మరో సారి విశాఖలో వీధికుక్కలు రెచ్చిపోయాయి.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని విధికుక్కలు తీవ్రంగా గాయపర్చాయి.
మరో సారి విశాఖలో వీధికుక్కలు రెచ్చిపోయాయి.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని విధికుక్కలు తీవ్రంగా గాయపర్చాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణ పురంలో గురువారం జరిగింది. వివరాలు.. స్థానిక కాలనీలో నివాసముంటున్న మురళి, కుమారిల మూడేళ్ల కుమారుడు ఊట్కూరి కిరణ్ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో.. వీధి కుక్క దాడి చేసింది. దీంతో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిని గుర్తించిన తల్లిదండ్రులు కుక్కను తరిమి బాలుడిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.