దయతో.. | City charity helps to care about street dogs | Sakshi
Sakshi News home page

దయతో.. పెట్స్

Published Wed, Dec 3 2014 12:17 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

దయతో.. - Sakshi

దయతో..

‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న తొమ్మిదవ కథనమిది...
 
 దయగల హృదయం.. ఉదాత్తమైన ఆశయం కలగలిసి మూగజీవులకు ఆపన్నహస్తం అందిస్తోంది. వీధికుక్కలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేలు..లక్షలు ఖరీదు చేసే శునకాల వైభోగం అంతాఇంతా కాదు. కానీ, గుప్పెడు మెతుకులకు గంపెడు విశ్వాసం చూపించే వీధి కుక్కల్ని పట్టించుకునే వారెవరు?. ఒకరోజు అన్నంపెడితే మనింటి కాంపౌండ్ వాల్ చుట్టూ చక్కర్లు కొడుతూ...కనిపించగానే తోక ఊపుతూ ప్రేమను పంచే ఆ మూగజీవులే ప్రియకు ప్రాణం. వాటి కోసమే ‘దయ’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పిన ఆ పెట్స్ ప్రేమికురాలి సేవా కార్యక్రమాల పరిచయం..
 
 మూడేళ్ల క్రితం..
 ‘ఒకరోజు ఉదయం వనస్థలిపురం రైతుబజార్‌కి వెళ్లాను. దారిలో ఓ వీధికుక్కను మిగతా కుక్కలు కరుస్తున్నాయి. వెంటనే బండి ఆపి, వాటిని చెదరగొట్టాను. అప్పటికే అది బాగా గాయపడింది. తెలుపురంగులో ఉన్న ఆ కుక్కని తీసుకొచ్చి మా ఇంటికి దగ్గరగా ఉన్న వెటర్నరీ ఆసుపత్రిలో చూపించాను. కాలికి బలమైన గాయం కావడంతో చిన్నపాటి ఆపరేషన్ చేసి పంపించారు. దాన్ని ఇంట్లో పెట్టుకుని కొన్నాళ్లు జాగ్రత్తగా చూసుకున్నాను. ఈ సంఘటన గురించి తెలుసుకున్న నా స్నేహితులు శ్రావణి, స్వాతి, సందీప్, కుషన్‌శర్మ.. కలసి మూగజీవుల గురించి ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందన్నారు. నేను వెంటనే 2011లో ‘దయ’ అనే ఆర్గనైజేషన్‌ని స్థాపించాను’ అంటూ నాటి నేపథ్యాన్ని వివరించారు ప్రియ.
 
 గాయపడ్డ వాటిని...
 గాయపడ్డ కుక్కలను చేరదీసి వాటికి వైద్యం చేయించి కావాల్సిన వారికి దత్తత ఇవ్వడంపై దృష్టిపెట్టిన ‘దయ’ సభ్యులు.. ఆ విషయంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు. గత మూడేళ్లలో గాయపడ్డ 70 వీధికుక్కలను చేరదీసి వైద్యం చేయించారు. వాటిలో కొన్నింటిని బ్లూక్రాస్‌కి, ఇంకొన్నిటిని దగ్గర్లోని పెట్‌కేర్ సెంటర్లకు, మరికొన్నింటిని దత్తతకు ఇచ్చారు. మిగిలిన వాటిని ఇంట్లో ఉంచి చూసుకుంటున్నారు. ‘ఒక్క గాయపడ్డ కుక్కలనే కాదు.. ఖరీదైన ప్రాంతాల్లో కొందరు జబ్బులొచ్చిన పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేసిపోతున్నారు.
 
ఈ మధ్యనే కేన్సర్ జబ్బుపడ్డ జర్మన్ షెపర్డ్ కుక్క బంజారాహిల్స్ వీధిలో దొరికింది. దానికి వైద్యం చేయించి ఇంట్లో పెట్టుకున్నాం. కొన్ని పెట్‌కేర్ సెంటర్లు ‘దయ’తో వీధికుక్కలకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇక వాటికయ్యే వైద్యం గురించి చెప్పాలంటే ముందుగా మా వెటర్నరీ డాక్టర్ సురేష్‌కుమార్ గురించి చెప్పాలి. ఆయన కూడా జంతు ప్రేమికుడే. ఇప్పటివరకూ కుక్కలన్నింటికి ఆయన ఉచితంగా వైద్యసేవలందించారు’ అని వివరించారు ప్రియ. వైద్యం ఖర్చుల సంగతి పక్కన పెడితే వాటి ఆశ్రయం, పోషణకయ్యే ఖర్చూ ఎక్కువే. దాని కోసం ‘దయ’ సంస్థ సిబ్బంది వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు.
 
 పాతన్యూస్ పేపర్ల డబ్బుతో..
 ‘మాకు తెలిసినవారి దగ్గరి నుంచి పాత న్యూస్‌పేపర్లు సేకరించి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుకు మేమంతా కొంత మొత్తం కలిపి మూగజీవుల పోషణ చేపడుతున్నాం. దీనికి తోడు చాలామంది మూగజీవుల ప్రేమికులు చాలా సందర్భాల్లో స్పందిస్తున్నారు. కేవలం శునకసేవే కాకుండా దయ సంస్థ గో సంరక్షణ కార్యక్రమాలూ చేపడుతోంది. గోవుల అక్రమ రవాణా సమాచారం తెలిసినపుడు మా టీమ్ వెంటనే స్పందించి వాటిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి వందకు పైగా ఆవుల్ని రక్షించాం. ఇక వేసవిలో పక్షుల రక్షణకు మా ప్రాంతంలోని అన్ని కాలనీల్లో ప్రతి ఇంటి దగ్గరా చిన్న గిన్నె పెట్టి వాటిలో నీళ్లు పోయాలని చెబుతాం’ అని చెప్పారు దయ సభ్యురాలు శ్రావణి. యోగా శిక్షకురాలు కూడా అయిన ప్రియ ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తూ అక్కడ మూగజీవుల సంరక్షణకోసం డ్రాప్‌బాక్సులు పెట్టి సాయం కోరుతున్నారు. నోరులేని మూగజీవుల్ని ప్రేమగా పలకరిస్తూ, ‘దయ’ గల హృదయాలను వెతుక్కుంటూ ముందుకుసాగుతున్న ఈ సంస్థ సేవలకు హ్యాట్సాఫ్.
 
 సదా మీ సేవలో..
 చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. వురెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సవూజం కోసం మీరు చేతులు కలిపి చేసిన చేతల వివరాలు వూకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సవుంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది.
 
మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. ఇలా ఉత్తమ సేవలు అందిస్తూ సమాజహితానికి పాటుపడుతున్న ‘సేవకుల’ను సవుంత పలకరిస్తారు. ఒక్క సవుంత వూత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి వురెందరో సెలబ్రిటీలు వుుందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెరుుల్ టు.. sakshicityplus@gmail.com
 ప్రజెంటేషన్: భువనేశ్వరి
 bhuvanakalidindi@gmail.com
 ఫొటోలు: సృజన్ పున్నా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement