నగరంలో వ్యభిచార ముఠా గుట్టురట్టు | Hyderabad Police arrests Sex racket gang | Sakshi
Sakshi News home page

నగరంలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Published Fri, Nov 10 2017 5:51 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Hyderabad Police arrests Sex racket gang - Sakshi

ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉప్పల్ పరిధిలోని హనుమసాయినగర్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.

ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుల వద్ద నుంచి రూ.9 వేల నగదు, 8 సెల్ ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement