Prostitution houses
-
ఇంట్లో రహస్యంగా వ్యభిచారం.. యువతులను తీసుకొచ్చి..
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. చేపల మార్కెట్ సమీపంలో షేక్ అస్లాం నివాసం ఉంటున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అస్లాం ఇంటిపై దాడి చేయగా ఇద్దరు విటులు, ఒక అమ్మాయిని గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: బరి తెగించిన భార్య.. ‘మా ఆయన్ను లేకుండా చేస్తే మనకు అడ్డుండదు’ -
జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..
ఆటోనగర్(విజయవాడ తూర్పు): విజయవాడ నగరంలోని రామవరప్పాడు ప్రాంతంలో నివాసాల మధ్య వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని సోమవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు పటమట సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు. వేరే ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపినట్టు చెప్పారు. ఐదుగురు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: మాట్లాడుకుందామని భార్యను హోటల్ గదికి పిలిచి.. -
ఇంటినే వ్యభిచార గృహంగా మార్చిన మహిళ.. పదేళ్లుగా అమ్మాయిలతో గుట్టుగా..
శ్రీకాకుళం: పాలకొండ పట్టణం.. గటాలడెప్పి వీధిలోని ఒక ఇంట్లో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. సోమవారం సాయంత్రం ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పక్కాగా దాడిచేసి నలుగురు విటులతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఒక మహిళ తన ఇంటినే వ్యభిచార గృహంగా నడుపుతోంది. గత పదేళ్లుగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తోంది. దీన్ని గమనించిన స్థానికులు అందించిన సమాచారంతో ఇంటిపై దాడి చేయగా నలుగురు యువకులు, ఒక మహిళ పట్టుబడినట్లు ఎస్సై చెప్పారు. యువకులపై కేసు నమోదు చేశామని, సంబంధిత మహిళను ఆసుపత్రికి తరలించామన్నారు. నిర్వహకురాలుని అదులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
Hyderabad: అపార్ట్మెంట్లో వ్యభిచార దందా
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): రాధాస్వామి కాలనీ రాక్‌ప్రైడ్ అపార్ట్మెంట్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు బోయిన్పల్లి పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 201లో దాడి చేసి వ్యభిచార గృహం నిర్వాహకుడు కుత్బాల్లాపూర్‌కు చెందిన ఎండీ అజీజ్, నిజాంపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విటుడు సుబ్రహ్మణ్యంతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4 వేల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అజీజ్‌తో పాటు ప్రదీప్ అనే మరో వ్యక్తి వృభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చదవండి: శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన -
వ్యభిచార దందా.. ఒక మహిళ.. ఇద్దరు యువతులను రప్పించి..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ ఇద్దరు యువతులను తీసుకొని వచ్చి తిమ్మాపూర్ శివారులోని ఇల్లు అద్దెకు తీసుకొని, వ్యభిచారం నిర్వహిస్తోంది. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి, జగిత్యాలకు చెందిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు, నిర్వాహకురాలు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఆయన వెంట జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్టు
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రంపై సనత్‌నగర్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో సహా మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట సమీపంలోని భవానీనగర్‌లో ఆర్ట్ స్పా సెంటర్ పేరిట భీమ్‌సింగ్ అనే వ్యక్తి మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. నిర్వాహకుడు భీమ్‌సింగ్‌తో పాటు అతని ఇద్దరు అనుచరులు, ఓ విటుడు, కోల్‌కత్తాకు చెందిన ఆరుగురు యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను.. -
కూకట్పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు
సాక్షి, కూకట్పల్లి: రెండు వేర్వేరు చోట్ల వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన కేపీహెచ్‌బీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాలు.. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ వద్ద ఎల్ఐజీ గృహంలో వ్యభిచారం నిర్హహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా దాడులు నిర్వహించి పల్లికల శ్రీనివాసరావును మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా అనంతరం యువతిని రెస్క్యూ హోంకు తరలించగా.. శ్రీనివాసరావును రిమాండ్‌కు తరలించారు.. అదే విధంగా కేపీహెచ్‌బీ కాలనీలో రోడ్డు నెంబర్3లో ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం 6..30 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంగులూరి నాగ వెంకటేశ్వరరావుతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిపి వారిపై కేసు నమోదు చేసి నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు. -
భర్త వద్దకు తీసుకెళ్తానని చిత్రహింసలు
గార్ల: మాయమాటలు చెప్పి ఓ వివాహితను హైదరాబాద్ తీసుకెళ్లిన వ్యక్తి.. ఆమెను గదిలో నిర్బంధించి, అత్యాచారం చేయడమే కాకుండా వ్యభిచారం చేయాలని చిత్రహింసలకు గురిచేశాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ బాధిత మహిళను రెండేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉంది. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఎనిమిది నెలల క్రితం సదరు మహిళ తల్లిగారి గ్రామమైన భద్రాచలం సమీపంలోని ఎటపాకకు వెళ్లి ఉంటోంది. ఈ క్రమంలో అంకన్నగూడెంకు చెందిన భూక్యా సర్వేశ్ నెల కింద ఏటపాక వెళ్లి తన భర్త హైదరాబాద్‌లో ఉంటున్నాడని, అతని దగ్గరకు తీసుకెళ్తానని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె సర్వేశ్‌తో రాగా.. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని అద్దె గదిలో బాధితురాలిని, ఆమె కూతురును ఉంచాడు. భర్త విషయం ఎప్పుడు అడిగినా దాటవేయడంపై ఆమె సర్వేశ్‌ను నిలదీయడంతో చిత్రహింసలకు పాల్పడ్డాడు. ఒంటిపై సిగరెట్లతో కాల్చడమే కాకుండా, వ్యభిచారం చేయాలని కొట్టేవాడు. ఆమెతో పాటు కుమార్తె చేతులపై కూడా సిగరెట్లతో కాల్చేవాడు. సర్వేశ్ తన స్నేహితులను గదికి తీసుకొచ్చి ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను లాక్కొని అమ్ముకున్నాడు. ఓ రోజు ఆ ఇంటి యజమాని సాయంతో ఆమె బయటపడి.. అంకన్నగూడెం చేరుకొంది. భర్త, అత్తకు విషయం చెప్పగా.. వారు గార్ల పోలీస్‌స్టేషన్‌లో సర్వేశ్‌పై ఫిర్యాదు చేశారు. చదవండి: కార్పెట్ నచ్చింది.. రూ. 3 వేలు పంపుతున్నా అంటూ -
వేశ్యా వృత్తిని కరోనానే రద్దు చేసింది
అతనేం ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లలేదు.. ఇవ్వమని తనూ అడగలేదు.. నిన్న ఆ కాసేపు సంభాషణ తప్ప తమ ఇద్దరి మధ్యా ఏ స్నేహమూ లేదు. కనీస పరిచయమూ లేదు. మరచివెళ్ళాడో, వదిలి వెళ్ళాడో, సెల్‌ఫోన్ తీస్తుండగా జేబు నుండి జారి పడింది ఈ విజిటింగ్ కార్డ్... కలరు, డిజైను బావున్నాయ్. అతని అభిరుచి ఎంత కళాత్మకమో తెలియజేస్తున్నాయ్.. కార్డ్ మీద ఒకే ఒక్క ఫోన్ నంబరూ ఫ్యాన్సీగా ఉంది... కానీ ఇంతకూ విజిటింగ్ కార్డు, ఈ ఫోన్ నంబరు అతనివే అయ్యుంటాయా? ఈ ప్రశ్న ఉదయం నుండి సాయంత్రం వరకు చాలాసార్లు అనుకుంది రేష్మా... ఇదివరకైతే ఇక్కడికి రోజుకు నలుగురైదుగురైనా వచ్చిపోతుండేవాళ్లు. కొన్ని నెలలుగా ఒక్క మగ పురుగూ రావటం లేదు. కనుక ఈ కార్డ్ అతనిదే అని తనకు తాను నిర్ధారించుకొని స్థిమిత పడింది.. రాత్రి ఏడవుతుండగా ఆ నంబర్‌కు కాల్ చేసి, ఒక రింగ్ కాగానే ఎందుకో భయమనిపించి కట్ చేసింది.. అంతకు ముందే చాలాసార్లు ఆ నంబర్ ఒకో అంకెను తన సెల్లో ప్రెస్ చేస్తూ కాల్ చేసే ధైర్యం రాక వదిలేసింది. ‘రింగ్ అయ్యిందా? హమ్మో ఎవరైనా కాల్ చేసి కోప్పడతారా? ఒకవేళ అతనే అయితే మళ్ళీ అంత మధురంగా మాట్లాడతాడా? తేనె తన పెదాల్లో ఉంటుందా? అతని పదాల్లోనా? మాట్లాడినంత సేపూ తియ్యగా ఉంటుంది’ అనుకుంది. ఒకవేళ అతనే కోపగించుకోబోతుంటే తన గొంతులో మాడ్యులేషన్ పసిగట్టి ముందు తనే... ‘ఎన్నో వివరాలు తీసుకున్నావు, ఏమో రాసుకెళ్ళావు పత్రికలో ఇంకా రాలేదేం?’ అని గట్టిగా అడగాలన్నట్టు రిహార్సల్స్ వేస్తోంది.. ఇన్నిసార్లు చేసినా ఒక్కసారీ కాల్ బ్యాక్ చేయడేం? తను బిజీ పర్సనే. ఆరోజు తను ఇక్కడున్న ఆ కాసేపట్లో ఆ విషయాన్ని గమనించింది. ఒకరింగ్తో రెండు రింగ్స్‌తో కట్ చేస్తూ ఈ అయిదు రోజుల్లో కనీసం ఓ పదిసార్లు చేసుంటుంది తను. ఇన్ని మిస్డ్ కాల్స్ ఎవరివో అనే స్పృహ ఉండదా ఇతనికి అనుకుంది. బహుశా అన్నోన్ నంబర్స్ పట్టించుకోడేమో అని సమాధానం చెప్పుకుంది.. ‘నీకేంటి.. నువు చేసిన తప్పేంటి.. ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి..’ గానగంధర్వుడు ఎస్పీ బాలు గొంతును అనుకరిస్తూ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్కెస్ట్రాలో వినవస్తోందో పాట. సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంగీతాభిమానులు పిలుపునివ్వటంతో ఆరోజు సభలో తామూ స్వర ఆకాంక్ష వ్యక్తం చేయాలని నిర్ణయించింది ఆ పత్రిక యాజమాన్యం. ఇందులో భాగంగా బాలు పాడిన అన్నేసి భాషల్లోని కొన్నేసి పాటలను పాడుతున్నారు గాయనీగాయకులు.. ‘సమస్యను వెలుగులోకి తేవటంతోనే జర్నలిస్ట్ బాధ్యత తీరిపోదు...’ పాటల అనంతరం చైర్మన్ గొంతు మైక్‌లో ధ్వనించే సరికి అక్కడున్న అందరూ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎడిటర్‌తో పాటు ఆ సభలో సెంట్రల్ డెస్క్ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, సిటీ డెస్క్, బ్యూరో, ఇంకొందరు సిబ్బంది కలసి ఓ యాభైమంది లోపుంటారు.. చెన్నై టీనగర్ కార్యాలయం బయట ఎప్పటి నుంచి కురుస్తోందో వర్షం అప్పుడే వినిపిస్తోంది. ఒక ఉదాత్తమైన వ్యక్తిని తన ఉన్నత ప్రసంగానికి ఆహ్వానిస్తూ కరతాళ ధ్వనులా అన్నట్టుంది చినుకుల సింఫనీ.. ‘సమస్య తీరే పరిష్కారాన్నీ చూపాలి. అందుకు ఎవరిని కదిలించాలో ఆ కదలిక తేవాలి. జర్నలిస్ట్‌గా మీరు ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగారో ఆత్మ విమర్శ చేసుకోండి. సమస్యను రాయటం అంటే సమస్యను భుజానికెత్తుకోవటం అని గుర్తించండి. మన వల్ల ఒక్కరి సమస్యా పరిష్కారం కాలేదంటే ఇక పెన్ను మూసుకోవటం ఉత్తమం’ అంటూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేస్తున్నాడు చైర్మన్ రామస్వామి. తమిళంలో అత్యాదరణ గల పత్రిక చైర్మన్ అతను. తన పత్రికలో అత్యుత్తమ కథనాలను ఏటా సెలెక్ట్ కమిటీ ద్వారా ఎంపిక చేసి జర్నలిస్టులను తన పుట్టినరోజు సందర్భంగా అవార్డుతో సత్కరించటం ఆనవాయితీ. చైర్మన్ అవార్డును ఆయన చేతుల మీదుగా తీసుకోవటం ప్రెస్టీజియస్‌గా భావిస్తారు ఆ పత్రిక జర్నలిస్టులు, విప్లవ్ అదే అనుభూతికి గురవుతున్నాడు... అవార్డు అందుకుంటుంటే సహ జర్నలిస్టులు, ఉద్యోగుల చప్పట్లు మార్మోగుతున్నాయ్ కాని, అతనికి మాత్రం చైర్మన్‌గారి ప్రసంగం చెవుల్లో ధ్వనిస్తోంది. డిన్నర్ టైంలో కలసిన తోటి జర్నలిస్ట్ వేలు పిళ్ళై ‘ఇదుగో బాస్ నీ సిమ్’ అని అందిస్తూ.. ‘ఏవో మిస్డ్కాల్స్ ఉన్నాయ్. చెక్ చేస్కో’ అన్నాడు.. ఒక జర్నలిస్ట్ సెలవుపై ఊరెళుతుంటే అతని ఆఫీస్ సిమ్‌కార్డ్‌ను ఇన్చార్జ్కు అప్పగించి వెళ్లటం ఆ పత్రిక రూల్. లాక్డౌన్ వల్ల, ఆఫీస్ పని ఒత్తిడి వల్ల, కరోనా భయం కారణాన గత మార్చి నుంచి సొంతూరికి వెళ్ళటం కుదరలేదు విప్లవ్కు... కోయంబత్తూరు దగ్గర చిన్న పల్లెటూరు అతనిది. తల్లిదండ్రులు ‘పెళ్లి సంబంధం చూశాం రమ్మ’ని డేట్ ఫిక్స్ చేయటంతో వారం క్రితం వెళ్ళి రాత్రే వచ్చాడు.. ఊరెళుతున్నప్పుడు తన సిమ్‌ను అప్పగించాడతను. అవార్డు తీసుకుంటూనే తను తిరిగి డ్యూటీలో జాయినవ్వటంతో అతని సిమ్‌ను అతనికప్పగించాడు ఇన్చార్జ్ వేలు పిళ్ళై. ఇంటికెళ్లి తను పొందిన అవార్డును మళ్లీ మళ్లీ చూసుకొని మురుస్తూ సెల్ఫోన్లో సిమ్ వేసుకున్నాక, కాల్ రిజిస్టర్ చెక్ చేస్తుంటే ఒక నంబర్ నుంచి ఎక్కువ మిస్డ్కాల్స్ ఉండటం గమనించాడు. అదేదో అన్ నోన్ నంబర్.. కానీ ఎవరో? ఎందుకు చేశారో? అనుకొని వెంటనే ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే టైం పది దాటింది. అయినా ఆ విషయం పట్టించుకోలేదు విప్లవ్.. అవతలి సెల్ఫోన్లో వినపడుతోన్న కాలర్ ట్యూన్ అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆ పాట ఎక్కడో విన్నట్టనిపించింది. ఎక్కడ విన్నాడో ఠక్కున గుర్తొచ్చింది. ఆ పాట రుడాలి సినిమాలో భుపేన్ హజారికా పాడింది. కానీ తాను ఈ మధ్య విన్నది మాత్రం రెద్ లైట్ ఏరియాలోని ఆమె గదికి వెళ్ళినపుడు.. ఆరోజు తను వెయిట్ చేస్తున్న గదిలోకి జాజిపూల పరిమళమై ఆమె లోగొంతుతో పాడుకుంటూ వస్తున్నప్పుడు.. ఇంటర్వ్యూ మధ్యలో ఆమె సెల్‌ఫోన్ రింగ్‌టోనై మోగినపుడు... తనకేదో ఫోనొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె అటు తిరిగి అదే పాట హమ్ చేస్తున్నప్పుడు.. ఇంటర్వ్యూ చేసొచ్చి మరిచేపోయాను.. ఆ ఇంటర్వ్యూ తాలూకు కథనం వల్లే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చైర్మన్ అవార్డ్ దక్కింది తనకు. తన ఆర్టికల్ చూసుకుందో? లేదో? పబ్లిష్ అయ్యాక చెబుదామనుకొని ఏదో పనుల్లో మరచిపోయాను. ఇపుడు ‘ఈ అవార్డు మీ వల్లనే’ అని థాంక్స్ చెప్పాలి.. లోకల్ అయితే ఏ స్వీట్ ప్యాకెట్టో పట్టుకొని వెళ్లి కృతజ్ఞత చెబుదును. తనుండేది ముంబైలో, నేనేమో చెన్నైలో ఎలా కుదురుతుంది? అనుకున్నాడు... ఫోన్లో పాట అయిపోయి అప్పటికి రెండోసారి.. ‘ఎందుకో ఫోన్ తీయటం లేదు’ అనుకుంటూ మరోసారి రీ డయల్ చేశాడు. ‘అవునూ ఇంతకు ఈ నంబర్ తనదేనా.. లేకపోతే ఈ టైంలో చేసినందుకు ఎవరితోనైనా తిట్లు తినాల్సి వస్తుందా .. అయినా నా నంబర్ ఆమెకు ఇవ్వలేదు కదా ఎలా తెలుస్తుంది? తను నాకెందుకు చేస్తుంది?’ అనుకుంటూ కాల్ కట్ చేశాడు పాట పూర్తిగా వినకుండానే.. పది నిమిషాల తరువాత ఫోన్ వస్తున్నట్టు రింగ్‌టోన్ మోగింది.. చూస్తే తను ఇప్పటివరకూ డయల్ చేసిన నంబర్ అది.. కాల్ చేస్తోంది తనే అనుకుంటూ, ఒకవేళ ఆమె కాదేమో అనే భయంతో లిఫ్ట్ చేయగానే.. ‘హాయ్...హల్లో’ అంటూ కోకిలగొంతు.. ఆ గొంతు ఆమెదే.. కానీ ఎందుకో ఆ గొంతులో అలసట ధ్వనిస్తోంది.. ‘హలో’ అని అతననగానే ‘హే.. ఏమైపోయారు? హబ్బ ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అంత బిజీనా?’ కొంచెం ఆయాసపడుతూ ఆమె అంటుండగా... ‘ఆ.. బిజీ ఎవరో తెలుస్తోందిగా, ఇప్పుడు నేనూ మూడుసార్లు చేశాను’ అని అతనన్నాడు.. ‘ఓహ్..సారీ క..క..కస్టమర్ ఉన్నాడు మీద.. అప్పటికీ ఫోన్ రింగవుతుంటే చూశా. మీ నంబర్.. బట్ అతనేమో మంచి మూడ్‌లో ఉన్నాడు. అప్పుడే క్లైమాక్స్ కొచ్చేస్తున్నాడు. అతని మూడ్ డిస్టర్బ్ చేయటం నాకిష్టముండదు. ఒక రిలాక్సేషన్ కోసం హ్యాపీనెస్ కోసం, ఇంట్లో దొరకనిదేదో పొందటంకోసం మా దగ్గరికొస్తారు.. వాళ్ళను శాటిస్ఫై చేయటమే నాకిష్టం. నేను కోపరేట్ చేస్తుంటే మురిసిపోతారు. ప్రేమగా మాట్లాడుతారు. లవ్యూ చెపుతారు. ఆ పదం వినగానే మరింత అర్పించేస్తుంటాన్నేను’ అంటూ తను చెపుతుంటే ఎందుకో చలం మైదానం నవలలో రాజేశ్వరి గుర్తొస్తోందతనికి. రాజేశ్వరి వేశ్య కాకపోవచ్చు. కానీ ప్రేమ పిపాసి.. ప్రేమిస్తున్నానగానే కరగిపోతుంది.. ఇదుగో ఈమె కూడా అని అనుకున్నాడు... ‘ఏంటి బిజినెస్ మళ్ళీ స్టార్టయ్యిందా?’ అన్నాడు.. ‘అదేం లేదు. మీరెళ్ళిన రోజు నుండి ఇదుగో ఈరోజే ఒక్క బేరమొచ్చింది.. ఆకలి కథ అలాగే కంటిన్యూ అవుతోంది... కరోనా భయంపోతేనే మా వేశ్యాజీవితాలకు కళ’ అని ఆమె చెపుతోంది.. వేశ్యావాటికకు ఏర్పడిన గడ్డుకాలం గురించి... అలా రాత్రి పన్నెండు దాటేవరకు ముంబై నుండి చెన్నై దాకా వాళ్ళ మాటలు ప్రవహిస్తూనే ఉన్నాయ్.. చివరగా ‘సరే నేనొచ్చేస్తున్నా ముంబై. ఒక వారం రోజులైనా ఉండేందుకు’ అనే మాటతో తన కాల్ కట్ చేశాడు... మరుసటి రోజు మొదటి ఫ్లైట్‌కు ముంబైలో వాలిపోయాడతను. తన ఆలోచన విని, తన పత్రిక చైర్మన్ సంతోషించటమే కాక అన్ని ఖర్చులూ తనే భరిస్తానని ప్రోత్సహించటం విప్లవ్కు మరింత శక్తినిచ్చింది.. వెళ్లీ వెళ్ళటంతోనే ఆమెను కలసి తన ఆలోచన చెప్పాడు విప్లవ్. అది విని ఆమె సంతోషిస్తూ చప్పట్లు చరిచింది. సాధ్యాసాధ్యాలపై ఆమె సంశయ పడుతుందో, పూర్తిగా వ్యతిరేకిస్తుందో అనుకున్నాడు విప్లవ్. కానీ ఆమె అందుకు భిన్నంగా స్పందించేసరికి ఆశ్చర్యపోయాడు. తన పని సులువు అవుతుందనుకున్నాడు.. ఆమె సహకారంతో వేశ్యా వాడలోని కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ముప్పయ్ ఏళ్ళ వయసున్న ఒకామె మాట్లాడుతూ.. ‘ఖర్మకొద్దీ ఈ బురదలో కూరుకున్నాం. ఇప్పటికైనా కలువల్లా వికసించాలనుకుంటున్నాం’ అంటూ తన మద్దతు తెల్పగా, ఇంకో ఆమె మైక్ అందుకొని ‘పుట్టిన ప్రతి బాలిక మహిళే అవుతుంది.. ఏ స్త్రీ కూడా వేశ్య ముద్ర కోరుకోదు. దురదృష్టం మమ్మల్ని అలా వెంటాడింది.. నిజంగా ఇది మరకలు చెరుపుకునే సమయం’ అంటూ మాట్లాడుతుంటే చప్పట్లు మార్మోగాయి... ‘వేశ్యా వృత్తి సాగటం లేదని, ఉపాధి కరువయ్యిందని ఇన్ని నెలలూ కరోనాను తిట్టుకున్నాం. కానీ ఆ కరోనా ఈ కొత్త ఆలోచనకు కారణమయ్యింది. బురద బతుకు నుంచి బయటపడేందుకు మనకిదే మంచి అవకాశం’ అంటూ మరో యువతి తన అభిప్రాయం స్పష్టం చేసింది.. ‘గత కొన్ని నెలలుగా ఎన్ని పస్తులున్నామో, ఎన్ని కన్నీళ్లు మింగుతున్నామో, అప్పు పుట్టక, ఆదరణ లేక, అనారోగ్యాలకూ చేతిలో చిల్లిగవ్వలేక.. పౌర సమాజం మనపట్ల జాలి చూపలేదు. ఏ ఒక్కరూ ఏ సాయం చేయలేదు. ఈ బతుకు మనకొద్దు్ద మనం జనజీవన స్రవంతిలో కలుద్దాం’ అంటూ మరో మహిళ తన ఆవేదన తెలిపింది. ‘కరువు కోరల్లో చిక్కిన వేశ్యల దయనీయ స్థితిపై మొన్న పేపర్లో వచ్చాక మన బతుకులెంత దుర్భరంగా ఉన్నాయో లోకానికి తెలిసింది. అయినా జాలి చూపులు తప్ప మనకే సాయమూ దక్కలేదు.. ఎవరి సాయం కోసమో ఎదురు చూడటం అనవసరం. మనం ప్రత్యామ్నాయం వైపు మళ్లటమే ఉత్తమం.. కరోనా శత్రువు కాదు. మనవరకు స్నేహితుడే...’ అంటూ ఇంకో యువతి మార్పును స్వాగతించింది. ‘ఎవరో అమ్మివేయడం వల్ల మనం ఇక్కడికొచ్చాం. ఎవరో మనల్ని కొనుగోలు చేయటాన ఈ బానిసత్వానికి గురయ్యాం.. కరోనా మన బానిసత్వాన్ని విడిపించే బాహుబలి. మార్చి నెల నుంచి వేశ్యా వృత్తిని కరోనానే రద్దు చేసింది. ఇది ఇన్నేళ్లూ ఎవరికీ సాధ్యపడనిది..’ అంటూ మరో మహిళ స్పష్టం చేశాక చివరగా రేష్మా మాట్లాడుతూ, ‘ఈ విప్లవ్ నా ఫేస్బుక్ ఫ్రెండ్. లాక్డౌన్ మొదలైనప్పటి నుండీ ఎదురవుతున్న కష్టాలను వివరిస్తూ నేను పోస్ట్ చేసిన పోయెం చదివి స్పందించి, వాళ్ల పత్రిక పర్మిషన్ తీసుకొని ఇక్కడికొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశాడు. మన వీధుల్లో తిరిగాడు, ఇక్కడి పరిస్థితులు అంచనా వేశాడు. నా ద్వారా మన కష్టాలు పూర్తిగా తెలుసుకొని తన శైలిలో ఆర్టికల్ రాశాడు. కరోనా తొలగటం కాదు, మన జీవితాల్లో మార్పు రావాలని, వేశ్య అనే పదంలేని మహిళా లోకం ఏర్పడాలని కోరుతూ ఆర్టికల్ రాశాడు. అంతటితో తన పని పూరై్తందనుకోకుండా, ఇలా మనకు ఉపాధి అవకాశాలను కల్పించే చర్యలకు పూనుకున్నాడు. వేశ్యా జీవితాల నుంచి వైదొలిగేందుకు మన ఉమ్మడి అభిప్రాయాలు తీసుకోవటం కోసమే ఈ మీటింగ్’ అంటూ ముగించింది రేష్మా. తను రాబోయే ముందే తన ఆలోచన స్థానిక జర్నలిస్టులకు తెలియజేశాడు విప్లవ్. మరుసటి రోజు వాళ్ళను కలుసుకొని, వాళ్ళ సహకారంతో కార్యాచరణ ప్రారంభించాడు. లోకల్ ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను, మున్సిపల్ కార్పొరేషన్‌ను, స్త్రీ శిశు సంక్షేమ శాఖను, విమెన్ ఎంపవర్మెంట్ విభాగం, బ్యాంకు అధికారులను కలసి వేశ్యావృత్తి మహిళలకు ఉపాధి అవకాశాలను బ్యాంకు రుణ సదుపాయాలపై చర్చించాడు. అలా ఆపరేషన్ వేశ్యా వాటిక మొదలయ్యింది. స్థానిక మహిళలకు ఫ్లవర్ బొకేలు, మాస్కులు, శానిటైజర్ల తయారీలో శిక్షణ ఇప్పించటం, బ్యాంకు రుణాల ద్వారా కిరాణా దుకాణాలు, మిల్క్ బూత్ లు, ఇతర యూనిట్ల ఏర్పాటు ద్వారా వారి ఉత్పత్తులను మహిళాభివృద్ధిశాఖ ద్వారా కొనుగోలు చేయించటం.. ప్రభుత్వం ద్వారా సొంత మార్కెటింగ్ అవకాశాలు కల్పించటం, కుట్లు, అల్లికలు, వంటలు, కళల్లో శిక్షణతోపాటు యూట్యూబ్ సాయంతో సొంత చానెల్ ఏర్పాటు చేయించటం ఒకొకటిగా యుద్ధ ప్రాతిపదికన జరిగాయ్. ఇంకా కొనసాగుతున్నాయ్. ఇప్పుడక్కడ ఇన్నేళ్ళ చీకట్లు తొలగి వెలుగు సంతరించుకుంటోంది. - కె శ్రీనివాస్ సూఫీ -
మసాజ్ సెంటర్‌కు వీఐపీలు, పోలీసులు
చెన్నై,టీ.నగర్: నాగర్‌కోవిల్‌లో పని చేస్తున్న మసాజ్ సెంటర్‌కు వీఐపీలు, పోలీసు శాఖలో ఉన్న అధికారులు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. కోట్టార్‌లో పని చేస్తున్న ఒక మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ శ్రీనాథ్‌కు సమాచారం అందింది. ఏఎస్పీ జవహర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ జరిపారు. దీంతో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా మసాజ్ సెంటర్లో చొరబడగా ముగ్గురు మహిళలు కనిపించారు. వారి వద్ద విచారణ జరపగా మసాజ్ సెంటర్ పేరుతో యువకులను రప్పించి వ్యభిచారం జరుపుతున్నట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉన్న ముగ్గురు యువతులను, యువకుడిని పట్టుకుని విచాణ జరిపారు. సదరు యువతులు తిరువణ్ణామలై జిల్లా ఆరణి, పాండిచ్చేరి, తిరుపూర్ ప్రాంతానికి చెందిన వారుగా తెలిసింది. పట్టుబడిన యువకుడు కేరళ రాష్ట్రం ఇడిక్కి ప్రాంతానికి చెందిన అలగ్జాండర్ (20)గా గుర్తించారు. ఆన్లైన్ ద్వారా ప్రకటనలు చేసి, కస్టమర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఏఎస్పీ జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ మసాజ్ సెంటర్ నాగర్‌కోయిల్ సెంటర్లో ఉండడంతో పలు ముఖ్య ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, పోలీసు అధికారులు ఈ మసాజ్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వస్తున్నట్టు తెలిసింది. ఈ మసాజ్ సెంటర్లో ప్యాకేజ్ సిస్టమ్‌లో నగదు వసూలు చేస్తున్నారు. పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
వ్యభిచారం గుట్టురట్టు
సాక్షి, కందుకూరు అర్బన్: కొంతకాలంగా కందుకూరు పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం గుట్టు ఎట్టకేలకు రట్టయింది. విచ్చలవిడిగా సాగుతున్న ఈ చీకటి బాగోతంపై గుర్తు తెలియని వ్యక్తుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఓ వ్యభిచార గృహంపై ఆకస్మికంగా దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వ్యాభిచార గృహం నిర్వాహకులు ధనవంతులు కావడంతో పట్టుబడిన వారిని గుట్టుచప్పుడు కాకుండా కోర్టుకు హాజరు పరిచారు. కొన్నేళ్లగా పట్టణంలో వ్యభిచారం మూడు పువ్వులు..ఆరుకాయలుగా సాగుతోంది. కొందరు బ్రోకర్లు ఒంగోలు, నెల్లూరు, గూడూరు, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పట్టణానికి చెందన కొందరి అండతో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్రోకర్లు రాత్రి సమయాల్లో ఆటోలు, బస్సుల్లో మైనర్లకు మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపి వ్యభిచారం రొంపిలోకి దించుతున్నారు. అందుకు పట్టణ శివారు ప్రాతాలను ఎంచుకున్నారు. కోవూరు రోడ్డు, విక్కిరాలపేట రోడ్డు, పామూరు రోడ్డు, పలుకూరు అడ్డ రోడ్డులోని జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని రాత్రి సమయంలో వ్యభిచారం సాగిస్తున్నారు. పోలీసుల రాత్రి సమయాల్లో పట్టణంలోని లాడ్జిలు, గెస్ట్హోసుల్లో తనిఖీలు చేయక పోవడంతో బ్రోకర్లు వ్యభిచారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం కోవూరు రోడ్డులోని ఓ ఇంట్లో వ్యభిచారం సాగిస్తున్నారని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారు ధనవంతులు కావడంతో మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా కోర్టులో హాజరు పరిచారు. రాత్రి వేళల్లో దంపతులు తమ స్వగ్రామాలకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. రాత్రి 9 గంటలు దాటితే మందుబాబులు అమ్మాయిలను తీసుకొచ్చి రోడ్డు పక్కనే మద్యం తాగుతూ తమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతోందోనని భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై పట్టణ ఎస్ఐ తిరుపతిరావును వివరణ కోరగా వ్యభిచార గృహంపై దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించినట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
వ్యభిచారం గుట్టు రట్టు
కర్నూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న రమా లాడ్జీలో జోరుగా సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టయింది. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు దాడి చేసి విటులతో పాటు లాడ్జీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాళ్లకు విముక్తి కల్పించారు. రమా లాడ్జీలోని రూం నెంబర్ 108, 109లో జోరుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మూడో పట్టణ సీఐ హనుమంతనాయక్, ఎస్ఐలు శ్రీనివాసులు, రహ్మతుల్లా తమ సిబ్బందితో శనివారం లాడ్జీలోని ఆయా గదుల్లో తనిఖీలు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతుండగా కొంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలులోని బళ్లారి చౌరస్తా సమీపంలోని గోపినగర్‌లో నివాసముంటున్న కమ్మరి సాయి కిరణ్, గార్గేయపురం గ్రామానికి చెందిన ఆర్యకటిక అంజీశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కౌలుబజార్ ప్రాంతానికి చెందిన దూసకంటి స్వప్న అలియాస్ జ్యోతి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చిన్న నల్గొండ ప్రాంతంలో నివాసముండేది. వ్యభిచార వృత్తిలోకి దిగి కొంత కాలంగా డోన్‌లో నివాసముంటోంది. ఈమెను రమా లాడ్జి నిర్వాహకుడు చిన్నకొండ మల్లికార్జునరెడ్డి పిలిపించుకొని వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది. దీంతో మల్లికార్జునరెడ్డితో పాటు లాడ్జీలో పనిచేస్తున్న గోవిందరెడ్డి, పోతుగంటి నాగరాజు తదితరుల పై కేసు నమోదు చేసి బాధితురాలికి విముక్తి కల్పించినట్లు సీఐ హనుమంతనాయక్ తెలిపారు. -
నగరంలో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉప్పల్ పరిధిలోని హనుమసాయినగర్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుల వద్ద నుంచి రూ.9 వేల నగదు, 8 సెల్ ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
ఫర్ సేల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: దంపతుల్లో సంతానలేమి సమస్య లేమి సమస్య చిన్నారుల అమ్మకాలు పెరిగి పోవడవానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సంతానం కోసం తపించిపోతున్న దంపతులను కిడ్నాపర్లు ముందుగా గుర్తిస్తారు. వారిని మాయమాటలతో బుట్టలో వేసుకుంటారు. ఎంత డబ్బైనా ఫరవాలేదు బిడ్డ కావాలి అనే దంపతులతో ముందుగానే ఒక ఒప్పందం కుదుర్చుకుని తగిన చిన్నారుల కోసం అన్వేషిస్తారు. చిన్నారులను అంగడి సరుకుగా మార్చే వారికి అన్నీ అనుకూలిస్తే కొనుగోలు చేయడం, లేకుంటే ఎత్తుకెళ్లడం... ఈ రెండు మార్గాలు. మరో దారుణమైన విషయం ఏమిటంటే సంతానం కావాలనే దంపతులకే కాదు, భిక్షమెత్తేందుకు, బాల కార్మికులుగా మార్చేందుకు, వ్యభిచార గృహాలకు అమ్మివేసేందుకు, ఆసుపత్రులకు అప్పగించి అవయవాలను కాజేసేందుకు కూడా చిన్నారుల కిడ్నాప్‌లు సాగుతున్నాయిం. గగుర్పొడిచే విషయం మరొకటి ఏమిటంటే మూఢ నమ్మకాలతో గుప్త నిధుల కోసం అన్వేషించే వారు నరబలులు ఇవ్వాలని భావిస్తే ఇలాంటి రాక్షసులకు సైతం చిన్నారుల సరఫరా సాగిపోతోంది. చిన్నారులను అమ్మకానికి పెట్టే ముఠా సభ్యులు ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని డబ్బు వల విసురుతారు. రోడ్డువారగా నిద్రించి కుటుంబాలపై గురిపెట్టి రాత్రివేళ తల్లిపక్కన హాయింగా నిద్రపోతున్న పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళతారు. మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబమంతా తరలివచ్చి ఆలయాల్లో నిద్రించే భక్తుల వద్ద నుంచి చిన్నారులను తస్కరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, బస్, రైల్వేస్టేషన్లలో తల్లిదండ్రుల పక్కన పడుకుని కునుకు తీస్తున్న చిన్నారులు కూడా కిడ్నాపర్ల బారిన పడుతున్నారు. తిరునెల్వేలి జిల్లా కీళప్పావురైకి చెందిన అరుణాచలం రూ.2.5 లక్షలకు ఒక మగ బిడ్డ, ఇద్దరు మహిళలు సహా ఏడుగురుని మార్తాండంకు చెందిన విల్సన్ అనే వ్యక్తికి అమ్మారు. అనుమానంతో సదరు విల్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కేసులో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వీరిచ్చిన సమాచారంతో ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బాలల శరణాలయంలో చేర్చారు. గత ఏడాది తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి తదితర జిల్లాలకు పరిమితమైన చిన్నారుల కిడ్నాప్, అమ్మకాల భూతం రాష్ట్రమంతా వ్యాపించి విశ్వరూపం దాల్చింది. ఈరోడ్, తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తులు సైతం చిన్నారుల కిడ్నాప్, అమ్మకాలనే వృత్తిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిరోధానికి హైకోర్టు సూచనలు ప్రజలను భయంకపితులను చేసేలా పెరిగిపోతున్న కిడ్నాప్‌లను నిరోధించడం ఎలా అనే అంశంపై మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. జిల్లాల వారీగా ప్రత్యేక పోలీసు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మేలో ఆదేశించింది. అపహరించిన చిన్నారులు రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లిపోతున్నందున రాష్ట్ర స్థారుులో ప్రత్యేక విచారణ కమిటీని నియమించాలని బాలల హక్కుల సంరక్షణ సమితుల వారు సూచిస్తున్నారు. చైల్డ్‌లైన్ పథకాన్ని అమలు చేస్తున్న శరణాలయం డెరైక్టర్ జయబాలన్ మాట్లాడుతూ గత 11 నెలల్లో బాలల హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుల్లో 600 మందికి అవసరమైన సహాయాన్ని అందించినట్లు తెలిపారు. అలాగే వీటిల్లో 35 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, ఇద్దరు చిన్నారులను రక్షించగలిగామని చెప్పారు. శిశు, మహిళ కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వచ్చేనెలలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ చెబుతున్నారు. అత్యవసర ఫోన్: 1098 చిన్నారులు, మహిళలు కిడ్నాప్‌లకు గురైనపుడు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ 1098 టోల్‌ఫ్రీ ఫోన్‌కు సమాచారం ఇవ్వవచ్చు. తమిళనాడులో శివగంగై, వేలూరు తదితర 30 జిల్లాల్లో చైల్డ్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నారుు. భయపెడుతున్న సర్వే జాతీయ స్థారుులో జరిగిన ఒక సర్వే ప్రకారం 2014లో తమిళనాడులో 441 మంది చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు. 2015లో ఈ సంఖ్య 526కు పెరిగింది. ఇక ఈ ఏడాదిలో నవంబరు వరకు 400 మందికి పైగా అపహరణకు గురయ్యారు. భారత దేశంలో చిన్నారులకు సంబంధించిన నేరాలు గతంలో కంటే 24 శాతం పెరిగిపోరుునట్లు ఆ సర్వే చెబుతోంది. చిన్నారుల కిడ్నాప్ 43 శాతం, లైంగిక వేధింపులు 30 శాతానికి పెరిగిపోయింంది. గడిచిన ఏడాదిలో చిన్నారులపై అకృత్యాలకు సంబంధించి 6,406 కేసులు నమోదయ్యాయిం. వీటిల్లో తమిళనాడులో 16.6 శాతం, మధ్యప్రదేశ్‌లో 13.2 శాతం, ఢిల్లీలో 12.8 శాతం, బిహార్‌లో 6.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 6.7 శాతం లెక్కన బాధిత బాలబాలికల ఫిర్యాదులతో నేరాలు నమోదయ్యాయిం. చిన్నారుల హత్యల్లో దేశస్థాయింలో తమిళనాడు మూడోస్థానంలో ఉంది. రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు పిల్లలు కిడ్నాపర్ల బారిన పడుతున్నారు. -
వ్యభిచార గృహాలపై దాడులు
-13 మంది అరెస్ట్ ముల్కలచెరువు: చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పలు చోట్ల దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకులతో పాటు ఐదుగురు బ్రోకర్లను, 9 మంది విటులను, 11 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ముల్కల చెరువు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి: పలువురి అరెస్ట్
నాగోలు (హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ సరస్వతీనగర్ కాలనీలో కాకినాడకు చెందిన ఓ మహిళ ఇంటిని అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు దాడి చేయగా ఓ యువతితోపాటు సరూర్‌నగర్‌కు చెందిన మహేష్, హస్తినాపురంకు చెందిన వెంకన్న పోలీసులకు చిక్కారు. వీరితో పాటు నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3500, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
వేశ్యాగృహ నిర్వాహకులను బెదిరిస్తున్న కానిస్టేబుళ్ల అరెస్ట్
వేశ్య గృహాల నుంచి మాముళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలపై ఎస్.ఆర్.నగర్ ఠాణాకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఎస్.ఆర్.నగర్ పరిధిలో పలు వేశ్య గృహాల నిర్వహకులను తమకు మాముళ్లు సమర్పించాలని ఆ కానిస్టేబుళ్లు తరచుగా వేధింపులకు గురి చేస్తు, అక్రమ కేసులు బనాయిస్తాంటూ వేశ్య గృహాల నిర్వహకులను బెదిరిస్తున్నారు. దాంతో నిర్వహకులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీంతో వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు దిగవ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. వారిని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని విచారిస్తున్నారు. -
కాఠిన్య నగరం : రాజధానిలో విస్తరిస్తున్న విషసంస్కృతులు
సాక్షి, న్యూఢిల్లీ: పనిమనుషులపై వేధింపుల విషయం రాఖీ ఘటనతో వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని దారుణాలెన్నో నగరంలో జరుగుతున్నా వాటికి బలవుతున్నవారిని కాపాడే నాథుడే కరువయ్యాడు. పెద్దలపై ప్రతీకారాలు తీర్చుకోవడానికి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. కష్టపడి డబ్బు సంపాదించడం చేతగాక పనికోసం నగరానికి వచ్చే యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. పసిపిల్లలని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వందల రూపాయల కోసం కూడా ప్రాణాలను తీస్తున్నారు. రాజధానిలో పెరుగుతున్న ఈ విష సంసృ్కతికి పోలీసులు చెబుతున్న పలు అపహరణ ఉదంతాలే అద్దంపడుతున్నాయి. ఆ వివరాల్లోకెళ్తే.... రాజధాని నగరంలో కిడ్నాప్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కిడ్నాప్ అవుతున్న వారిలో చిన్నారులే అధికంగా ఉంటుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కల్గిస్తోంది. ఈశాన్య ఢిల్లీలో ఈ దారుణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీ సుల అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదృశ్యమవుతున్నవారిలో బాలబాలికల సంఖ్య దాదాపు సమానంగానే ఉంటోంది. పోలీసులు వీరి జాడ కని పెడుతున్న కేసులు అత్యంత తక్కువగా ఉండడం మరింత బాధాకరం. కిడ్నాప్ కేసుల నమోదులో ఖజూరీ, కరావల్నగర్, గోకుల్‌పురి పోలీసు స్టేషన్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. 2011లో 868 పిల్లలు అదృశ్యమయ్యా రు. ఇందులో 448 మంది బాలురు, 420 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 766 మంది జాడను పోలీసులు కనుక్కోగలిగారు. 44 మంది బాలురు, 58 మంది బాలికల జాడ ఇప్పటికీ ఇంకా తెలియలేదు. 2012లో అదృశ్యమైనవారి సంఖ్య 732గా పోలీసుల రికార్డుల్లో నమోదైంది. వీరిలో 361 మంది బాలురు, 298 మంది బాలికల జాడను పోలీసులు కనుగొన్నారు. 35 అబ్బాయిలు, 38 అమ్మాయిల ఆచూకీ ఇంకా తెలియలేదు. అదృశ్యమైన చిన్నారుల కోసం వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు వం దల సంఖ్యలో కిడ్నాప్ కేసులు నమోదవగా వారిలో సగం మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఎలా మాయం అవుతున్నారు? పోలీసు ఉన్నతాధికారుల చెబుతున్న ప్రకారం.. పిల్లలను అపహరించిన కిడ్నాపర్లు వారిని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తూ అక్కడ వారితో వ్యవసాయ పనులు చేయిస్తున్నారు. యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో పలువురిని గుర్తించారు. బాలికల్లో యుక్త వయస్సువారు అదృశ్యమవుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారు, తల్లిదండ్రులపై ఉన్న పగతో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఉద్యోగాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వస్తున్న యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార గృహాలకు అమ్ముతున్నట్టు స్వచ్ఛంద సంస్థల పరిశీలనలో వెల్లడైంది. -
వ్యభిచార గృహాలపై దాడి:8 మంది అరెస్టు
హైదరాబాద్: గుట్టు చప్పుడుకాకుండా నిర్వహిస్తున్న రెండు వ్యభిచార గృహాలపై పోలీసులు ఆదివారం అకస్మికంగా దాడి చేశారు. వనస్థలిపురంలో గణేష్ నగర్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న నాని అనే యువకుడు కొంత మంది అమ్మాయిలతో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నాడు. వారు ఇంటర్నెట్ ద్వారా యువకులకు వల వేసి ముగ్గులో దింపుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయగా ఒక యువకుడితో సహా 8 మంది పట్టుబడ్డారు. వీరిలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో యువతులతో పాటు పశ్చిమబెంగాల్ కు చెందిన యువతి కూడా పోలీసులకు చిక్కింది. నిర్వాహకుడు నాని పారిపోగా, మరో యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.