కలెక్టరేట్, న్యూస్‌లైన్: మానవ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమేనని మానవ హక్కుల కమిషన్ సభ్యులు పెదపేరిరెడ్డి అన్నారు. హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే వ్యక్తులు తమ బాధ్యతలను గుర్తిస్తే హక్కులను రక్షించినట్లే అన్నారు. మంగళవారం మానవ హక్కుల దినోత్సవం బషీర్‌బాగ్‌లోని నిజాం పీజీ న్యాయ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపేరిరెడ్డి మాట్లాడుతూ 70 శాతం కేసులు మానవ హక్కుల చట్టపరిధిలో లేనివేనన్నారు. అయినప్పటికీ ఆ సమస్యల పరిష్కార దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. నేటి యువత ప్రేమంటూ జీవితాలను నాశనం చేసుకోకుండా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పీయూసీఎల్, న్యాయవాది జయవింధ్యాల, నిజాం న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
మానవహక్కుల పరిరక్షణ బాధ్యత అందరిదీ
ఉస్మానియా యూనివర్సిటీ: మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అన్నారు. ఓయూ క్యాం పస్‌లోని కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర మహిళా సభలో మానవ హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా, బ్లూక్రాస్ అధినేత అక్కినేని అమల, జస్టిస్ లక్ష్మణ్‌రావు, కల్నల్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
హక్కులతో పాటు బాధ్యతలూ ముఖ్యమే
Published Wed, Dec 11 2013 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement