
మిడుతూరు తహశీల్దార్ కార్యాలయంలో రాసలీలలు!
జిల్లాలోని మిడుతూరు తహశీల్దార్ కార్యాలయంలో రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
కర్నూలు: జిల్లాలోని మిడుతూరు తహశీల్దార్ కార్యాలయంలో రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి వేళ జలకనూరు వీఆర్వోతోపాటు ఓ మహిళ కూడా కార్యాలయంలో ఉన్నట్లు వెళ్లడైంది. వారిద్దరూ కార్యాలయంలో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బహిరంగమయ్యాయి.
వీఆర్వో రాసలీలలను సాక్షి టీవీ బయట పెట్టింది. వీఆర్వో చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయాన్ని వీఆర్వో గెస్ట్ హౌస్గా ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ రాసలీలల వార్త సాక్షి టీవీలో ప్రసారమైన తరువాత ఎమ్మార్వో రాములు మాట్లాడుతూ వీఆర్వోపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అతనికి నోటీస్ కూడా జారీ చేసినట్లు తెలిపారు.
**