
ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం: పాలకొండ పట్టణం.. గటాలడెప్పి వీధిలోని ఒక ఇంట్లో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. సోమవారం సాయంత్రం ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పక్కాగా దాడిచేసి నలుగురు విటులతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఒక మహిళ తన ఇంటినే వ్యభిచార గృహంగా నడుపుతోంది. గత పదేళ్లుగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తోంది. దీన్ని గమనించిన స్థానికులు అందించిన సమాచారంతో ఇంటిపై దాడి చేయగా నలుగురు యువకులు, ఒక మహిళ పట్టుబడినట్లు ఎస్సై చెప్పారు. యువకులపై కేసు నమోదు చేశామని, సంబంధిత మహిళను ఆసుపత్రికి తరలించామన్నారు. నిర్వహకురాలుని అదులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment