వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్, హోంగార్డ్ అరెస్ట్! | constable and home guard arrested in hyderabad vanasthalipuram police station | Sakshi
Sakshi News home page

వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్, హోంగార్డ్ అరెస్ట్!

Published Tue, Jan 5 2016 11:11 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

constable and home guard arrested in hyderabad vanasthalipuram police station

తుర్కయంజాల్: ఓ రేషన్ డీలర్ నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్, హోంగార్డ్‌ని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గణేష్, హోంగార్డ్ కృష్ణ కొంతకాలంగా రేషన్ దుకాణాల నుంచి తాము ఎస్‌ఓటీ పోలీసులమని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది.


దీనిపై దృష్టి సారించిన ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో సుష్మా థియేటర్ సమీపంలో ఓ రేషన్ దుకాణం వద్ద నిఘా పెట్టారు. అదే సమయంలో రేషన్ దుకాణం డీలర్ వైకుంఠం డీసీఎం వాహనంలో బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు రేషన్ బియ్యం నింపుతున్నాడు. గమనించిన గణేష్, కృష్ణలు రేషన్ డీలర్ నుంచి రూ.40 వేలు తీసుకున్నట్లు సమాచారం. అక్కడ వేచి ఉన్న ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి కానిస్టేబుల్ గణేష్, హోంగార్డ్ కృష్ణలను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement