
ప్రతీకాత్మక చిత్రం
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రంలో ఏ జైలులోనైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే అందుకు సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేయాల్సి వస్తుందని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. శనివారం వికాససౌధలో ఇటీవల ఏర్పాటైన కారాగృహ అభివృద్ధి మండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు. జైళ్లు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ కారాగృహంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగళూరు పరప్పన అగ్రహార, బెళగావిలోని హిండలగ, బళ్లారి జైలులో నిరంతరం అక్రమ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జైలులో నిందితులపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పునరావృతం కారాదని, ముందు ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనల్లో 15 మందిని సస్పెండ్ చేసి 30 మందిని బదిలీ చేసినట్లు చెప్పారు. సమావేశంలో డీజీపీ ప్రవీణ్ సూద్, జైళ్ల మండలి కార్యదర్శి అలోక్ మోహన్, హోమ్‌శాఖ కార్యదర్శి రజనీశ్ గోయల్ పాల్గొన్నారు.
ఎస్‌ఐ స్కాంలో ఎవరినీ వదలం
ఎస్‌ఐ ఉద్యోగాల స్కాంపై నిష్పాక్షపాతంగా విచారణ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కూడా బహిరంగం చేస్తానని హోంమంత్రి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా అక్రమాల కేసులో ఏడీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఇందులో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదన్నారు. డబ్బులిచ్చినవారు, తీసుకున్నవారు, మధ్యవర్తులపై కూడ కఠిన చర్యలు తీసుకుంటామని, సీఐడీకి సంపూర్ణ అధికారమిచ్చామని చెప్పారు.
చదవండి: తమిళనాడులో టెన్షన్.. టెన్షన్.. స్కూల్ బస్సులను తగలబెట్టారు: సీఎం వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment