Akkineni Amala
-
ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమాకి ఉంది: అక్కినేని అమల
‘‘ఓ ఉత్తమమైన ప్రదేశంగా ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమా మాధ్యమానికి ఉంది’’ అని అక్కినేని అమల అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘రోడ్ నెం 52’ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమల విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోఎందరో ప్రతిభావంతులైన యువత సినీ రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారని, వారిని తీర్చిదిద్దే పనిలో తాము పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.కొన్నేళ్లుగా వందలాది మందికి తమ అన్నపూర్ణ సంస్థ శిక్షణ అందించిందని, ఇప్పటికే పలువురు సినిమా రంగంలో పని చేస్తున్నారని వివరించారు. మహారాష్ట్రకు చెందిన యువకులు అచ్చ తెలుగు కథాంశం ఎంచుకుని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారని ‘రోడ్ నెం 52’ రూపకర్తల్ని అభినందించారు అమల. ‘రోడ్ నెం 52’ రచయిత– దర్శకుడు సరోజ్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అథర్వ మహేష్ గాగ్ తమ అనుభవాలు పంచుకున్నారు. నటీమణుల పాత్రల నిడివి పెరగాలి‘‘నటీమణులకు తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది’’ అనే అభిప్రాయం ‘ఇఫీ’లో నిర్వహించిన సదస్సులో వ్యక్తమైంది. సినీ పరిశ్రమలో మహిళా భద్రత అనే అంశంపై జరిగిన చర్చలో నటి–నిర్మాత వాణీ త్రిపాఠి టికూ మోడరేట్ చేసిన ఫ్యానెల్ పాల్గొంది. నటి సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో ఏదో ఇలా వచ్చి అలా పోయేవి కాకుండా మహిళలు తాము నటించే పాత్రలు బలంగా ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు.‘‘లొకేషన్లో మహిళలు వేధింపులకు గురి కాకూడదు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలి’’ అని దర్శకుడు ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు. ‘‘వినోదంపై దృష్టి సారిస్తూనే సమానత్వానికిప్రా ధాన్యం ఇవ్వడంతో పాటు బాధ్యతాయుతమైన చిత్రనిర్మాణం సాగాలి’’ అని ఖుష్బూ అన్నారు. మహిళలు తెరపై గౌరవప్రదంగా, తెరవెనుక సురక్షితంగా ఉండాలని, మహిళల భద్రతకి సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ఫ్యానెల్ ముగిసింది. -
అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ఏఎన్నార్ శత జయంతి వేడుకలు (ఫొటోలు)
-
మా మావయ్య, విశ్వనాధ్ గారు గ్రేట్ ఫ్రెండ్స్
-
ఆత్మగౌరవం నేపథ్యంలో...
లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నచ్చినవాడు’. ఈ సినిమాలోని ‘తోడై నువ్వుండక..’ పాట లిరికల్ వీడియోను అక్కినేని అమల విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలన్నారు. ‘‘మహిళల ఆత్మగౌరవం నేపథ్యంలో అల్లిన ప్రేమకథా చిత్రం ఇది. కామెడీ, నేటి యువతరానికి కావాల్సిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు లక్ష్మణ్. రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్ కీలక పాత్రలు ΄పోషించిన ఈ సినిమాకు మిజో జోసెఫ్ స్వరకర్త. -
అలా నేను సినిమాల్లోకి వచ్చాను: అక్కినేని అమల
ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్' కార్యక్రమంలో అక్కినేని అమల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, ప్రస్తుతం వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి మూవీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆమె చలనచిత్ర రంగంలో రాణించాలంటే ముందుగా ఆ పాత్రకు మనం ఫిట్ అవ్వాలని, అందుకోసం మనల్ని మనం మేకోవర్ చేసుకోవాలన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. దాంతో డైరెక్టర్స్, నిర్మాతలు సినిమాల్లో క్లాసికల్ డ్యాన్సర్ పాత్రల కోసం నన్ను సంప్రదించారు. అలా నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ అది అంత ఈజీ కాదు. మనకు ఇక్కడ గుర్తింపు రావాలంటే ఆ పాత్రకు మనం ఫిట్ అవ్వాలి. ఒకవేళ మనం ఆ పాత్రకి ఫిట్ కాకపోతే దురదృష్టవశాత్తు సినీ రంగంలో ఓ మహిళ మూస పద్దతిలో వెళ్లాల్సి వస్తుంది. కానీ అదృష్టం కొద్ది ఇప్పుడు వారికి చాలా అవకాశాలున్నాయి. తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో ప్లాట్‌ఫాంలు వచ్చాయి. యంగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు, ఉమెన్ ఫిలిం మేకర్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు మహిళలు పురుషులకు సమానంగా ఏ రంగంలోనైనా రాణించగలిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిశ్రమలోనైనా పురుషాధిక్యం ఉంటుంది. అలాగే సినీ రంగంలో కూడా. అలాంటప్పుడు ఓ ఫిమేల్ ఆర్టిస్ట్ ఇక్కడ రాణించడం అంటే అంత ఈజీ కాదు. ఆమె సినిమాను ప్రమించాలి, తన నటనను మెరుగుపెరుచుకోవాలి. ఏలాంటి లేవల్లో ఉన్న మనల్ని మనం ప్రూవ్ చేసుకునేందుకు ఓ మహిళ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి’ అని ఆమె సూచించారు. -
Kanam Movie: సైన్స్ ఫిక్షన్‌గా అక్కినేని అమల 'కణం'.. రిలీజ్ అప్పుడే!
Akkineni Amala Kanam Movie Release Date Out: వైవిధ్య భరిత కథా చిత్రాల నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్. ఈ సంస్థ అధినేతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'కణం'. నటి అమల అక్కినేని, శర్వానంద్, రీతూవర్మ, నాజర్, సతీష్, రమేష్ తిలక్, ఎమ్మెస్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. దీనికి సుజిత్ సరాంగ్ ఛాయాగ్రహణం, జాక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఇది వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంగళవారం (ఆగస్టు 9) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని, గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన చిత్రంలోని అమ్మ పాటకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ద్విభాషా చిత్రంగా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమిళంలో 'కణం' పేరుతోనూ, తెలుగులో 'ఒకే ఒక జీవితం' పేరుతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తామన్నారు. చదవండి: కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ -
కేన్సర్‌తో బెడ్ మీద నుంచే ఏఎన్నార్ డబ్బింగ్.. అక్కినేని అమల ఎమోషనల్
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: ‘మా మామ గారు అక్కినేని నాగేశ్వర్రావు చివరి వరకూ శ్రమిస్తూనే ఉన్నారు. కేన్సర్‌తో బాధపడుతూనే ‘మనం’ సినిమాకు పనిచేశారు. చివరి దశలో హాస్పిటల్ బెడ్పైనుంచే ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆశీర్వాదంతో తాను ఇంత అద్భుతమైన జీవితాన్ని గడిపానని, మీరు విచారించాల్సిన అవసరం లేదని ఆయన మా అందరికీ చెప్పేవారు’ అని మామయ్య అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకుంటూ అక్కినేని అమల ఎమోషనల్ అయ్యారు. కేన్సర్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ కేన్సర్ అవగాహన పరుగు పోస్టర్‌ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. మనం మనల్ని తగినంతగా ప్రేమించుకోకపోవడం, పర్యావరణాన్ని ప్రేమించకపోవడం.. అన్నింటినీ నిర్లక్ష్యం చేయడమే కేన్సర్ విజృంభణకు కారణాలన్నారు. కలుపు మందులు, పురుగుమందులు చాలా వరకు కేన్సర్‌కు కారణమవుతాయని తెలిసినా వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రేస్ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు సీఈఓ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ ప్రమీలారాణి, గ్లోబల్ రేస్ డెరైక్టర్ నిరంజన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లీ కొడుకుల అనుబంధం
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ పూర్తయింది. శ్రీకార్తీక్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్లో 30వ చిత్రం కావడం విశేషం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు (‘ఖైదీ’ నిర్మాత) నిర్మించారు. రీతూ వర్మ కథానాయికగా నటించగా, నటి అక్కినేని అమల ఒక ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాయడం విశేషం. ‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకుల్లో శర్వానంద్‌కు అమితమైన ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులనే కాకుండా అటు యూత్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సంగీతం: జేమ్స్ బిజోయ్, కెమెరా: సుజీత్ సారంగ్. -
చిన్న విరామం
‘‘ఒక చిన్న విరామం’ సినిమా నా స్టూడెంట్స్‌ది. మా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో కొత్తరకమైన, ప్రజలకు అవగాహన కల్పించే, ప్రేక్షకులను ఆకట్టుకునే, ట్రెండ్‌ని సెట్ చేసే సినిమాలు వస్తాయి. ఇప్పుడు ‘అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్, మీడియా’(ఏఐఎస్ఎఫ్ఎం) విద్యార్థులు.. అంటే నా స్టూడెంట్స్ తీసిన సినిమా కాబట్టి పక్కాగా హిట్ అవుతుంది’’ అని ఏఐఎస్ఎఫ్ఎం డైరెక్టర్ అక్కినేని అమల అన్నారు. ఏఐఎస్ఎఫ్ఎం స్టూడెంట్ సందీప్ చేగూరి స్వీయ దర్శకత్వంలో మూన్‌వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ‘ఒక చిన్న విరామం’ సినిమా ఫస్ట్‌లుక్, సాంగ్ ప్రోమోను అమల విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మా ఫిల్మ్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు మంచి ప్రతిభ ఉంది. దాంతో అద్భుతమైన చిత్రాలు తీయగలుగుతున్నారు. ‘ఒక చిన్న విరామం’ కచ్చితంగా మంచి హిట్ సాధించి, సందీప్‌కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం’’ అన్నారు. ‘‘నేను తీసే ప్రతి సినిమా ద్వారా 20 నుంచి 25మంది టాలెంటెడ్ యూత్‌ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నా. యంగ్‌స్టర్స్ అయితేనే బ్లాక్‌బస్టర్స్ ఇవ్వగలరు’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘సస్పెన్స్, రోడ్ థ్రిల్లర్‌తో తెరకెక్కిన సినిమా ఇది’’ అన్నారు సందీప్ చేగూరి. ‘‘ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో సంజయ్‌వర్మ, హీరోయిన్ గరిమాసింగ్. నటులు ధనరాజ్, నవీన్నెవి, కెమెరామన్ రోహిత్ బట్చు, సంగీత దర్శకుడు భరత్ మంచిరాజు, సౌండ్డిజైనర్ అశ్విన్బర్దేలు పాల్గొన్నారు. -
‘మామయ్యకు మహా ఇష్టం’
పంజగుట్ట: నా మాతృభాష బెంగాళీ.. మా మామయ్య అక్కినేని నాగేశ్వరరావుకు బెంగాళీ సినిమాలంటే ఎంతో ఇష్టమని, పలు సినిమాలను తెలుగులో రీమేక్ చేశారని ప్రముఖ నటి అక్కినేని అమల అన్నారు. బెంగాళీస్ ఇన్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఆరవ ‘హైదరాబాద్ బెంగాళీ ఫిల్మ్ ఫెస్టివల్’ వివరాలను ఎర్రమంజిల్‌లోని హోటల్ మెర్క్యూరీలో శుక్రవారం వివరించారు. కార్యక్రమానికి హాజరైన అమల మాట్లాడుతూ.. మా మామయ్యకు బెంగాళ్ సినిమాలంటే ఎంతో మక్కువ అన్నారు. ఈ ఫెస్టివల్‌కు 50 మంది ప్రముఖులు బెంగాళ్, ఇతర రాష్ట్రాల నుంచి హాజరుకావడం సంతోషకరమన్నారు. ఫెస్టివల్ డైరెక్టర్ పార్థ పాతమ్ మలిక్ మాట్లాడుతూ.. ఫెస్టివల్‌ను ఈ నెల 18వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలోని శివ థియేటర్లో ప్రారంభిస్తున్నప్పటికీ అధికారికంగా 19వ తేదీన బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ సినీ నిర్మాత బుద్దదేబ్ దాస్‌గుప్త ప్రారంభిస్తారని తెలిపారు. బెంగాళి సినిమా ఈ యేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దిగ్గజాల సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. బెంగాలి ఇన్ హైదరాబాద్ అధ్యక్షురాలు మోసొమి శర్మ, జాయింట్ కన్వీనర్ మాలిక్ బసు పాల్గొన్నారు. -
నా జీవితంలో నువ్వో మ్యాజిక్
నాగార్జునకు 33 ఏళ్లు. అవును.. నటుడు నాగ్ వయసు ఇది. ‘విక్రమ్’ (23 మే 1986 రిలీజ్) సినిమాతో హీరో అయిన నాగ్ ఈ మే 23తో నటుడిగా 33 ఏళ్ల ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త నాగార్జున గురించి ఆయన సతీమణి అమల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సారాంశం ఈ విధంగా...‘‘నా హీరో, నా భర్త, నా స్నేహితుడు... నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావు. నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగావు. నువ్వు స్క్రీన్‌పై కనబడితే ఇప్పటికీ నా చూపు తిప్పుకోలేకపోతున్నా. నీ స్టైల్, నీ స్మైల్, నీ కళ్లలోని మెరపుని చూసేందుకు ఇప్పటికీ నా గుండె తపిస్తూనే ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ నీ అందం ఇంకా పెరుగుతూనే ఉంది. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మాకు నువ్వు ఓ ఉదాహరణగా నిలిచావు. మిస్టరీ, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా జానర్ ఏౖదైనా నీ సినిమా విడుదలవుతున్న ప్రతిసారీ ఎలా కనిపించబోతున్నావో అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటాను. శ్రీ వెంకటేశ్వరస్వామికి, రాముడికి, షిరిడీ సాయికి నన్ను పరిచయం చేశావు. ఆ దేవుళ్లు మన కుటుంబంలో భాగమ య్యారు (‘అన్నమయ్య, షిరిడి సాయి, శ్రీరామదాసు’ చిత్రాల్ని ఉద్దేశిస్తూ). కంటెంట్ ఉన్న కథలను ఇస్తున్నావు. మా అంచనాలను మించి చేస్తున్నావు. నీ పాత్రల పరంగా 2 గంటల అమూల్యమైన సమయాన్ని మాకు ఎంటర్టైనింగ్గా అందిస్తున్నావు. ఓడిపోతానేమోనని నువ్వెప్పుడూ భయపడలేదు. ఎందుకంటే ది బెస్ట్ ఇస్తావ్ కాబట్టి. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి నువ్వు వెనకాడలేదు. అనుకున్న సమయానికి సినిమాలను రిలీజ్ చేయడంలోనూ నువ్వు విఫలం కాలేదు. నీ నిర్మాతను తగ్గనివ్వలేదు. నీలాంటి నటుల వల్ల సినిమాల్లో ఫన్, మ్యాజిక్, గ్లామర్ ఉంటున్నాయి. నా లైఫ్‌లో నువ్వో మ్యాజిక్. ఇండస్ట్రీలో 33 ఏళ్లు పూర్తిచేసుకుని, 95 సినిమాల్లో నటించినందుకు శుభాకాంక్షలు మై స్వీట్హార్ట్. క్లింట్ ఈస్ట్ ఉడ్, మిస్టర్ అమితాబ్ బచ్చన్, ఏయన్నార్‌లా సినిమాల్లో నువ్వింకా ఏన్నో ఏళ్లు పూర్తి చేసుకోవాలి. గోల్డెన్ స్కై కింద నీ రైడ్ సాగుతోంది. ఇది కేవలం సగం దూరం మాత్రమే. మై హీరో, మై ఫ్రెండ్. ప్రేమతో నీ అభిమాని అమల -
‘ఎన్ఆర్ఐ’ని క్లాప్ కొట్టి ప్రారంభించిన అమల
అవసరాల శ్రీనివాస్.. నటుడిగా, దర్శకుడిగా, హీరోగానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న నాయనా రారా ఇంటికి (ఎన్ఆర్ఐ) చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని అమల క్లాప్ కొట్టి మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, మహతి కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు నాని, అక్కినేని అఖిల్, సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సేంద్రియ సేద్యం ఆరోగ్య మార్గం
హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనీ, ఇదే అందరి ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. బుధవారం శిల్పారామంలోని సాంప్రదాయ వేదికలో కేంద్ర మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ’ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఉత్సవాన్ని’ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రెండెకరాల భూమిలో తన తండ్రి సేంద్రియ వ్యవసాయం చేసేవారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయానికి చేయూతనిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లను కేటాయించి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్లే గతంలో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండేవన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ క్లబ్‌ల ద్వారా మహిళలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మహిళ, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ టిర్కీ, సంయుక్త కార్యదర్శి నందితా మిశ్రా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయన్నారు. మహిళా రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తుల అమ్మకాలకు ‘ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ’ఉపకరిస్తుందన్నారు. ఇందులో రెడ్ అండ్ బ్లాక్ రైస్, చిరుధాన్యాలు, లెంటీస్, కూరగాయలు, సీడ్స్ అండ్ సీడ్ జ్యువెలరీ, సుగంధ ద్రవ్యాలు, ఐస్‌క్రీమ్, సౌందర్య సాధనాలు, వస్త్రాలు, బేకరీ ఉత్పత్తులు, టీ, పండ్లు, తదితరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఉత్సవం ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందనీ సుమారు వెయ్యికి పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డబ్ల్యూసీడీ, ఎస్సీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జగదీశ్వర్ మాట్లాడుతూ ఇప్పటికే ఎక్కువ భాగం భూమి కలుషితమైందని, పొలాలను మరలా శుద్ధి చేయడానికి 15 నుండి 20 ఏళ్ల సమయం పడుతుందన్నారు. సినీ నటి అమల మాట్లాడుతూ తమ కుటుంబమంతా సేంద్రియ పంటలే తింటామన్నారు. పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ గుండు సుధారాణి, హైదరాబాద్ రీజినల్ ఆర్గనైజర్ సుశీలారెడ్డి, రంగారెడ్డి రీజినల్ ఆర్గనైజర్ వీరమణిలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో వీధి కుక్కలకు రోగనిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు పునరుత్పత్తి నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపిస్తామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర వింద్‌కుమార్ తెలిపారు. వీధి కుక్కలను చంపకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ఆయన బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమలతో సమావేశమయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వెటర్నరీ విద్యార్థుల కోసం త్వరలో 2 వారాల శిక్షణ కోర్సును ప్రారంభించనున్నామన్నారు. వెటర్నరీ విద్యార్థులకు శిక్షణ అందించడానికి బ్లూక్రాస్ సొసైటీ ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తామని అమల పేర్కొన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ డీకే శ్రీదేవి పాల్గొన్నారు. -
గిరిజన తండాలో సినీనటి అమల సందడి
కుల్కచర్ల: ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్ సొసైటీ నిర్వాహకురాలు అక్కినేని అమల గిరిజన తండాలో సందడి చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రాంరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అల్లాపూర్ తండాను ఆదివారం ఆమె సందర్శించారు. రాంరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మాణెమ్మ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయని, ఇలాంటి సమయంలోనూ 36 మందితో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్న మాణెమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అక్కినేని నాగేశ్వర్రావు స్థాపించిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఫిలిమ్స్ మీడియా పాఠశాలకు అమల డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇందులో పనిచేసే సిబ్బందికి గ్రామీణ ప్రాంతాలు, వారి జీవన స్థితిగతులు, వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు తండాలను సందర్శించారు. -
పిల్లలకు నచ్చినవే ‘బెస్ట్ మూవీస్’అవుతాయి!
‘హాయ్ బేటా.. గుడ్ మార్నింగ్’... స్వీట్‌గా పిల్లలను పలకరిస్తున్నారు అక్కినేని అమల. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ‘ఏషియన్ పనోరమ’కి చైర్ పర్సన్‌గా వ్యవహరించారామె. గత శుక్రవారం నుంచి సోమవారం వరకూ ఏషియన్ పనోరమా జ్యూరీకి ఎంపికైన ముగ్గురు పిల్లలతో కలసి ఆమె పలు సినిమాలు చూశారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న వేడుకలో అవార్డు అందుకోనున్నవారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అమలతో ‘సాక్షి’ చిట్ చాట్. ► మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో కలసి సినిమాలు చూస్తాం.. పిల్లలతో చూడటం ఎలా అనిపించింది? వెరీ నైస్. రోజుకి 5 నుంచి 10 సినిమాలు చూస్తాం. వీటిలో ఫీచర్స్ ఫిల్మ్స్, షార్ట్‌ఫిల్మ్స్ ఉంటాయి. ఆరేడు గంటలు ఈజీగా పడుతుంది. అన్నేసి గంటలు పిల్లలు ఓపికగా సినిమాలు చూడటం, వాటిగురించి నిక్కచ్చిగా తమ అభిప్రాయం చెప్పడం అభినందించదగ్గ విషయం. ► ఒక సినిమా చూసి, జడ్జ్ చేసే కెపాసిటీ పిల్లలకు ఉంటుందా? పిల్లల మనసు ‘వైట్ పేపర్’లాంటిది. మనసులో ఏమీ పెట్టుకోకుండా జస్ట్ మూవీ చూస్తారు. నచ్చితే నచ్చిందంటారు. లేకపోతే లేదు. వాళ్లకు నచ్చినవే ‘బెస్ట్ ఫిల్మ్స్’ అవుతాయి. ఎందుకంటే, ఓపెన్ మైండ్‌తో చూస్తారు కదా. ► జడ్జ్మెంట్ అనేది కష్టమైన విషయం. కొందర్ని నిరాశపరచాల్సి ఉంటుంది కదా? వేల సినిమాలు వచ్చాయి. వాటిలో కమిటీ ఆల్రెడీ కొన్ని సినిమాలను ఫిల్టర్ చేసి, మాకు పంపిస్తుంది. వాటిలో మేం ‘ది బెస్ట్’ అనేలా ఉన్నవి సెలక్ట్ చేయాలి. అది టఫ్ జాబ్. ఎందుకంటే, అన్నీ బాగున్నట్లే అనిపిస్తాయి. కాకపోతే ఎక్కడో చిన్న చిన్న తేడా లుంటాయి. దాంతో అవార్డుకి అనర్హం అవుతాయి. అంతమాత్రాన ఆ ఫిల్మ్ మేకర్స్ లేదా ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్‌ని తక్కువ అంచనా వేయలేం. ఇక, జడ్జిమెంట్ సీట్లో కూర్చుకున్నప్పుడు.. ఒకరి సంతోషం, బాధ గురించి ఆలోచించలేం. మేం తీసుకునే నిర్ణయం ‘జెన్యూన్’గా ఉండాలి. సినిమాలు చూసేటప్పుడు మా మనసులో అదొక్కటే ఉంటుంది. ► ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కాబట్టి, చానల్స్‌లో అఖిల్ ‘సిసింద్రీ’ వేశారు.. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఆ సినిమాని గుర్తు చేసుకుంటారా? ‘ఫీలింగ్ నైస్’. ఎప్పటికీ ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ‘సిసింద్రీ’ గురించి ఎక్కువ మాట్లాడితే, ఈ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని హైజాక్ చేసినట్లవుతుంది. ఇప్పుడు నా ప్రయార్టీ ఇదే కాబట్టి, దీని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. ► ఒక్క మాట చెప్పండి.. ఆ సినిమాలో అఖిల్ ఏడ్చే, నవ్వే సీన్స్‌ని ఎలా తీశారు.. ఏడ్చే సీన్స్‌కి చిన్నగా గిల్లడం లాంటిది.. (నవ్వుతూ). అలా ఏం లేదు. అఖిల్ ఆ సినిమాలో ఏం చేసినా అది న్యాచురల్‌గా చేసినదే. బలవంతంగా ఏదీ చేయించలేదు. ఆ సినిమాని నాగార్జునగారే తీశారు. నేను కూడా లొకేషన్లో ఉండేదాన్ని. పెద్దగా ఇబ్బంది పడలేదు. ► ‘సిసింద్రీ’ గురించి ఇంకొక్క క్వొశ్చన్.. ఆ సినిమా తీసినందుకు పెద్దయ్యాక అఖిల్ ఏమన్నారు? ఇది మాత్రం అఖిల్ అడగాల్సిన క్వొశ్చన్ (నవ్వేస్తూ). ► ‘లిటిల్ డైరెక్టర్స్’ అంటూ కొంతమంది పిల్లలు సినిమాలు తీయడం ఎలా అనిపించింది? నైస్ ఎఫర్ట్. నాట్ ఓన్లీ డైరెక్షన్. ఫొటోగ్రఫీ, మ్యూజిక్.. ఇంకా చాలా ఉన్నాయి. ‘ఇలా చేయడం మంచిది’ అని పిల్లలకు పెద్దవాళ్లు చేసి చూపించడం కన్నా.. ‘ఇలా చేయండి’ అని వాళ్లతో ప్రాక్టికల్‌గా చేయించాలి. ‘మేకింగ్’లో ఉన్న కష్టాలు తెలుస్తాయి. ఆలోమేటిక్‌గా ‘సాల్వ్’ చేసే నేర్చు వచ్చేస్తుంది. థియరీ మీద మాత్రమే కాదు.. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ► మీరన్నట్లు ప్రాక్టికల్ నాలెడ్జ్ వ్యక్తిగా డెవలప్ అవ్వడానికి కూడా పనికొస్తుంది... కరెక్ట్. పిల్లలు పెరుగుతూనే ఎంతో నేర్చుకుంటుంటారు. ఒక్క సినిమాల్లోనే కాదు. లైఫ్‌లో కూడా. ఎలా ప్రశ్నలు వేయాలి? ఒక కాన్సెప్ట్‌ని ఎలా వినాలి? విన్న అంశాలను పాజిటివ్‌గా ఎలా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి? అనేది తెలుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. స్కూల్స్‌లో ధియేట్రికల్ సిస్టమ్‌ను డెవలప్ చేస్తే ఓన్లీ యాక్టింగే కాదు.. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. టెక్నికల్ థింగ్స్ కూడా నేర్చుకుంటారు. ప్రొడక్షన్ విషయాలు తెలుసుకుంటారు. యాక్ట్ చేసే టాలెంట్ ఉన్నవాళ్లు ఆ సైడ్, టెక్నాలజీ అంటే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు అది నేర్చుకుంటాడు. ► బాలల చలన చిత్రోత్సవాలకు ఎప్పటి నుంచో మెంబర్‌గా ఉంటున్నారు కదా.. ఓ చిల్డ్రన్ మూవీ తీయాలని ఎప్పుడూ అనుకోలేదా? చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీలో గవర్నింగ్ బోర్డ్‌లో ఉన్నాను. నేను ఫిల్మ్ మేకర్‌ను కాదు. అందుకని సినిమా తీయడం గురించి ఆలోచించలేదు. ► అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతలు చూసుకుంటారు కదా.. దాని గురించి? అన్నపూర్ణ స్కూల్ డైరెక్టర్ని. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. కోర్స్ కంప్లీట్ చేసి, తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి వెళతారు. వాళ్లను చూస్తే ముచ్చటగా ఉంటుంది. అయితే నేనెప్పుడూ ‘టీచ్’ చేయను. ఓన్లీ మేనేజింగ్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటా. ► ఫైనల్లీ.. దాదాపు వారం రోజులుగా పిల్లలతో కలసి సినిమాలు చూస్తున్నారు. నిన్నటితో ఈ బాధ్యత పూర్తయింది. పిల్లలతో ఎమోషనల్‌గా ఎటాచ్ అయ్యారా? నా ప్రొఫెషన్లో ‘ఎమోషనల్’ అవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఒక కొత్త సినిమా చేసినప్పుడు కొత్త యూనిట్‌తో పని చేస్తాం. ఆ తర్వాత వేరే యూనిట్‌తో. అందుకే ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఈ ప్రొఫెషన్లో కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకే కాదు.. ఎవరికీ కరెక్ట్ కాదు. ఒక ‘బ్యూటిఫుల్ అవుట్‌పుట్’ ఇవ్వాలనుకోవడమే మా వరకూ కరెక్ట్. ఇక.. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం బాగా అనిపించింది. పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు (నవ్వుతూ). -
రోడ్లు ఊడ్చిన అమల
హైదరాబాద్: నగరంలోని మియపూర్ జనప్రియ వెస్ట్ సిటీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నటి అక్కినేని అమల పాల్గొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో కలిసి రోడ్లు శుభ్రం చేసిన అమల అనంతరం జరిగిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు జాకెట్లు, గ్లౌజులు అందజేశారు. కాలనీ వాసులతో కలిసి రోడ్లు ఊడ్చడంతో పాటు గంతలు పట్ట రోడ్లకు మరమ్మతులు నిర్వహించారు. -
అమలకు నారీ శక్తి అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటి అక్కినేని అమలకు నారీ శక్తి పురస్కారం లభించింది. సమాజంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటా అందించే ఈ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 33 మంది మహిళలకు రాష్ట్రపతి నారీశక్తి పురస్కారాలను అందజేశారు. వ్యక్తిగత సమాజ సేవకు గుర్తింపుగా అమలకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. అవార్డుతో సమాజ సేవలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. సమాజ సేవకు తాను చేస్తున్న కృషికి తన కుటుంబం నుంచి అందుతున్న సాయం ఎంతో ఉందన్నారు. వివిధ రంగాల్లో మరింత సాయం చేయడానికి తన వద్ద ప్రణాళిక ఉందని, దీన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు అందించి తన భవిష్యతు కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె తెలిపారు. -
అమల సభ్యురాలిగా జంతు సంక్షేమ మండలి
చైర్మన్‌గా పశుసంవర్థక శాఖ మంత్రి సాక్షి, హైదరాబాద్: పశు సంవర్థక శాఖ మంత్రి చైర్మన్‌గా.. సినీనటి, బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ఉత్తర్వులిచ్చారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ మండలిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, చెన్నైకి చెందిన భారత జంతు సంక్షేమ మండలి చైర్మన్ సహా 13 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. సభ్య కన్వీనర్‌గా పశుసంవర్థక శాఖ డెరైక్టర్ ఉంటారు. అనధికారిక సభ్యుల్లో అమలతో పాటు స్వామి స్వయం భగవాన్‌దాస్, వైల్డ్‌లైఫ్ ప్రచార మేనేజర్ సి.సంయుక్త, జంతు సంక్షేమ ఉద్యమకారుడు శ్యాంసుందర్ అగర్వాల్, పీలా రామకృష్ణ మెమోరియల్ జీవరక్ష సంఘానికి చెందిన సతీష్ ఖండేవాల్ తదితరులున్నారు. మొత్తం 21 మందితో ఏర్పాటైన మండలి... పీసీఏ చట్టం-1960ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. -
జంతు సంరక్షణే బ్లూక్రాస్ లక్ష్యం
♦ సొసైటీ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ♦ కేజీరెడ్డి కళాశాలలో డాగ్స్ షెల్టర్ ప్రారంభం మొయినాబాద్: పశుపక్ష్యాదుల విషయంలో ప్రతిఒక్కరూ మాన వతా దృక్పథంతో వ్యవహరించాలని బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల అన్నారు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బ్లూక్రాస్, కళాశాల యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాగ్స్ షెల్టర్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శునకాలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జంతు సంరక్షణే ధ్యేయంగా బ్లూక్రాస్ సొసైటీని స్థాపించామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన కుక్కలకు వైద్యం అందించాలని కోరారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి శునకాలను కొనుగోలు చేస్తారని.. అలా కాకుండా వీధి కుక్కలను దత్తత తీసుకుని పెంచితే అవి విశ్వాసంతోపాటు రక్షణగా ఉంటాయన్నారు. సృష్టిలోని జీవులన్నింటికీ బతికే హక్కుందన్నారు. కేజీ రెడ్డి కళాశాలలో డాగ్స్ షెల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ప్రవళిక, శృతి, జబీఖాన్, కళాశాల డెరైక్టర్ మధుసూదన్‌నాయర్, ప్రిన్సిపల్ కేవీ నర్సింహ్మరావు, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ రవికిరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పాతికేళ్ల తర్వాత కమల్‌తో..
తమిళసినిమా : దాదాపు పాతికేళ్ల తర్వాత అమల కమలహాసన్‌తో నటించడానికి సిద్ధమవుతున్నారు. అమల మంచి నృత్య కళాకారిణి అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె బహుభాషా నటి అన్నది గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ దర్శక నటుడు టీ.రాజేందర్ గుర్తింపు అమల. 1986లో మైథిలీ ఎన్నై కాదలీ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన అమల తొలి చిత్రంతోనే నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఆ చిత్రం ఘన విజయంతో అమలకు అవకాశాలు వెల్లువెత్తాయి. రజనీకాంత్, కమలహాసన్ వంటి టాప్‌స్టార్లతో వరుసగా నటించే అవకాశాలను అందుకున్నారు. అలా అనతికాలంలోనే తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. కమలహాసన్‌తో సత్య, వెట్ట్రివిళా వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత దాదాపుగా నటనకు దూరం అయ్యారనే చెప్పాలి. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల వెండితెర, బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కనున్న ఒక భారీ చిత్రంలో విశ్వనటుడు కమలహాసన్‌తో నటించడానికి సిద్ధమవుతున్నారు. కమల్ నటించిన తూంగావనం ఈనెల 10న విడుదల కానుంది. చీకటిరాజ్యం పేరుతో తెలుగులో 20వ తేదీన తెరపైకి రానుంది. దీంతో కమలహాసన్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా అమల నటించనున్నారు. మరో నాయకిగా బాలీవుడ్ నటి జెరీనా వాకబ్ నటించనున్నారు. -
నేను వదిలేశా.. మరి మీరో!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని తన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీని సోమవారం స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ మేరకు 'గివ్ ఇట్ అప్' దరఖాస్తుపై సంతకాలు చేసిన అమల, ఆ పత్రాలను ఆయిల్ కంపెనీ ప్రతినిధికి అందజేశారు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు మరో ఐదుగురు కూడా 'గివ్ ఇట్ అప్' చేసినట్లు హైదరాబాద్ ఏరియా సేల్స్ మేనేజర్ ఆర్.ఉమాపతి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకే ఆమె సబ్సిడీని వదులకున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సబ్సిడీని వదులుకోగా, అందులో తెలంగాణ హెచ్‌పీసీఎల్ వినియోగదారులు 13,420 మంది ఉన్నారని తెలిపారు. -
హక్కులతో పాటు బాధ్యతలూ ముఖ్యమే
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మానవ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమేనని మానవ హక్కుల కమిషన్ సభ్యులు పెదపేరిరెడ్డి అన్నారు. హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే వ్యక్తులు తమ బాధ్యతలను గుర్తిస్తే హక్కులను రక్షించినట్లే అన్నారు. మంగళవారం మానవ హక్కుల దినోత్సవం బషీర్‌బాగ్‌లోని నిజాం పీజీ న్యాయ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపేరిరెడ్డి మాట్లాడుతూ 70 శాతం కేసులు మానవ హక్కుల చట్టపరిధిలో లేనివేనన్నారు. అయినప్పటికీ ఆ సమస్యల పరిష్కార దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. నేటి యువత ప్రేమంటూ జీవితాలను నాశనం చేసుకోకుండా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పీయూసీఎల్, న్యాయవాది జయవింధ్యాల, నిజాం న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్ పాల్గొన్నారు. మానవహక్కుల పరిరక్షణ బాధ్యత అందరిదీ ఉస్మానియా యూనివర్సిటీ: మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అన్నారు. ఓయూ క్యాం పస్‌లోని కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర మహిళా సభలో మానవ హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా, బ్లూక్రాస్ అధినేత అక్కినేని అమల, జస్టిస్ లక్ష్మణ్‌రావు, కల్నల్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.