వ్యభిచార నిర్వాహకులను అరెస్ట్ చూపుతున్న పోలీసులు
కర్నూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న రమా లాడ్జీలో జోరుగా సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టయింది. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు దాడి చేసి విటులతో పాటు లాడ్జీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాళ్లకు విముక్తి కల్పించారు. రమా లాడ్జీలోని రూం నెంబర్ 108, 109లో జోరుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మూడో పట్టణ సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐలు శ్రీనివాసులు, రహ్మతుల్లా తమ సిబ్బందితో శనివారం లాడ్జీలోని ఆయా గదుల్లో తనిఖీలు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతుండగా కొంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కర్నూలులోని బళ్లారి చౌరస్తా సమీపంలోని గోపినగర్‌లో నివాసముంటున్న కమ్మరి సాయి కిరణ్, గార్గేయపురం గ్రామానికి చెందిన ఆర్యకటిక అంజీశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కౌలుబజార్ ప్రాంతానికి చెందిన దూసకంటి స్వప్న అలియాస్ జ్యోతి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చిన్న నల్గొండ ప్రాంతంలో నివాసముండేది. వ్యభిచార వృత్తిలోకి దిగి కొంత కాలంగా డోన్‌లో నివాసముంటోంది. ఈమెను రమా లాడ్జి నిర్వాహకుడు చిన్నకొండ మల్లికార్జునరెడ్డి పిలిపించుకొని వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది. దీంతో మల్లికార్జునరెడ్డితో పాటు లాడ్జీలో పనిచేస్తున్న గోవిందరెడ్డి, పోతుగంటి నాగరాజు తదితరుల పై కేసు నమోదు చేసి బాధితురాలికి విముక్తి కల్పించినట్లు సీఐ హనుమంతనాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment