వేశ్యాగృహ నిర్వాహకులను బెదిరిస్తున్న కానిస్టేబుళ్ల అరెస్ట్ | Three constables arrested due to bribe demand at prostitution houses | Sakshi
Sakshi News home page

వేశ్యాగృహ నిర్వాహకులను బెదిరిస్తున్న కానిస్టేబుళ్ల అరెస్ట్

Published Sun, Dec 15 2013 11:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

Three constables arrested due to bribe demand at prostitution houses

వేశ్య గృహాల నుంచి మాముళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలపై ఎస్.ఆర్.నగర్ ఠాణాకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఎస్.ఆర్.నగర్ పరిధిలో పలు వేశ్య గృహాల నిర్వహకులను తమకు మాముళ్లు సమర్పించాలని ఆ కానిస్టేబుళ్లు తరచుగా వేధింపులకు గురి చేస్తు, అక్రమ కేసులు బనాయిస్తాంటూ వేశ్య గృహాల నిర్వహకులను బెదిరిస్తున్నారు.

 

దాంతో నిర్వహకులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీంతో వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు దిగవ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. వారిని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని విచారిస్తున్నారు.  
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement