
గచ్చిబౌలి: విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. మంగళవారం రాత్రి టీఎన్‌జీవోస్ కాలనీలోని ఓ ఇంట్లో గచ్చిబౌలి పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఒక విటుడు, 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. టాంజానియా, కజికిస్తాన్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment