Street dogs
-
వీధి కుక్కలతో తస్మాత్ జాగ్రత్త !
-
చిన్న పిల్లోడు...20 కుక్కలు ఒకేసారి..!
-
కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి?వాటికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుందా?
జిల్లాలో రోజురోజుకూ కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ నే ఉన్నాయి. వీధులు, రోడ్లపై గుంపులు గుంపులు గా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. అంతేకాకుండా ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నాయి. శునకాల దాడిలో చిన్నారులు ప్రాణాలు వదిలిన సందర్భా లు అనేకం. కుక్క కాటుకు గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజు రోజుకు కుక్కల బాధితులు పెరిగిపోతున్నారు. కుక్కలు కరవడం వల్ల రేబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రేబిస్ వల్ల ఏటా 55 వేల మందికి పైగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మన దేశంలో కుక్క కాటుకు ఏటా 15 వేలకు పైగా మంది చనిపోతున్నారు. ఆకలితో దాడి చేస్తున్నాయా..? ఇంతకీ కుక్కలు మనుషులపై ఎందుకు తెగబడుతున్నాయి. ఆకలితోనా లేక దూపతోనా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసేవి కావు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, వాటికి హాని చేసే జంతువులు, ఇతర ప్రాణులు ఏవైనా కనిపిస్తే దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేయడం ఎక్కువైంది. ఏ కుక్క మంచిదో ఏది పిచ్చిదో తెలియని పరిస్థితి నెలకొంది. శునకాల దాడికి ప్రధాన కారణం ఆకలి అని పలువురు అంటున్నారు. గ్రామాల్లో, మున్సిపలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది. దీంతో వాటికి ఆహారం దొరకడం లేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రారంభమయ్యాక రోడ్డు పక్క అన్నం, ఇతర ఆహార పదార్థాలు పడేయడం తగ్గింది. దీంతో వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. పైగా కుక్కలు తరుచూ దాడి చేస్తుండడంతో వాటిని ఎవరూ చేరదీసి ఆహారం పెట్టడం లేదు. దీంతో అవి ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం దాహం తీర్చుకునేందుకు వీధి నల్లాల వద్ద నీరు కూడా దొరడం లేదు. కుక్కలు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది. కొన్ని సార్లు ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. అవి అలా అరుస్తూ వెంటపడినప్పుడు ప్రజలు పరుగెడతారు. దీంతో తమకు భయపడి మనుషులు పరుగెడుతున్నారని కుక్కలు భావిస్తాయి. ఈ క్రమంలోనే వాళ్లను వెండిస్తూ కరచే దాకా వదలవు. ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. ►కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. ► నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. ► కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. ►కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఏబీసీలో 1,429 శునకాలకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ల అనంతరం కొన్నాళ్ల పాటు సెంటర్లోనే ఉన్న కుక్కలు బయటి వచ్చాక వరుసపెట్టి జనాలపై దాడికి తెగబడుతున్నాయి. వీధి కుక్కలను ఒకేచోట పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు బంధించి ఉంచడంతో అవి ఒత్తిడికి లోనై మనుషులపై దాడి చేస్తున్నట్లు తెలిసింది. తాండూరులోని ఏబీసీ సెంటర్లో కూడా సుమారు 1,247 కుక్కలకు ఆపరేషన్లు చేశారు. కుక్క కరిస్తే ఏం చేయాలి? కుక్క కాటుకు గురైన వ్యక్తి ఐదు సార్లు రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటు వల్ల బాగా గాయం అయ్యి రక్తస్రావం అయితే వ్యాక్సిన్ తో పాటు కరిచిన చోట ఇమ్యునొగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే..గతంలో కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒకప్పుడు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేసేవారు. దీంతో ఆ వ్యక్తి ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి మారింది. వ్యాక్సినేషన్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల కుక్కలకు రేబీస్ వ్యాధి సోకకుండా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. అయినా ఎక్కడో ఒక చోట రేబీస్ వ్యాధితో కుక్కలు జనాలపై దాడి చేస్తున్నాయి. రేబిస్‌తో చాలా ప్రమాదం రేబీస్ వ్యాధికి గురైన పశువులను కుక్కలు కరిసినా, రేబీస్ వ్యాధి ఉన్న కుక్కను మరో కుక్క కరిచినా వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి సోకుతుంది. ఆ కుక్కలు మనుషులను కరిస్తే ప్రమాదం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే రేబీస్ వ్యాధి సోకుండా ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నాం. పెంపుడు కుక్కలకు కూడా వాటి యజమానులు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలి. కుక్కలను భయపెట్టడం, నేరుగా వాటివైపు చూడడం, వాటి దగ్గరగా పెద్ద చప్పుడు చేయడం వంటివి చేయరాదు. అలా చేస్తే అవి దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – అనిల్‌కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
‘భౌ’బోయ్.. కరుస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు నిత్యం వీధి, పెంపుడు శునకాలతో దాడి ముప్పు పొంచి ఉందని భయపడుతున్నారట. ఇందులో 61 శాతం మంది ఇలాంటి దాడులు సర్వ సాధారణమని చెప్పగా.. ఇది గతంతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపిస్తోంది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 326 జిల్లాల్లో 53 వేల మందికిపైగా ప్రజల నుంచి ప్రతి స్పందనలు స్వీకరించింది. వీరిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో 8 మంది కుక్కల బెడదను తొలగించడంలో అధికారుల సహకారం దూరమైందని అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణ, పెంపుడు కుక్కల డేటా సేకరణలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. కేవలం 10 శాతం మంది మాత్రమే అధికార యంత్రాంగంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 71 శాతం మంది ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద విచ్చలవిడి జంతు నిర్వహణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం. 36 శాతం రేబిస్ మరణాలు భారత్‌లోనే! దేశంలో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960 ప్రకారం జంతువులను హింసించడం, చంపడం చట్టవిరుద్ధం. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్–2001 ప్రకారం.. వాటి జనాభాను తగ్గించడానికి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో నిధుల కొరతతో వీధి కుక్కలకు టీకాలు వేయడంలో విఫలమవుతున్నట్టు సర్వే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36 శాతం భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే 18వేల నుంచి 20వేల మరణాలు సంభవిస్తున్నాయి. 30నుంచి 60 శాతం మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. వీధి శునకాలకు వేటాడే స్వభావం వీధి శునకాలకు విచ్చలవిడిగా వేటాడే స్వభావం ఉంటుందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి సంచరిస్తున్న ప్రదేశంలో ఆహారం లభించకుంటే చిన్నచిన్న జంతువులను చంపి తింటాయని.. ఆ ప్రక్రియ వాటి మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేస్తోందని వాదిస్తున్నారు. ఏటా ఆడ శునకం 20 పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కసారి కారు, బైక్ ప్రమాదంలో శునకం పిల్ల చనిపోతే ఆ వాహనాన్ని శత్రువుగా భావిస్తుంది. అలాంటి వాహనాలు వస్తే దూకుడుగా వెంబడించడం.. దాడి చేయటం వాటికి అలవాటుగా మారుతుందంటున్నారు. గతేడాది మహారాష్ట్రలో అత్యధికంగా 3,46,318 శునకాల దాడుల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో 1,69,378, ఉత్తరాఖండ్‌లో 1,62,422, కర్ణాటకలో 1,46,094, గుజరాత్లో 1,44,855, బీహార్‌లో 1,18,354 కేసులొచ్చాయి. -
కరీంనగర్ జిల్లాలోనూ కుక్కలు స్వైర విహారం
-
హైదరాబాద్ లో కుక్కల బెడదపై స్పందించిన కేటీఆర్
-
హైదరాబాద్ అంబర్ పేటలో విషాదం
-
పిచ్చికుక్కలు స్వైరవిహారం...20 మంది పై దాడి
సాక్షి, హైదరాబాద్/అల్వాల్: ఓల్డ్ అల్వాల్ ప్రెసిడెన్సీ కాలనీలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో దాదాపు 20 మందికి పైగా కాలనీ వాసులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి కాలనీలో పాదచారులు, బయట ఆడుకుంటున్న చిన్నారులపై దాదాపు మూడు పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఫలితంగా కాలనీలో నివసించే వారితో పాటు అటుగా వెళ్తున్న పాదచారులు సైతం తీవ్ర గాయాల పాలయ్యారు. దాదాపు 20 మందికి పైగా కుక్కల దాడిలో గాయపడ్డారు. గాయత్రి అనే అయిదేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క విచుకుపడటంతో ఆమె ముఖంపై తీవ్ర గాయమై పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది. కాలనీలో గురువారం ఉదయం వరకు పిచ్చికుక్కలు వీరంగం చేశాయి. దీంతో జీహెచ్ఎంసి సిబ్బంది కుక్కలను పట్టుకువెళ్లారు. కుక్కల బెడద తప్పేదెప్పుడు..? కుక్కల సంతాన నియంత్రణకు, ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు ఏటా దాదాపు రూ.10 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నప్పటికీ, నగరంలో పిచ్చి కుక్కల బెడద తప్పడం లేదు. తాజాగా అల్వాల్ సర్కిల్ పరిధిలో కుక్కలు 20 మందిని కరవడంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండేళ్ల క్రితం సైతం అమీర్‌పేటలో ఓ కుక్క దాదాపు 50 మందిని కరవడం తెలిసిందే. అప్పట్లో ఆ కుక్కకు రేబిస్ వ్యాధి ఉన్నట్లు బెంగళూర్‌లోని పరిశోధన సంస్థ వెల్లడించింది. తాజా ఘటనలోనూ పరీక్ష ఫలితాలు వెలువడితే కానీ దానికి రేబిస్ ఉందో, లేదో తెలియదు. కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, రేబిస్ సోకకుండా వ్యాక్సిన్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఏడాది క్రితం కొన్ని వార్డులను ఎంపిక చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించిన అధికారులు దాని ఫలితాలేమిటో వెల్లడించలేదు. వీధి కుక్కలను పట్టుకురావడం.. సంరక్షణ బాధ్యతల్ని సైతం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయినా నగరంలో కుక్కల బెడద తప్పడం లేదు. ఏటా ఎన్నో ఆపరేషన్లు చేసినట్లు చెబుతున్నా ఇప్పటికీ నగరంలో పది లక్షలపైనే వీధి కుక్కలున్నట్లు అంచనా. ప్రతినెలా నగరంలో 2వేల నుంచి 4వేల మంది వరకు కుక్కకాట్ల బారిన పడుతున్నారు. (చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది) -
మూగప్రేమకు అమ్మానాన్న.. 50 ఏళ్లకుపైగా సేవలు
‘మానవసేవే మాధవసేవ’గా భావిస్తారు. ఈ దంపతులు మాత్రం అంతకుమించి జంతుసేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నారు. ‘ఆకలి’ అన్ని ప్రాణులకు సమానమే. మనిషికి ఆకలైతే నోరు తెరిచి అర్ధించి కడుపు నింపుకుంటారు. జంతువులు ఆకలైయినా నోరు తెరిచి అడగలేవు. తాము తినేప్పుడు ఎదుటకు వచ్చిన మూగజీవుల ఆకలి బాధను వారు గ్రహించారు. ఆరోజు నుంచి క్రమం తప్పకుండా రెండుపూట్ల వాటి ఆకలి తీర్చడం దినచర్యగా పెట్టుకున్నారు. అన్నం, కూరలు వండి మూగజీవులుండే ప్రాంతాలకు వెళ్లి ప్రేమతో ఆహారాన్ని అందిస్తూ అమ్మానాన్నలయ్యారు. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్కాలనీలో ఎం.విజయ్‌కుమార్, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారుండేది మానవ ప్రపంచంలో అయినా మనస్సు మాత్రం జంతు ప్రపంచంతో ముడిపడి ఉంది. విజయ్‌కుమార్ కేబుల్ ఆపరేటర్. వేకువజాము నుంచి కుక్కలు, కోతులు, పిల్లులు, ఆవులు, పక్షుల ఆకలి తీర్చడంతో ఈ దంపతుల దినచర్య ప్రారంభమవుతోంది. ఆ సమయానికి మూగప్రాణులు వారి కోసం ఎదురు చూస్తుంటాయన్న ఆత్రుత వారిలో కనపడుతుంటుంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నుంచి అయ్యప్పగుడి సెంటర్ వరకు ఉన్న వీధుల్లోని మూగజీవాలకు అతను సుపరిచితుడు. ఉదయాన్నే పాలు, బిస్కెట్లు దగ్గర నుంచి భోజనం వరకు అందిస్తుంటాడు. అనారోగ్యం పాలై ఇబ్బందులు పడే వాటికి వైద్యసేవలు సైతం అందిస్తుంటాడు. తాను తినే ముద్దలో మూగజీవాల ఆకలి తీర్చాలనే సంకల్పాన్ని తండ్రి ఆనందరావు దగ్గర నుంచి విజయ్‌కుమార్ పుణికి పుచ్చుకున్నాడు. దీనికితోడు భార్య రాజ్యలక్ష్మి సహకారం కూడా తోడవడంతో తన సేవా కార్యక్రమాలు మరింత బలపడ్డాయి. దీంతో సుమారు 50 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. స్వయంగా వెళ్లి.. ఉదయం ఐదు కేజీలు, సాయంత్రం ఐదు కేజీల బియ్యం, కూరలు, అప్పుడప్పుడు మాంసం, చేపలు కూరలు సైతం వండి ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి మూగజీవాలకు పెడుతుంటాడు. వీధుల్లో చాలామంది ఆహార పదార్థాలను పడేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి మూగజీవాలు తినేవిధంగా తయారు చేస్తారు. విజయ్‌కుమార్ దంపతుల సేవను గుర్తించిన స్నేహితులు, బంధువులు సైతం ఈ విషయంలో తోడుంటారు. వైద్యసేవలు ఆకలి తీర్చడంతో పాటు జబ్బున పడిన మూగ జీవులకు వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ల సహాయం తీసుకునేవాడు విజయ్‌కుమార్. ఓ రోజు రాత్రి సమయంలో రైలు పట్టాల మధ్యలో ఆవు చిక్కుకున్న విషయాన్ని గుర్తించి పశువైద్యాధికారులను, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆవును ప్రమాదం నుంచి తప్పించిన ఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్తాడు. కరెంట్ షాక్‌కు గురైన కోతి కాలును బాగు చేయించేందుకు మూడు నెలలకు పైగా వైద్యసేవలు అందించానంటాడు. తాను చేస్తున్న పనులను చూసి ఆ వీధుల్లో వారు పాలు, పెరుగు ఇచ్చేవారు. కరోనా సమయంలో.. కరోనా సమయంలో మూగజీవాలు ఆకలికి అల్లాడాయి. ముఖ్యంగా కరెంటాఫీస్ సెంటర్ కోతులకు కేంద్రం. ఆ సమయంలో విజయ్‌కుమార్ కష్టపడి అరటి పండ్లను సేకరించి వాటి ఆకలి తీర్చాడు. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు, పిల్లులకు సైతం ఆకలిని తీర్చడం కరోనా సమయంలో కష్టమైంది. అయినా తమ సేవా కార్యక్రమాలను ఆపలేదు. జంతువులపై తనకున్న జాలి, దయ, తన సంపాదనలో అధికంగా వెచ్చించేందుకు ఇష్టపడ్డాడు. ఇటీవల నెల్లూరులో భారీ వర్షాలు, వరదల సమయంలో సైతం మూగజీవాలకు ఆహారం పెట్టే కార్యక్రమాలకు బ్రేక్ వేయలేదు. మొదలైందిలా.. విజయ్‌కుమార్ తండ్రి ఆనందరావు ఆర్టీసీ ఏడీసీగా పని చేస్తుండేవారు. ఆ రోజుల్లో జంతువులకు బిస్కెట్లు, పాలు అందించేవాడు. తాను వి«ధులకు వెళ్లి వచ్చేప్పుడు విధిగా ఈ పనిని చేయడం తనకు అలవాటు. ఈ పని చిన్నప్పటి నంచి విజయ్‌కుమార్ చూస్తూ మూగజీవాలపై ప్రేమను పెంచుకున్నాడు. ఉద్యోగం నుంచి తండ్రి విశ్రాంతి పొందిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ ఈ పనిని కొనసాగించారు. తమకున్నంతలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో పాటు అన్నం ఆయా ప్రాంతాల్లోని జంతువులకు పెట్టడం దిన చర్యగా చేసుకున్నారు. ఎంతో ఆనందాన్నిస్తోంది తాను తినే ముద్దలోనే పశుపక్షాదుల ఆకలి గుర్తు చేసుకుంటాం. ఉన్నంతలోనే మా కుటుంబం మూగజీవాల కోసం సహాయం అందించడం తృప్తినిస్తుంది. వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఉదయాన్నే గోవులు, పక్షుల ఇంటి ముందు వాలడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక గంట కేటాయిస్తే మూగజీవాల ఆకలి తీర్చిన వాడినవుతాను. మనుషులకు పెడితే మర్చిపోతారేమో కానీ, మూగజీవాలు మాత్రం తమ ప్రేమను కళ్లల్లోనే చూపే విధానం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలకు ఎటువంటి సేవలు కావాలన్నా 97002 21223 నంబర్‌కు ఫోన్ చేస్తే నిస్వార్థంగా అందిస్తాను. – విజయ్‌కుమార్ -
250 కుక్కలకు చికెన్ బిర్యానీ; నెలకు రూ.60 వేల ఖర్చు
సాక్షి, హైదరాబాద్: సామాజికసేవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ యానిమల్ సర్వీస్ చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్. సౌదీ అరేబియాలో జాబ్ చేసిన ఇతను భారత్‌కు తిరిగి వచ్చాక సమాజసేవ చెయ్యాలనుకున్నాడు. దీంతో ఘటకేసర్లో ఆర్ఫనేజ్ మొదలు పెట్టాడు. అయితే ల్యాండ్ సమస్య వల్ల అది మూసివేయాల్సి వచ్చింది. గత 12 సంవత్సరాల నుంచి మాత్రం ఈయన డాగ్ లవర్‌గా మారిపోయారు. ఎల్లారెడ్డిగూడ నుంచి ఎస్ఆర్నగర్ వరకు రోజూ 200 నుంచి 250 వీధి కుక్కలకు ఈయన భోజనం పెడుతుంటాడు. వివిధ ప్రమాదాల నుంచి కాపాడిన కుక్కలు కూడా ఈయన దగ్గర 10 వరకు ఉన్నాయి. రోజూ ఉదయం 4 గంటలకు లేచి కుక్కలకోసం వంట వండడం స్టార్ట్ చేస్తారు. ఉదయం దాదాపు 70 కుక్కలకు, సాయంత్రం 200 నుంచి 250 కుక్కలవరకు పోషిస్తున్నాడు. పైగా చికెన్ బిర్యానీ లాంటివి కూడా వండి పెడుతుంటాడు. వీటికి నెలకు 60 వేలు ఖర్చవుతుంది. అయినా కూడా ఈయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. స్నేహితులు, చుట్టాలు, యానిమల్ లవర్స్ సహాయంతో దీనిని నేటికి కొనసాగిస్తున్నాడు. ఆయన చేస్తున్న ఈ పనికి తన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. -
అక్కున చేర్చుకుందాం
మూడున్నర కోట్లకు పైగా వీథికుక్కలున్నాయి మనదేశంలో. పెంపుడు కుక్కలకు ఉన్నట్లు వాటి పొట్టను చూసి ఆకలి తీర్చే పెట్ పేరెంట్స్ ఎవరూ వీథి కుక్కలకు ఉండరు. వాటి ఆహారాన్ని అవి సొంతంగా సంపాదించుకుంటాయి. అది ప్రకృతి నియమం కూడా. అయితే... వాటికి ఎదురయ్యే ప్రధాన కష్టం ఆరోగ్యరక్షణ లేకపోవడమే. ‘‘ప్రతి పాణికీ జీవించే హక్కు ఉంది. వీథికుక్కలు అయినంత మాత్రాన వాటి జీవించే హక్కును కాలరాసే అధికారం మనిషికి ఉండదు. చేతనైతే వాటిని పరిరక్షించడానికి ముందుకు రండి’’ అంటున్నారు ఎన్ఆర్ఐ ఉజ్వల చింతల. ఇందుకోసం ఆమె ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ను స్థాపించి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలోని వీథికుక్కల కోసం పని చేస్తున్నారు. మాది మహేశ్వరం ఉజ్వల చింతల 2019లో యూఎస్, ఫ్లోరిడాలో ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొన్నేళ్లుగా ఆమె వీథి కుక్కల కోసం పని చేస్తూనే ఉన్నారు. ‘‘మాది హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం. నాన్న నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయంలోనే చదివాను. బాండింగ్ నా బలం, బలహీనత కూడా. ఇంటర్‌కి విజయవాడలోని మేరీస్టెల్లా కాలేజ్‌లో చేరిస్తే అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక, మూడు నెలల్లో వెనక్కి వచ్చేశాను. డిగ్రీ హన్మకొండ, ఎంబీఏ బెంగళూరులో చేసిన తర్వాత పెళ్లితో యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. యూఎస్‌లో కంప్యూటర్స్ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరాను. పేరెంట్స్ మీద బెంగ తో తరచూ ఇండియాకి వస్తూనే ఉంటాను. అలా రావడమే ఈ సేవాపథంలో నడిపించింది. పాలు తాగే పిల్లల్ని విసిరేశారు 2013లో ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటి వాళ్లు చిన్న కుక్కపిల్లల్ని పాలుతాగే పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటపడేయడం నా కంట పడింది. అప్పుడు తల్లి కుక్క పడిన ఆరాటం, ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు. మరోసారి పెళ్లిలో భోజనాల దగ్గర... పదార్థాలన్నీ పారవేస్తున్నారు. ఆ ప్లేట్ల కుప్ప మీదకు కుక్కలు ఎగబడుతున్నాయి. ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని విచక్షణరహితంగా కొడుతున్నాడు. అలాంటిదే మరోటి... ఓ కుక్కకు వెనుక కాళ్లు రెండూ విరిగిపోయాయి. దేహాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోతోంది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పర్మిషన్ తీసుకుని నాతోపాటు మూడు కుక్కలను యూఎస్ తీసుకెళ్లాను. అక్కడ చికిత్స చేయించి కోలుకున్న తర్వాత పెంచుకునే వాళ్లకు దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి స్ట్రే యానిమల్స్ కోసం పని చేస్తున్నాను. అమెరికాలో లడ్డూ హౌస్ హైదరాబాద్, అమీన్పూర్లో షెడ్ వేసి, ముగ్గురు ఉద్యోగులతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇప్పడు తొంభై ఉన్నాయి. నెలనెలా వాటి పోషణ, ట్రీట్మెంట్ కోసం డబ్బు పంపిస్తున్నాను. నా జీతం నుంచి కొంత భాగం, నా లడ్డూ హౌస్ రాబడితో వాటిని సంరక్షిస్తున్నాను. లడ్డూ హౌస్ బ్రాండ్ మీద నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్‌తో తినుబండారాలు తయారు చేసి, ఆదివారం ‘స్ట్రే యానిమల్స్ కోసం’ అని బోర్డు పెట్టి సేల్ చేస్తున్నాను. యూఎస్‌లో చారిటీ కోసం సేల్స్ చేసినప్పుడు... ఒక వస్తువు ధరను ఆ పదార్థానికి ఆపాదించి చూడరు, చారిటీ కోసం ధారాళంగా ఖర్చు చేస్తారు. మేము ప్రధానంగా గాయపడిన కుక్కలకు వైద్యం చేయించడం, కోలుకున్న తర్వాత పెంపకానికి ఇచ్చేయడం లేదా స్వేచ్ఛగా వదిలేయడం మీద దృష్టి పెట్టాం. ముసలితనం వల్ల ఎటూ పోలేని కుక్కలకైతే జీవితకాలపు సంరక్షణ బాధ్యత మాదే. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్ వంటి కొన్ని సహకారాలను బ్లూ క్రాస్ నుంచి తీసుకుంటాం’’ అని చెప్పారు ఉజ్వల. భారతీయ సమాజాన్ని ఆమె కోరుకునేది ఒక్కటే... మనం మనుషులం, మానవీయంగా మసలుకుందాం. కుక్క అనగానే తక్కువగా చూడవద్దు. వాటి జీవితం మన అధికారం ప్రదర్శించవద్దు. మనవి ‘ప్రాణాలను హరించే చేతులు కావద్దు, రక్షించే చేతులు కావాలి’ అన్నారు. – వాకా మంజులారెడ్డి -
పెద్ద మనసుంటే తప్ప చేయలేని పని ఆమె చేస్తోంది
పదహారేళ్లయింది ఈ ఫ్రెంచి ప్రొఫెసర్ తన జన్మభూమిని వదిలిపెట్టి వచ్చి. రెండేళ్లుగా ఇండియాలో ఉంటున్నారు. థెరిసా కాలేజ్‌లో పాఠాలు బోధించడమే కాదు, థెరిసా ప్రబోధాలను ఆచరణలో పెడుతూ ఇచ్చే చెయ్యిగా, పెట్టే ముద్దగా జీవిస్తున్నారు. నోరు లేని జీవుల్ని మనుషులుగా చూసే ప్రొఫెసర్ ఫేడెట్.. నోరు తెరిచి ఆడగలేని మనుషుల్ని గమనించి తనే వెళ్లి ఆదుకుంటూ ఉంటారు. ఇదేమీ పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ పెద్ద మనసుంటే తప్ప చెయ్యలేని పని! ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కాలేజ్‌లో ఫ్రెంచి భాషను బోధిస్తుండే ప్రొఫెసర్ ఫేడెట్ బ్యాడీ డీఆర్సిస్ గత ఇరవై నెలలుగా కొచ్చిలోని ప్రధాన కూడళ్లలో కనిపించే ఎవరికీ చెందని మూగజీవాలకు (స్ట్రే యానిమల్స్) ప్రేమతో ఆహారాన్ని అందిస్తున్నారు. ఫేడెట్ ఉంటున్నది కొచ్చిలో. అక్కడి నుంచి ఎర్నాకుళం పది కి.మీ. దూరం. కొచ్చి నుంచి రోజూ ఎర్నాకుళం వెళ్లొస్తుండే ఫేడెట్ తరచు కొచ్చిలోని హైకోర్టు జంక్షన్లో అక్కడి వీధి శునకాలకు బిస్కెట్లు వేస్తూ కనిపిస్తుంటారు. కొన్నిసార్లు వాటి కోసమే వండి తెచ్చిన ఆహార పదార్థాలను ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. ‘‘మనుషుల్ని నేను ఎంత ప్రేమిస్తుంటానో ఈ మూగజీవుల్నీ అంతే’’ అంటారు ఫేడెట్. ఇప్పుడీ కరోనా సెకండ్ వేవ్‌లోనైతే వాటి కోసమే ఆమె వీధుల్లోకి వస్తున్నారు. అందుకు ఆమె పోలీస్‌శాఖ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. 2019 లో కొచ్చి వచ్చారు ఫేడెట్. ఫ్రెంచి ఫ్రొఫెసరమ్మగా కొచ్చి అంతటా ఆమె తెలుసు. ‘‘కోవిడ్ ఇక్కడ ఇంత ఎక్కువగా ఉంది. మీకేమీ భయం వేయడం లేదా? మీ దేశానికి వెళ్లిపోవాలని లేదా?’’ అంటే ‘‘ఇక్కడ నేను సేఫ్‌గానే ఉన్నాను. ఉద్యోగం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్.. అన్నీ ఉన్నాయి. ఈ మాత్రం లేనివాళ్లు మనలో ఇక్కడ ఎంత మంది లేరు? సేఫ్ అంటే కరోనా నుంచి మాత్రమే కాదు కదా. ఆకలి నుంచి, నిరుద్యోగం నుంచి, ప్రతికూల జీవన పరిస్థితుల నుంచి అందరూ సేఫ్‌గా ఉండాలి. అందుకోసం అందరం అందరికీ సహాయంగా ఉండాలి’’ అంటున్నారు ఫెడెట్. -
గ్రామాల్లో వీధి కుక్కలన్నింటికీ టీకాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో తిరుగాడే వీధి కుక్కలన్నింటికీ ర్యాబీస్ వ్యాధి వ్యాప్తి నిరోధక టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాబీస్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్‌శాఖ ఈ టీకాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో వీధి కుక్కలలో సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ఆపరేషన్ చేయించడంతో పాటు కుక్క కరిచినా ర్యాబీస్ సోకకుండా శునకాలకు టీకాలు వేస్తారు. వీధి కుక్కల టీకాలు వేసే ప్రక్రియలో పశు సంవర్థక శాఖ సిబ్బందితో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించింది. మండలంలో ప్రతి రోజూ కనీసం 10 వీధి కుక్కలకు, జిల్లాలో కనీసం 500 కుక్కలకు టీకాలు వేయాలని పేర్కొంది. జిల్లాల వారీగా వీధి కుక్కల టీకాల పురోగతిని ఎప్పటికప్పుడు కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించింది. కాగా, 2020 పూర్తి ఏడాదితో పాటు 2021లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది కుక్క కాటుకు గురైనట్లు అంచనా. -
హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి
డెహ్రాడూన్: కరోనా వైరస్ మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో ప్రతీ ఇంట్లోనూ కరోనా వచ్చిన వారిని దూరంగా ఉంచుతున్నారు. అలా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంగతి వర్ణనాతీతం. కరోనాతో ఒక వ్యక్తి చనిపోతే.. ఆ ఇంటి కుటుంబసభ్యులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి కూడా భయపడుతున్నారు. వారికి ఎక్కడ సోకుతుందో అని భయపడి దూరంగా ఉండే వారికి అంతిమ సంస్కారాలు కానిస్తున్నారు. తాజాగా కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసి అక్కడి స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర కాశీలోని భాగీరథీ నదీ తీర ప్రాంతంలోని కేదార్ ఘాట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. కరోనాతో మృతి చెందినవారికి భాగీరథీ నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం కొన్ని మృతదేహాలను ఖననం చేస్తుండగా.. మరికొన్నింటిని చితి పేర్చి కాలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మృతదేహాలు సగం మాత్రమే కాలినా వాటిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. దీంతో వీధి కుక్కుల అక్కడికి చేరుకొని సగం కాలిన శవాల శరీర బాగాలను పీక్కు తింటున్నాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఒక వ్యక్తి ఈ ఘటనపై స్పందిస్తూ.. ''ఇది చాలా హృదయవిదారకం.. భాగీరథి నదీ తీరానా సగం కాలిన శవాలను కుక్కుల పీక్కు తింటుంటే నా మనసు చెమ్మగిల్లింది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో మృతదేహాల ఒడ్డుకు కొట్టుక వస్తున్నాయి. వీధి కుక్కలు ఆ శవాలను పీక్కుతింటున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆ మృతదేహాలు కరోనా సోకినవారివైతే వ్యాధి మరింత వ్యాపించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం' Uttarakhand | Residents claim that dogs are eating half-burnt COVID bodies at Kedar Ghat, Uttarkashi. After receiving complaints from locals, we have assigned a person at Kedar Ghat for cremation of half-burnt bodies: Municipality president Ramesh Semwal pic.twitter.com/9IvC9ysC6O — ANI (@ANI) June 1, 2021 -
వీధి కుక్కలంటే అందరికి భయం.. కానీ ఆమెకు కాదు!
సాక్షి, నిజాంపేట్: అందరూ కుక్కలు అంటేనే భయపడతారు.. కాని కొందరే వాటిని ప్రేమిస్తారు. అంటువంటి వారిలో సాయిశ్రీ ఒకరు అని చెప్పవచ్చు.. మన పక్కనున్న వారినే పట్టించుకోని ఈ రోజుల్లో.. వీధుల్లో తిరుగుతున్న శునకాలను ఓ యువతి చేరదీసి అన్నీ తానై కంటికి రెప్పలా వాటిని కాపాడుతోంది. వాటి పోషణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆపాయ్యతను పంచడంలో ఎక్కడా హెచ్చుతగ్గులు చూపిండం లేదు. వివరాలు.. బాచుపల్లిలోని ఆదిత్య గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న సాయిశ్రీ రెడ్డి బాక్సింగ్ చాంపియన్. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన అనేక పోటీల్లో పాల్గొని పతకాలు కూడా సాధించింది. కాగా గత సంవత్సరం లాక్డౌన్ కారణంగా హోటల్స్, ఫంక్షన్ హాళ్లను మూసివేయడంతో సరిపడా ఆహారం దొరక్క తల్లడిల్లిన వీధి కుక్కుల పరిస్థితి చూసి ఆమె చల్లించిపోయింది. వాటి సంరక్షణకు నడుం బిగించింది. ప్రగతినగర్‌లోని సింహపురి కాలనీలో ఓ గోదాములో వీధి కుక్కలను ఉంచి వాటికి ప్రతి రోజు ఆహారం అందించడం ప్రారంభించింది. శునకాల ఆలనా పాలాన చూసుకునే బాధ్యతను తన భుజాన వేసుంది. ఇందు కోసం ప్రతి నెలా సుమారు రూ. 30 వేల వరకు వెచ్చిస్తుండటం గమనార్హం. తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో .. ► వీధి కుక్కల సంరక్షకు సాయిశ్రీ తల్లిదండ్రులైన ఈశ్వర్‌రెడ్డి, సు«ధల సహకారంతో పాటు స్నేహితులు, బంధువుల సహకారం కూడా తీసుకుంటోంది. ►తమ కుమార్తె చేస్తున్న పనికి తల్లిదండ్రులు కూడా చేదోడువాదోడుగా నిలవడం గమనార్హం. ►గాయపడిన కుక్కులకు చికిత్స.... ►వివిధ ప్రమాదాల్లో గాయపడిన కుక్కలను, మనుషుల దాడిలో గాయపడిన శునకాలను అక్కున చేర్చుకుని అవసరమైన చికిత్స చేయించి గాయాలు మానే వరకు వాటిని పూర్తి స్థాయిలో సంరక్షిస్తోంది. ►కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి సందర్భంలోనైనా కుక్కలు గాయపడితే వెంటనే సాయిశ్రీకి ఫోన్ వస్తుంది. ►ఇలా ఇప్పటి వరకు 50 వరకు శునకాలను చేరదీసింది. ప్రతి రోజు ఆహారం వండాల్సిందే... ప్రతిరోజు తన దగ్గర ఉన్న కుక్కలకు ఆహారం చికెన్‌తో, గుడ్లతో వండి అందిస్తోంది. గాయపడిన కుక్కలకు ప్రతి రోజు డ్రెస్సింగ్ చేయడం, అవసరమైన మందులు వేయడం చేస్తోంది. అలాగే వృద్ధాప్యం కారణంగా కొందరు తమ పెంపుడు కుక్కలను సైతం రోడ్లపై వదిలేసి వెళుతుంటారు. అలాంటి వాటిని కూడా ఈమె సంరక్షించడం చెప్పుకోదగ్గ విషయం. దీంతో ప్రస్తుతం ఈమె సంరక్షణలో వీధి కుక్కలతో పాటు ల్యాబ్, పామేరియన్ లాంటి బ్రిడ్ జాతి కుక్కలు కూడా ఉన్నాయి. స్థలం లేక పెంపకానికి ఇబ్బంది అవుతోంది.. రోజు రోజుకు కుక్కల సంఖ్య పెరగుతుండటంతో అవసరమైన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మా బంధువు గోదామును గత సంవత్సరం కాలంగా వాడుకుంటున్నాను. కాని అక్కడ వారి పనికి ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం కాని ఎవరైన దాతలు స్పందించి అవసరమైన స్థలం కేటాయిస్తే నా సేవలు మరింత విస్తృత పరుస్తా. కుక్కల ఆహారం కోసం మనసున్న కొద్దిమంది బియ్యం అందిస్తున్నారు. కుక్కలకు మానవత్వంతో ఆహారం అందించాలనుకునేవారు, ఎక్కడైన కుక్కలు గాయాలకు, ప్రమాదాలకు గురైనప్పుడు ఈ నెంబర్‌కు 9949679131 ఫోన్ చేసి సమాచారం తెలుపవచ్చు. – సాయిశ్రీరెడ్డి -
మనిషి కాదు.. మృగం!
మైసూరు: మైసూరులో సభ్యసమాజం తలదించుకునే అమానుషం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువకుడు వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడగా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. మైసూర్‌లోని గోకులం 3వ స్టేజ్‌లో నివసించే సోమశేఖర్ (26) ఈ నెల 11న రాత్రి సమయంలో సందులో చాటుగా వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడుతుండగా, కొందరు యువకుల వీడియో తీసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. పీపుల్ ఫర్ అనిమల్స్ (పీఎఫ్ఎ) అనే స్వచ్ఛంద సంస్థ వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంతువులపై లైంగికదాడి జరిపాడన్న అభియోగాలతో కేసు నమోదు చేసి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. కుక్కను గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. చదవండి:పార్లమెంట్ హౌజ్‌లోనే అత్యాచారం -
వీధి కుక్కల కోసం 'అడాప్ట్ ఎ పెట్'
-
వీధికుక్కలను బతకన్విండి... ప్లీజ్
ప్రకృతిలో మానవుడితో అనేక రకాల జీవులు ఉన్నాయి. అన్ని రకాల జంతువులు, జీవజాలం మానవుడికి ఉపయోగపడుతున్నాయి. అయితే కొన్ని జీవులు, జంతువుల పట్ల మానవులు పక్షపాతధోరణి ప్రదర్శిస్తున్నారు. ఖరీదైన విదేశీ కుక్కలను కొనుగోలు చేసి వాటిని అపురూపంగా పెంచుకుంటున్నారు. అదే సందర్భంలో వీధుల్లో కనిపించే కుక్కల పట్ల వివక్ష చూపుతున్నారు. కొందరు అకారణంగా వాటిని చంపివేయడం, గాయ పరచడం చేస్తున్నారు. చాల వీధికుక్కలకు ఆహారం అందక, తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయి. కరోనా వచ్చాక వీధి కుక్కల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇంతకు మునుపు హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిన ఆహారం తెచ్చి వేసేవారు, ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్ల నడవటం గగనమై వీధి కుక్కలకు ఆదరణ, ఆహారం కరువైంది. ఈ నేపథ్యంలో వీధికుక్కలను ఆదరిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు.. తిరుపతికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ ఉదయ. తన చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు, అవ్వా తాతలు వీధుల్లో తిరిగే ఆవులు, కుక్కలు, ఇతర జంతువులపై ప్రేమ చూపేవారు. వారి నుంచి ఈ సద్గుణాన్ని అందిపుచ్చుకున్న ఉదయ శ్రీ 10 సంవత్సరాల క్రితం బాణ సంచా పేలి శరీరం అంతా కాలి, కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఒక వీధి కుక్కను అక్కున చేర్చుకొని దానిని బాగు చేయించి తానే పెంచుకోవడంతో పాటు దాని సంతతిని తన బంధువులకు ఇచ్చి పెంచుకొనేలా చేసింది. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో భవాని నగర్, అశోక్ నగర్, అలిపిరి బైపాస్ రోడ్డు, కపిల తీర్థం రోడ్డు, ఇస్కాన్ టెంపుల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు 150 వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఎవరి సహాయం కోసమో ఎదురుచూడకుండా తనకున్న ఆర్థిక వనరులతోనే వాటికి ఆహారం సిద్దం చేసి నిత్యం ఆటోలో వెళ్లి ఆయా ప్రాంతాల్లో వీ«ధికుక్కలకు ఆహారం పంచుతూ తనకున్న జంతుప్రేమను చాటుకొంటోంది. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న ఉదయశ్రీని ‘సాక్షి’ పలుకరించింది. ఈ సందర్బంగా ఆమె పలు విషయాలు సాక్షికి వివరించింది. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే... నా పేరు నవకోటి ఉదయశ్రీ. తిరుపతి నగర శివార్లలోని ఒక ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 2014లో బీటెక్ పూర్తి చేశాను. బీటెక్ తర్వాత టీసీఎస్ సంస్థలో ఉద్యోగంలో చేరాను. మూడు సంవత్సరాలు పనిచేశాక ఉద్యోగం వదిలేశాను. ప్రస్తుతం తిరుపతిలోనే ఉంటున్నాను. నా తల్లిదండ్రులు, అవ్వతాతలకు జంతువులంటే ఎంతో ప్రేమ. అమ్మ శాంతి వీధి కుక్కలను, ఆవులను, ఇతర జంతువులను ఆదరించేవారు. వాటికి ఆహారం అందించేవారు. గాయపడిన జంతువులు కనిపిస్తే వాటికి వైద్యం అందించేవారు. చిన్న తనం నుంచి ఇది చూసిన నాకు జంతువులపై ఎంతో ప్రేమ కల్గింది. గత కొన్నేళ్లుగా అనేక వీధి కుక్కలు ఆహారం, నీరు దొరక్క వీధుల్లో రోదిస్తుండటం చూసి వాటికోసం ఏమైనా చేయాలనుకున్నాను. నా వంతు సాయంగా ఆహారం సిద్దం చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 150 వీధి కుక్కలకు అందిస్తున్నాను. నా స్వంత ఖర్చులతోనే ఈ పని చేస్తున్నాను. ఎక్కడైనా వీధి కుక్కలు, ఆవులు గాయపడి కనిపించినా వెంటనే బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో వాటికి వైద్యం అందిస్తాను. ఇందుకు అనిమల్ కేర్ లాండ్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ శ్రీకాంత్ సహకారిస్తున్నారు. నా ప్రయత్నంలో కొన్నిసార్లు చికాకులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ఆపలేదు. వీధికుక్కలు, ఇతర జంతువులు గాయపడతాయన్న కారణంగా చిన్నతనం నుంచి దీపావళి జరుపుకోవడం లేదు. నా ప్రయత్నానికి అమ్మ శాంతి ఎంతో సహకారం అందిస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే... కొన్ని కుక్కలు తప్పు చేశాయని అన్నిటిని ఆలాగే చూడటం భావ్యం కాదు. ఖరీదైన కుక్కల స్థానంలో వీటిని ఆదరిస్తే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆహారం, మురికి నీరు తాగడం వల్ల వాటికి గజ్జి, ఇతర వ్యాధులు సంభవిస్తున్నాయి. వాటికి ఆదరణ ఉంటే ఇలా ఉండవు. ప్రతి ఒక్కరూ ఒక వీధికుక్కనైనా దత్తత తీసుకుంటే బాగుంటుంది. ఉదయశ్రీని ఆతృతతో చుట్టుముట్టిన వీధికుక్కలు -
వీధి శునకాల లెక్క పక్కాగా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వీధి కుక్కల బెడద అంతాఇంతా కాదు. వీటి దాడుల్లో తరచూ ఎంతోమందికి గాయాలవుతూనే ఉన్నాయి. అడపాదడపా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కల దాడుల్లో మరణిస్తున్న వారిలో చిన్నపిల్లలే ఉండటం విషాదకరం. కుక్కల సంఖ్య పెరగకుండా ఉండాలంటే వాటికి సంతాన నిరోధక శస్త్రకిత్సలు (స్టెరిలైజేషన్స్) చేయడం ఒక్కటే మార్గం. కుక్క కరిచినా దాని ద్వారా వచ్చే రేబిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే వీధి కుక్కలన్నింటికీ వ్యాధి నిరోధక వ్యాక్సిన్ (టీకా) వేయాలి. ఇంతకుమించి వేరే మార్గాల్లేవు. కుక్కలను సంహరించేందుకు జంతు సంరక్షణ చట్టాలు ఒప్పుకోవు. అంతేకాదు.. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు జీహెచ్‌ఎంసీలోనిసంబంధిత వెటర్నరీ సిబ్బంది కుక్కలను పట్టుకొని వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్లు చేసి తిరిగి ఎక్కడ పట్టుకున్నారో.. అక్కడే వదిలిపెడతారు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా.. నగరంలో కచ్చితంగా ఎన్ని వీధికుక్కలు ఉన్నాయో సరైన లెక్కల్లేవు. కుక్కలు ఎనిమిది నెలల వయసులోనే సంతానోత్పత్తి శక్తి కలిగి ఉండటం, ఒక కుక్క ఏడాదికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉండటంతో వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక కుక్క, దాని సంతతి ద్వారా ఏడాదికాలంలో 40కిపైగా కుక్కలు నగర వీధుల్లోకి చేరుతున్నాయి. వెటర్నరీ విభాగం శునకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నప్పటికీ, ప్రజలకు కుక్క కాట్లు తప్పడం లేవు. ఈ నేపథ్యంలో గ్రేటర్ నగరంలో ఉన్న మొత్తం వీధి కుక్కలెన్నో తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం సిద్ధమైంది. గుర్తించే ప్రతి కుక్కకూ టీకా వేయడం, దానికి అప్పటి వరకు సంతాన నిరోధక శస్త్ర చికిత్స జరిగి ఉండకపోతే శస్త్ర చికిత్స చేయాలనేది లక్ష్యం. గ్రేటర్ మొత్తం ఒకే పర్యాయం కాకుండా పైలట్ ప్రాజెక్టుగా తొలుత ఐదు వార్డుల్లో ఈ పనులకు నెల క్రితం శ్రీకారం చుట్టారు. ఆగస్ట్ 15 వరకు ఈ సర్వే పూర్తి చేయాలనుకున్నప్పటికీ.. వెటర్నరీ సిబ్బందిలో కూడా కొందరికి కరోనా సోకడం తదితర పరిణామాలతో ఆగస్ట్ నెలాఖరు వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు. పాతబస్తీలోని శాలిబండతోపాటు ఆసిఫ్‌నగర్ వార్డుల్లో సర్వే నెమ్మదిగా జరుగుతోంది. ఆ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందిలో ఎక్కువ మందికి కరోనా సోకడంతో కొందరు మాత్రమే సర్వేలో పాల్గొంటున్నట్లు సమాచారం. -
సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు
-
సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు
మనిషికి మానవత్వానికి విడదీయరాని బంధం ఉంది. అయితే ప్రస్తుతం మనిషి, మనిషికి మధ్య బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా మానవత్వం సన్నగిల్లుతోంది. కానీ మనిషిలోని మంచితనం ఇంకా బతికి ఉందనేందుకు ఈ సంఘటన అద్దంపడుతోంది. అయితే అతడేం ధనవంతుడు కాదు. అయినప్పటికీ తనకున్న దానిలో సాయం చేసి తన దయా గుణాన్ని చాటుకున్నాడు. (అమ్మాయ్.. ఎన్ని మార్కులొచ్చాయ్?) భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో ఓ సందేశాత్మక వీడియోను పోస్టు చేశారు. 17 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో వృద్ధుడైన ఓ బిచ్చగాడు తింటుండగా.. వీధి కుక్కలు అతని చుట్టూ వచ్చి చేరాయి. దీంతో ఆ వృద్ధుడు తింటున్న ఆహారాన్ని రెండు ప్లేట్లలో వేసి కుక్కలకు తినిపించాడు. ‘సంపదలో పేదవాడు. మనసున్న వ్యక్తిలో ధనవంతుడు’ అని షేర్ చేసిన ఈ వీడియోను పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అంతేగాక వృద్ధుడు దయతో చేసిన మంచితనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఈ రోజుల్లో మానవ్వతం తగ్గిపోతుంది. ఈ వృద్ధుడు మనిషిలోని మానవత్వాన్ని చాటుకున్నాడు’. అంటూ కామెంట్ చేస్తున్నారు. (సూపర్ హిట్ సాంగ్‌కు డాన్స్ చేసిన వార్నర్ కూతుళ్లు) -
తన మేకను కుక్క కరిచిందని, 40 కుక్కలను..
భువనేశ్వర్ : ఓ వీధి కుక్క తన మేకను కరిచిందని కుక్కలన్నింటిపైనా కక్ష కట్టాడో వ్యక్తి. ఊర్లో ఉన్న అన్ని కుక్కలకు విషం ఇచ్చి వాటిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని చౌదార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ జిల్లాలోని మహంగలో బ్రహ్మానంద మాలిక్ అనే వ్యక్తి పెంచుకుంటున్న మేకను ఓ రోజు వీధి కుక్క కరిచింది. దానికి గాయమవడంతో అతడు కుక్క జాతిపైనే పగ పట్టాడు. ఊరిలోని కుక్కలన్నింటి ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నాడు. దీనికి భరత్ మాలిక్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. అతనితో కలిసి కుక్కలకు ఎంతో ఇష్టమైన మాంసం తీసుకొచ్చి వాటిలో విషపు గుళికలు కలిపాడు. (మంచాన పడ్డ తల్లిని బ్యాంకుకు లాక్కెళ్తూ..) అనంతరం ఆ విషపు ఆహారాన్ని శునకాలకు ఎరగా వేశాడు. దీంతో దాన్ని తిన్న 40 కుక్కలు రోడ్డుపై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "కళ్లముందే కుక్కలు బాధతో గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోవడం చూడలేకపోయాం. ఇది మా హృదయాలను కలిచి వేసింది" అని ఓ గ్రామస్థుడు తెలిపాడు. ఈ విషయం గురించి ఆ ఊరి సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు సమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక ఈ ఘటన సరిగ్గా ఏ రోజు జరిగిందనేది తెలియరాలేదు. (పోలీసునంటాడు.. సెల్ఫోన్లతో ఉడాయిస్తాడు) -
గ్రామసింహాలూ వేట వైపు?
కేరళ.. ఓ సంవత్సరన్నర క్రితం వరదలతో పోరాడింది. ఆ సమయంలో వందల ఊళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శునకాలకు తిండిలేక దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రాణాలు నిలుపుకునే క్రమంలో అవి ‘వేట’ఆరంభించాయి. కోళ్లు, పక్షులు, కుందేళ్లు లాంటి వాటిని ఆహారం చేసుకున్నాయి. మన దేశంలో దాదాపు 3.5 కోట్ల శునకాలు ఉంటాయన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. హైదరాబాద్‌లో వాటి సంఖ్య దాదాపు 9 లక్షలు ఉంటుంది. మన రాష్ట్రంలో 25 లక్షలకు పైమాటే. సాక్షి, హైదరాబాద్: అనుకోకుండా వచ్చి పడ్డ కరోనా సమస్య ఎన్నో మార్పులకు కారణం కాబోతోంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఇది. కరోనా విపత్తు నుంచి తేరుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కానీ, ఎన్నడూ చూడని విధంగా ప్రస్తుతం మనం అమలుచేసుకుంటున్న లాక్డౌన్ కూడా ఎన్నో మార్పులకు కారణమవుతోంది. ఇది మనుషులకే కాదు, జంతువులకూ వర్తించనుంది. ఈ విషయంలో శునకాలు ముందు వరసలో ఉన్నాయంటున్నారు జంతు ప్రేమికులు. లాక్డౌన్ సమయంలో ఎక్కువ రోజుల పాటు కుక్కలకు తిండి దొరక్కపోవడంతో అవి క్రమంగా ఇతర జంతువులను వేటాడేందుకు యత్నిస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదని వారు హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఇతర జంతువులను వేటాడి చంపేందుకు అలవాటు పడితే, వెంటనే అవి తీరు మార్చుకోని పక్షంలో వన్య ప్రాణులకు ఇబ్బందులు ఎదురుకాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న లాక్డౌన్, మరో పక్షం రోజులు (పొడిగింపు లేకుంటే) జరగాల్సి ఉన్న తరుణంలో కుక్కల తీరులో విపరీత మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’పేర్కొంటోంది. లాక్డౌన్ నేపథ్యంలో కుక్కల ప్రవర్తనలో మార్పులపై కొద్ది రోజులుగా ఆ సంస్థ ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నారు. పూర్తి జనావాసాల్లో ఉండే కుక్కల కంటే, చుట్టూ ఇళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లోని శునకాల్లో ప్రవర్తనలో మార్పు వస్తోందని చెబుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్, సంజీవయ్య పార్కు, హయత్‌నగర్ వైపు ఉన్న శివారు ప్రాంతాల్లో వారు అధ్యయనం చేశారు. పక్షులు, చిన్న జంతువులపై దాడులు.. ఇళ్లలో పెంచుకునే కుక్కలకు నిత్యం సమయానుకూలంగా తిండి లభిస్తుంది. కానీ వీధుల్లో సంచరించే శునకాలు మనుషులు పడేసే పదార్థాల నుంచి ఆహారాన్ని సేకరించుకుంటాయి. హోటళ్ల సమీపంలోని చెత్తకుండీలు, కాలనీలు, బస్తీల్లోని డంపింగ్ స్థలాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పడేసిన ఆహారాన్ని అవి తింటాయి. లాక్డౌన్ నేపథ్యంలో వాటికి ఆ తిండి బాగా కరువైంది. పార్కులు, రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసరాల్లో అయితే అక్కడికి వచ్చే సందర్శకులు, ప్రయాణికులు పడేసే వాటినే అవి తింటుంటాయి. ఇప్పుడు జనం ఇళ్లకే పరిమితం కావటంతో అలాంటి ప్రాంతాల్లో వాటికి తిండి లేకుండా పోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో అవి తీవ్ర ఆకలితో నకనకలాడుతున్నాయి. ఫలితంగా కంటికి కనిపించిన ఇతర చిన్న జంతువులు, పక్షులను వేటాడే ప్రయత్నం చేస్తున్నాయి. వన్య ప్రాణులకు ప్రమాదం.. కుక్కలు ఒకసారి ఇతర పక్షులను వేటాడేందుకు అలవాటుపడితే ప్రమాదం అంటున్నారు యానిమల్ వారియర్స్ సంస్థ వ్యవస్థాపకులు ప్రదీప్ నాయర్. ‘లాక్డౌన్ పరిధి ఎక్కువగా ఉంటే కుక్కలు ఆకలి తీర్చుకునేందుకు ఇతర జంతువులు, పక్షులను వేటాడే పరిస్థితి ఉంటుంది. వాటిలో వచ్చే విపరీత ప్రవర్తనలతో ఒక్కోసారి మనుషులపై దాడి చేసే పరిస్థితి వస్తే ఆ పరిణామం తిరిగి కుక్కలకే శాపంగా మారుతుంది. తమపై దాడి చేస్తే జనం ఆ కుక్కలను చంపేందుకు కూడా వెనకాడరు. ఒకచోట దాడి చేస్తే, చాలాచోట్ల ఊరకుక్కలను బతకనీయరు’ అని పేర్కొన్నారు. కొత్త రోగాలకు అవకాశం: ‘వేటలో భాగంగా కుక్కలు ఇతర జంతువులను వేటాడి తింటే వాటి ద్వారా కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ కుక్కల ద్వారా వన్యప్రాణులకు కొత్త రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది’ అని ఆ సంస్థ మరో ప్రతినిధి సంజీవ్ వర్మ అంటున్నారు. అందుకే ఇలాంటి దుస్థితి రాకుండా గ్రామసింహాలకు ప్రజలు ఆహారాన్ని అందించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని చెబుతున్నారు. -
నేలపాలైన పాల కోసం కుక్కలతో....
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పొట్టనింపుకునేందుకు నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సిగ్గు ఎరగదని... ఈ సంఘటన ఈ నానుడిని మరోసారి గుర్తు చేస్తుంది. నేలపై ఒలికిపోయిన పాలను ఒకవైపు మనిషి ఎత్తిపోసుకునేందుకు ప్రయత్నిస్తే... ఇంకోవైపు కుక్కల గుంపు ఆబగా జుర్రుకోవడం అందరి మనసులను కలచివేసేదే. విషయం ఏమిటంటే.. ఆగ్రాలో తాజ్‌మహల్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం ఓ భారీ పాల వ్యాను బోల్తా పడింది. దీంతో బోలెడన్ని పాలు నేలపై ఒలికిపోయాయి. లాక్డౌన్ కారణంగా తగినంత ఆహారం దక్కని కుక్కల గుంపు ఈ పాలను తాగుతూండగానే...ఓ మనిషి ఈ పాలను ఎలాగైనా వాడుకోవచ్చు అన్న అంచనాతో ఓ మట్టి కుండలో వాటిని చేతులతోనే నింపుకునే ప్రయత్నం కనిపించింది. కమాల్ ఖాన్ అనే వ్యక్తి ఈ విషాద దృశ్యాన్ని వీడియోలో బంధించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి ఆఖరు వారంలో అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పలువురు వలస కూలీలు స్వస్థలాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలామందికి తినడానికి తిండి కూడా దక్కడం లేదు. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి వలస కూలీలకు ఆహారం అందించే ప్రయత్నం జరుగుతున్నా.. కొందరు ఇప్పటికీ తిండికి అల్లాడిపోతూనే ఉన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మూడువారాల లాక్డౌన్ ముగిసిన క్రమంలో మరో రెండు వారాల పాటు పొడిగించిన క్రమంలో దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టివేసింది. పని కోల్పోయిన వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు నడుస్తూ స్వస్ధలాలకు చేరుకోగా, మరికొందరు నగరాలు, పట్టణాల్లో చిక్కుకుపోయి పూటగడవని స్ధితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు సబ్సిడీపై ఆహార ధాన్యాలు సమకూర్చింది. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 11,000 దాటగా 377 మందికి పైగా మరణించారు. -
మూగజీవాలపై ద్వేషమేల?
కర్ణాటక,బనశంకరి: మూగజీవాలకు విషమిచ్చి చంపాడో కిరాతకుడు. విషం పెట్టిన ఘటనలో ఏడు వీధికుక్కలు మృత్యవాత పడగా, నాలుగు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన జేపీ.నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. జేపీ.నగర ఎంఎస్.రామయ్యసిటీలో ఎవరో దుండగులు విషం కలిపిన ఆహారాన్ని కుక్కలకు వేశారు. వాటిని తిని ప్రాణాలు పోగొట్టుకున్నాయి. కొనప్రాణంతో ఉన్న కుక్కలను స్థానికులు, ప్రాణిప్రియులు గమనించి ప్రాణి చికిత్సా కేంద్రానికి తరలించారు. కారకులెవరో తెలిస్తే కేసు పెడతాం ఈ ఘటన పై బీబీఎంపీ ప్రత్యేక కమిషనర్ రందీప్ మాట్లాడుతూ. వీధికుక్కలకు విషంతో కూడిన ఆహారం వేసిన ఘటన తమ దృష్టికిరాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలా చేయడం నేరమని, కారకుల ఆచూకీ తెలిస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.