వ్యభిచార గృహాలపై దాడులు
Published Mon, Sep 12 2016 10:49 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
-13 మంది అరెస్ట్
ముల్కలచెరువు: చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పలు చోట్ల దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకులతో పాటు ఐదుగురు బ్రోకర్లను, 9 మంది విటులను, 11 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ముల్కల చెరువు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
Advertisement