వరంగల్: వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, రేల్వే స్టేషన్ సమీపంలో శనివారం కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మంది మహిళల పై కూడా శునకాలు దాడి చేశాయి. సుమారు 21 మందిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైర విహారంతో.. స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయోనని బయటకు రాలేకపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.