హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో వీధి కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రణీత(4)పై కుక్కలు దాడి చేశాయి. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే భాను(20) అనే యువకుడిపై కూడా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా.. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి ఇద్దరినీ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.