
వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
♦ రంజాన్ పండుగ రోజు విషాదం
♦ శరీరంపై వంద గాట్లు.. మేడ్చల్ జిల్లాలో ఘటన
హైదరాబాద్: ఆనందంగా గడపాల్సిన రంజాన్ పండుగ రోజు ఆ ఇంట విషాదం నెలకొంది. మజీద్ బయట ఆడుకుం టున్న చిన్నారిని వీధికుక్క లు బలితీసుకున్నాయి. కళ్లెదుటే కన్నకొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం మూడు చింతలపల్లి కాశవాడలో సోమవారం చోటు చేసుకుంది. మూడు చింతలపల్లి కాశవాడకు చెందిన ఎం.డి.ఇమామ్, ఖాదర్‌బీ దంపతులకు హసీనా, ఎండీ ఫారుక్(7), ఎండీ హస్మీ సంతానం. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం వీరు స్థానిక మజీద్‌కు వచ్చారు. అందరూ నమాజ్ చేస్తుండగా ఫారూక్ మజీద్ సమీపంలో ఆడుకుంటున్నాడు.
అదే సమయంలో పోట్లాడుకుంటూ వచ్చిన ఆరు వీధి కుక్కలు ఒక్కసారిగా ఫారూక్‌పై దాడి చేశాయి. బాలుడి తల, మెడ, వీపు, కడుపు, కాళ్లు, చేతులు ఇలా శరీరమంతా గాయాలై తీవ్ర రక్త స్రావమైంది. ‘అల్లా ,అబ్బా, అమ్మీ ముజుకో బచావో’అంటూ ఆ చిన్నారి మొత్తుకుంటున్నా కుక్కలు విడిచి పెట్టలేదు. కేకలు విన్న తండ్రి ఇమామ్ వెంటనే చిన్నారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే తీవ్రంగా కరవడంతో బాలుడి పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఫారుక్‌ను అంబులెన్స్‌లో మొదట నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి శరీరంపై వంద కాట్లు ఉన్నాయి. పరిస్థితి విష మంగా ఉందని వైద్యులు చెప్పడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ ఫారూక్ మృతి చెందాడు.
ఫారూక్ మృతిని తట్టుకోలేక కుటుం బీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆస్పత్రిలో విషా దఛాయలు అలుముకున్నాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కో సం బాలుణ్ని అంబులెన్స్‌లో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అక్క డి వైద్యులు బాలుని శరీరంపై ఉన్న సుమారు వందకుపైగా కుక్కగాటు గాయా లను శుభ్రం చేసి రిగ్ ఇంజక్షన్ ఇచ్చారు. నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.