ఏఎస్ పేట: నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తోంది. పంచాయతి పరిధిలోని పలు కాలనీలలో తిరుగుతూ గతరాత్రి నుంచి ఇప్పటివరకు 23 మందిని గాయపర్చింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. గ్రామస్థులంతా కలిసి పిచ్చి కుక్కను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రబుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.