serious injuries
-
జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై ఆదివారం ముసుగు దుండగులు చేసిన విచక్షణారహిత దాడిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విదేశీ యూనివర్సిటీల్లోనూ సోమవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అధికార, విపక్ష నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అడ్డుకునే విషయంలో అసమర్ధంగా వ్యవహరించారని యూనివర్సిటీ వైస్ చాన్సెలర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయని క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. ముసుగులు వేసుకుని జేఎన్‌యూ క్యాంపస్‌లోకి వచ్చిన దుండగులు ఆదివారం రాత్రి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలోయూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ సహా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం వారిని సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. కాగా, ఈ హింసకు బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీదే బాధ్యత అని విపక్షాలు, యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించాయి. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో జేఎన్‌యూలో పరిస్థితిని సమీక్షించారు. మోదీ ప్రభుత్వ సహకారంతో గూండాలు దేశ యువతపై జరిపిన ఈ దాడి అత్యంత గర్హనీయమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ అంధుడిపైనా వీరంగం కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో ముసుగులు ధరించిన గూండాలు విచ్చలవిడిగా దాడి చేశారని బాధితులు తెలిపారు. ‘మేం హాస్టల్లో ఉండగా, ఏబీవీపీ వారు కర్రలతో వస్తున్నారని ఎవరో అరిచారు. దాంతో మేం రూంలోకి వెళ్లి లోపలి నుంచి తలుపేసుకున్నాం. అయినా, వారు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేయసాగారు. దాంతో బాల్కనీ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాం’ అని కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపారు. అంధుడినని కూడా చూడకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని సూర్యప్రకాశ్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలువురు విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. గూండాల దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళల వసతి గృహంపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. ‘క్యాంపస్‌లో జరిగిన శాంతి ర్యాలీలో పాల్గొంటుండగా.. 20–25 మంది దుండగులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నాపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు’ అని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ వివరించారు. తనపై దాడి చేసినవారిని గుర్తుపడతానన్నారు. తమకు వ్యతిరేకులైన వారిని గుర్తించి మరీ దాడికి పాల్పడ్డారని, ఇది ఏబీవీపీ దౌర్జన్యమేనని ఘోష్ ఆరోపించారు. ‘మా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు గత 4, 5 రోజులుగా ఆరెస్సెస్‌తో సంబంధాలున్న పలువురు ప్రొఫెసర్లు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే, వారి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది’ అని ఘోష్ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ‘జేఎన్‌యూ సెక్యూరిటీ సహకారంతోనే ఆ గూండాలు రెచ్చిపోయారు. ఫోన్ చేసిన 2 గంటల తరువాత పోలీసులు వచ్చారు’ అని ఆయిషీ ఘోష్ ఆరోపించారు. తమపై వచ్చిన ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది. దేశవ్యాప్తంగా నిరసనలు జేఎన్‌యూలో విద్యార్థులపై దాడిని విద్యార్థిలోకం తీవ్రంగా పరిగణించింది. పుదుచ్చేరి నుంచి చండీగఢ్ వరకు.. అలీగఢ్ నుంచి కోల్‌కతా వరకు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్వర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, సావిత్రీబాయి ఫూలె యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ వర్సిటీసహా పలు విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులోని నేషనల్ లా యూనివర్సిటీ, ఐఐటీ– బాంబే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్(పుణె) తదితర విద్యా సంస్థల్లోనూ విద్యార్థులు నిరసన తెలిపారు. ముంబైలో ఆదివారం అర్ధరాత్రి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ యువజన విభాగం టార్చ్‌లైట్స్ మార్చ్ నిర్వహించారు. విదేశాల్లో.. నేపాల్‌లోని కఠ్మాండూలో జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే, బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, ససెక్స్ యూనివర్సిటీల్లో, అమెరికాలోని కొలంబియా వర్సిటీలో విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. వీసీపై ఆరోపణలు దాడి విషయంలో సకాలంలో స్పందించకపోవడంపై యూనివర్సటీ వైస్‌చాన్స్‌లర్ జగదీశ్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. జేఎన్‌యూ అధికారులతో సోమవారం మానవ వనరుల శాఖ జరిపిన సమీక్ష సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వీసీ రాజీనామా చేయాలని జేఎన్‌యూఎస్‌యూ, జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. వీసీ గూండాల నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, యూనివర్సిటీలో హింసకు ఆయనదే ప్రణాళిక అని ఆరోపించాయి. దుండగులు ప్రొఫెసర్ల నివాస సముదాయాలపైనా దాడి చేసి, మహిళలను దుర్భాషలాడారని పలువురు టీచర్లు తెలిపారు. దాడిలో ఏబీవీపీ హస్తం? జేఎన్‌యూలో దాడికి, బీజేపీ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి సంబంధం ఉన్నదని సూచించే పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో పాల్గొన్నవారిలో జేఎన్‌యూ ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వికాస్ పాటిల్ ఉన్నట్లు భావిస్తున్నారు. లాఠీలు, ఇనుపరాడ్లు పట్టుకుని ఉన్న కొందరు వ్యక్తులతో వికాస్ ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాంపస్‌లో ఢిల్లీ పోలీసులకు దొరికిన ఫైబర్ గ్లాస్ లాఠీ లాంటి దానినే పాటిల్ పట్టుకుని ఉన్నారు. ఫొటోలో అతని పక్కన ఉన్న వ్యక్తిని ఏబీవీపీకి చెందిన శివపూజన్ మండల్‌గా గుర్తించారు. ఇతను జేఎన్‌యూలో బీఏ తొలిఏడాది చదువుతున్నాడు. కర్రలతో వికాస్ పాటిల్. శివపూజన్ మండల్. యోగేంద్ర (ఇన్సెట్లో) పాటిల్, మండల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయడం గమనార్హం. జేఎన్‌యూ క్యాంపస్‌లో వామపక్ష విద్యార్థులపై దాడి చేయాలంటూ వాట్సాప్‌లో జరిగిన చర్చకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ‘వామపక్ష విద్యార్థులపై భౌతిక దాడికి దిగాలి. అదొక్కటే పరిష్కారం’ అని, ‘మేం ఇక్కడ 25 నుంచి 30 మంది వరకు ఉన్నాం’ అని అందులో ఉన్నాయి. ఈ చాట్‌లో పాల్గొన్న వారిలో జేఎన్‌యూలో సంస్కృతంలో పీహెచ్డీ చేస్తోన్న విద్యార్థి యోగేంద్ర భరద్వాజ్, మరో పీహెచ్డీ విద్యార్థి సందీప్ సింగ్ ఉన్నారు. భరద్వాజ్ ఇప్పటికే తన ఇతర సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసినప్పటికీ, ఆయన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ ద్వారా అతడు ఏబీవీపీ సభ్యుడని గుర్తించారు. బయటివారా? లోపలి వారా? జేఎన్‌యూలో ఆదివారం హింసకు పాల్పడింది వర్సిటీ విద్యార్థులా? లేక బయటినుంచి వచ్చిన వ్యక్తులా? అనే విషయంపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ దృష్టి సారించింది. ‘ఆదివారం మధ్యాహ్నం నుంచే వర్సిటీ గోడలు, గేట్ల వద్ద భారీగా పోలీసు వాహనాలు కనిపించాయి. ఆ స్థాయిలో పోలీసులున్నా దుండగులు క్యాంపస్‌లోకి ఎలా రాగలిగారు? క్యాంపస్‌లో దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఇంటలిజెన్స్ సమాచారం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే.. వారెందుకు వెంటనే స్పందించలేదు?’ అనే ప్రశ్నలను పలువురు సంధిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ స్థాయి అధికారి ఒకరు స్పందించారు. ‘గత నెల రోజులుగా పోలీసులు జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉంటున్నారు. అలాగే, ఆదివారం కూడా అక్కడ ఉన్నారు. వర్సిటీ అధికారుల అనుమతి లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులు వెళ్లలేరు’ అని వివరించారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారని, పోలీసులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారమివ్వడంలో ఆలస్యం కావడంపై వర్సిటీ అధికారులు స్పందించారు. ‘సరైన కారణం లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులను పిలిస్తే విద్యార్థులకు కోపమొస్తుంది. అందుకే పరిస్థితి దిగజారిందని భావించాకే పిలిచాం’ అని తెలిపారు. విద్యార్థులపై మోదీ ప్రభుత్వ మద్దతుతో జరిగిన అమానుష దాడి ఇది. విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. – సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఈ దాడులు 26/11 ముంబై దాడులను గుర్తు చేస్తున్నాయి. దేశంలో తమకు రక్షణ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనల వంటి వాటిని మహారాష్ట్రలో జరగనివ్వను. నిందితులను పోలీసులు పట్టుకోలేకపోతే.. వారూ అందులో పాలుపంచుకున్నట్లే.. – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం జేఎన్‌యూ దాడిపై బాలీవుడ్ నటి, అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా స్పందించారు. వార్తా పత్రికలోని ఓ భాగాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘భారత్.. ఇక్కడ విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఇది భయానికి వెరవడం లేదు. నిరసనలను హింసతో అణచలేరు. అదే జరిగితే మరింత మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతారు’ అని చెప్పారు. అయితే దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ మాటలను ఏబీవీపీకి మద్దతుదారుడైన అక్షయ్ కుమార్‌కు (ట్వింకిల్ భర్త) చెప్పాలంటూ ట్రోల్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు
-
రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు
ప్రముఖ హాలీవుడ్ హీరో, హాస్యనటుడు కెవిన్ హార్ట్(40) ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ముల్హోల్యాండ్ రహదారిపై కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కెవిన్‌కు తీవ్ర గాయాలు కాగా, అతని స్నేహితులు బ్లాక్, ఇంటర్నెట్ ఫిట్నెస్ మోడల్ ,బ్లాక్ ఫియాన్సీ రెబెక్కా కూడా తీవ్రంగా గాయపడ్డారు. వేరే వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. వాహనాన్ని నడుపుతున్న జేర్డ్ బ్యాక్(28) బ్లాక్ నియంత్రణ కోల్పోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి పక్కనే వున్న గోతిలోకి పడిపోయింది. దీంతో కెవిన్‌తోపాటు, బ్లాక్‌కు నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు హెలికాఫ్టర్ ద్వారా..హాస్పిటల్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీనిపరిశీలించిన అధికారులు ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కాగా ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ మూవీలో జుమాన్జీ పాత్రలో కెవిన్ మెప్పించారు. 2019 ఆస్కార్ పండుగకు కెవిన్ హోస్ట్‌గా వ్యవహరించాల్సి వుంది కానీ స్వలింగ సంపర్కానికి సంబంధించిన ఆయన పాత ట్వీట్లు వెలుగులోకి రావడంతో ఆయన్ను తప్పించారు. -
ఆటో లారీ ఢీ
పులిచెర్ల(కల్లూరు) : కల్లూరు – పీలేరు జాతీయ రహదారిలోని అయ్యావాండ్లపల్లె బస్ స్టాప్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు వైపు వెళుతున్న లారీ కల్లూరువైపు వస్తున్న ప్యాసింజరు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో పీలేరు మోడల్ కాలనీకి చెందిన గురప్ప(55), రేవతి(40), ఇందిరమ్మ కాలనీకి చెందిన సరస్వతి(47), సుభా కాంక్షిణి(22), మనోహర్ (6నెలలు), ఎగువపోకలవారి పల్లెకు చెందిన హంసవేణి(27) ఉన్నారు. కల్లూరు ఎస్ఐ విశ్వనాథ నాయుడు క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రూయాకు తీసుకెళ్లారు. కాగా ప్రమాదానికి కారణమై, ఆగకుండా వెళ్లిపోయిన లారీ డ్రైవర్‌ను పీలేరు సమీపంలో అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. -
పూటుగా తాగొచ్చాడు.. ఫాస్ట్‌గా ఢీకొట్టాడు
♦ మద్యం మత్తులో బైక్‌తో మరో బైక్‌ను ఢీకొట్టిన యువకుడు ♦ దంపతులకు తీవ్ర గాయాలు కాశీబుగ్గ: పూటుగా మద్యం తాగి బైక్ డ్రైవ్ చేసిన ఓ యువకుడు మరొక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పలాస–కాశీబుగ్గ శివారు ప్రాంతమైన కోసంగిపురం కూడలి వద్ద బుధవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన నర్తు మాధవరావు అనే యువకుడు ఉదయాన్నే మద్యం తాగి ద్విచక్ర వాహనంపై తూలుతూ అతివేగంతో వాహనాన్ని నడుపుతూ వచ్చాడు. కోసంగిపురం కూడలి వద్ద ఎదురుగా వెళ్తున్న మందస మండలం సరియాపల్లి గ్రామానికి చెందిన షావుకారి ముకుందరావు, హేమలత దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ కిందపడ్డారు. హేమలత తల రోడ్డుకు బలంగా తాకడంతో అధిక రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయింది. ముకుందరావు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుడిని 108 అంబులెన్సులో పలాస సీహెచ్‌సీకి తరలించారు. ప్రమాద విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న ఎస్ఐ వెంకటరావు తొలుత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి యువకుడిని అదుపులోకి తీసుకుని వివరాలు నమోదు చేశారు. -
దేవుడా!
♦ వ్యాన్–బస్సు ఢీ ముగ్గురు మృతి ♦ ముగ్గురికి తీవ్రగాయాలు అన్నానగర్: దేవుడిని దర్శించుకుని తిరిగి వస్తూ వ్యాన్–బస్సు ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమార్తె సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తిరుచ్చెంగోడు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లా భవానీసాగర్ ఆనకట్ట నుంచి సత్యమంగళం వెళ్లే రోడ్డులో ఉన్న తొప్పమ్ పాళయం ప్రాంతానికి చెందిన కర్ణన్. ఇతను ఇటీవలే మృతి చెందాడు. ఇతని భార్య కాంతామణి (50). వీరి కుమార్తెలు హరిప్రియ (33), కీర్తిక (31). వీరిలో హరిప్రియకి కరుణాకరన్‌తో ఆరు నెలల ముందు వివాహం జరిగింది. ఈ క్రమంలో వీరికి పిల్లలు పుట్టాలని నామక్కల్ ఆంజనేయర్, తిరుచ్చెంగోడు అరత్తుకాళీశ్వరర్ ఆలయంలో దేవుడిని దర్శించుకోవాలని సిద్ధమయ్యారు. దీంతో మంగళవారం కాంతామణి, హరిప్రియ ఈమె భర్త కరుణాకరన్, కీర్తిక, కాంతామణి మరిది విజయకుమార్ (50) వీరందరూ ఓ వ్యాన్‌లో నామక్కల్ తిరుచ్చెంగోడు ఆలయానికి వెళ్లారు. స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు వ్యాన్‌లో బయలుదేరారు. తిరుచ్చెంగోడు సమీపం వరకూరామ్పట్టి వద్ద వస్తుండగా ఎదురుగా వస్తున్న ఈరోడ్ నుంచి సేలం వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంతామణి, హరిప్రియ, వ్యాన్ డ్రైవర్ రాజ్‌కుమార్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కీర్తిక, కరుణాకరన్, విజయకుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గాయపడ్డ ముగ్గురిని తిరుచ్చెంగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుచ్చెంగోడులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దరా>్యప్తు చేస్తున్నారు. -
కాలా షూటింగ్లో అరుళ్‌దాస్‌కు గాయాలు
తమిళసినిమా: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కాలా చిత్ర షూటింగ్లో విపత్తు నెలకొంది. నటుడు అరుళ్దాస్ కాలికి తీవ్రగాయాలయ్యాయి. నాన్‌మహాన్ అల్ల, పాపనాశం, నీర్పార్వవై, చతురంగం చిత్రాల్లో వివిధ తరహా పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు అరుళ్దాస్. ఈయన కాలా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం చెన్నై పూందమల్లి ప్రాంతంలో ముంబయిలోని ధారావి ప్రాంతాన్ని తలపించే విధంగా భారీ సెట్‌ను వేసి షూటింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం నటుడు అరుళ్దాస్పై సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్లో జీప్ అనూహ్యంగా అరుళ్దాస్ వైపు దూసుకురావడంతో ఆయన కాలుపై ఎక్కేసింది. దీంతో అరుళ్దాస్ కాలి వేళ్లు నలిగిపోయాయి. దీంతో వెంటనే ఆయన్ని చిత్ర యూనిట్ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు అరుళ్దాస్ కాలి వేళ్లు మూడు పాక్షికంగా విరిగాయని, ఆయనకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు. -
ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఏమైంది?
బుధవారం బళ్లారి సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై తీవ్ర గాయాలతో పడి ఉన్న ఈ యువతి ఒక ఐటీ ఉద్యోగిని. ఇది ప్రమాదమా.., లేక ఆత్మహత్యాయత్నమా? అనేది తేలాల్సి ఉంది. ఇంటి నుంచి బయల్దేరిన యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో ఇలా కనిపించింది. ఘటనపై పోలీసులు నోరుమెదపడం లేదు. బళ్లారి అర్బన్ : సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే యువతి రైలు పట్టాలపై తీవ్ర గాయాలతో పడి ఉండగా రైల్వే పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈఘటన బళ్లారి నగరంలోని రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని మోతీ బ్రిడ్జీ పక్కన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. బళ్లారిలోని పార్వతీనగర్‌కు చెందిన స్వాతి (22) బీకాం పూర్తి చేసి పూణాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఈమెకు తండ్రి మృతి చెందాడు. తల్లి బళ్లారిలో పెద్ద కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. స్వాతి ఉగాది పండుగ కోసం బళ్లారి వచ్చింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటినుంచి వెళ్లిన స్వాతి రైలు పట్టాలపై గాయాలతో కనిపించింది. ఘటనపై బళ్లారి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు యత్నించిందా? ప్రమాదవశాత్తు రైలు కింద పడి గాయపడిందా ? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పిచ్చి కుక్క స్వైర విహారం
రాయచోటి రూరల్: పెమ్మాడపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని గరుగుపల్లె, వడ్డెపల్లె, కొండోళ్లపల్లె గ్రామాలకు చెందిన 30 మందిపై పిచ్చికుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు కొండోళ్లపల్లెలో ఆరుబయట నిద్రిస్తున్న 10 మందిని ఆ కుక్క కరిచింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో గరుగుపల్లె, వడ్డెపల్లెలో 20 మందిపై దాడి చేసింది. అలాగే ఆ మూడు గ్రామాల్లో 20 పశువులను కూడా కరిచిందని స్థానికులు తెలిపారు. గరుగుపల్లెకు చెందిన లక్ష్మీదేవి నుదుటున, వెంకటమ్మ మోచేతి పైన తీవ్ర గాయాలయ్యాయి. వీరితోపాటు గాయపడిన వారిలో రెడ్డెమ్మ, నాగులమ్మ , సిద్దన్న, ఓబులమ్మ, అంజలి , నాగసిద్దయ్య, జ్యోతి, అప్పన్న, పాపులమ్మ, ఆంజినేయులు, మల్లికార్జున తదితరులు ఉన్నారు. వారిని 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన 10 మందిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అధికారులు చర్యలు తీసుకుని పిచ్చికుక్కలను అదుపు చేయాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు. -
లాఠీచార్జిలో బీజేపీ ఉపాధ్యక్షుడికి తీవ్రగాయాలు
కేరళలోని ఒక న్యాయ కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు, జర్నలిస్టులతో పాటు కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ వావా కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వావాకు టియర్ గ్యాస్ షెల్ తలమీద తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కేరళ న్యాయ అకాడమీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ప్రైవేటు కళాశాల. ఇక్కడ ప్రిన్సిపాల్ లక్ష్మీ నాయర్‌ను తొలగించడంతో విద్యార్థులు గత మూడు వారాలుగా సమ్మె చేస్తున్నారు. ఇదే అంశంపై మంగళవారం నాడు బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించగా, పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. పోలీసు దాష్టీకానికి నిరసనగా తిరువనంతపురంలో బీజేపీ బుధవారం నాడు హర్తాళ్‌కు పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వి.మురళీధరన్ న్యాయకళాశాల ఎదురుగా నిరాహార దీక్ష ప్రారంభించగా, ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయన స్థానంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి రాజేష్ గురువారం నుంచి దీక్ష ప్రారంభిస్తారు. తాను కూడా విద్యార్థులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కె.మురళీధరన్ ప్రకటించారు. -
ఏటీఎం వద్ద నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: ఏటీఎం వద్ద అర్ధరాత్రి క్యూలో నిల్చున్న వారిపైకి కారు వేగంగా దూసుకు రావడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులు సొహైల్ (19), రిజ్వాన్ (19), నవీన్ (19) డబ్బుల కోసం గురువారం అర్ధరాత్రి నానల్‌నగర్‌లోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు వెళ్లారు. అక్కడ జనాలు బారులు తీరి ఉన్నారు. దీంతో వారి వెనుక వరుసలో ముగ్గురు స్నేహితులు నిలబడ్డారు. 2.30 ప్రాంతంలో లంగర్‌హౌస్ నుంచి వచ్చిన తెలుపురంగు స్విఫ్ట్ కారు ఏటీఎం వద్ద నిలబ డిన వారిపైకి దూసుకెళ్లింది. దీంతో రిజ్వాన్, నవీన్‌లకు తీవ్రగాయాలయ్యాయిు. సొహైల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన అనంతరం కారు ఆపకుండా దూసుకుపోరుుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమో దు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధా రంగా కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
బ్రిడ్జిని ఢీకొట్టిన స్కూల్ బస్సు
డ్రైవరు నిర్లక్షం వల్లనే ప్రమాదమని ఆరోపణలు తాడ్వాయి : ప్రవేటు స్కూల్ బస్సు బ్రిడ్జిని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు ఆయాలకు గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి దగ్గరలో ఉన్న ఎస్పీఆర్ పాఠశాలకు చెందిన బస్సు రోజు మాదిరిగానే తాడ్వాయి మండలంలోని నందివాడ, ఎర్రపహాడ్,ఎండ్రియాల్, తాడ్వాయి, క్రిష్ణాజివాడి తదితర గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లింది. నందివాడకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, ఎర్రపహాడ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను తీసుకొని వస్తుండగా డ్రైవర్ నారాగౌడ్ అజాగ్రత్త వల్ల వాగుపై ఉన్న బ్రిడ్జికి ఢీకొట్టింది. దీంతో ఎర్రపహాడ్‌కు చెందిన సొంటికే జనార్దన్–భారతిల కుమారుడు ఆద్శకుమార్ (యూకేజీ)కు ముఖానికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎర్రపహాడ్‌కు చెందిన సొంటికే దశరథ్–వీణల కుమార్తె అమూల్య(4వతరగతి)కు చేతి విరిగింది. ఆదిత్య అనే విద్యార్థికి, అందులో ఉన్న ఆయాలు గంగమణి, సుగుణలకు తీవ్రగాయాలు అయ్యాయి. అదేవిధంగా విద్యార్థులు ఆర్వాన్, శెర్వాన్, రిషికేతన్కు స్వల్పగాయాలయ్యాయి,వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రవేటు హాస్పిటల్‌కు 108 వాహనంలో తరలించారు. ఘటనా స్థలికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బండరాయి మీదపడి వ్యక్తి దుర్మరణం
ఘట్కేసర్ మండలం మైసమ్మగుట్టలో ఘటన ఘట్కేసర్: బండరాయి మీదపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైసమ్మగుట్ట కాలనీలో నివాసం ఉండే వరికుప్పల లక్ష్మయ్య(32) రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అతడు మంగళవారం ఉదయం కాలనీ సమీపంలోని గుట్టపైకి రాళ్లు కొట్టేందుకు వెళ్లాడు. రాళ్ళు కొడుతుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని పెద్ద బండారారుు వచ్చి అతడిపై పడిపోరుుంది. తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బండరారుుని తొలగించి మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య స్వర్ణ, పిల్లలు సరిత, అశోక్ ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయూలు
సాలూరు: పట్టణంలోని డీలక్స్ సెంటర్ చర్చివద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చర్చి దగ్గరకు వచ్చేసరికి ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తున్న రజనీకాంత్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బైక్ కూడా నుజ్జునుజ్జైంది. క్షతగాత్రుడ్ని స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బైక్ బోల్తా పడి ఒకరికి.. అలమండ (జామి): బైక్ బోల్తాపడడంతో ఒకరు గాయపడిన సంఘటన అలమండలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. ఎ. కాశీ (26) ఎలమంచిలి నుంచి విజయనగరం వైపు బైక్‌పై వస్తుండగా, అలమండ వంతెన సమీపంలో అదుపు తప్పి పడిపోయూడు. దీంతో శివకు తీవ్ర గాయూలయ్యూరుు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడ్ని 108లో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
భౌబోయ్!
పిచ్చికుక్క దాడిలో 20మందికి తీవ్ర గాయాలు ఆరుగురిని విశాఖ తరలింపు కుక్కల ఏరివేతకు రంగం సిద్ధం పార్వతీపురం: పట్టణంలలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దొరికినవారిని దొరికినట్టు దాడిచేసి కరిచేసింది. దాని బారినపడి 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బుధవారం అర్ధరాత్రి రాయగడ రోడ్డులోని వివేకానంద కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై తొలుత దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరచింది. అక్కడి జనం తేరుకునేలోగా కొత్తవీధిలో పలువురిపై దాడిచేసింది. అక్కడినుంచి మాదిగ వీధి, దేవాంగుల వీధి, గొడగల వీధి, కుమ్మరవీధుల్లో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికి కండలు ఊడబెరికింది. తరువాత ఇందిరాకాలనీలో జనంపై దాడిచేసి, కొత్తవలస చేరుకొని ఎన్టీఆర్ కాలనీతోపాటు పలు వీధుల్లోని జనాన్ని గాయపరచింది. ఈ దాడిలో సిరిపురం ప్రసాద్, ఎం.తరుణ్, కన్నూరి గౌరి, చీపురుబిల్లి రాముడమ్మ, బి.ఆదినారాయణ, ఎ.రమణమ్మ, కె.వెంకటి, ఎం.అప్పలనరసమ్మ, కె.రమణమ్మ, ఎస్.భద్రమ్మ, సిహెచ్.రామచంద్రమ్మ, బి.బుచ్చిరాజు, కె.రాము, పి.మరియమ్మ, డి.నారాయణరావు, ఎం.శంకర్రావు, ఆర్.అప్పలనరసమ్మ, సుందరాడ భద్రాచలం, రాజేటి రమణ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నుండే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి క్యూ కట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నాగభూషణరావు, డా. పెద్దింటి రవికుమార్, డా. వెంకటరావు తదితరులు బాధితులకు వైద్య సేవలందించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి.నాగభూషణరావు మాట్లాడుతూ బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదని, అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చామనీ తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వి.సిహెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ ఇప్పటికే ఆ పిచ్చికుక్కను పట్టుకునేందుకు సిబ్బందిని నియమించామనీ, కుక్కల ఏరివేత, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లకు చర్యలు చేపట్టామనీ తెలిపారు. -
జైల్లో ఘర్షణ, అధికారికి తీవ్ర గాయాలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ వారణాసి జిల్లా కారాగారంలో ఖైదీలకు, పోలీసులకు మధ్య శనివారం ఉదయం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో జైలు ఉన్నతాధికారి తీవ్రంగా గాయడ్డారు. ఖైదీలకు, జైలు పోలీసులకు మధ్య జరిగిన అల్లర్లు రణరంగాన్ని తలపించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శనివారం ఉదయం ఇద్దరు ఖైదీలను జైలు గార్డులు చితకబాదడంతో పాటుగా, తమకు అందించే ఆహారంలో నాణ్యత సహా అనేక సమస్యలపై అసంతృప్తితో రగిలిపోతున్న ఖైదీలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు ఖైదీలపై విరుచుకుపడ్డారు. దీంతో వివాదం మొదలైంది. పోలీసులపై తిరగబడిన ఖైదీలు రాళ్లు రువ్వడంతో జైలు ఆవరణంతా రాళ్లతో నిండిపోయింది. ఈ ఘర్షణలో డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అజయ్ రాయ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది జైలు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. జైలు చుట్టూ పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఆఫ్ దళాలు సహా అదనపు బలగాలను మోహరించినట్లు ఉన్నతాధికారి రాజ్ మణి యాదవ్ తెలిపారు. మరోవైపు ఘర్షణకు దిగిన ఖైదీలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
పోలీస్ స్టేషన్లో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ భవన విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఓ కేసు విషయమై ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువకుడి తలపై ఇటుకలు పడడంతో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాల య్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా మరిపెడ శివారులోని తండా సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మరిపెడ వస్తున్న ఆటో తండా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పత్తి మిల్లులో ప్రమాదం: బాలికకు గాయాలు
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుబీర్ గ్రామ సమీపంలోని పత్తి మిల్లులో జరిగిన ప్రమాదంలో ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. శనివారం ఉదయం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక బాలికపై ప్రమాదవశాత్తు ఇనుప కడ్డీ పడటంతో తలకు తీవ్ర గాయమైంది. నిర్వాహకులు వెంటనే భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. -
తుంగతుర్తిలో పిచ్చి కుక్క స్వైరవిహారం
నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో ఓ కుక్క కనిపించిన వారినల్లా కరిచేసింది... స్థానిక రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో స్వైర విహారం చేసింది. పాఠశాలకు చెందిన బాలుడితో పాటు.. రోడ్డున పోయే వారినీ కరిచేసింది. కుక్క దాడిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
మందుగుండు పేలి నలుగురికి తీవ్ర గాయాలు
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో ఓ ఇంట్లో మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు జరిగింది. కూరాసుల వీధిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి 70 శాతం కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి 40 శాతం కాలిన గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలుడు- పది మందికి తీవ్ర గాయాలు
కొత్త గ్యాస్ కనెక్షన్ వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జీఐసీ కాలనీలో హుస్సేన్ అనే వ్యక్తి కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాడు. బంధువులను పిలుచుకుని ప్రార్థనల అనంతరం గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా... సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు వీరిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. -
కారు-బైక్ ఢీ.. యువకుడి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్(25) ట్రావెల్స్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం బైక్‌పై చేబ్రోలు నుంచి గుంటూరు వెళ్తున్న సమయంలో గుంటూరు నుంచి తెనాలి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో హుస్సేన్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతం ఒకరికి గాయాలు
రిపేరు కోసం కరెంటు స్థంభంపైకి ఎక్కిన ఓ వ్యక్తి విద్యుత్‌షాక్ కొట్టడంతో తీవ్రగాయాలైన సంఘటన ప్రకాశంజిల్లా కొమరోలులో బుధవారం జరిగింది. కొమరోలులోని సాయిబాబా ఆలయ సమీపంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగటంతో మరమ్మతు కోసం బాషా అనే వ్యక్తి స్థంభంపైకి ఎక్కాడు. ప్రమాద వశాత్తు అతడినిక షాక్ కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని వెంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు