
సాక్షి, హైదరాబాద్: ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ కానిస్టేబుల్ మైనర్ బాలికపై లైంగికదాడికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయ్యప్పరెడ్డిగూడ కాలనీకి చెందిన శేఖర్ కూకట్‌పల్లిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంట్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మేస్త్రీ కుటుంబం ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. వీళ్లకు 14 ఏళ్ల అమ్మాయి ఉంది. బుధవారం ఉదయం 7–8 గంటల ప్రాంతంలో బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డాడు.
తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకునే సరికి అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీస్ కానిస్టేబుల్ శేఖర్‌ను చితకబాది 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. నిందితుడు శేఖర్‌పై శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పోక్సో, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాలిక ఇంట్లో.. కోడి గుడ్లు పెడుతుందని, చూసేందుకు వెళ్లానని శేఖర్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.
చదవండి: ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..
Comments
Please login to add a commentAdd a comment