
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

'ఏఎన్‌ఆర్ 100- కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఫిల్మ్ ఫెస్టివల్‌ని ఈ క్రమంలో నిర్వహించారు.

అక్కినేని ఐకానిక్ ఫిలిం 'దేవదాసు' స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది.

ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులందరితో పాటు అభిమానుల పలువురు పాల్గొన్నారు.

ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, గుండమ్మ కథ సినిమాలు ప్రదర్శించనున్నారు.

డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మనం ఈ లిస్టులో ఉన్నాయి.

నాగార్జున మాట్లాడుతూ.. నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే ఉంటాం.

31 సిటీల్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఉత్తరాదిలోనూ అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పుకొచ్చారు.

గోవా ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నాన్నగారి పేరు మీద ఓ చాప్టర్ చేయడం సంతోషంగా ఉంది.




















