సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో వీధి కుక్కలకు రోగనిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు పునరుత్పత్తి నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపిస్తామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర వింద్‌కుమార్ తెలిపారు. వీధి కుక్కలను చంపకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ఆయన బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమలతో సమావేశమయ్యారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వెటర్నరీ విద్యార్థుల కోసం త్వరలో 2 వారాల శిక్షణ కోర్సును ప్రారంభించనున్నామన్నారు. వెటర్నరీ విద్యార్థులకు శిక్షణ అందించడానికి బ్లూక్రాస్ సొసైటీ ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తామని అమల పేర్కొన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ డీకే శ్రీదేవి పాల్గొన్నారు.
‘వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు’
Published Fri, Jun 15 2018 1:11 AM | Last Updated on Fri, Jun 15 2018 1:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment