల పార్లర్లు ఉన్నట్లు వెల్లడైంది. వీటి ద్వారా ఎంత మేర వ్యాపారం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఓ బ్యాంక్ అధికారి మచ్చుకు ఆరు పార్లర్ల ఖాతాలను పరిశీలించగా.. సగటున రోజుకు లక్ష రూపాయలకు పైగా ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోని పార్లర్లు అయితే ఇంతకంటే ఎక్కువే ఆర్జిస్తున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం పార్లర్లు రోజుకు రూ.40 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నట్లు అంచనా. రాజధాని, శివార్లలోని వందలాది విద్యాసంస్థల్లోని విద్యార్థులే లక్ష్యంగా నిర్వాహకులు తమ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. బెంగాల్, మణిపూర్, అస్సాం, కేరళ, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి మసాజ్ పేరుతో అనైతిక పనులు చేయిస్తున్నారు. ఇంజనీరింగ్ ఇతర విద్యాసంస్థల వద్ద ఏకంగా తమ ఏజెంట్లను పెట్టుకుని మరీ ప్రచారం చేయిస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్లర్‌కు వచ్చే పరిచయస్తులు కొత్తవారి మొబైల్ నెంబర్ ఇస్తే నాలుగు సార్లు మసాజ్ చేయించుకోవడానికి 50 శాతం రాయితీ అంటూ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఇంటర్నెట్ నిండా వాటి వివరాలే ‘హైదరాబాద్ మసాజ్ సెంటర్స్’అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలు రెండు డెడికేటెడ్ వెబ్సైట్లు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. వాటి లింక్ తీసుకుని వెబ్సైట్లోకి వెళ్తే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని వేలాది మసాజ్ సెంటర్ల వివరాలు బూతు బొమ్మలతో సహా ప్రత్యక్షమవుతాయి. పార్లర్ల నిర్వాహకులు ఈ వెబ్సైట్ల ద్వారా రోజుకు కొత్తగా పది నుంచి 15 వేల మంది విద్యార్థులు, యువకులను ఆకర్షిస్తున్నారు. నగరంలో 16 ప్రాంతాలను ఎంపిక చేసి వాటి పరిధిలో ఎక్కడెక్కడ మసాజ్ పార్లర్లు ఉన్నాయన్న వివరాలు వెబ్సైట్లో ఉంచారు. ఉదాహరణకు దిల్సుఖ్నగర్ అని క్లిక్ చేస్తే ఆ ప్రాంతంలోని 80 నుంచి 100 పార్లర్ల సమాచారం దొరుకుతుంది. యువతను ఆకట్టుకోవడానికి పురుషుడికి మహిళ మసాజ్ చేస్తున్న ఫోటోలను వెబ్సైట్లో ఉంచారు. దీంతో గ్రాడ్యుయేషన్, ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులు తేలిగ్గా వీటి బారిన పడుతున్నారు. నగరంలోని ప్రముఖ కూడళ్ల పేర్లలో దేన్ని కిŠల్క్ చేసినా 50కి తగ్గకుండా మసాజ్ సెంటర్ల వివరాలు ఉన్నాయి. కొందరైతే కాలనీల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మామూళ్ల మత్తులో పోలీసులు నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న మసాజ్ పార్లర్లు స్థానిక పోలీసు స్టేషన్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వీటిలో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిసినా మామూళ్లు తీసుకొని మిన్నకుండిపోతున్నారు. కొన్నిసార్లు పై అధికారుల ఒత్తిళ్లతో దాడులు చేయాల్సి వచ్చినా నిర్వాహకులకు ముందే హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేస్తున్నారు. తమకు వచ్చే ఆదాయంలో ఐదు నుంచి పది శాతం పోలీసులకు ముట్టజెప్పుతామని ఓ పార్లర్ నిర్వాహకుడు తెలిపారు. ఓ తండ్రి ఆవేదన.. ‘‘నగరంలో జరుగుతున్న ఈ తరహా అనైతిక కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రించాలి. పార్లర్లన్నింటినీ వెంటనే మూసివేయాలి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనైతిక ప్రకటనలకు చోటుకల్పిస్తున్న వెబ్సైట్లను నియంత్రించాలి’’అని ఓ తండ్రి ఇటీవలే ట్వీటర్ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తన కుమారుడు తెలివైన విద్యార్థి అని ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్లో పాసై ఎంబీఏ మంచి కాలేజీలో చేరి రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఫెయిలయ్యాడని, ఈ అనైతిక కార్యకలాపాలకు అలవాటు పడ్డ అతడిని ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావడం కష్టంగా మారిందని ఆవేదన చెందారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నడుస్తున్న వీటిని నియంత్రించకపోతే యువత మరింత చెడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
షికాగోలో సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్ : ఆమె ఓ చిన్నస్థాయి సినీ నటి.. ఇటీవలే తాత్కాలిక వీసాపై అమెరికాలోని షికాగో విమానాశ్రయానికి చేరింది.. అక్కడి కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా.. ఓ భారత అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన మేనేజర్ సాయంతో వచ్చానని, రెండు వారాలు ఉండి వెళ్లిపో తానని చెప్పింది.. కానీ ఆమెను రప్పించింది వ్యభి చారం చేయించడానికి.. ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికంటూ టాలీవుడ్ నుంచి చిన్నస్థాయి సినీతారలను అమెరికాకు రప్పించి, భారీగా డబ్బు ఎరగా చూపి వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్ర అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసి, అక్కడి జిల్లా కోర్టుకు 42 పేజీలతో కూడిన దర్యాప్తు నివేదికను సమర్పించారు. కిషన్ మోదుగుమూడి పలు తెలుగు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంపై అక్కడి ‘షికాగో ట్రిబ్యూన్’ మీడియా సంస్థ పూర్తి వివరాలతో కథనం ప్రచురించడం సంచలనం సృష్టిస్తోంది. షికాగో ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. తాత్కాలిక వీసాలపై రప్పించి.. భారతీయ అసోసియేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడానికంటూ కిషన్ దంపతులు కొందరు చిన్నస్థాయి సినీ తారలను అమెరికాకు రప్పించి, వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. అవకాశాలు పెద్దగా లేని, ద్వితీయస్థాయి నటీమణులకు భారీగా డబ్బు ఎరగా చూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. హీరోయిన్లు అనగానే అమెరికాలో ఉన్న భారతీయులకు ఉండే ‘మక్కువ’ను సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే ఇటీవల ఓ నటిని అమెరికాకు రప్పించినప్పుడు సందేహం వచ్చిన ఫెడరల్ పోలీసులు కూపీ లాగారు. దీంతో షికాగో నగరంలో వెస్ట్బెల్డెన్ అవెన్యూ ప్రాంతంలోని 5700 నంబర్ అపార్ట్మెంట్లో కిషన్ దంపతులు నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. దీనిపై దర్యాప్తు చేసిన ఫెడరల్ పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. నటీమణులకు డబ్బులు ఎరవేసి ఆ అపార్ట్మెంట్లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని.. ఈ వ్యవహారంలో బాలికలు, మహిళల అక్రమ రవాణా అంశాలూ ఇమిడి ఉన్నాయంటూ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. చంపుతామని బెదిరించి.. అవకాశాలు రాని చిన్న నటీమణులు, హీరోయిన్లకు కిషన్ దంపతులు డబ్బు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతున్నారని... తర్వాత వారిని బెదిరిస్తున్నారని ఫెడరల్ పోలీసులు కోర్టుకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ విధంగా ఓ నటిని లోబర్చుకున్నారని, తమ గురించి బయటపెడితే కీడు తలపెడతామంటూ హెచ్చరించారని తెలిపారు. కిషన్ భార్య చంద్ర ఈ వ్యభిచార కార్యకలాపాల వివరాలను, ఎవరెవరితో ‘వ్యాపారం’చేశారు, ఎంత సొమ్ము వచ్చింది.. వంటివాటిని రాసిపెట్టుకుందని వెల్లడించారు. కిషన్ అపార్ట్మెంట్లో జరిపిన సోదాల్లో జిప్‌లాక్ కవర్లలో ఉంచిన 70కి పైగా కండోమ్‌లు లభించాయని వివరించారు. ఈ–మెయిళ్లు.. ఫోన్లలో బేరాలు కిషన్ దంపతులు అటు బాధితులు, ఇటు విటులతో ఈ–మెయిళ్లలో, ఫోన్లలో సంప్రదింపులు జరిపారని.. కిషన్ భార్య చంద్ర నేరుగా విటులతో ఫోన్లో మాట్లాడేదని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఫోన్‌ను పరిశీలించిన విచారణ అధికారులు.. ఆమె విటులతో జరిపిన ఎస్సెమ్మెస్ సంప్రదింపులను గుర్తించారు. ‘ఏ నటి అందుబాటులో ఉంది, ఎంత చెల్లించాల్సి ఉంటుంది’వంటి వివరాలతోపాటు వ్యభిచారానికి సిద్ధంగా ఉన్న నటి ఫోటోలను కూడా పంపింది. ‘ఓ నటి ఫోటోను ఒక క్లయింట్‌కు పంపగా.. అతను నా కోసమేనా? అంటూ సంతోషం వ్యక్తం చేసినట్టు’గా 2016 డిసెంబర్లో పంపిన మెసేజ్‌లో ఉంది. ఇక ‘తాను ఇప్పుడే ఓ క్లయింట్‌తో వ్యభిచరించానని, అతను చాలా సంతృప్తిగా ఉన్నాడ’ని ఓ బాధితురాలు చంద్రకు పంపిన మెసేజీలు కూడా లభించాయని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. కిషన్ దంపతులు అమెరికాలోని భారతీయ సంఘాల సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్దకు వెళ్లి ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి ఉన్న వారి వివరాలను తెలుసుకునేవారని.. వ్యభిచారం కోసం ఒక్కో విటుడి నుంచి 3 వేల డాలర్ల వరకు వసూలు చేశారని తేలిందని నివేదికలో వెల్లడించారు. ‘ప్లీజ్.. నన్ను ఆ కూపంలోకి లాగొద్దు’ కిషన్ ఈ–మెయిళ్లను పరిశీలించిన షికాగో పోలీసులకు ఓ బాధిత మహిళ పంపిన ఈ–మెయిళ్లు లభించాయి. తనను బెదిరించవద్దని, వ్యభిచారం చేయాలని వేధించవద్దని ఆమె కిషన్‌కు మెయిళ్లు పంపింది. ‘నాకు ఇలాంటివి చేయాలనిపించడం లేదు. ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ నీతో కలసి నేను అలాంటి పనులు చేయలేను. ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా..’’అని ఆమె ఆ మెయిళ్లలో హెచ్చరించింది. భార్యాభర్తలు అరెస్ట్.. రిమాండ్ డబ్బు ఎరవేసి వ్యభిచారం చేయించిన అంశంపై కిషన్ దంపతులను అమెరికా ఫెడరల్ పోలీసులు ఏప్రిల్ చివరి వారంలోనే అరెస్టు చేశారు. కోర్టు వారిని రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉన్నారు. వారి ఇద్దరు పిల్లలను వర్జీనియాలోని శిశు సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంచారు. కిషన్ దంపతులకు బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు తిరస్కరించింది. వాస్తవానికి అమెరికాలో వ్యభిచారం చట్టవిరుద్ధమేమీ కాదని.. అయితే ఈ వ్యవహారంలో పిల్లలు ఉన్నా, మహిళల అక్రమ రవాణా వంటివి ఉన్నా సీరియస్‌గా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. షికాగో పోలీసులు కిషన్ దంపతులపై తీవ్రమైన అభియోగాలే నమోదు చేశారని వెల్లడిస్తున్నారు. విచారణకు సహకరించని బాధితులు ఈ కేసు విచారణకు బాధితులు సహకరించడం లేదని అమెరికన్ పోలీసులు చెబుతున్నారు. ఓ బాధితురాలిని విచారించగా.. తాను వ్యభిచారం చేయలేదని, కొంతసేపు వారితో సరదాగా మాట్లాడానని, వారు తన ‘సాయం’కోరారని చెప్పింది. ఇక ఓ విటుడు తాను కిషన్ భార్య చంద్రతో మాట్లాడానని.. నటీమణులతో వ్యభిచరించేందుకు ఎంత ఖర్చవుతుందని మాత్రమే అడిగానని, అంతకుమించి ఏమీ లేదని పోలీసులకు వెల్లడించాడు. కానీ అతను షికాగో విమానాశ్రయంలోని ఓ సూట్లో చంద్రను కలసి, ఓ నటితో వ్యభిచరించేందుకు 1,110 డాలర్లు చెల్లించినట్టుగా తేలిందని ఫెడరల్ పోలీసులు కోర్టుకు ఇచ్చిన దర్యాప్తు నివేదికలో వెల్లడించారు. -
‘హరిత’లో అసాంఘిక కార్యకలాపాలు
సాక్షి, ధర్మపురి: ధర్మపురిలోని హరితహోటల్లో పర్యాటకంమాటున రాసలీలలు కొనసాగుతున్నాయి. మందుబాబులు.. విటులు హోటల్‌ను వేదిక చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రెండునెలల క్రితం మందుబాబులతోపాటు కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. ఆ సంఘటన మరువకముందే సోమవారం ఓ జంట రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ధర్మపురికి వచ్చే పర్యాటకుల కోసం గోదావరి ఒడ్డున మూడేళ్ల క్రితం పర్యాటక శాఖా వారి ఆధ్వర్యంలో హరితహోటల్‌ను నిర్మించారు. ఈ హోటల్లో మద్యం, మాంసానికి తావులేదు. హోటల్లో ఉండాలంటే ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటారు. హోటల్లో చేరేముందు పర్యాటకుల ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసు కోవాల్సి ఉంటుంది. నిర్వాహకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రెండునెలల క్రితం పోలీసులు దాడుల చేయగా.. హోటల్ అసాంఘిక కార్యకలపాలు సాగిస్తున్నట్లు తేలింది. ఆ సమయంలో మేనేజర్‌ను సస్పెం డ్ చేశారు. అప్పటినుంచి హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అడ్డంగా దొరికిన జంట భార్యాభర్తలమని చెప్పి హోటల్‌ను అద్దెకు తీసుకున్న ఓ జంట రెండురోజులుగా బయటకు రావడం లేదు. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో పోలీసులు గదిని తెరువగా ఆ జంట రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది. గదిలో మందుతోపాటు ఇతర వస్తువులున్నాయి. కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత (భర్త నుంచి విడాకులు తీసుకుంది) సిద్దిపేటకు చెందిన ఓ యు వకుడితో ప్రేమలో పడింది. హోటల్లో గదిని తప్పుడు చిరునామాతో అద్దెకు తీసుకున్నట్లు తేలింది. అయినా సిబ్బంది ఆధార్‌కార్డులు పరిశీలించకుండానే వారినుంచి కొంతసొమ్ము తీసుకుని అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీఐ లక్ష్మీబాబు జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. హోటల్ నిర్వాహకులనూ మందలించారు. తప్పుడు ధ్రువీ కరణ పత్రాలతో వస్తే గదులు ఇవ్వవద్దని సూచించారు. -
ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు
అనంతపురం న్యూసిటీ:నగరంలోని సర్వజనాస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. కొందరు పురుష సిబ్బంది మహిళా రోగులు, సిబ్బందిపై కన్నేస్తున్నారు. మాయమాటలతో లోబర్చుకుని ఆస్పత్రి ప్రాంగణంలోనే చనువుగా మెలుగుతున్నారు. ఓపీ, మందులిచ్చే ప్రాంతంలోనూ క్యూలో నిల్చున్న మహిళను అదేపనిగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో సదరు పురుష సిబ్బంది మరింతగా రెచ్చిపోతున్నారు. తామేమి చేసినా ఎవ్వరూ ఏమీ చేయరనే ధీమాతో బరితెగిస్తున్నారు. రోగుల తాకిడి సర్వజనాస్పత్రిలో ఆరు నెలలుగా రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. అనారోగ్యాలు, ప్రమాదాలు, వివిధ సమస్యలతో ఇక్కడ చేరుతున్న వారితో 24 గంటలూ కిటకిటలాడుతోంది. మహిళా సిబ్బంది కూడా షిఫ్టులవారీగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. రోగులకైనా, మహిళా సిబ్బందికైనా సహాయం చేసే పేరుతో కొందరు పురుష సిబ్బంది చనువు పెంచుకుంటున్నారు. అపవిత్రమవుతున్న వైద్యాలయం ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున 3.29 గంటల సమయంలో ఓ పురుష సిబ్బంది మార్చురీ పక్కన ఉన్న షెడ్డులోకి వెళ్లాడు. 3.30 గంటలకు ఓ మహిళా సిబ్బంది అదే షెడ్డులోకి వెళ్లింది. దాదాపు గంటన్నర సమయం అందులోనే గడపడం దుమారం రేపుతోంది. వీరిని కొందరు సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా ఎటువంటి చర్యలూ లేవు. ఆస్పత్రి యాజమాన్యం బాధ్యులను పిలిపించి హెచ్చరికలు చేసి.. పనితీరు మార్చుకునే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విచారణకు ఆదేశించారు సెక్యూరిటీగార్డుపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఆర్ఎంఓ డాక్టర్ లలితను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టి నివేదికను సూపరింటెండెంట్‌కు అందజేశారు. అయినా సెక్యూరిటీ గార్డును తీసేశామని సెక్యూరిటీ నిర్వాహకులు చెప్పారు. తీసేశారో లేదో తెలియదు. – డాక్టర్ విజయమ్మ,ఇన్చార్జ్ ఆర్ఎంఓ -
గుట్కాకు అడ్డాగా..
గుట్కా అమ్మకాలకే కాదు.. దాని తయారీకి కూడా జిల్లా అడ్డాగా మారుతోంది. జిల్లా కేంద్రమైన కాకినాడతోపాటు.. వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరం నగరాలు ఈ అక్రమ దందాకు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మన జిల్లాతోపాటు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఈ దందాలో ప్రధాన భాగస్వాములుగా నిలుస్తున్నారు. ఈ గుట్టును జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులు శనివారం ఛేదించారు. కాకినాడ రూరల్ : గుట్కా అమ్మకాలతోపాటు దాని తయారీకి కూడా కాకినాడ నగరం నిలయంగా మారుతోంది. తూరంగి పంచాయతీ పరిధి కాకినాడ – యానాం రోడ్డులోని ఓ ప్రైవేటు గోడౌన్‌పై ఇంద్రపాలెం పోలీసులు, ఆహార అధికారులు శనివారం చేసిన దాడి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ దాడుల్లో గుట్కా తయారీకి సిద్ధంగా ఉంచిన రూ.50 లక్షలకు పైగా విలువైన ముడిసరుకు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సీఐ రాజశేఖర్, ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావుల కథనం ప్రకారం.. గోడౌన్లో గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు, దానిని పొడిగా మార్చేందుకు అవసరమైన యంత్రాలు ఉన్నాయి. అక్కడ ముడిసరుకు తయారు చేసి, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజవోలు గ్రామంలోని మరో గుట్కా తయారీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. రాజవోలు గుట్కా కేంద్రానికి సంబంధించి తొమ్మిది మంది అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని, వారి ద్వారా వచ్చిన సమాచారంపై తూరంగిలోని గోడౌన్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎవ్వరూ పట్టుబడలేదని, ముందుగానే సమాచారం తెలుసుకొని పరారైనట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తోందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని రాజశేఖర్, రామారావు చెప్పారు. ఈ దాడిలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.పాండురంగారావు, ఇంద్రపాలెం ఏఎస్సై మురళీకృష్ణ, కానిస్టేబుళ్లు రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
హరిత హోటల్‌పై విజిలెన్స్ దాడులు
ధర్మపురి : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల్లో ఏర్పాటు చేసిన హరిత హోటళ్లు అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ధర్మపురి క్షేత్రంలోని హరిత హోటల్‌పై శనివారం విజిలెన్స్ అధికారులు దాడిచేయగా పలు విషయాలు వెలుగుచూశారు. స్థానికులు, అధికారుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని గోదావరి ఒడ్డున వీఐపీల విడిది కోసం హరిత హోటల్ ఏర్పా టు చేశారు. ఇందులో మధ్యం, మాం సం ఉండదు. నిత్యం ధర్మపురికి వచ్చే భక్తులకు ఈ భవనం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొంత కాలంగా హోటల్లో మేనేజర్ ఇష్టానుసారంగా మెనూ తయారు చేయిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో హోటల్‌పై దాడిచేశారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో గదుల్లో కనీస శుభ్రత కూడా కనిపించలేదు. గదుల్లో పేక ముక్కలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌కు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. క్యాష్బుక్ కనిపించకపోవడంతో హోటర్ మేనేజర్ బాలకృష్ణను పోలీసులు విజిలెన్స్ అధికారులు ప్ర«శ్నించగా నీళ్లు నమిలాడు. క్యాష్బుక్ పోయిందని బుకాయించాడు. ప్రతిరోజూ హోటల్లో ఎంత మంది ఉంటున్నారు, ఎన్ని గదులు అద్దెకిస్తున్నారు.. జమ, ఖర్చుల వివరాలేవని ప్రశ్నించారు. మేనేజర్, సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. కాగా, విజిలెన్స్ దాడుల అనంతరం మేనేజర్ బాలకృష్ణ హోటల్ క్యాష్బుక్ పోయిందని ధర్మపులి ఠాణాలో సాయంత్రం ఫిర్యాదు చేశారు. హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు, క్యాష్బుక్ మాయంపై విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
రాత్రయితే చాలు స్టేషన్లలో గాజుల మోతలు..
దందాలు... ఇసుకదోపిడీలు... సెటిల్ మెంట్లు... ఇవీ ఇప్పటివరకూ చాలా వరకూ జిల్లాలోని పోలీసులపై ఉన్నఅపవాదు. కానీ రాత్రయితే చాలు స్టేషన్లలో గ్లాసుల గలగలలు... గాజుల మోతలు వినిపిస్తాయని తాజాగారుజువైంది. పోలీస్ శాఖలో ఉన్నకొద్దిమంది బాధ్యతారాహిత్యం ఏకంగాఆ శాఖకే మచ్చతెస్తోంది. క్రమశిక్షణకొరవడి... విచక్షణ కోల్పోయి...అవకాశంగా వచ్చిన ఉద్యోగానికే ఎసరుపెట్టుకుంటున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎవరైనా తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. తప్పుడు పనులు చేసి సర్వీసు కే మచ్చతెచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్లోనే మందు కొట్టి చిందులేస్తున్నారు. దత్తిరాజేరు మండలం, పెదమానా పురం పోలీస్ స్టేషన్లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసుల పరువు మరో సారి రోడ్డున పడింది. గాడి తప్పిన ఏడుగురిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. చాలాచోట్ల పగలంతా సెటిల్మెంట్లు, మామూళ్లు అంటూ బిజీగా గడిపి, చీకటి పడగానే పోలీస్ స్టేషన్లనే బార్లుగా మార్చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్రియురాళ్లను తీసుకువచ్చి తమ సీటులోనే కూర్చోబెట్టుకుంటున్నారు. అసలేం జరిగింది ఈ నెల 9వ తేదీ రాత్రి పెదమానాపురం ఎస్ఐ నాయుడు విధులు ముగించుకుని రాత్రి డ్యూటీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి ఇంటికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లగానే స్టేషన్లో ఉన్న ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోమ్‌గార్డులు కలిసి ఆ రాత్రి మద్యం తెచ్చుకుని పీకలదాకా తాగి, కడుపునిండా బిర్యానీ తిని అక్కడే ఒళ్లు మరిచి చిందులేశారు. ఇదంతా గమనించిన అజ్ఞాతవ్యక్తులు వారి నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పోలీసుల బాగోతం అక్కడా ఇక్కడా చక్కర్లు కొట్టి జిల్లా ఎస్పీ జి.పాలరాజు దృష్టికి వెళ్లింది. వెంటనే స్టేషన్లో జరిగిన దానిపై వాస్తవాలను తెలుసుకోవాలని విచారణ నిమిత్తం ఒక అధికారిని పంపించారు. ఆయన వెళ్లి వీడియో చూసిందంతా నిజమేనని తేల్చి నివేదిక ఇచ్చారు. వెంటనే ఆ ఏడుగుర్నీ ఏఆర్‌కి అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా వారిలో ఇద్దరు హోమ్‌గార్డులను సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇలాంటోళ్లు ఇంకా ఉన్నారు జిల్లాలో పోలీసులు సేవలు, సందేశాలు అంటూ ఓ వైపు ప్రచారంలో నిలుస్తూనే తెరవెనుక వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఎస్‌కోట పరిధిలో ఓ కుర్ర ఎస్ఐ అయితే ఏకంగా తన ప్రియురాలిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని తన సీటులోనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నారనే ఆపోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అతని వద్ద ప్రస్తావిస్తే నా లవర్ని నా సీటులో కూర్చోబెట్టుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విజయనగరం పట్టణంలో అయితే ఓ అధికారి సిబ్బందికి నెల నెలా ఎంతివ్వాలో ఫిక్స్ చేసి మరీ వసూలు చేసుకుంటున్నారని డిపార్ట్మెంట్ కోడై కూస్తోంది. ఇటీవల అతని ఇంట్లో ఓ శుభకార్యం జరిగితే బలవంతంగా భారీ మొత్తంలో కానుకలు దండేశారంట. ఆరుగంటలకే మొదలు పోలీస్ స్టేషన్లలో మద్యం సేవించడం సర్వసాధారణమని ఓ పోలీస్ అంటున్నారు. పేరు బయటపెట్టేందుకు ఇష్టపడని ఆయన ‘రాత్రి వరకూ అవసరం లేదు, సాయంత్రం ఆరుదాటాకే మా వాళ్లు స్టేషన్లో మందు తాగడం మొదలెట్టేస్తారు. ముద్దాయిలు ఉంటే ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది మెన్ ఉంటారు. వారు రాత్రి గడవడానికి ముద్దాయి డబ్బులతోనే మద్యం, విందు చేసుకుంటుంటారు. ఆదివారం అయితే చెప్పక్కర్లేదు. ఆ రోజు పండగే. ముఖ్యంగా ఏఆర్ గార్డులుగా పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది ఇలా చేస్తుంటారు. వారితో పాటు కానిస్టేబుళ్లు జతకలుస్తుంటారు.’ అని చెప్పుకొచ్చారు. తప్పు ఎవరు చేసినా తప్పే పెదమానాపురం వ్యవహారం మా దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టాం. నిజమని తేలడంతో శాఖాపరంగా చర్యలు చేపట్టాం. ఇద్దరు హోమ్‌గార్డులను సర్వీస్ రిమూవ్ చేశాం. ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హెచ్సీలపై సస్పెన్షన్ వేటు వేశాం. ఎక్కడైనా ఎటువంటివి జరుగుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. పోలీస్ సిబ్బంది ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తే సహించేది లేదు. – జి.పాలరాజు, జిల్లా ఎస్పీ, విజయనగరం. -
అక్రమంగా కందుల అమ్మకాలు
జడ్చర్ల : రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వ మద్దతు ధరకు సంబంధిత ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఓ కమీషన్ ఏజెంట్‌ను మార్కెట్ యార్డు చైర్పర్సన్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం జడ్చర్ల మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది. చైర్పర్సన్ శోభ కథనం ప్రకారం.. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం హాకా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్వింటాల్‌కు ప్రభుత్వం మద్దతు ధరను రూ.5,450గా నిర్ణయించింది. అయితే బయట మార్కెట్లో రైతులకు ఆ ధరలు దక్కడం లేదు. క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ధరలు దక్కుతున్నాయి. అయితే కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తదితర చిల్లర వ్యాపారులు సైతం రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కందులను తిరిగి వారి పేరున హాకా కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డు చైర్పర్సన్ శోభ, పాలక మండల సభ్యులు సదరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి కందుల కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా సహకరించాలని, మధ్య దళారీల ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. రైతు పేరున విక్రయం.. ఈ నేపథ్యంలో విక్రయాలపై దృష్టిసారించి నిత్యం పర్యవేక్షణ పెంచగా శుక్రవారం ఉదయం మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ద్వారా బాదేపల్లి యార్డు కమీషన్ ఏజెంట్ వాసవీ ట్రేడర్స్ సతీష్ 17 బస్తాల కందులను హాకా కేంద్రంలో విక్రయించేందుకు ప్రయత్నించగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. సదరు రైతు ఆంజనేయులుకు సంబంధించిన ఫోన్‌ను కూడా స్వాధీనపరుచుకుని అందులో కాల్‌డేటాను పరిశీలించగా రైతు, కమీషన్ ఏజెంట్ మాట్లాడుకున్న సమాచారం ఉందన్నారు. అంతేకాక బైరంపల్లి గ్రామ పరిధిలో ఆంజనేయులు సాగు చేసిన కందిపంటకు వచ్చిన దిగుబడికి ఎక్కడా పొంతన లేదన్నారు. దీంతో కమీషన్ ఏజెంట్ సతీష్ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను మద్దతు ధరకు హాకా కేంద్రంలో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు రుజువయ్యిందన్నారు. వెంటనే ధాన్యాన్ని స్వాధీనపరుచుకుని తహసీల్దార్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక కమీషన్ ఏజెంట్ లైసెన్ రద్దుపరిచి చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ శ్రీశైలం, డైరెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మొగులయ్య, యార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అధునాతన వైపు ఆబ్కారీ..
ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తోంది. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, అనుమతులు తదితర వాటిని పొందుపరుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా తెచ్చిపెడుతున్న ఎక్సైజ్ శాఖలోనూ ప్రజలకు చేరువయ్యేలా ‘ఆన్లైన్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పోలీసుశాఖను ఆధునిక సాంకేతిక వైపు తీసుకెళ్తున్న ప్రభుత్వం తాజాగా అదే దారిలో ఆబ్కారీ శాఖను తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులకు ల్యాప్‌ట్యాబ్‌లు అం దజేసింది. ఈ ట్యాబ్‌ల ద్వారా సాంకేతికతను ఉపయోగించుకొని అధునాతన సేవలు అందించనున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతా ల్లో గుడుంబా నివారణలో భాగంగా గుడుంబా తయారీదారులకు పునరావాస పథకం కింద ఆర్థికసాయం అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఎక్సైజ్‌శాఖ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ట్యాబ్‌లను అందజేసింది. సర్కిల్ ఇన్స్పెక్టర్స్థాయి నుంచి కమిషనర్ స్థాయి వరకు ట్యాబ్‌లు అందించిన ప్రభుత్వం నిత్యం వారి విధులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో అనుసంధానించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా పరిధిలో.. ఎక్సైజ్‌శాఖ పరిధిలో జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లతో పాటు ఒక సూపరింటెండెంట్, ఆరుగురు ఎస్సైలు ఉన్నారు. సూపరింటెండెంట్, సీఐలకు ప్రభుత్వం ఇప్పటికే ట్యాబ్‌లు కేటాయించగా త్వరలో ఎస్సైలకు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కల్తీ కల్లు నుంచి గుడుంబా విక్రయాల వరకు అక్రమ మద్యం రవాణా చేసే వారి సమాచారం వరకు ఎప్పటికప్పుడు ట్యాబ్ ద్వారా వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో ఉన్నత అధికారులకు నివేదికలు పంపించే విధానం అమలులోకి వచ్చింది. నిత్యం తమ విధుల్లో భాగంగా తనిఖీలు, స్వాధీనం చేసుకునే గుడుంబా, దేశీదారు, బెల్లం, కేసులు, మద్యం దుకాణాల్లో జరిగే కల్తీదందా, అధిక ధరలకు విక్రయించే వారిపై తీసుకునే చర్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ట్యాబ్‌లు వెంట తీసుకొని వెళ్లి ప్రత్యక్షంగా అక్కడ ఉన్న పరిస్థితులను చూపించే అవకాశాలు ఉన్నాయి. అక్రమ దందాలకు చెక్.. మద్యం దుకాణాల్లో జరిగే అక్రమ దందాలకు సంబంధించి వెంటనే అడ్డుకట్ట వేసేందుకు ట్యాబ్‌లను వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎక్సైజ్ యాప్‌ను రూపొందించారు. వినియోగదారులు ఎవరైనా మద్యం దుకాణాల్లో జరిగే కల్తీ, అధికధరల విక్రయాలు, నాన్ డ్యూటీ మద్యానికి సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే యాప్ ద్వారా ఆయా దృశ్యాలను చిత్రీకరించి అప్లోడ్ చేయడం ద్వారా వెంటనే దానిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే సంబంధిత ఎౖMð్సజ్ శాఖ పరిధిలోని అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయవచ్చు. ఇలాంటి అవకాశాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకొని అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్లో అనుమతులు.. జిల్లాలో ఎవరైనా ఈవెంట్ అనుమతి కోసం ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. tsexise.cgg.gov వెబ్‌సైట్‌ను రూపొందించింది. వెబ్సైట్లో ఈవెంట్‌కు సంబంధించిన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును వెంటనే సంబంధిత ప్రాంత అధికారులతో వివరాలు తెలుసుకొని అక్కడున్న పరిస్థితులను బట్టి ఆన్లైన్లోనే అనుమతి మంజూరు చేస్తారు. శుభకార్యం నేపథ్యంలో మద్యం ఏర్పాట్లు చేసుకునే వారు ఎక్సైజ్‌శాఖ అనుమతి తీసుకోవాలి. ఇలాంటి అనుమతుల కోసం గతంలో ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ సేవలు.. ఎక్సైజ్‌శాఖ అన్ని సేవలను ఆన్లైన్లోనే పొందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అధికారులకు ట్యాబ్‌లు అందించారు. వీటి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చడంతో పాటు అధికారులకు వెంటనే సమాచారం అందించవచ్చు. ఈవెంట్ అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం అమలులోకి వచ్చింది. -
కిలోకు 600 గ్రాములే!
సాక్షి, హైదరాబాద్: తూనికలు, కొలతల శాఖ కొరడా ఝళిపిస్తోంది. నగర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వరుస దాడులతో అక్రమ తూకాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ‘సాక్షి’ ప్రధాన సంచికలో మూడు రోజుల క్రితం ‘తూచేస్తున్నారా.. దోచేస్తున్నారా..?’ అనే పతాక శీర్షికతో ప్రచురితమైన కథనానికి తూనికలు, కొలతల శాఖ తీవ్రంగా స్పందించింది. ఆ శాఖ రాష్ట్ర కంట్రోలర్ సీవీ ఆనంద్ తూకాల మోసాలపై తనిఖీల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. మొదటిరోజు కూరగాయల మార్కెట్లపై దాడులు నిర్వహించగా, రెండో రోజు చేపలు, మాంసం మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమ తూకాల వ్యాపారులపై సుమారు 62 కేసులు నమోదు చేశారు. చేపల మార్కెట్లో కిలోకు 600 గ్రాములు నగరంలోని రామ్‌నగర్ చేపల మార్కెట్లో హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్ విమల్ బాబు నేతృత్వంలో అధికారుల బృందం ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించి తూకాలు తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక చేపల షాపులో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌ను పరిశీలించగా అందులో సెట్టింగ్ (చేతివాటం) బయటపడింది. కిలోకు 400 గ్రాములు తక్కువగా తూకం వస్తున్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు ఆ షాపు యాజమానిపై కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశ పెట్టేందుకు పోలీసులకు అప్పగించారు. మరో ఐదు షాపుల తూకాలను తనిఖీ చేయగా కిలోకు 200 గ్రాములు తక్కువ వస్తున్నట్లు వెల్లడవడంతో కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. స్టాంపింగ్ లేకుండా తూకాలు జియాగూడ హోల్‌సేల్ మాంసం మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ స్టాంపింగ్ లేని ఎలక్ట్రానిక్ కాంటాలు బయటపడ్డాయి. హైదరాబాద్ సిటీ తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్జీ భాస్కర్ రెడ్డి నేతృత్యంలోని బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సుమారు 23 మంది వ్యాపారులు తమ ఎలక్ట్రానిక్ కాంటాలకు శాఖాపరమైన ఆమోదముద్ర వేయకుండానే వినియోగిస్తున్నట్లు బయటపడింది. దీంతో వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక బృందాలు నగరంలోని గుడిమల్కాపూర్, బోయినపల్లి, కొత్తపేట, ఎన్టీఆర్ నగర్ మార్కెట్లలో తనిఖీలు చేసి ఎలక్ట్రానిక్ కాంటాలు, తూకాల్లో మోసాలున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా 33 కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు నగరంలోని మార్కెట్లపై తనిఖీల కోసం ముగ్గురు అధికారుల నేతృత్వంలో మూడు బృందాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్ విమల్ బాబు నేతృత్వంలో ఒక బృందం, హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కంట్రోలర్ వి. శ్రీనివాస్ నేతృత్వంలో మరో బృందం, హైదరాబాద్ సిటీ తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్జీ భాస్కర్ రెడ్డి నేతృత్యంలో మూడో బృందం ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి. -
కలకలం రేపుతున్న తహశీల్దార్ ఫోన్ బేరాలు !
-
అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
- ఇన్పుట్ సబ్సిడీ పంపిణీపై జేడీ శ్రీరామ్మూర్తి విచారణ ఓడీ చెరువు: ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని వ్యవసాయశాఖ జిల్లా సహాయ సంచాలకులు (జేడీఏ)శ్రీరామ్మూర్తి వెల్లడించారు. శుక్రవారం ఓడీ చెరువులో పర్యటించిన ఆయన...ఇన్పుట్ సబ్సిడీ జాబితాలో చోటు చేసుకున్న డమ్మీ ఖాతాలకు సంబంధించి విచారణ చేపట్టారు. చాలా ఖాతాలకు డమ్మీ ఖాతా నంబర్ నమోదు చేసి ఉండడంపై ఏడీఏ రాంసురేష్‌పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇనగలూరు, కొండకమర్ల, మామిళ్లకుంట్లపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు పరిహారం జాబితాలో జరిగిన తప్పులు, బినామీ ఖాతాల గురించి జేడీఏ దృష్టికి తెచ్చారు. బ్యాంకు ఖాతాల్లో జమ అయిన పరిహారం కూడా రైతులకు అందకుండా నిలిపి ఉంచినట్లు రైతులు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన జేడీఏ... ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు. పరిహారం పంపిణీలో జరిగిన తప్పులను ఈనెల 18లోగా సరి చేసి రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటికే రైతు ఖాతాల్లో జమ అయిన మొత్తాలను వెంటనే అందేలా చూడాలని ఏడీఏను ఆదేశించారు. -
కటకటాల్లో 'కలకలం'
► బాస్‌పైనే డీఐజీ రూప సమరశంఖం ► అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజం ► పరప్పన అగ్రహార సెంట్రల్ జైలే వివాద కేంద్రం ► గొడవ ఎక్కడికెళ్తుందోనని ఉత్కంఠ ► సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం సీనియర్ల మాటను జవదాటని పోలీసు శాఖలో ఇది సంచలనమే. ఒక సీనియర్‌ను మరో జూనియర్ ఐపీఎస్ సవాల్ చేశారు. ఏకంగా అవినీతి ఆరోపణలనే సంధించారు. జైళ్లశాఖ డీఐజీ రూప మౌద్గిల్... ఆ శాఖ చీఫ్ సత్యనారాయణపై ముడుపుల ఆరోపణలతో నివేదికను సర్కారుకు పంపడం కలకలం రేపుతోంది. పరప్పన జైల్లో చిన్నమ్మ శశికళకు ప్రత్యేక వసతుల కోసం రూ.2 కోట్లు చేతులు మారాయని రూప స్పష్టంచేయడం వ్యవహారం తీవ్రతను చాటుతోంది. సాక్షి, బెంగళూరు: జైలంటే ‘తప్పుచేసిన వారిని సన్మార్గంలో నడిపించే పరివర్తన కేంద్రం’, కానీ ఈ స్ఫూర్తి కాగితాలకే పరిమితమన్నది మరోసారి స్పష్టమైంది. అక్కడ గంజాయి మొదలుకొని మద్యపానం, సెల్ఫోన్లు వాడటం, దాడులు,దౌర్జన్యాలు వంటివి సాధారణంగా మారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఆరోపణలు పై స్థాయిలోని అధికారిపై రావడం మాత్రం సంచలనం రేపుతోంది. ఇందులో అనేక పెద్ద తలకాయలు ఉండడంతో విషయం ఎక్కడికి వెళ్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు లోపల అనేక అక్రమాలు జరుగుతున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ రూప మౌద్గిల్ ఆ శాఖ డీజీపీ సత్యనారాయణరావ్, ప్రభుత్వానికి నివేదిక పంపడం కలకలం రేపుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు ప్రత్యేకవసతులు కల్పించడానికి ఆ ఉన్నతాధికారి రూ.2కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆమె నివేదికలో లిఖితపూర్వకంగా ఆరోపించడం గమనార్హం. వైద్య సిబ్బందిపై ఖైదీల దాడులతోనే రట్టు! పరప్పన అగ్రహార కేంద్ర కారాగృహంలో జరుగుతున్న అక్రమాలు బయటికి రావడానికి ప్రధాన కారణం అక్కడి వైద్య సిబ్బంది పై ఖైదీలు దాడికి పాల్పడం అని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల కొందరు ఖైదీలు వైద్య సిబ్బంది తమ మాట వినలేదని కొట్టారు. దీనిని జైలు వార్డర్లు చూసినా పట్టించుకోలేదు. ఫిర్యాదులు చేస్తే ఉన్నతాధికారులకు ఇబ్బందులకు గురవుతారని వైద్యులను బుజ్జగించారు. దీంతో వైద్యులను ఖైదీలు హేళన చేయడం మొదలైంది. ఈ నేపథ్యంలో వైద్యులు తమ గోడును డీఐజీ రూపాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పరప్పనఅగ్రహార జైలు ఉన్నతాధికారులకు డీఐజీ రూప ఆదేశించారు. అయితే సమాధానం రాకపోవడంతో ఆమే స్వయంగా ఈ నెల 10న తనిఖీకి వెళ్లడం వ్యవహారాన్ని మలుపు తిప్పింది. జైల్లోని సంగతులపై తాజా నివేదికను రూపొందించారు. ఇది కూడా కారణమా? రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు, అలాగే జూనియర్ ఐఏఎస్‌లు– ఐపీఎస్‌లకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ ఐజీపీగా సత్యనారాయణ ఆ శాఖలో తాను ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలను, పథకాలను డీఐజీ రూప తనవేనని ప్రచారం చేసుకుంటున్నారని భావిస్తున్నారు. ఈ క్రమంలో పై నుంచి ఆమెకు రెండు మెమోలు కూడా వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డీఐజీ రూప పరప్పన జైల్‌పై వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్రమాలపై గళమెత్తారని ఆ శాఖ వర్గాల కథనం. పనిచేస్తే.. మెమో ఇస్తారా? – జైళ్ల డీఐజీ రూప నివేదికలో డీఐజీ రూప కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘జైళ్ల శాఖ డీఐజీగా నేను జూన్ 23న బాధ్యతలు స్వీకరించాను. విధుల్లో భాగంగా ఈనెల 10న నేను పరప్పన జైలుకు వెళ్లాను. ఆ తరువాతి రోజే మీ (సత్యనారాయణ) కార్యాలయం నుంచి నాకు మెమో వచ్చింది. అందులో ‘మిమ్ములను పరప్పన అగ్రహార జైలుకు ఎవరు వెళ్లమన్నారు’ అని ప్రశ్నించారు. నా అధికార పరిధి ప్రకారం జైళ్లకు వెళ్లి తనిఖీ చేయడం, తప్పు చేసినసిబ్బంది నుంచి వివరణ కోరడం కూడా నా విధి. నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే మీరు మెమో జారీ చేయడం అత్యంత శోచనీయం’ అని ఘాటుగా పేర్కొన్నారు. డీఐజీ రూప వైఖరి సరికాదు రాయచూరు రూరల్ : బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ, స్టాంపుల కేసు దోషి తెల్గీ నుంచి జైళ్ల శాఖ ఐజీపీ సత్యనారాయణరావు ముడుపులు తీసుకుని రాచమర్యాదలు చేస్తున్నారని ఆ శాఖ డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన గురువారం రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా తొండిహాళ్లోని హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు. డీజీపీ సత్యనారాయణ జైళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని డీఐజీ రూప మీడియా ముందు బహిరంగంగా చెప్పడం తగదని సూచించారు. ఈ విషయంపై హోం శాఖ కార్యదర్శితో చర్చించి పరప్పనజైలు వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మళ్లీ కరువు ఛాయలు రాష్ట్రంలో కాంగెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.40 వేల కోట్లను నీటిపారుదల రంగానికి కేటాయించామన్నారు. గత బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.18 వేల కోట్లను మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని జాతీయబ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను రద్దు చేసేలా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, విధాన పరిషత్ ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్లు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి ఒత్తిడి చేయాలన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తరపున ముందు జాగ్రత్త చర్యగా మేఘ మథనం చేపడతామన్నారు. బీజేపీ నాయకులు 2018 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కంటున్న కలలు కల్లలు కాక తప్పదన్నారు. -
న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే..
► తెరవెనుక పోలీసుల సెటిల్మెంట్లు? ► న్యాయంకోసం స్టేషన్‌కొస్తే ‘పంచాయితీ’ సలహాలు ► రౌడీషీటర్లతో పంచాయితీలు ► నేరుగా ఓ సీఐకి బాధితుడి ఫిర్యాదు ► వివాదాస్పద ఇంటిని పరిశీలించిన ఎస్పీ ► ఎస్సైపై వేటేస్తా: ఎస్పీ అనంతశర్మ ► నలుగురు రౌడీషీటర్లపై పీడీయాక్ట్ సాక్షి, జగిత్యాల/జగిత్యాలటౌన్: ఇప్పటికే.. అవినీతి అపవాదులు ఎదుర్కొంటున్న ఖాకీలు తీరు మార్చుకోవడం లేదు. అవినీతి ఫిర్యాదులు నిరూపణ అయి ఇప్పటికే పలువురిపై వేటుపడినా అదే దారిన పయనిస్తున్నారు. అవకాశం వస్తే చాలు.. డబ్బులు వసూళ్లకు తెగబడుతున్న పోలీసులు తాజాగా సెటిల్మెంట్లపై దృష్టిసారించారు. ఒకవేళ సివిల్ కేసులు ఠాణాకు వస్తే.. కోర్టుకెళ్లమని సలహాలివ్వాల్సింది పోయి.. బయటే పంచాయితీలు పెట్టుకొమ్మని ఉచిత సలహా ఇస్తున్నారు. ముందే ఓ ఒప్పందానికి వచ్చి తమకు మచ్చిక చేసుకున్న వారికి అనుకూలంగా రౌడీషీటర్లనూ పంచాయితీల్లో ఉంచుతున్నారు. ఇది నమ్మశక్యం కాకున్నా.. జిల్లాలో పలుచోట్ల వాస్తవ పరిస్థితి మాత్రం ఇలానే ఉంది. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారిని పోలీసులే బయట పంచాయతీల్లో సమస్యను పరిష్కరించుకోవాలని తనకు రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని స్వయంగా జిల్లా ఎస్పీ అనంతశర్మ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లా నడిబొడ్డున ఇదీ పరిస్థితి.. ఎనిమిదేళ్ల క్రితం... బుగ్గారం మండలం నేరెళ్లకు చెందిన రాజాగౌడ్ జిల్లా కేంద్రంలోని జమ్మిగద్దె ప్రాంతానికి చెందిన బైరి సత్తయ్యగౌడ్‌కు రెండు విడతలుగా రూ. 20లక్షలు ఇచ్చాడు. తీసుకున్న ఈ అప్పును తీర్చలేని సత్తయ్య రాజాగౌడ్‌కు తన ఇంటిని అమ్మేశాడు. నాలుగేళ్లు అదే ఇంటిలో ఉన్న సత్తయ్య కుటుంబ సభ్యులు తర్వాత ఇళ్లు విడిచివెళ్లిపోయారు. ఆ సమయంలో రాజాగౌడ్ ఇళ్లు అమ్ముకుందామనుకోగా.. జాయింట్ ప్రాపర్టీ కారణంగా అమ్మలేకపోయాడు. దీంతో రాజాగౌడ్ పోలీసులను ఆశ్రయించి.. తనకు ఇచ్చిన దానిపై వడ్డీతో సహా అందేలా న్యాయం చేయాలని కోరాడు. అదే సమయంలో సత్తయ్య భార్య రాజేశ్వరీ సైతం భర్త రాజాగౌడ్‌కు అసలు ఇళ్లే అమ్మలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు పోలీసు అధికారి ఇరువురిని పిలిచి బయట పంచాయతీ పెట్టుకొమ్మని సలహా ఇచ్చారు. గత నెల 24న.. ఇరు వర్గాలు పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కూర్చొని మాట్లాడుకుందామనుకోగా.. అందులో రాజేశ్వరీ తరుపు నుంచి వచ్చిన నలుగురు రౌడీషీటర్లు రూ. 13 లక్షలు తీసుకుని వెళ్లిపోవాలని లేకపోతే అంతుచూస్తామని రాజాగౌడ్‌ను హెచ్చరించాడు. ఇదే క్రమంలో ఈ నెల 7న.. ఇంటి తాళాన్ని పగలగొట్టిన రాజేశ్వరీ అందులో ఉంటుంది. దీంతో రాజాగౌడ్ పై స్థాయి అధికారులను ఆశ్రయించాడు. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీ అనంతశర్మ వివాదానికి కారణమైన ఆ ఇంటిని శుక్రవారం పరిశీలించారు. సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ ఈ వ్యవహారంలో ఓ ఎస్సై ప్రమేయముందనీ నిగ్గు తేల్చారు. త్వరలోనే సదరు ఎస్సైపై వేటు వేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్‌తో మాట్లా డి.. అనుమతి లేకుండా.. ఇంటి తాళాన్ని పగలగొట్టేలా రాజేశ్వరీని ప్రరేపించిన నలుగురు రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని విలేకరులతో చెప్పారు. చెలరేగుతున్న రౌడీషీటర్లు.. నాలుగు నెలల క్రితం రౌడీషీటర్లతో సమావేశమైన ఎస్పీ అనంతశర్మ సెటిల్మెంట్లు చేసినా.. భూ తగాదాల్లో తలదూర్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో నాలుగు మాసాల నుంచి జిల్లాలో స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు మళ్లీ పెట్రేగిపోతున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో పలు చోట్ల మళ్లీ సెటిల్మెంట్లకు దిగుతున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో నలుగురు ఓ సెటిల్మెంట్లో పాల్గొనగా... ఇబ్రహీంపట్నంలోనూ ఓ రౌడీషీటర్‌పై తనకు ఫిర్యాదు అందిందని జిల్లా ఎస్పీ తెలిపారు. సెటిల్మెంట్లు, కబ్జాలకు పాల్పడే రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అనంతశర్మ హెచ్చరించారు. -
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అక్రమాలు
కదిరి టౌన్ : కదిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు ఏకంగా 15 మంది నకిలీ అభ్యర్థులు పట్టుబడటం సంచలనం సృష్టించింది. వారిని పోలీసులకు అప్పగించారు. పరీక్ష కేంద్రంలో 10 మంది నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ స్వరూప కనుగొన్నారు. మరో సెంటర్లో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ రాజేంద్ర ఐదు మంది నకిలీ అభ్యర్థులను పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొన్నారు. మాల్ ప్రాక్టిస్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామన్నారు. ఆర్డీఓ తనిఖీలో మరో ముగ్గురు బుక్ కదిరి ఆర్డీఓ వెంకటేశు పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించగా మరో ముగ్గురు అభ్యర్థులు చూచి రాతలు రాస్తూ పట్టుబడ్డారు. దీంతో వారిని బుక్ చేశారు. -
‘రత్నగిరి’ అక్రమాలపై కొరడా
- బ్లాక్ లిస్ట్‌లో ‘ఫోర్డ్’! – స్వచ్ఛంద సంస్థ అక్రమాలకు చెక్ – రావుడి వాటర్‌షెడ్ ప్రాజెక్టు రద్దు – ‘రత్నగిరి’లో రూ.79 లక్షల రికవరీకి నిర్ణయం – కలెక్టర్ కోన శశిధర్ వద్దకు ఫైల్ – ‘అవినీతి’పై వరుస కథనాలిచ్చిన ‘సాక్షి’ అనంతపురం టౌన్ : వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలు పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న వాటర్‌షెడ్ పథకంలో అక్రమాలకు పాల్పడిన ‘ఫోర్డ్’ స్వచ్ఛంద సంస్థపై వేటు పడింది. భారీఎత్తున దోపిడీకి పాల్పడినట్లు రుజువు కావడంతో ఈ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. 2009–10 ఆర్థిక సంవత్సరంలో మొదటి బ్యాచ్ కింద రొళ్ల మండలంలో రత్నగిరి మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని పరిధిలో రత్నగిరి, కాకి, దొడ్డెరి, గుడ్డిగుర్కి పంచాయతీలు (మైక్రో వాటర్షెడ్లు) ఉన్నాయి. వీటిలోని 4,104 హెక్టార్ల విస్తీర్ణంలో జలసంరక్షణ పనులు చేపట్టేందుకు రూ.4కోట్ల 92 లక్షల 98 వేలతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఏడేళ్ల వ్యవధిలో ఈ నాలుగు మైక్రో వాటర్షెడ్ల పరిధిలో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే.. ‘ఫోర్డ్’ సంస్థ భారీఎత్తున అక్రమాలకు పాల్పడింది. అక్రమాలపై కలెక్టర్ కన్నెర్ర రత్నగిరి మెగా వాటర్‌షెడ్ పరిధిలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ కోన శశిధర్ కన్నెర్ర చేశారు. ప్రాజెక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ బదరీశ్, ఏపీఓ లక్ష్మణమూర్తి, వాటర్‌షెడ్ ఇంజినీర్లు, సిబ్బంది బాలాజీ, మహాలింగప్ప, నరసింహమూర్తిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. రూ.79 లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ‘ఫోర్డ్’ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపారు. అక్కడి నుంచి రాగానే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు పంపనున్నారు. రావుడి వాటర్‌షెడ్ ప్రాజెక్టు రద్దు 2014–15 బ్యాచ్ కింద ‘ఫోర్డ్’ సంస్థకు అగళి మండలంలో ‘రావుడి’ వాటర్‌షెడ్ ప్రాజెక్టు మంజూరైంది. 2,550 హెక్టార్ల పరిధిలో రూ.3 కోట్ల 82 లక్షల 50 వేలతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోసం రూ.70 వేలను ఆ సంస్థ ఖర్చు చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టును ఫోర్డ్‌కు కాకుండా మడకశిర డబ్ల్యూసీసీ (వాటర్‌షెడ్ కంప్యూటర్ సెంటర్)కి బదలాయించారు. అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలు రత్నగిరి వాటర్‌షెడ్‌లో జరిగిన దోపిడీ వ్యవహారంపై గత నెల 10న అవి‘నీటి’ ప్రవాహం... 11వ తేదీన గుంతల్లో గూడుపుఠాణీ...12వ తేదీన ‘పైపై పూత.. నిధుల మేత’.. 18వ తేదీన ‘సమయం లేదు తమ్ముడూ.. దొరికినంత దోచుడు!’ శీర్షికలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేపట్టడం, చెక్‌డ్యాంలను మరమ్మతు చేయకుండానే, కొన్నిచోట్ల అసలు నిర్మించకుండానే నిధులు భోంచేయడం తదితర అంశాలను ప్రస్తావించింది. ఈ కథనాలు అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాయి. ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది పరారయ్యారు. దీనిపై ఫిబ్రవరి 13వ తేదీన ‘కనపడుట లేదు’ శీర్షికతో మరో కథనాన్ని ‘సాక్షి’ ఇచ్చింది. నిందితులకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన కీలక నేతల అండ ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాగా.. పనులన్నీ టీడీపీ నాయకులు చేపట్టిన క్రమంలో ‘సాక్షి’ కథనాలు కలకలం సృష్టించడంతో ‘తమ్ముళ్లు’ అప్రమత్తమయ్యారు. పలుచోట్ల రాత్రికి రాత్రే పనులు చేశారు. ఈ వ్యవహారంపై కూడా ఫిబ్రవరి 20వ తేదీన ‘చీకటి పనులు’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ఇచ్చింది. అవినీతిపై ఇంటెలిజెన్స్ ఆరా! వాటర్‌షెడ్ పథకంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు రొళ్ల మండలంలో ఆరా తీసినట్లు సమాచారం. ఏయే పనులు జరిగాయి, ఎవరు చేశారన్న దానిపై కొందరిని కలిసి మాట్లాడినట్లు తెలిసింది. వారం పాటు దీనిపై సమగ్ర పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు సమాచారం. ఇదే సమయంలో అధికారుల పాత్రపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. సామాజిక తనిఖీకి ముందు ఓ ఏపీడీ ‘ఫోర్డ్’ సిబ్బంది నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు, మరో రూ.2 లక్షలకు బేరం కుదరగా కొంత అడ్వాన్స్ తీసుకుని ఆ తర్వాత తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. దీనిపై కూడా ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.