ఆర్టీసీ బస్సు ఢీ : ఇద్దరి దుర్మరణం | two killed as bike, RTC bus collide in hyderabad vanasthalipuram | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ : ఇద్దరి దుర్మరణం

Published Sat, Mar 12 2016 5:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

two killed as bike, RTC bus collide in hyderabad vanasthalipuram

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు యాక్టివాను ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వనస్థలిపురం విష్ణు సినిమా థియేటర్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్టివాను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య(50) అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement