సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం మంగలి గుంటపాలెం గ్రామానికి చెందిన ఎస్తేర్‌రాణి(36) సోమవారం సాయంత్రం కుమారుడితో కలిసి సైకిల్‌పై వెళ్తోంది.
ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ వారిని ఢీకొట్టటంతో ఎస్తేర్‌రాణి అక్కడికక్కడే మరణించింది. గాయపడిన ఆమె కుమారుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు.