ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.
ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ భవన విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఓ కేసు విషయమై ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువకుడి తలపై ఇటుకలు పడడంతో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.