వ్యభిచార గృహాలపై దాడి:8 మంది అరెస్టు | police attacked on Prostitution houses:8 were arrested | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహాలపై దాడి:8 మంది అరెస్టు

Oct 6 2013 9:03 PM | Updated on Sep 4 2018 5:07 PM

గుట్టు చప్పుడుకాకుండా నిర్వహిస్తున్న రెండు వ్యభిచార గృహాలపై పోలీసులు ఆదివారం అకస్మికంగా దాడి చేశారు.

హైదరాబాద్: గుట్టు చప్పుడుకాకుండా నిర్వహిస్తున్న రెండు వ్యభిచార గృహాలపై పోలీసులు ఆదివారం అకస్మికంగా దాడి చేశారు. వనస్థలిపురంలో గణేష్ నగర్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న నాని అనే యువకుడు కొంత మంది అమ్మాయిలతో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నాడు. వారు ఇంటర్నెట్ ద్వారా యువకులకు వల వేసి ముగ్గులో దింపుతున్నారు.  ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయగా  ఒక యువకుడితో సహా 8 మంది పట్టుబడ్డారు.

 

వీరిలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో యువతులతో పాటు పశ్చిమబెంగాల్ కు చెందిన యువతి కూడా పోలీసులకు చిక్కింది. నిర్వాహకుడు నాని పారిపోగా, మరో యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement