
చెన్నై,టీ.నగర్: నాగర్‌కోవిల్‌లో పని చేస్తున్న మసాజ్ సెంటర్‌కు వీఐపీలు, పోలీసు శాఖలో ఉన్న అధికారులు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. కోట్టార్‌లో పని చేస్తున్న ఒక మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ శ్రీనాథ్‌కు సమాచారం అందింది. ఏఎస్పీ జవహర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ జరిపారు. దీంతో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా మసాజ్ సెంటర్‌లో చొరబడగా ముగ్గురు మహిళలు కనిపించారు. వారి వద్ద విచారణ జరపగా మసాజ్ సెంటర్ పేరుతో యువకులను రప్పించి వ్యభిచారం జరుపుతున్నట్లు తెలిసింది.
దీంతో అక్కడ ఉన్న ముగ్గురు యువతులను, యువకుడిని పట్టుకుని విచాణ జరిపారు. సదరు యువతులు తిరువణ్ణామలై జిల్లా ఆరణి, పాండిచ్చేరి, తిరుపూర్ ప్రాంతానికి చెందిన వారుగా తెలిసింది. పట్టుబడిన యువకుడు కేరళ రాష్ట్రం ఇడిక్కి ప్రాంతానికి చెందిన అలగ్జాండర్ (20)గా గుర్తించారు. ఆన్‌లైన్ ద్వారా ప్రకటనలు చేసి, కస్టమర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఏఎస్పీ జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ మసాజ్ సెంటర్ నాగర్‌కోయిల్ సెంటర్‌లో ఉండడంతో పలు ముఖ్య ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, పోలీసు అధికారులు ఈ మసాజ్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వస్తున్నట్టు తెలిసింది. ఈ మసాజ్ సెంటర్‌లో ప్యాకేజ్ సిస్టమ్‌లో నగదు వసూలు చేస్తున్నారు. పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment