![నేను వదిలేశా.. మరి మీరో!](/styles/webp/s3/article_images/2017/09/3/71438605494_625x300.jpg.webp?itok=bi-an8SX)
నేను వదిలేశా.. మరి మీరో!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని తన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీని సోమవారం స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ మేరకు 'గివ్ ఇట్ అప్' దరఖాస్తుపై సంతకాలు చేసిన అమల, ఆ పత్రాలను ఆయిల్ కంపెనీ ప్రతినిధికి అందజేశారు.
ఆమెతోపాటు కుటుంబ సభ్యులు మరో ఐదుగురు కూడా 'గివ్ ఇట్ అప్' చేసినట్లు హైదరాబాద్ ఏరియా సేల్స్ మేనేజర్ ఆర్.ఉమాపతి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకే ఆమె సబ్సిడీని వదులకున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సబ్సిడీని వదులుకోగా, అందులో తెలంగాణ హెచ్‌పీసీఎల్ వినియోగదారులు 13,420 మంది ఉన్నారని తెలిపారు.