akkineni nageswararao
-
ఇఫీలో శతాబ్ది వేడుకలు
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా... భారతీయ చిత్రసీమలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. నటులుగా ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడిగా మహమ్మద్ రఫీ, దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) ఘనంగా నివాళులర్పించనుంది. 55వ ఇఫీ వేడుకలు గోవాలో ఈ నెల 20న ఆరంభమై 28 వరకూ జరుగుతాయి.22న అక్కినేని నాగేశ్వరరావు, 24న రాజ్ కపూర్, 26న మహమ్మద్ రఫీ, 27న తపన్ సిన్హాలకు చెందిన శతాబ్ది వేడుకలను జరపడానికి ‘ఇఫీ’ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చిత్రోత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక నలుగురు లెజెండ్స్ నివాళి కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ⇒ నలుగురు లెజెండ్స్ కెరీర్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలను, పాటలను ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ‘దేవదాసు’, రాజ్ కపూర్ కెరీర్లో మైలురాయి అయిన ‘ఆవారా’, తపన్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అద్భుత చిత్రం ‘హార్మోనియమ్’ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు ‘హమ్ దోనో’లో మహమ్మద్ రఫీ పాడిన పాటలను వినిపించనున్నారు. కాగా, వీక్షకులకు నాణ్యతతో చూపించడానికి ఈ చిత్రాలను పునరుద్ధరించే బాధ్యతను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆరై్కవ్ ఆఫ్ ఇండియా తీసుకుంది. అలాగే ఈ ప్రముఖుల సినిమా కెరీర్‌కి సంబంధించిన ఏవీ (ఆడియో విజువల్) చూపించనున్నారు. ⇒నలుగురు కళాకారుల ప్రత్యేక నివాళిలో భాగంగా వారి విజయాలను గౌరవిస్తూ పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ గోవాలోని కళా అకాడమీలో సృష్టించే ‘శాండ్ ఆర్ట్’ ఇల్ల్రస్టేషన్ని ప్రదర్శించనున్నారు. ⇒ సినిమా రంగంలో, భారతీయ సంస్కృతిపై వీరు వేసిన ముద్రకు ప్రతీకగా ఈ నలుగురు దిగ్గజాలకు అంకితం చేస్తూ ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించనున్నారు. ⇒ ఈ నలుగురి కెరీర్లో తీపి గుర్తులుగా నిలిచిపోయిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ‘ఇఫీ’ ప్లాన్ చేస్తోంది. ⇒ రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ కెరీర్‌లోని చిత్రాల్లోని 150 పాటలు, ఏఎన్నార్, తపన్ సిన్హా చిత్రాల్లోని 75 పాటలు... మొత్తంగా 225 పాటలతో ఓ సంగీత విభావరి జరగనుంది.భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నలుగురు కళాకారుల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు. -
మెగాస్టార్‌కు ఏఎన్నార్ జాతీయ అవార్డ్.. హాజరైన టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ఏఎన్నార్ శత జయంతి వేడుకలు (ఫొటోలు)
-
తెలుగు సినిమాకో మైలురాయి.. ఏఎన్నార్ జయంతి ప్రత్యేకం (ఫొటోలు)
-
ఏఎన్నార్ 100వ పుట్టినరోజు.. 10 క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్
దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర రావు (ఏఎన్ఆర్) 100వ పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ సంస్థ ఘన నివాళి ప్రకటించింది. అక్కినేని నాగేశ్వర రావు ఫిల్మ్ ఫెస్టివల్‌ను తేదీలని బయటపెట్టింది. సెప్టెంబరు 20-22 తేదీల మధ్య ఈ సినిమా వేడుక జరగనుంది. 31 నగరాల్లో ఏఎన్నార్ 10 క్లాసిక్ సినిమాల్ని రీ రిలీజ్ చేసి సెలబ్రేట్ చేసుకోనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ ఫెస్టివల్లో దేవదాసు, మాయాబజార్, భార్యా భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడి గుండాలు, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్, మనం తదితర సినిమాలని ప్రదర్శిస్తారు. ఇకపోతే ఏఎన్ఆర్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు వందల సినిమాలు చేశారు. చివరగా అక్కినేని కుటుంబమంతా కలిసి నటించిన 'మనం'లో ప్రధాన పాత్ర పోషించారు. ఒకప్పటి తరానికి బాగా దగ్గరైన ఏఎన్నార్ మూవీస్ మళ్లీ థియేటర్లలోకి రానుండటం విశేషం.(ఇదీ చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)#CelebratingANR100 with 10 classic films of the legend #AkkineniNageswaraRao Garu ✨Immerse yourself in the timeless classic of love and sacrifice, #Devadasu, and relive the finest moments of cinema ❤️Catch the iconic films of #ANR Garu on the big screen from September 20th… pic.twitter.com/7UXOuFRgOr— Annapurna Studios (@AnnapurnaStdios) September 15, 2024 -
AI Video: అప్పుడు శోభన్ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు
ప్రస్తుతం టెక్నాలజీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త సాంకేతికతను అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) మరో మెట్టు ఎక్కించింది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త వీడియోలు, ఫోటోలు రీక్రియేట్ చేయటం ఒక ట్రెండ్‌గా మారింది. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఏఐ రీక్రియేటెడ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. INTELLIGENTLY created ARTIFICIAL ANR 🙏 pic.twitter.com/dfRUpKpEGI — Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2024 తాజాగా తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి హాలీవుడ్ హీరోలా రీక్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్ పోస్ట్ చేశారు. ఇటీవల ఆర్జీవీ.. తెలుగు చిత్రపరిశ్రమలో అందగాడు అనే పేరు సొంతం చేసుకున్న నటుడు శోభన్ బాబుకు సంబంధిచిన రీక్రియేటెడ్ వీడియోను కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Guess The Actor: ఏఐ మాయ.. దిగ్గజ హీరో లుక్ అదిరిపోయిందంతే! -
అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని
పాన్ ఇండియా నటుడు అక్కినేని నటనలో శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని అల నాడే పాన్ ఇండియా నటుడు అయ్యారు అన్నారు పూర్వ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ ఉప కులపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య కొలకలూరి ఇనాక్.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్టొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో అమెరికా లోని డల్లాస్ నగరం లోని ప్రిస్కో లో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా,నటసమ్రాట్ ఆక్కి నేని - ఆకృతి జాతీయ పురస్కారం, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాదుకు ప్రదానం చేశారు..ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ దుశ్హాలువాతో, పుష్పగుచ్ఛంతో, ఘనంగా సత్కరించి అక్కినేని ఆకృతి జాతీయ పురస్కారాన్ని తోటకూర ప్రసాద్ కు అందించారు.. చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు మరువలేనివి ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రసంగిస్తూ, అక్కినేని తన పాత్రల ఎంపిక లో ఎంతో పరిణతి చూపెవారన్నారు.. స్వయం కృషి తో ఉన్నత శిఖరాలు చేరుకున్న మహానటుడు ఆయన అన్నారు.. అంతేకాదు చలన చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రలలో పరిధవిల్లడానికి ఆయన చేసిన కృషి గణనీయమైనదని అన్నారు.. అక్కినేని పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలు అందిస్తూ అమెరికా లోని తెలుగు సమాజానికి అండగా వుంటు అక్కినేని పేరిట అనేక కార్య క్రమాలు చేస్తున్న డా. తోటకూర ప్రసాద్ కు అందించడం ఎంతో సముచిత నిర్ణయం అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పురస్కార గ్రహీత పురస్కార గ్రహీత తోటకూర ప్రసాద్ తనకు లభించిన ఈ పురస్కారం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. తన బలం ఏమిటో, తన బలహీనతలు ఏమిటో నిర్మొహమాటంగా చెప్పేవారని అన్నారు.. ఆయన పాత్రల ఔచిత్యాన్ని సోదాహరణంగా వివరించారు.. విశిష్ట అతిథిగా డా.ఆళ్ళ శ్రీనివాసరెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్న అమెరికా లోని ప్రముఖ కార్డియాజిస్ట్ డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని ఆకృతి అమెరికా లో నిర్వహించడం ఎంతో విశేషం అన్నారు.. అక్కినేని ఫౌండేషన్ బోర్డు సభ్యులు రావు కలవల అక్కినేని తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు.. వి. రాంభూపాల్ రావు, ఇంద్ర కరణ్, డా. వర్ష, మోహన్, రవీందర్, మున్నగు వారు ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలు గా వ్యవహరించారు.. ఈ సందర్భంగా అమెరికా లో తెలుగు గాయకులు చంద్రహాస్, ప్రభాకర్ కోట, లక్ష్మీ భారతి అక్కినేనీ చిత్ర గీతాల విభావరి జనరంజకంగా నిర్వహించారు.. -
వహ్వా వహిదా.. తెనాలి ఫిదా
తెనాలి: సినీ రంగంలో లబ్ధప్రతిష్టులైన కళాకారులకు భారత ప్రభుత్వం అందించే సర్వోన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2021 సంవత్సరానికి స్వీకరించనున్న ప్రసిద్ధ బాలివుడ్ నటి వహిదా రెహమాన్ తెలుగు చిత్రసీమ నుంచే బాలివుడ్‌కు వెళ్లారు. విశాఖపట్టణంలో పెరిగిన వహిదా, అక్కణ్ణుంచే సినీరంగానికి పరిచయమయ్యారు. అయితే అందరికీ తెలీని విషయం ఏమిటంటే ఆమెకు ఆంధ్రాప్యారిస్ తెనాలితోనూ అనుబంధం ఉంది. విశాఖకు ముందు ఆమె తన తల్లిదండ్రులతోపాటు కొద్దికాలం తెనాలిలో ఉన్నారు. నాట్యం నుంచి ఆమె తెరంగేట్రం చేసినందున, ఆ నాట్యకళకు శ్రీకారం చుట్టింది కళల తెనాలిలోనే అని పెద్దలు చెబుతారు. వహిదా తండ్రి మున్సిపాలిటీ అధికారి వహిదా తండ్రి రెహమాన్ పట్టణ మున్సిపాలిటీలో అధికారిగా కొంతకాలం పనిచేశారు. అందుచేత వహిదా కొత్తపేటలోని తాలూకా హైస్కూలులో చదువుకున్నారు. అప్పట్లోనే ఆమె నాట్యం నేర్చుకుని ఉంటుందని, తనకు ఆమె బ్యాచ్‌మేట్ అని సీనియర్ కళాకారుడు, ‘నూరేళ్ల తెనాలి రంగస్థలి’ గ్రంథకర్త స్వర్గీయ నేతి పరమేశ్వరశర్మ చెప్పేవారు. ఆ తర్వాత ఆమె తండ్రికి విజయవాడకు బదిలీ అయింది. అక్కడకు వెళ్లాక కూడా వహిదా నాట్య సాధన కొనసాగించింది. పట్టణానికి చెందిన రాజకీయ నాయకుడు, కళాభిమాని, కళాపోషకుడు నన్నపనేని వెంకట్రావు అప్పట్లో ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలను స్వరాజ్ టాకీస్‌లో నిర్వహించేవారు. ఒకరోజు వహిదా రెహమాన్ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన తిలకించిన వారిలో తానూ ఒకణ్ణని పరమేశ్వరశర్మ సంతోషపడేవారు. ప్రేక్షకుల మది గెలిచిన నటి తర్వాత వహిదా తాపీ చాణక్య తీసిన ‘రోజులు మారాయి’ సినిమాతో వెండితెరపై మెరిశారు. ‘ఏరువాక సాగారో’ పాటకు అద్భుతంగా నృత్యం చేశారు. ప్రజా నాట్యమండలి డప్పు కళాకారులు అమృతయ్య, ఏసుదాసులే ఆ పాటకు డప్పు వాయించారు. ఆ సినిమా ఎంత హిట్టయిందో తెలిసిందే. రోజులు మారాయి సినిమా శతదినోత్సవం తెనాలిలో జరిగినప్పుడు ఆ సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావు, వహిదా రెహమాన్ ఇద్దరూ తెనాలి వచ్చారు. అక్కినేనితోపాటు వహిదాకు తెనాలికి దగ్గర్లోని సంగంజాగర్లమూడిలో ఒక ఇంట్లో బస ఏర్పాటుచేశారు. తెనాలిలో అయితే ప్రేక్షకుల తాకిడి తట్టుకోలేమని నిర్వాహకులు భావించారు. అయినా విషయం తెలుసుకున్న ప్రేక్షకులు అనేకమంది ఆ ఇంటిని చుట్టుముట్టారట. దీంతో బసచేసిన భవనంపై నుంచి అక్కినేని, వహిదా ప్రేక్షకులకు అభివాదం చేశారని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, ‘యోగాచార్య’ షేక్ మొహిద్దీన్ బాచ్చా ఒక సందర్భంలో చెప్పారు. చేబ్రోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను, బిల్లులు మార్చుకునే నిమిత్తం తెనాలి వస్తుండగా మార్గమధ్యంలో సంగంజాగర్లమూడిలో నాగేశ్వరరావు, వహిదాను చూశానని వివరించారు. తెలుగు తెర నుంచే బాలివుడ్‌కు వెళ్లిన వహిదా అక్కడ ఓ వెలుగు వెలిగారు. తన అందంతోనే కాకుండా నాట్యంతో ప్రేక్షక హృదయాలు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను స్వీకరించారు. మళ్లీ ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమె కీర్తి సిగలో కలికితురాయి కానుంది. -
ANR 100th Birthday Celebrations: నాగేశ్వరరావుగారు నట విశ్వవిద్యాలయం
‘‘తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు అని ఎప్పుడూ చెబుతుంటాను. తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం నాగేశ్వరరావుగారిలోని గొప్పతనం. అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మహా కవి కాళిదాసు.. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగి΄ోయేవారు. నాగేశ్వరరావుగారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ విశ్వ విద్యాలయంలో విద్యార్థిననుకుని, ఆ గుణగణాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌కు మంచి ప్రణాళికలు వేసుకున్నట్లవుతుంది’’ అన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం (సెప్టెంబరు 20) ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు మహానటులు.. మహా మనిషి. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావుగారు. అవతలివాళ్లు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సంప్రదాయాలు, విలువల్లో ఆయన జీవించి, నటించి మనకు చూపించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తే అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. నాగేశ్వరరావుగారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, జీవిత చరమాంకంలోనూ నటిస్తూనే ఉన్నారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. జీవిత కాలం పూర్తయిన తర్వాత కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో అక్కినేని నాగేశ్వరరావుగారు అగ్రగణ్యులు. ఆయన మంచి నటులే కాదు.. పరిణతి చెందిన గొప్ప ఆశావాది కూడా. ఆయన నాస్తికుడు. గొప్ప తాత్త్వికుడు. ఆయన పెద్దగా చదువుకోలేదని అంటారు. కానీ జీవితాలను చదివారు. జీవితంలో ఆయన ΄ోరాటం చేశారు.. జీవితాన్ని ప్రేమించారు.. ఆస్వాదించారు. జీవితంలో నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు’’ అని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘1950 సమయంలో నాగేశ్వరరావుగారు సినిమాల్లో నటించడంప్రారంభించాక, సొంతిల్లు కట్టుకోవడానికి ముందే మద్రాస్ విశ్వ విద్యాలయానికి పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాతిక వేలు ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి కూడా పాతిక వేలు విరాళం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. 1959లోలక్ష రూపాయల విరాళం ఇచ్చి గుడివాడ కళాశాలను నిలబెట్టారు. నాలాంటివారు ఎందరో చదువుకోగలిగారు. ఆ విధంగా ఆప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఓ విప్లవానికి ఆయన నాంది పలికారు’’ అన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ – ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి కష్టం, కళల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆయన్ను ఓ లెజెండ్‌ని చేశాయి. యువ నటీనటులకు నాగార్జునగారు స్ఫూర్తి అని నా ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో చెబుతుంటారు. నాగార్జునగారేమో తన తండ్రి చూపించిన మార్గంలో నడిచానని చెబుతుంటారు’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే.. ఆయన ఓ మహానుభావుడు... ఆయన మనతో లేరనే భావన నా మనసులో చిన్నతనం నుంచే ముద్రపడింది. ఏ విగ్రహం చూసినా నాకు అదే అనిపించేది. అందుకే వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించేంతవరకూ నేను నాన్నగారి విగ్రహాన్ని చూడలేదు. చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాన్నగారు మాతో లేరనే విషయాన్ని అంగీకరించాల్సి వస్తుందేమోనని... శిల్పి వినీత్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా చెక్కాడు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని జీవించారు. తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి.. ఇలా వివిధ రకాలుగా నాన్నగారు అందరికీ తెలుసు. మాకు మాత్రం నాన్నగారు మా గుండెలను ప్రేమతో నింపిన వ్యక్తి. నన్ను, నా తోబుట్టువులను, మా పిల్లలను.. అందర్నీ చల్లగా చూసిన వ్యక్తి. మాకు మనసు బాగున్నా, బాగోలేకున్నా నాన్నగారి దగ్గరికి వెళ్లి కూర్చుంటే చాలు అన్నీ సర్దుకునేవి. అన్నపూర్ణ స్టూడియోస్ నాన్నగారికి నచ్చిన స్థలం. నచ్చిన చోట విగ్రహం పెడితేప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు అంటారు. సో.. ఆయన ప్రాణంతో మా దగ్గరే ఉన్నారని,ప్రాణంతో మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. నా ఆలోచనల్లోనే కాదు.. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో నాన్నగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినవారికి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన నాన్నగారి అభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు. ఏయన్నార్ పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘మనిషి ఎంత కీర్తి సంపాదించినా, ఎంత ధనం గడించినా తలగడ మీద తల పెట్టగానే నిద్ర΄ోవడం అనే ఆస్తి, సౌకర్యం ఏ ధనం ఇవ్వలేదు. ఏయన్నార్‌గారు తలగడ మీద తల పెట్టగానే హాయిగా నిద్ర΄ోయేవారు. 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ ముందు రోజు నర్సు నిద్రకోసం మాత్ర ఇస్తే తీసుకోలేదు. ఏ మాత్ర వేసుకోకుండానే హాయిగా నిద్ర΄ోయారు. ఆ తర్వాత ఆయన జీవితం అందరికీ తెలిసిందే. నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. అన్నపూర్ణ సంస్థ, ఏయన్నార్ ఫిల్మ్ స్కూల్, కాలేజీ, ఆయన చిత్రాలు, ఫ్యాన్స్ తీపి గుర్తులు’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావు గారు ఒక గ్రంథం. ఆయన ‘మరపురాని మనుషులు’ సినిమాకు అసోసియేట్‌గా చేశాను. అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాల్లో నటించాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్న వ్యక్తి నాగేశ్వరరావుగారు. మహానట వృక్షం. కళాకారులకు గొప్ప వరం. స్వయంశిల్పి. స్నేహశీలి. అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి’’ అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఓ వేడుకలో నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం లభించింది. స్టార్ అయిన మీరు ‘మిస్సమ్మ’ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు చేశారు? అని ఆయన్ను అడిగాను. ‘దేవదాసు’ తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే వస్తున్నాయని, ఇమేజ్ మార్చుకోక΄ోతే ఇబ్బందవుతుందేమోనని, ఆ పాత్రను తానే అడిగి మరీ చేశానని చె΄్పారు. నాగేశ్వరరావుగారికి ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకానికి నమస్కారం చేయాలనిపించింది’’ అన్నారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయడం నా అదృష్టం. క్రమశిక్షణతో పాటు ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. ఏయన్నార్ కుమార్తె నాగ సుశీల మాట్లాడుతూ– ‘‘అందరికీ పండగలు ఉంటాయి. కానీ మా అక్కినేని అభిమానులకు నాన్నగారి జయంతే పండగ. అభిమానుల ్ర΄ోత్సాహం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. అమ్మానాన్నలు మేం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేవారు. అలా మేమందరం కలిసే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేశాం’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ– ‘‘తాతగారు తన జీవితంలో కృతజ్ఞతకు విలువ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో తారా స్థాయికి ఎదిగిన ఆయనకు కళామతల్లికి తిరిగి ఇవ్వాలని ఉండేది. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఏయన్నార్ నేషనల్ అవార్డు, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. ఇలా ఎన్నో ఆయన కృతజ్ఞతలోంచి వచ్చిన ఆలోచనలే’’ అన్నారు. ‘‘నాగేశ్వరరావుగారి విగ్రహం పనులను నాకు అప్పగించిన అక్కినేని కుటుంబ సభ్యులకు ధన్య వాదాలు. దాదాపు ఐదున్నర నెలలు వర్క్ చేశాం’’ అన్నారు విగ్రహ రూపకర్త వినేష్ విజయన్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్గారంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్ ఐకాన్‌గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ప్రేరణ కలిగించే కేస్ స్టడీగా చాలా మంది ఫిల్మ్ స్కూల్స్‌లో చదువుతుంటారు. ఈ జాబితాలో నేనూ ఉన్నాను. తాతగారితో నేను కలిసి నటించడం నా అదృష్టం. మన పుట్టుక మన చేతిలో ఉండదు. అలాంటిది అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడిగా పుట్టడం నా అదృష్టం’’ అని అన్నారు. తాత ఏయన్నార్‌కు అఖిల్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమల, సుప్రియ, సుమంత్.. ఇలా అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, మంచు విష్ణు, నాని, నాజర్, అనుపమ్ ఖేర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, సి. కల్యాణ్, కేఎల్ నారాయణ, ‘దిల్’ రాజు, చినబాబు, నాగవంశీ, బి. గోపాల్, వైవీఎస్ చౌదరి, పి. కిరణ్, గుణ్ణం గంగరాజు, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొని, అక్కినేని నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు. -
అక్కినేని.. నీకెవరు సాటిరాని!
తెలుగునాట సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జన్మించి నేటితో 99 ఏళ్లు నిండాయి. సెప్టెంబర్ 20న 1924లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఆయన జన్మించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 20వ తేదీకి 100 ఏళ్లు నిండుతాయి. ఈ రోజు నుంచే ఆ శకపురుషుడి శతవసంత వేడుక ఆరంభమైంది. ప్రపంచమంతా, వాడవాడలా విశేష వేడుకలు మొదలయ్యాయి. విగ్రహాల ఆవిష్కరణలు, ప్రత్యేక సంచికలు, ఛాయాచిత్రాల విశిష్ట ప్రచురణల కోలాహలం మొదలైంది. తెలుగు జన హృదయ సామ్రాజ్యలను దోచుకున్న 'నటసామ్రాట్' అక్కినేని. ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. తానే చెక్కుకున్న అద్భుతమైన శిల్పం. తానే గీసుకున్న అందమైన 'చిత్రం'. ఏ కాలేజీ చదువులు చదవని విద్యాధికుడు, ప్రపంచాన్ని, జీవితాన్ని విశ్వవిద్యాలయంగా భావించి, జీవించిన నిత్య అధ్యయన శీలి. చదువులంటే ఎంతో ఇష్టం.చదువుకున్నవారంటే అంతులేని గౌరవం. తను రాసిన 'అ ఆలు..' చదివితే చాలు. అతనెంతటి ఆలోచనాపరుడో తెలుస్తుంది. ఆ జీవితాన్ని సమీక్షిస్తే తెలుస్తుంది, ఆయనెంతటి సాధకుడో! అది ఒక ప్రయోగశాల. తొమ్మిది పదుల నిండు జీవితాన్ని పండించుకున్న పూర్ణ యశస్కుడు, కళాప్రపూర్ణుడు. భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన వేసిన పాత్రలు అజరామరం. సాంఘిక సినిమాలు ఆయన ప్రత్యేకం. ముఖ్యంగా మహాకవులు, వాగ్గేయకారులు,మహాభక్తులు, కళాకారుల పాత్రలకు పెట్టింది పేరు. కాళిదాసు,తెనాలి రామకృష్ణ ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. జయదేవుడు, విప్రనారాయణుడు ఈయనే ఏమో! అని భ్రమ కలుగుతుంది. చాణుక్యుడు అచ్చూ అలాగే ఉంటాడేమో అని అనుకుంటాం. "స్పర్ధయాన్ వర్ధతే విద్య" అనే ఆర్యుల వాక్కు అక్కినేనికి నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. ఎన్టీఆర్ వంటి విద్యాధికుడు, పరమ ఆకర్షణా స్వరూపుడు అటువైపు ఉండగా, తన ఉనికిని కాపాడుకుంటూ.. తన విశిష్ట ముద్ర వేసుకోడానికి, ఎంత తపన పడ్డాడో? జగ్గయ్య వంటి చదువరులు, భానుమతి వంటి గడసరులు, సావిత్రి వంటి ప్రతిభామణులు ఉన్న కాలంలో, దీటుగా నిలబడడానికి ఎన్ని ధీరోదాత్తమైన ఆత్మదీపాలు వెలిగించుకున్నారో! అడుగడుగునా,ఆణువణువునా తనను తాను భద్రంగా కాపాడుకోవడానికి,గెలుపుగుర్రంపై స్వారీ చేయడానికి చెప్పలేనంత తపన పడ్డారు. ఆ తపనే తపస్సు. హైస్కూల్ విద్య కూడా దాటని అక్షరాస్యతతో, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ వంటి మహాకవుల పాత్రలు వేయడం బహు సాహసం, వేసి గొప్పగా మెప్పించడం బహు ఆశ్చర్యచకితం. నిజజీవితంలో దైవభక్తి ఎరుగని మనిషి, పరమ భక్తులైనతుకారాం,విప్రనారాయణలుగా జీవించిన తీరు అనన్య సామాన్యం. అమరశిల్పి జక్కనగా ఆయన వేసిన ముద్ర ఆయనకే చెల్లింది. తెలుగు సినిమాలో డాన్సులు మొదలు పెట్టిన మొట్టమొదటి హీరో ఆయనే. ద్విపాత్రాపోషణం ఆయనతోనే మొదలైంది.'నవరాత్రి' సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. ఆయనే తొలి నవలా నాయకుడు కూడా. ఇక ప్రేమికుడు, భగ్నప్రేమికుడు పాత్రలు ఆయనకే చెల్లాయి. 'దేవదాసు'గా ఆ విశ్వరూపాన్ని చూడవచ్చు. హీరోకు ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చారు.ఆ హెయిర్ కట్, ఆ మీసకట్టు,డ్రెస్‌ను కొన్ని లక్షలమంది అనుకరించారు. ఆయన స్టైల్ కొన్ని తరాలను శాసించింది. కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఎక్కడో రామాపురం/ వెంకటరాఘవాపురం అనే కుగ్రామంలో జన్మించారు. దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. పల్లెల్లో పొలాల్లో పనిచేసుకుంటూ, నాటకాలలో చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ నటప్రస్థానాన్ని ప్రారంభించారు. స్త్రీ పాత్రలు వేసి,తొలినాళ్ళల్లోనే అందరినీ ఆకర్షించారు. పాటలు, పద్యాలు పాడి డాన్సులు వేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఘంటసాల బలరామయ్య చలువతో తన ప్రగతి భవనానికి మెట్లు కట్టుకున్నారు. వెండితెరపై ఏడు దశాబ్దాలు 16 ఏళ్ల వయస్సులోనే (1940)'ధర్మపత్ని'తో సినిమా రంగంలో అడుగుపెట్టారు. 20ఏళ్ల ప్రాయంలోనే 'సీతారామ జననం'(1944)తో మొట్టమొదటగా కథానాయకుడిగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు. అప్రతిహతంగా ఏడు దశాబ్దాల పాటు మహాప్రస్థానం సాగింది. తొమ్మిది పదుల వయస్సులోనూ 'మనం'లో జీవించి మెప్పించారు. జీవితంలో తుదిశ్వాస వరకూ నటించిన అరుదైన చరిత్రను లిఖించుకున్నారు. కె విశ్వనాథ్‌కు దర్శకుడిగా అవకాశం నటుడుగా విజృంభించడమే కాక,'అన్నపూర్ణ' బ్యానర్లో ఆణిముత్యాల వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు. తెలుగునేలపై చిత్రపరిశ్రమ ప్రభవించడానికి కృషిచేసి, సాధించినవారిలో అక్కినేనివారిది అగ్రశ్రేణి. కె.విశ్వనాథ్‌లో దర్శకత్వ ప్రతిభ ఉందని తొలిగా గుర్తించినవారు అక్కినేని నాగేశ్వరావు. కేవలం గుర్తించడమే కాక 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకుడుగా అవకాశమిచ్చి.. ప్రోత్సహించినవారు కూడా ఆయనే. ఎక్కడ ప్రతిభ, పాండిత్యం ఉంటే అక్కడ గుర్తించి, ఆ ప్రతిభామూర్తులను ప్రోత్సహించి, గౌరవించిన కళాహృదయుడు, ప్రతిభా పక్షపాతి అక్కినేని.మహాదాత కూడా. కాలేజీ కోసం ఉన్నదంతా దానం గుడివాడలో కళాశాల నిర్మాణానికి, అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చివేసిన త్యాగశీలి. తన ప్రతిభ పట్ల, రేపటి పట్ల అచంచలమైన విశ్వాసంతో అంతటి దానం చేశారు. ఆ కాలేజీకి అక్కినేని నాగేశ్వరావుపేరు పెట్టుకున్నారు. కేవలం గుడివాడ కాలేజీకే కాదు.. ఆంధ్రా యూనివర్సిటీ మొదలు ఎన్నో విద్యాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు. ఎందరికో, ఎన్నింటికో గుప్తదానాలు కూడా చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను కాపాడుకుంటూనే, పాత్రత ఎరిగి దానం చేసే విజ్ఞత ఆయన సొత్తు.'అపాత్రాదానం' చేయకూడదన్నది ఆయన నియమం. తన విజ్ఞాన పరిధులను విశేషంగా విస్తరించుకోడానికై కవులు,మేధావులతో గడిపేవారు. సత్ సాంగత్యంలో గడపడం ఆయన నిత్యకృత్యం. 50 ఏళ్లకే గుండె ఆపరేషన్ 50 ఏళ్ల వయస్సులోనే గుండె దెబ్బతిన్నది. అమెరికాలో ఆపరేషన్ చేయించుకొని పునరుత్తేజం పొందారు. అప్పటి నుంచి జీవనశైలిని ఎంతో మార్చుకున్నారు. తన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోడానికి ఋషి వలె కృషి చేశారు. గుండె చాలా తక్కువ శాతం మాత్రమే పనిచేసేది. అచంచలమైన మనోధైర్యం, విచక్షణతో హృదయాన్ని ధృడంగా నిలుపుకున్నారు. ఆ తీరు అన్యులకు సాధ్యపడదు. సునిశితమైన పరిశీలన, చురుకైన చూపులు, పాదరసం వంటి మెదడు, నిలువెల్లా రసికత, గుండెనిండా పట్టుదల, నిత్య కృషీవలత్వం అక్కినేని సుగుణాలు,సులక్షణాలు. క్రమశిక్షణకు మారుపేరు అకడమిక్‌గా తాను పెద్ద చదువులు చదువుకోలేదనే స్మృతితో పిల్లలను బాగా చదివించారు. చదివించడమే కాక,ఎంతో క్రమశిక్షణతో పెంచారు. శ్రమ విలువ తెలియాలన్నది ఆయన సూక్తి. సినిమా జీవితంలోనూ, నిజ జీవితంలోనూ తన బలాలు,బలహీనతలు బాగా ఎరిగి నడుచుకున్నారు. తాను ఎక్కడ రాణించగలనో తెలిసి అక్కడ విజృంభించారు. ఎచ్చట గెలవలేనో ఎరిగి అచ్చట విరమించుకున్నారు. రాజకీయాల్లో అనేకసార్లు అవకాశాలు వచ్చినా చిరునవ్వుతో తప్పించుకున్నారు. కానీ,రాజకీయాలను సునిశితంగా పరిశీలించడం ఎన్నడూ మానలేదు. రాజకీయ నాయకులతో విస్తృతంగా సంబంధాలను పెంచుకున్నారు. ఆయనకి అదొక 'ఆట'విడుపు. సాధించని అవార్డులు లేవు ఆయన నటించిన సినిమాలు, నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి రికార్డ్ సృష్టించాయి.నటుడుగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనను చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకూ,కళాప్రపూర్ణ నుంచి కాళిదాసు సమ్మాన్ వరకూ, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఆన్నీ వరించాయి. ఒక్క 'భారతరత్న' తప్ప, ఘనమైన గౌరవాలన్నీ దక్కించుకున్నారు. 'అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్' స్థాపించారు. దాదా సాహెబ్ ఫాల్కేతో సమానమైన పురస్కారాలను ప్రతి ఏటా చలనచిత్ర ప్రతిభామూర్తులకు సమర్పించాలని సంకల్పం చేసుకున్నారు. దేవానంద్ మొదలు రేఖ వరకూ ఎందరో ప్రజ్ఞాప్రముఖులు 'ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు'ను అందుకున్నారు. అక్కినేని మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయం. "బండరాళ్లను సైతం అరగించుకో గలిగిన వయసులో డబ్బులు లేవు. డబ్బులున్న నేడు వయస్సు లేదు" అంటూ జీవనసారాన్ని చెప్పిన తత్త్వవేత్త అక్కినేని. అక్కినేని వలె జీవించడం, జీవితాన్ని సాధించడం అందరికీ సాధ్యపడేది కాదు. నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే నడచి వెళ్లిన అక్కినేని 'అమరజీవి'గా అనంతమైన కాలంలో అఖండగా వెలుగుతూనే ఉంటారు. రచయిత: మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
తెలుగు సినీ దిగ్గజం.. అక్కినేనికిదే శతజయంతి నివాళి!
తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పుట్టి సినీ ప్రపంచంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యం ఏర్పరచుకున్న ఏకైక నటుడు మన అక్కినేని. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో కళామతల్లి ఒడిలో ఒదిగిపోయారు. ఆయన శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. (ఇది చదవండి: భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్) అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ తారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సుమంత్, నాగచైతన్య, అమల, అఖిల్ ఆయనకు నివాళులర్పించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్ రాజు, మోహన్ బాబు, రామ్ చరణ్, మహేశ్ బాబు, సుమ కనకాల, టాలీవుడ్ సినీ పెద్దలు పాల్గొన్నారు. A moment of joy and pride for the fans of #AkkineniNageswaraRao Garu ✨💫 Former Vice President of India Shri. @MVenkaiahNaidu Garu unveils the statue of #ANR garu at @AnnapurnaStdios marking the centenary birthday ❤️ Watch ANR 100 Birthday Celebrations live now! -… pic.twitter.com/5ajMSNFiM1 — Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2023 -
భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్
టాలీవుడ్ దిగ్గజం, వెండితెరపై చెరదని ముద్ర వేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తన సినీ జీవితంలో దాదాపు 250కు పైగా చిత్రాలతో ఏడు దశాబ్దాల కాలం పాటు వెండితెరపై అలరించిన నటుడు బహుదూరపు బాటసారి ఆయన. 16 ఏళ్ల వయసులోనే పుల్లయ్య చిత్రం ధర్మపత్నిలో చిన్నవేషం వేసినా.. అక్కినేని సినీ యాత్ర మొదలైంది మాత్రం 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాతోనే. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన శతజయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!) మెగాస్టార్ ట్వీట్లో రాస్తూ.. 'శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి , నా సోదరుడు నాగార్జునకు, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !!' శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. 🙏🙏 ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని… pic.twitter.com/yrAxhk7pgb — Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2023 -
నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా', 'వంశీ ఇంటర్నేషనల్' అండ్ ' సాంస్కృతిక కళాసారథి- సింగపూర్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "నవరసాల నటసామ్రాట్" (అక్కినేని నటనా వైదుష్యం) అనే విలక్షణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో ఆదివారం 2 గంటల పాటు అద్భుతంగా నిర్వహింపబడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి సందర్భంగా.. అమెరికా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్, భారత్ దేశాల నుంచి 50మంది ప్రఖ్యాత రచయితలు/రచయిత్రులు పాల్గొని, ఆణిముత్యాలైన 50 సినిమాలలో అక్కినేనిగారి నటనా వైదుష్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు అందించారు. నిర్వాహక సంస్థల అధ్యక్షులైన డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్, ప్రముఖ సినీ కవి భువనచంద్ర తమ సందేశాలు అందించగా, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించారు. ప్రముఖ అవధాని డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, రచయిత్రులు కె.వి కృష్ణకుమారి, గంటి భానుమతి, డా తెన్నేటి సుధాదేవి, తిరునగరి దేవకీదేవి, గాయని సురేఖ మూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డా టి గౌరీశంకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా సూర్య ధనంజయ్ మొదలైనవారు ఈ కార్యక్రమంలో ప్రసంగించగా, "మనం" సినిమా మాటల రచయిత అయిన సినీ నటుడు హర్షవర్ధన్ మనం సినిమాపై విశ్లేషణ వ్యాసం అందించారని నిర్వాహకులు డా వంశీ రామరాజు తెలియజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ అక్కినేని గారి అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను, తనకు వారితో ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గురించి పంచుకున్నారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక, భగ్న ప్రేమిక, హాస్య భరిత, భక్త పాత్రలలో దేనిలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి చిత్రం ఆసాంతం ఆకట్టుకునేలా నటించగలిగే అద్వితీయ ప్రతిభ అక్కినేనిగారిది. దానిని నిరూపించే విధంగా ఉన్న 50 సినిమాలలో వారి నట విశ్వరూపాన్ని విశ్లేషిస్తూ ఏడు దేశాల నుంచి 50 మంది వక్తలు మాట్లాడటం ఇదే తొలిసారి అని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. అనితర సాధ్యమైన నటనతో, అతి స్పష్టమైన ఉచ్చారణతో, కళ్ళతోనే అనేక భావాలు పలికించగలిగే అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి వారి శతజయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి అండ్ కల్చరల్ టీవి యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. సుమారు వెయ్యి మందికి పైగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాల నుంచి వీక్షించారు. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
ఆ హీరోయిన్ విషయంలో నాకు నాగేశ్వర్ రావుకు మనస్పర్థలు వచ్చాయి..
-
అక్కినేనికి ఘన నివాళి అర్పించిన ప్రవాస భారతీయులు
దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు, పద్మ విభుషణ్ పురస్కార గ్రహీత నట సామ్రట్ అక్కినేని నాగేశ్వరరావు 98వ జయంతిని పురస్కరించుకుని 5 ఖండాలు 30 దేశాల తెలుగు సంస్థల సహకారంతో వంశీ ఇంటెర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి ఒమన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యములో జరిగిన కార్యక్రమంలో అక్కినేనికి ఘన నివాళి అర్పించారు. అంతర్జాల వేదికగా జరిగిన కార్యక్రమానికి అమెరికా నుంచి అమెరికా గాన కోకిల శారదా ఆకునూరి, ఇండియా నుంచి కళాబ్రహ్మ శిరొమణి వంశీ రామరాజు, వ్యవస్థాపకులు వంశీ, అనీల్ కుమార్ కడించర్ల కన్వీనర్ తెలుగు కళా సమితి, ఒమన్ నిర్వహణలో 16 గంటల పాటు నిర్విఘ్నంగా జరిగింది. చదవండి : .Miss Universe Singapore-2021: మిస్ సింగపూర్‌గా శ్రీకాకుళం యువతి ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు సన్‌షైన్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డా. గురువా రెడ్డీకి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, వైద్య సేవ శిరొమణి బిరుదు ప్రదానం చేశారు. కరోనా కారణంగా డా. గురువా రెడ్డికి ఆయన నివాసంలోనే కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించి అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కినేని కుటుంబంతో తనకు విడదీయారాని బందం ఉందన్నారు. అక్కినేని పేరు మీద ఈ పురస్కారం అందుకోవడం అందులోనూ తమ కుటుంబ సభ్యులు తనను సత్కరించడం అపూర్వ సన్నివేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా నటి కళాభారతి డా. జమున రమణా రావు, సినీ దర్శకులు కే. విశ్వనాథ్, మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి, పద్మ భుషణ్ పురస్కార గ్రహిత డా. కేఎల్. వరప్రసాద్ రెడ్డి, డా. కె.వి.రమణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు, మాజీ పార్లమెంటరీ సభ్యులు, సినీ నటులు మురళిమోహన్,ఏపీ పూర్వ ఉప సభాపతి బుద్ధప్రసాద్, మహనటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, దేవుల పల్లి మనుమరాలు లలితారామ్(అమెరికా), ఉపేంద్ర చివుకుల కమిషనర్ న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ ఉటిలిటి(అమెరికా), డా. మెడసాని మొహన్, డా.కె.వి.క్రిష్ణ కుమారి, సుద్ధాల అశోక్ తేజ, భువన చంద్ర, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్ది( అమెరికా), రవి కొండబొలు(అమెరికా), డా. చిట్టెన్ రాజు వంగూరి( అమెరికా), జయ తాళ్ళురి ( తానా పూర్వ అధ్యక్షుడు), శీరిష తూముగుంట్ల(కల్చరల్ సెక్రేటరి తానా), శారదా సింగిరెడ్డి(చైర్ పర్సన్ ఆటా), గురుజాడ శ్రీనివాస్(అమెరికా) పాల్గొన్నారు. వారితో పాటుగా డా.లక్ష్మి ప్రసాద్ కపటపు, తాతాజీ ఉసిరికల(తెలుగు కళా సమితి ఖతర్, కే. సుధాకర్ రావు( ఊటాఫ్ కువైత్), వేదమూర్తి యూఏఈ), సత్యనారయాణ రెడ్డి( ఏకేవీ ఖతర్ ), సురేష్ తెలుగు తరంగిణీ(యూఏఈ), ప్రదీప్ (యూఏఈ), శివ యెల్లెపు(బహ్రెయిన్), వెంకట్ భాగవతుల(ఏకేవీ ఖతర్), దీపిక రావి( సౌదీ అరేబియా ), రత్నకుమార్ కవుటూరు(సింగపూర్), రాజేష్ టెక్కలి(అమెరికా), సారధి మొటుమర్రి(ఆస్ట్రేలియా), విజయ గోల్లపుడి(ఆస్ట్రేలియా), పార్థసారధి( ఉగండా), కె.ఆర్. సురేష్ కుమార్(టాంజనియా ), డా.G.V.L. నరసింహం, డా.తెన్నెటి సుధా, శైలజ సుంకరపల్లి, రాధికా నూరి( అమెరికా), సత్యదేవి మల్లుల(మలేషియా), డా. శ్రీరామ్ శొంటి, శారదా పూర్ణ శొంటి(అమెరికా), సుధా పాలడుగు(అమెరికా), లక్ష్మీ రాయవరపు(కెనడా), గుణ సుందరి కొమ్మారెడ్డి(అమెరికా), శ్రీదేవి జాగర్లమూడి(అమెరికా ), శ్రీలత మగతల(న్యూజిలాండ్), విజయ కుమార్ పర్రి(స్కాట్లాండ్), రవి గుమ్మడవల్లి(ఐర్లాండ్), రాధిక మంగినపుడి(సింగపూర్), రాజేష్ తొలెటి (లండన్), చిన్న రావు, వేణు గొపాల్ హరి, టి. నాగ, బి.కుమార్, చైతన్య, సీతరాం, చరణ్ కుమర్, అరుందతి, రాజశేఖర్, ఆనంద్, శారద, అపర్ణ, రాణి, సునీత, లక్ష్మీ కామేశ్వరి, విజయ కుమార్ పర్రి(స్కాట్లాండ్), రవి గుమ్మడవల్లి(ఐర్లాండ్), రాధిక మంగినపుడి(సింగపూర్), రాజేష్ తొలెటి(లండన్), డా. తెన్నెటి శ్యాంసుందర్, డా. తెన్నెటి విజయ చంద్ర ఆమని, డా. సమరం, గుమ్మడి గోపాలకృష్ణ, అపార గంటసాల, కామేశ్వర రావు, సింగినగ స్టార్ విజయలక్ష్మి తదితరులు పాల్లొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా వెంకట్ ప్రసారం చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గoటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలు దేశాల నుండి గాయనీ గాయకులు అక్కినేని నాగేశ్వర రావు నటించిన చిత్రాల నుంచి గీతాలను ఆలపించారు. చదవండి: ఇల్లినాయిస్లో నాట్స్ ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్ -
ట్రెండ్ సెట్టింగ్ బుల్లోడు
ఒక్కో తరంలో ఒక్కో సినిమా ఉంటుంది. ఒక్కో యాక్టర్ కెరీర్ లో ఒక్కో సినిమా ఉంటుంది. కమర్షియల్ సినిమాలే అయినా... కాసులు కురిపించడంతో పాటు, పాపులర్ కల్చర్ పైనా ప్రభావం చూపెడతాయి. పేరు దగ్గర నుంచి పాటలు, దుస్తుల దాకా అనేక విషయాల్లో ఆ తరాన్నీ, ఆ తరువాతి సినిమాలనూ ప్రభావితం చేస్తాయి. అనేక తరాల పాటు గుర్తుండిపోతాయి. అక్కినేని నటించిన ‘దసరా బుల్లోడు’కి అలాంటి ప్రత్యేకతే ఉంది. ఇప్పటికి సరిగ్గా 50 ఏళ్ళ క్రితం 1971 జనవరి 13న రిలీజైన ‘దసరా బుల్లోడు’ అప్పట్లో ఓ సంచలనం. ఇప్పటికీ ఓ తరానికి తీపి జ్ఞాపకం. అది 1970ల నాటి మాట. తెలుగు తెరపై అప్పుడప్పుడే కలర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కంటే ఖర్చు ఎక్కువయ్యే కలర్ సినిమాలంటే పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ మోజు పెరుగుతున్న కాలం. అలా కలర్ సినిమాల శకం ప్రారంభంలో వచ్చిన చిత్రం ఏయన్నార్ ‘దసరా బుల్లోడు’. ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్ తొలిసారిగా కలర్లో తీసిన సినిమా అది. ఆ సినిమాకు ముందు అక్కినేని ప్రస్థానం వేరు. ‘దసరా బుల్లోడు’ తరువాత ఆ ప్రభావంతో ఆయన తన పంథా మార్చి, చేసిన ప్రయాణం వేరు. అదీ ‘దసరా బుల్లోడు’ స్పెషాలిటీ! జయలలిత లాస్... వాణిశ్రీకి గెయిన్! ‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది – అక్కినేని, ఆయనకు జంటగా నటించిన హీరోయిన్ వాణిశ్రీ. నిజానికి, ఈ చిత్రంలో వాణిశ్రీ కన్నా ముందు హీరోయిన్గా దర్శక, నిర్మాతలు ఎంచుకున్నది – తరువాతి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన జయలలితను! అయితే, అదే సమయంలో నిర్మాత ఎం.ఎస్. రెడ్డి నిర్మిస్తున్న ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ విజయము’లో, ఎమ్జీఆర్ హీరోగా చేస్తున్న చిత్రంలో జయలలిత నటిస్తున్నారు. ఏమైందో ఏమో ‘దసరా బుల్లోడు’ షూటింగ్ వారంలో ఉందనగా, జయలలితకు కుదరదంటూ ఆమె తల్లి లెటర్ పంపారు. దిక్కుతోచని వి.బి. అప్పటికే పేరు తెచ్చుకున్న వాణిశ్రీని అప్పటికప్పుడు హీరోయిన్గా అనుకున్నారు. ఎంత డబ్బయినా ఫరవాలేదని ఆమె డేట్లు ఎడ్జస్ట్ చేయించుకున్నారు. ఆ సినిమాకు ఏయన్నార్ పారితోషికం పాతిక వేలైతే, అర్జెంటుగా వాణిశ్రీ డేట్ల కోసం ఆమె బంధువుకు అడగకుండానే ఇచ్చింది యాభై వేలట! ఆ సంగతి వి.బి.నే స్వయంగా వెల్లడించారు. అలా ‘దసరా బుల్లోడు’ జోడీ అయ్యారు వాణిశ్రీ. అక్కడ నుంచి వాణిశ్రీ హవా మొదలైంది. ‘దసరా బుల్లోడు’ హిట్‌తో వాణిశ్రీకి స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ‘ప్రేమ్‌నగర్’ లాంటి కెరీర్ బెస్ట్‌లు రావడానికి ఈ సినిమా పునాది వేసింది. అక్కినేని, వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే ధోరణి పాకింది. వారిద్దరితో 20+ సినిమాలొచ్చాయి. కష్టాలు దాటిన కలర్ ఫుల్ సినిమా నృత్య దర్శకుడు హీరాలాల్ సారథ్యంలో ‘పచ్చగడ్డి కోసేటి...’ పాట చిత్రీకరణతోనే పచ్చనిచేలలో తొలి రోజు షూటింగ్ ఆరంభమైంది. ప్రముఖ నటీనటులందరూ పాల్గొనగా, రోజుకు 200 మంది యూనిట్‌తో, ఓ తిరణాల లాగా 12 రోజులు ఈ కలర్ చిత్రం షూటింగ్ చేశారు. తీరా అంతా అయ్యాక, మొదటి రోజు మినహా మిగతాదేదీ కెమెరాలో చిత్రీకరణ జరగలేదని తెలిసింది. తరువాత మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఆ రోజుల్లో కొత్తగా ఆరంభమైన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కె.ఎల్.ఎన్. ప్రసాద్ లక్ష్మీఫిలిమ్స్ అండగా నిలిచింది. ఇలా ఎన్నో అవరోధాలు దాటి, ‘దసరా బుల్లోడు’ రిలీజై, జనాదరణ పొందాడు. పంచె కట్టులో, పసందైన పాటలు, స్టెప్పులతో అక్కినేని అలరించారు. తొలి ప్రయత్నంతోనే డైరెక్టర్‌గా వి.బి. హిట్టయ్యారు. వరసగా తెలుగు, తమిళ, హిందీల్లో చిత్రాలను రూపొందించారు. అన్నా వదినల సొంత బిడ్డలా తిరిగే ఓ పల్లెటూరి దసరా బుల్లోడి (అక్కినేని)ని పట్నంలో చదువుకున్న తన కూతురి (చంద్రకళ)కిచ్చి ఆస్తి కాజేయాలని అనుకొంటాడు ఓ దుష్టుడు (నాగభూషణం). కానీ, ఊళ్ళోనే మరో అమ్మాయిని (వాణిశ్రీ)ని ప్రేమిస్తాడు హీరో. ఈ ముగ్గురి ప్రేమకథలో జరిగే ట్విస్టులు, ఒకరి కోసం మరొకరు చేసే త్యాగాలు, విధి ఆడే వింత నాటకాలు ఈ చిత్రకథ. ఎస్వీఆర్, సూర్యకాంతం, గుమ్మడి, అంజలీదేవి, పద్మనాభం – ఇలా భారీ తారాగణం ఉన్న సినిమా ఇది. కలర్ సినిమాల్లో... తెరపై రంగుల్లో అందంగా కనిపించడం కోసం ఆ రోజుల్లో నటీనటులు కాస్తంత మందంగానే మేకప్ దట్టించేవారు. పెదాలు, నోరు ఎర్రగా కనిపించడం కోసం... రంగు గట్టిగానే వేసుకొనేవారు. ‘దసరా బుల్లోడు’ చిత్రాన్ని ఇవాళ బుల్లితెరపై చూస్తున్నా, ఆ సంగతి అర్థమవుతుంటుంది. కథలోని డ్రామా, శృంగారం పాలు, హుషారైన పాటలు, మనసును కదిలించే సన్నివేశాలు కలిసి ఆ రోజుల్లో ఈ చిత్రం జనాన్ని ఓ ఊపు ఊపేసింది. సినిమా మొదట్లోనే దసరా సందర్భంగా హీరోతో పులి వేషం డ్యాన్స్, నెమలి డ్యాన్స్, కోలాటాల లాంటివి చేయడం గ్రామీణ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పాట ప్రయాణదిశ మార్చిన ఆ(బూ)త్రేయ! అలాగే, యాభై ఏళ్ళ క్రితం ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనం. రేడియోలో ఆ పాటలు మోగని రోజు లేదు. వినపడని ఇల్లు లేదు. కె.వి. మహదేవన్ సంగీతం ఒక ఎత్తయితే, ఆత్రేయ సాహిత్యం మరో కొత్త ఎత్తు. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ..’, అలాగే సంతోష, విషాద సందర్భాలు రెంటిలో వచ్చే ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా..’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ – ఇలా పాటలు సూపర్ హిట్. అన్నిటి కన్నా ముఖ్యంగా ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్...’ లాంటి పాపులర్ శృంగార సినీగీత సాహిత్యానికి ఈ సినిమాతోనే తెలుగు నేల స్వాగతం పలికింది. తెలుగు సినిమాకు ఆ రకంగా అది ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి సినీగీతం పూర్తి కమర్షియల్ దిశలోకి మలుపు తిరిగింది. బూతును కూడా పాటలో అందంగా చెప్పారంటూ సినీ గీత రచయిత ఆత్రేయను ‘‘బూత్రేయ’’ అనడం మొదలెట్టారు – గిట్టని జనం. ఎవరేమన్నా అప్పటి నుంచి మారిన కాలం, మారిపోయిన సామాన్యుల అభిరుచికి తగ్గట్టుగా ఆ సుడిగుండంలోనే ఇప్పటిదాకా మన సినీగీతాలు సుడులు తిరుగుతూ ఉండడం గమనార్హం. నాలుగు వారాలకు ఇండస్ట్రీ రికార్డ్! లేట్ రన్లో కూడా ‘దసరా బుల్లోడు’ మరో 3 కేంద్రాలలో (తుని, ప్రొద్దుటూరు, కరీంనగర్) వంద రోజులు ఆడడం విశేషం. అప్పట్లో వసూళ్ళలో ‘దసరా బుల్లోడు’ది ఓ ఇండస్ట్రీ రికార్డు. రిలీజైన తొలి 4 వారాలకే ఆ చిత్రం రూ. 25 లక్షల గ్రాస్ వసూళ్ళు సాధించడం తెలుగు సినీ పరిశ్రమలో అంతకు మునుపెన్నడూ కనివిని ఎరుగని విషయం. ‘దసరా బుల్లోడు’ తరువాత వచ్చిన ఏయన్నార్ ‘ప్రేమ్‌నగర్’ (1971) ఇంకా ఎక్కువ వసూళ్ళు తెచ్చుకొని, తొలి 50 రోజులకు రూ. 33 లక్షల గ్రాస్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘దసరా బుల్లోడు’ మూలకథ ఆధారంగా, కొన్ని మార్పులు చేర్పులతో తరువాత తమిళంలో శ్రీధర్ దర్శకత్వంలో ఎమ్జీఆర్ హీరోగా ‘ఉరిమై కురళ్’ (1974) వచ్చింది. హిట్టయింది. ఇక, వి.బి.నే స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, షబానా ఆజ్మీలతో ‘రాస్తే ప్యార్ కే’ (1982) పేరిట ‘దసరా బుల్లోడు’ను హిందీలో రీమేక్ చేశారు. డైరెక్షన్‌కు అక్కినేని నో! ఇవాళ్టి ప్రముఖ నటుడు జగపతిబాబు తండ్రి, ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాతోనే దర్శకుడయ్యారు. అసలు ఈ కథ తయారు చేసిందీ ఆయనే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, బి.ఎస్సీ చదువుకొన్న ఆయన కృష్ణాజిల్లాలో తాను పుట్టి పెరిగిన పల్లెటూరు, మనుషుల మనస్తత్వాలు, ఇంట్లోని వ్యక్తులు, కళ్ళారా చూసిన వాస్తవ సంఘటనల ఆధారంగా స్వయంగా ఈ కథ సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాకు దర్శకత్వం వహిం చాల్సింది మాత్రం మొదట ఆయన కాదు – జగపతి సంస్థకు పర్మినెంట్ దర్శకుడైన ‘విక్టరీ’ మధుసూదనరావు! తీరా ఆయన బిజీ అన్నారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారు. ఆదుర్తికీ అవలేదు. ఇంతలో వి.బి. రాజేంద్రప్రసాద్ ‘అక్కా చెల్లెలు’ చిత్రాన్ని నిర్మించారు. కానీ, ఆ తరువాతా ఆ దర్శకులంతా బిజీనే! ఇంతలో అక్కినేని సినిమా ఒకటి అనుకోకుండా క్యాన్సిలైంది. ఆ కాల్షీట్లు ఖాళీ అయి, అర్జెంటుగా సినిమా నిర్మించాల్సి వచ్చింది. ‘దసరా బుల్లోడు’ స్క్రిప్టు సిద్ధం చేసి, అక్కి నేనికి వినిపించిన వి.బి చివరకు అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ రంగస్థల నటుడు, నిర్మాతగా అనుభవజ్ఞుడైన వి.బి. రాజేంద్ర ప్రసాద్‌నే డైరెక్ట్ చేయాల్సిందని ప్రోత్సహించారు ఏయన్నార్. తామంతా వెన్నంటి ఉంటామన్నారు. ‘‘కాదూ... కూడదంటే, ఇక నీ సినిమాల్లో నటించను’’ అని బెదిరించారు కూడా! దాంతో, రాజేంద్రప్రసాద్ సాహసించి దర్శకుడు కాక తప్పలేదు. అక్కినేనికి తొలి గోల్డెన్ జూబ్లీ హిట్! కమర్షియల్‌గా ‘దసరా బుల్లోడు’ పెద్ద హిట్. ఆ రోజుల్లో ఈ సినిమా 35 ప్రింట్లతో రిలీజైంది. 29 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 22 సెంటర్లలో (హాలు షిఫ్ట్ అయిన కర్నూలుతో కలిపి) శతదినోత్సవం చేసుకుంది. చిత్ర యూనిట్ తరలి రాగా, ట్రాక్టర్లో అక్కినేనిని ఊరేగిస్తూ, గుడివాడ నీలా మహల్ థియేటర్లో 1971 ఏప్రిల్ 24న వంద రోజుల వేడుక ఘనంగా జరిపారు. ఆ మరునాడే హైదరాబాద్ శాంతి థియేటర్లోనూ శతదినోత్సవం చేశారు. ‘దసరా బుల్లోడు’ రిలీజైన పదిహేను వారాలకు అక్కినేనిదే ‘సుపుత్రుడు’ వచ్చింది. ఆ కొత్త సినిమా రిలీజ్ కోసం అనేక కేంద్రాలలో పాత ‘దసరా బుల్లోడు’ను పక్కకు తప్పించారు. అయినా, 4 కేంద్రాలలో (విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, షిఫ్టయిన గుంటూరుల్లో) 16వ వారం నుంచి కూడా ‘దసరా బుల్లోడు’ హవా కొనసాగింది. వాటిలో 200 రోజులు ఆడింది. తిరుపతిలో కొద్ది గ్యాప్ తరువాత 213వ రోజు నుంచి మరో 6 వారాలు సినిమా ఆడింది. ఇక, హైదరాబాద్‌లో షిప్టింగులు, గ్యాప్‌లతో ‘దసరా బుల్లోడు’ ఏకంగా 365 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. అలా అక్కినేని సినీకెరీర్ లో 50 వారాలు ఆడిన తొలి స్వర్ణోత్సవ (గోల్డెన్ జూబ్లీ) చిత్రంగా చరిత్ర కెక్కింది. తర్వాత మరో దశాబ్దికి ‘ప్రేమాభి షేకం’(1981)తో అక్కినేని మరో గోల్డెన్ జూబ్లీ హిట్ సాధించారు. అది దసరా బుల్లోడు కారు! ‘దసరా బుల్లోడు’ తెలుగులో అంత పేరు, వసూళ్ళు సాధించినా అతి మంచితనం వల్ల దర్శక, నిర్మాత రాజేంద్రప్రసాద్‌కు లాభాలు మిగల్లేదు. సాక్షాత్తూ ఆయనే ఆ తరువాతి కాలంలో ఆ సంగతి వెల్లడించారు. ‘దసరా బుల్లోడు’లో ప్రధానభాగం అమలాపురంలో, విజయవాడ చుట్టుపక్కల భట్లపెనుమర్రు తదితర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం షూటింగులో వాడిన ఎర్రటి ‘బీచ్ బగ్గీ’ అనే ఫారిన్ కారు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్! దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తనకు విజయం అందించిన ‘దసరా బుల్లోడు’ అన్నా, ఆ చిన్న కారు అన్నా జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్‌కు పంచప్రాణాలు. అదే కారును నాగార్జున హీరోగా తీసిన ‘కెప్టెన్ నాగార్జున’లో కూడా వాడారు. అయితే, 1990లలో ఒకానొక దశలో జీవితంలో అన్నీ కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డారు వి.బి. ఆ పరిస్థితుల్లో ఆ కారును అమ్మేయాల్సి వచ్చింది. అపురూప జ్ఞాపకమైన ఆ కారును అలా అమ్మే యాల్సి వచ్చినందుకు ఆయన చాలా బాధ పడ్డారు. విశేషం ఏమిటంటే, వి.బి. రాజేంద్రప్రసాద్ తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షరరూపమిస్తూ, ఆ పుస్తకానికి కూడా ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టడం! – రెంటాల జయదేవ -
శ్రీవారి ముచ్చట్లు @40
కాలు పెట్టిననాడే కాపురం చేసే కళ తెలుస్తుందని సామెత. కొన్ని సంవత్సరాలు మొదటి రోజునే తమ విజయోత్సవ లక్షణాన్ని బయటపెట్టేస్తాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అలాంటి ఏడాది – 1981. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం జనవరి 1న దాసరి దర్శకత్వంలో అక్కినేని ‘శ్రీవారి ముచ్చట్లు’, తాతినేని రామారావు దర్శకత్వంలో శోభన్ బాబు ‘పండంటి జీవితం’తో ఆ ఏడాది తెలుగు సినిమాల ప్రయాణం మొదలైంది. ఇద్దరూ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువుండే హీరోలే. ఇద్దరి సినిమాలూ లేడీస్ సబ్జెక్ట్లే. ఒకే రోజున రెండూ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. గమ్మత్తుగా రెండూ హిట్టే. అలా మొదలైన ఆ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏయన్నార్ ‘ప్రేమాభిషేకం’, ఎన్టీయార్ ‘కొండవీటి సింహం’ లాంటి ఎన్నో ఘన విజయాలను అందించింది. చరిత్రకెక్కిన తల్లీ కూతుళ్ళు తెలుగు సినీ చరిత్రలో తొలి తరం మహిళా నిర్మాతల్లో ఒకరు సి. కృష్ణవేణి. జీవిత భాగస్వామి అయిన శోభనాచలా పిక్చర్స్ మీర్జాపురం రాజా గారి బాటలో ఆమె ఎన్టీఆర్ ‘మనదేశం’ లాంటి సినిమాలు తీశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, వారి సంతానమైన ఎన్.ఆర్. (నంగునూరి రాజ్యలక్ష్మీ) అనూరాధాదేవి కూడా మహిళా నిర్మాతగా పలు చిత్రాలు తీయడం విశేషం. తెలుగు సినీచరిత్రలో ఇలా తల్లీ కూతుళ్ళిద్దరూ నిర్మాతలుగా వెలిగిన అరుదైన ఘట్టం ఇది. పైపెచ్చు, తల్లితండ్రులు తీసిన సినిమాల (‘కీలుగుర్రం’) బాటలో కూతురు కూడా అదే హీరో అక్కినేనితో ఏకంగా 6 సినిమాలు (‘చక్రధారి’, ‘రావణుడే రాముడయితే’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘అనుబంధం’, ‘ఇల్లాలే దేవత’) తీయడం విశేషం. ముక్కోణపు డ్రామా అక్కినేని, దాసరి కాంబినేషన్లో అంతకు ముందు ‘రావణుడే రాముడయితే’ (1979) నిర్మించారు అనూరాధాదేవి, శ్రీనివాసరావు దంపతులు. అది రిలీజైన ఏడాదికి మళ్ళీ అదే సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వారు నిర్మించిన ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిల్మ్ ‘శ్రీవారి ముచ్చట్లు’ (1981). అక్కినేని, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రధారులుగా మహిళలు మెచ్చిన ముక్కోణపు కుటుంబకథ ఇది. ప్రేమించిన కాశ్మీరీ పిల్ల(జయప్రద)తో కాకుండా అనుకోని పరిస్థితుల్లో అయినవాళ్ళ అమ్మాయి (జయసుధ) సంబంధం చేసుకుంటాడు హీరో. తీరా తాళి కట్టాక, ప్రేమించిన పిల్ల పెళ్ళిమండపంలోకి వస్తుంది. ఆ ఇద్దరు స్త్రీల మధ్య నలిగిన ఆ శ్రీవారి ముచ్చట్లు ఏమిటి, ఒకరి సంగతి మరొకరికి తెలిసి ఆ స్త్రీమూర్తులు చేసిన త్యాగం ఏమిటన్నది సినిమా. ఒక సినిమా... రెండు ఓపెనింగ్లు... కథానుసారం కాశ్మీర్లో జరిగే ‘శ్రీవారి ముచ్చట్లు’ ఓపెనింగ్, ఓ మేజర్ షెడ్యూల్ అక్కడే చేశారు. హీరో, హీరోయిన్లతో దాసరి, నిర్మాతలు ఫ్లైట్‌లో చేరారు కానీ, కెమేరాతో సహా యూనిట్‌గా బయల్దేరిన దాసరి శిష్యుడు రేలంగి నరసింహారావు బృందానికి జమ్ము నుంచి కాశ్మీర్ రైలు మిస్సయింది. మరునాడే ముహూర్తం షాట్. నిర్మాత శ్రీనివాసరావు ముహూర్తం సెంటిమెంట్. దాంతో దేవుడి పటాల కోసం రాత్రికి రాత్రి జమ్మూ అంతా రేలంగి వెతికారు. చివరకు కృష్ణుడి పటాలు మినహా ఏమీ దొరకలేదు. కథ ప్రకారం హీరో పాత్రకు శ్రీకృష్ణుడి పటం సరిపోతుందని, దాని మీదే జమ్ములో ముహూర్తం షాట్ చేశారు రేలంగి. మరోపక్క కాశ్మీర్లో తన వద్ద యూనిట్ ఏమీ లేకపోయినా నిర్మాత సెంటిమెంట్ కోసం హీరో, హీరోయిన్లకు మేకప్ వేయించి, స్థానిక స్టిల్ ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు తీయించారు దాసరి. పాటలతో... కాసుల మూటలు నిజానికి, ఈ సినిమా టైటిల్ సాంగ్ వేటూరి రాయాల్సింది. ఆయన టైముకు బెంగుళూరు రాకపోవడంతో, నిర్మాతల కోరిక మేరకు సినిమాలో రెండుసార్లు వచ్చే ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే టైటిల్ సాంగ్ ను దాసరే రాసేశారు. అదే ఊపులో సినిమాలో పాటలన్నీ దాసరి రచనలయ్యాయి. సినిమా రిలీజుకు ముందే ‘కాళ్ళా గజ్జా కంకాళమ్మా’ మొదలు ‘శ్రీవారి ముచ్చట్లు’ టైటిల్ సాంగ్, ‘ముక్కుపచ్చలారని కాశ్మీరం..’, ‘ఉదయకిరణ రేఖలో...’ – ఇలా పాటలన్నీ మారుమోగేవి. ఆ క్రేజుతో రిలీజైన సినిమా సూపర్ హిట్టయి, కాసులు కురిపించింది. పూర్ణా పిక్చర్స్ జి. విశ్వనాథ్ పంపిణీ చేసిన ఈ చిత్రం తొలి వారంలో ఏకంగా రూ. 22 లక్షలు వసూలు చేసింది. హీరోగా అక్కినేని కెరీర్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. కాశ్మీరులో ఈ సినిమా షూటింగ్ లోనే దాసరికి ‘ప్రేమాభిషేకం’ (1981) స్టోరీ లైన్ తట్టింది. ‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజు వేళ నిర్మాత అనూరాధాదేవి, పూర్ణా పిక్చర్స్ వారి విజయవాడ ఊర్వశి థియేటర్‌కు వెళ్ళారు. సినిమా చూసి జనసందోహం మధ్య నుంచి ఆమె, ‘పూర్ణా’ విశ్వనాథ్, ఆయన సోదరుడు బాలు అంబాసిడర్ కారులో హోటలుకు బయలుదేరారు. సినిమా చాలా బాగుందనే ఆనందంలో అభిమాన ప్రేక్షకులు తాము కూర్చున్న కారును ఆనందంగా పైకి ఎత్తేశారని అనూరాధాదేవి ఇప్పటికీ గుర్తు చేసు కుంటారు. విశేష మహిళా ప్రేక్షకాదరణతో ‘శ్రీవారి ముచ్చట్లు’ నేరుగా 5 కేంద్రాల (విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ లలో 100 రోజులు, కాకినాడలో 98 రోజులు)లో, నూన్ షోలతో 9 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మధ్యాహ్నం ఆటలతో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజైన సరిగ్గా 48 రోజుల తర్వాత వచ్చిన ఇదే కాంబినేషన్లో ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. అది ఏకంగా ఏడాది ఆడి, గోల్డెన్ జూబ్లీ జరుపుకొంది. అప్పట్లో నెల్లూరు కల్యాణి కాంప్లెక్స్ (కృష్ణ– కావేరి–కల్యాణి థియేటర్స్)లో ‘శ్రీవారి ముచ్చట్లు’ శతదినోత్సవం ఘనంగా చేశారు. తమిళ స్టార్ శివాజీ గణేశన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైల్వే ట్రాకు పక్కనే ఉన్న ఆ సినిమా హాలులో వేడుకలలో పాల్గొంటున్న అక్కినేని, తదితర తారలను రైళ్ళు ఆపి మరీ జనం చూడడం గమనార్హం. కాశ్మీర్ షూటింగ్... కచ్చిన్స్ డ్రెస్సులు... కాశ్మీరులో 15 రోజుల షెడ్యూల్లో 4 పాటలు, 10 సీన్లు తీశారు. బొంబాయిలోని ప్రసిద్ధ కచ్చిన్స్ సంస్థ అక్కినేనికీ, కాశ్మీరీ పాత్రలోని జయప్రదకూ ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ అందించింది. ఒక పాటలో అక్కినేని డజను డ్రస్సులు మార్చారు. షెడ్యూల్ చివరలో పని ముగించుకొని అక్కినేని, దాసరి వచ్చేస్తే, జయప్రద, చాట్ల శ్రీరాములుపైన కొన్ని సీన్లు, ప్యాచ్ వర్క్ రేలంగే షూట్ చేశారు. హిందీ రీమేక్‌లో రేఖ అనుమానం! ఈ హిట్ చిత్రాన్ని మూడేళ్ళ తరువాత హిందీలో ‘ఆశాజ్యోతి’ (1984) పేరిట దాసరి దర్శకత్వంలోనే నిర్మాత కోవై చెళియన్ తీశారు. రాజేశ్ ఖన్నా, రేఖ, రీనారాయ్ తారాగణం. హిందీ రీమేక్ రెండో షెడ్యూల్ సమయంలో దాసరి మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. దాంతో, మైసూరులో చేయాల్సిన 15 రోజుల షూటింగ్‌ను శిష్యుడు రేలంగి నరసింహారావుకు అప్పగించారు. తీరా రేలంగి అక్కడకు వెళ్ళాక రేఖ తదితరులకు అనుమానం వచ్చింది. తొలి షెడ్యూలులో నిర్మాతకూ, దాసరికీ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందుకని నిర్మాతే, దాసరి బదులు రేలంగిని తెచ్చారేమోనని భ్రమపడ్డారు. ఆ మాటే రేఖ అచ్చ తెలుగులో గౌరవంగా రేలంగితో చెప్పేశారు. చివరకు దాసరి ఫోన్ చేసి, రేలంగిని తానే పంపినట్టు వివరించారు. హిందీలోనూ ఈ లేడీస్ సెంటిమెంట్ కథ సక్సెస్ సాధించింది. - రెంటాల జయదేవ -
అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం
సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, ఒకానొక సందర్భంలో చిత్ర సీమని ఏలిన లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అక్కినేని అభిమానులను అలరిస్తున్నారు నాగార్జున, నాగచైతన్య, అఖిల్. ఇలా ఒకే వంశానికి చెందిన నలుగురు హీరోలతో ఓ సినిమా తీయాలని అనేమంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఎవరికీ సాధ్యం కాని మ్యాజిక్‌ను విక్రమ్ కుమార్ ‘మనం’తో సుసాధ్యం చేశాడు. ‘మనం’ టాలీవుడ్లోనే ఓ మధుర జ్ఞాపకం. మూడు తరాల హీరోలు కలిసి చేసిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీకి, అభిమానులకు ఎవర్గ్రీన్ మూవీ, ఏఎన్నార్ చివరి చిత్రం ‘మనం’ విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తయింది. కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసం మాత్రమే పుడతాయి. అలా ‘మనం’ కథ కూడా అక్కినేని కుటుంబం కోసం పుట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య పాత్రలు చాల కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. నలుగురు అక్కినేని హీరోలతో ఏదో ఓ సినిమా తీయాలని రోటీన్ స్టోరీతో కాకుండా విభిన్నంగా ప్రస్తుత జెనరేషనకు తగ్గుట్టు టిపకల్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విక్రమ్ కుమార్. అయితే ఎక్కడా తడబడకుండా, పక్కా స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేశాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రేక్షకులు లీనమయ్యేలా తీయడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇక అఖిల్ పాత్ర కూడా ఎదో ఇరికించినట్టు కాకుండా సందర్భానుసారంగా వస్తుంది. ఈ సినిమాకు మరో ఆయువుపట్టు మ్యూజిక్. అనూప్ రుబెన్స్ అందించిన సంగీతం మైండ్‌బ్లాక్ అనే చెప్పాలి. అక్కినేని మూడు తరాల హీరోలతో పాటు సమంత, శ్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తెరపై వీక్షించిన అభిమానులు మైమర్చిపోయారు. దీంతో ఏఎన్నార్ చివరి చిత్రం చిరస్థాయిలో నిల్చిపోయేలా అద్భుత విజయాన్ని అభిమానులు అందించారు. ఇక ఈ సినిమా విడుదలై ఆరేళ్లు అవుతున్న సందర్భంగా నాగార్జున, నాగచైతన్య, అనూప్ చిత్ర విశేషాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్లు చేశారు. చదవండి: రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీ కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...
సాక్షి, హైదరాబాద్ : ‘తాను ఇవాళ వేదికపై ఉన్నానంటే అందుకు కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవిగారే. వారిద్దరూ నటించిన ‘సువర్ణసుందరి’ చిత్రం నా జీవితంలో చూసిన తొలి సినిమా. వందసార్లు అయినా ఆ సినిమా చూశాను. సినిమా అంటే ఏంటి అనే తెలియని వయసులో ఆ సినిమా చూశాక నాకు పిచ్చి పట్టేసింది’ అని ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ తెలిపారు. అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోకు వస్తే నా సొంతింటికి వచ్చినట్టుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు. నా చిన్నప్పుడు ఆయన ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. ఆ అబ్బాయ్ చాలా ఫోకస్డ్... చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, ప్రేమ, క్వయిట్ కానీ ...కెమెరా ఆన్ అయితే అదరగొట్టేస్తారు. ఎవరూ...ఎవరూ అని అడిగితే ఇంకెవరూ నాగేశ్వరరావుగారు అని చెప్పారు. నేను చూసిన మొదటి సినిమా ‘సువర్ణ సుందరి’. ఇక్కడ నేను నిల్చున్నానంటే దానికి కారణం నాగేశ్వరరావుగారు, అంజలీదేవినే. ఆ సినిమా చూశాక పిచ్చి పట్టేసింది. ఎలాగేనా సినిమాల్లో నటించాలని అనుకున్నాను. చదవండి: రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు.. నటి అయ్యాక షూటింగ్‌కు వెళుతూ... రోజూ బంజారాహిల్స్ నుంచి వెళుతూ గుడిలోకి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి అలా తిరిగితే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇంకోవైపు సుబ్బరామిరెడ్డిగారి ఇల్లు. రోడ్డు మీద వెళుతూనే నాగేశ్వరరావుగారికి మనసులోనే నమస్కరించేదాన్ని. పెద్ద స్టార్‌ను అయ్యేలా దీవించమని. ఒకరోజు భోజనానికి వాళ్ల ఇంటికి పిలిచారు. అమ్మ బాబోయ్ అని భయపడ్డాను. అమ్మాయ్ ఏం అనుకున్నావ్. నిన్ను చాలా గమనించేవాడిని తెలుసా? అని అన్నారు. నేను ఒక్కమాట మాట్లాడితే ఒట్టు. చూడమ్మాయ్.... నువ్వు ఏం తింటున్నావో అనేది కూడా ముఖ్యం. కానీ అన్నింటికి కంటే ముఖ్యం నువ్వు ఏం తింటావో అది మన మీద ప్రభావం చూపుతుందని. అది అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది. నాగేశ్వరరావుగారితో పాటు అలాగే మా నాన్నగారు చదువు, నటన గురించి చెప్పిన రెండు మాటలు జీవితాంతం చీర పల్లులో మూటకట్టుకుని పెట్టుకున్నాను. అందరూ అడుగుతున్నారు ఇప్పటికీ ఇంత అందంగా ఎలా ఉన్నారు అని. అవి నాకు అమ్మా,నాన్నల నుంచి వారసత్వంగా వచ్చిన జీన్స్ అంతే. ఇందుకోసం నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. సినిమా కెరీర్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. నా జీవితంలో కూడా అలాంటివి జరిగాయి. అయినా తట్టుకుని నిలబడ్డాను. అప్పట్లో హాస్పటల్లో ఉన్న అమ్మ తన కోసం ఓ తెలుగు సినిమా చేయమంది. అమ్మ కోసం తెలుగు సినిమాలో నటిస్తా. తెలుగు బాగా నేర్చుకుని శ్రీదేవి అంత స్పష్టంగా మాట్లాడతాను’ అని తెలిపారు. -
ఆయన ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ఎప్పటికైనా ‘అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం’ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం స్థాయికి చేరుతుందని మెగాస్టార్ చిరంజీవి ఆదివారం వ్యాఖ్యానించారు. ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్ ఎప్పుడూ మన మనస్సులో ఉంటారు. చనిపోయే ముందు వరకూ ఆయన ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఏఎన్నార్ జీవితం నాలో స్ఫూర్తి నింపింది. మా అమ్మకు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. డెలివరీ సమయంలో కూడా అక్కినేని సినిమా చూడాలంటూ అమ్మ పట్టుబట్టి మరీ చూశారట. అందుకేనేమో ఆమె కడుపులో ఉన్న నాకు సినిమాలు అంటే ఇష్టం ఏర్పడిందేమో. అక్కినేని గారితో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో కలిసి నటించా. ఆయన చాలా బాగా మాట్లాడేవారు. అక్కినేని దగ్గర చాలా నేర్చుకున్నా.’ అంటూ అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. చదవండి: అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ... ‘శ్రీదేవి, రేఖలకు అక్కినేని పురస్కారం ఇవ్వడం ఎంతో సముచితమైన నిర్ణయం. భారతదేశంతో పాటు ముఖ్యంగా దక్షిణాది గర్వించదగ్గ నటీమణులు శ్రీదేవి, రేఖ అని వారిద్దర్ని సన్మానించుకోవడం గర్వంగా ఉంది. ఇక మరణించే ముందు కూడా నటించిన ఏకైక ‘లేడీ సూపర్ స్టార్’ శ్రీదేవి. అలాగే రేఖ చేతలు మీదగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకోవడం మరిచిపోలేని జ్ఞాపకం. ఇప్పుడు నా చేతుల మీదగా ఆమెకు అక్కినేని పురస్కారం అందచేయడం చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభకు రేఖ వస్తుంటే సభ అంతా నిశ్శబ్దం అయిపోయేది. ఆమెను చూస్తూ అందరూ అలా ఉండిపోయేవాళ్లు. అందుకేనేమో రేఖ ఎక్కువగా సభకు వచ్చేవాళ్లు కాదు. ఇక నా భార్య పేరు సురేఖ అయినా నేను మాత్రం రేఖ అనే పిలుస్తాను. ఎందుకంటే నా ఆరాధ్య నటి రేఖ పేరుతో పిలుస్తాను ఆ విషయం ఇప్పటివరకూ మా ఆవిడకు కూడా తెలియదు.’ అని చిరంజీవి తెలిపారు. చదవండి: రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు.. -
అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
-
రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని జాతీయ పురస్కారాలు ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిథులకు అక్కినేని కుటుంబం స్వయంగా స్వాగతం పలికి ఆహ్వానించింది. ఈ వేడుకల్లో 2018, 2019 సంవత్సరాలకు అవార్డులు ప్రదానం చేశారు. 2018కి గాను దివంగత నటి శ్రీదేవికి పురస్కారం ప్రకటించగా, శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్ ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా అందుకున్నారు. అలాగే 2019కి గానూ బాలీవుడ్ సీనియర్ నటి రేఖకు అక్కినేని అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఉన్నంతవరకూ అక్కినేని నాగేశ్వరరావు అందరి మనస్సులో ఉంటారని అన్నారు. ‘సినిమా తల్లి ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నాన్న అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ జాతీయ పురస్కారంతో పాటు నాన్న తనపేరు కూడా చిత్ర పరిశ్రమలో చిరకాలం ఉంటుందనుకునేవారు. నాన్నగారు భౌతికంగా మనమధ్య లేకున్నా ఆయన ఆత్మ మన మధ్య, మనతో ఇక్కడే ఉంది. జాతీయ అవార్డుతో పాటు నాన్నగారు కూడా ఈ వేదికపైనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరువుతుందని సంతోషంగా ఉన్నారు.’ అని పేర్కొన్నారు. గతంలో దేవానంద్ , షాబానా ఆజ్మీ , లతా మంగేష్కర్ , కే బాల చందర్ ,హేమమాలిని, అమితాబచ్చన్ , రాజమౌళి లాంటి ప్రముఖులకు అక్కినేని జాతీయ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, నటి రేఖా మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నటి రేఖ తొలి తెలుగుచిత్రంతో పాటు, అందంపై నాగార్జున చేసిన వ్యాఖ్యలకు అంతే దీటుగా రేఖా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా రేఖ స్పష్టమైన తెలుగులో మాట్లాడి వేడుకకు వచ్చిన వారందరినీ ఆశ్చర్యపరిచారు. తన తొలి తెలుగు చిత్రం ‘ఇంటిగుట్టు’ అని.. సొంత ప్రొడక్షన్లో నిర్మించిన ఆ సినిమాలో ఏడాది వయసు పాత్ర తనదని అన్నారు. ‘రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు’ అన్న నాగార్జున ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ... ‘మీరు ఎంత అందంగా ఉన్నారో నేను అంతే అందంగా ఉన్నాను’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అవార్డుల ఫంక్షన్‌లా లేదని, ప్రశ్నల కార్యక్రమంలా ఉందంటూ రేఖ సరదాగా వ్యాఖ్యలు చేశారు. సినిమా ...సినిమానే...జీవితం ...జీవితమే అని ఆమె అన్నారు. ఆఖరీ రాస్తా చిత్రానికి శ్రీదేవికి డబ్బింగ్ చెప్పిన విషయాన్ని రేఖ గుర్తు చేసుకున్నారు. ఆమె బిజీగా ఉండటంతో ఆ సినిమాకు తాను డబ్బింగ్ చెప్పానని తెలిపారు. అలాగే శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాలు చేశాను. మీతో కలిసి నటించాలని ఉందంటూ నాగార్జున ఈ సందర్భంగా రేఖను కోరగా... నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తే అందులో ఒక పాత్రలో రేఖ నటిస్తారంటూ చిరంజీవి మధ్యలో మైక్ తీసుకుని తన మనసులో ఉన్న మాట అంటూ చెప్పుకొచ్చారు. -
ఐకమత్యమే జాతికి శ్రీరామరక్ష...
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమెరికా అబ్బాయి’ చిత్రంలో సి. నారాయణరెడ్డి రచించిన ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా/పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము/రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడూ’’ అని ప్రారంభమయ్యే పల్లవిని అభేరి రాగంలో స్వరపరచారు. ఈ చిత్రానికి నేను నాన్నగారికి సహాయకుడిగా పనిచేశాను. ఈ పాటను 1986లో కంపోజ్ చేశారు, 1987లో విడుదలైంది. అప్పటికే సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిపోయింది. ఈ చిత్ర నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుగారికి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చెన్నైలో అన్నపూర్ణ ఆఫీసు ఉండేది. హైదరాబాద్‌కి వెళ్లిపోయాక ఆ స్టూడియో లేదు. నాన్నగారితో పాట ట్యూన్ చేయించుకోవాలనుకుంటే, తప్పనిసరిగా చెన్నై రావలసిందే. ఆ రోజుల్లో పాట కంపోజింగ్ పద్ధతి వేరేగా ఉండేది. పాటను కవి రాసి ఇచ్చేస్తే, సంగీత దర్శకుడు స్వరపరచడం అనే విధానం ఉండేది కాదు. మధుసూదనరావుగారు ఈ సినిమా పాటల కోసం చెన్నై వచ్చారు. ఆయన సుశీల గారి ఇంట్లో దిగేవారు. ఆవిడ ఇంట్లో మేడ మీద ఒక హాలు, గది ఉండేవి. అక్కడే పాట కంపోజింగ్ జరిగేది. పాట కోసం సినారె, డి. మధుసూదనరావు, నాన్నగారు, సుశీలగారు అందరూ ఒక చోట కూర్చున్నారు. అప్పుడు మధుసూదనరావుగారు నాన్నగారితో, ‘‘మీ మూడో అబ్బాయి వాసూరావు చాలా హుషారుగా ఉంటున్నాడు. ఈ సినిమాకి మీ అసిస్టెంట్‌గా ఈ అబ్బాయిని పెట్టుకోండి’ అని సూచించారు. మా పెద్ద అన్నయ్య రామలింగేశ్వరరావు కూడా నన్ను తీసుకోమని చెప్పడంతో నాన్నగారు అంగీకరించారు. మొదటి చరణంలో ‘‘పుట్టింది ఈ మట్టిలో సీత/ రూపు కట్టింది దివ్య భగవద్గీత/వేదాలు వెలసిన ధరణిరా/ ఓంకార నాదాలు పలికిన అవనిరా/ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు/ వికసించె మన‡నేల విజ్ఞాన కిరణాలు’’ అనే చరణంలో ‘వేదాలు వెలసిన ధరణిరా’ అనే వాక్యాన్ని రేవతి రాగంలో స్వరపరచారు. అక్కడ నుంచి వెంటనే అభేరి రాగానికి వెళ్లడంలో నాన్నగారి గొప్పదనం కనిపిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోగాలు చేయడం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సాధారణంగా ఒక సినిమాకు పాట చేసేటప్పుడు, రచయిత పాట రాసి ఇచ్చేస్తే సంగీత దర్శకుడు సంగీతం చేసేసి, ఆ పాటను రికార్డు చేసి, గాయకులకు టేప్ ఇచ్చేస్తే, వారు ఎక్కడో ఒక చోట కూర్చుని సాధన చేసి పాడేస్తుంటారు. కాని మధుసూదనరావుగారి విధానం చూస్తే ఆశ్చర్యం వేసింది. అన్నపూర్ణ సంస్థలో అందరూ కలిసి ఒకచోట కూర్చుని పనిచేస్తారు. ఈ పాట పల్లవిలో ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా’’ అని రాయప్రోలు వారి రచనతో ప్రారంభమైనప్పుడు, అక్కడ ఉన్నవారిలో ఒకరు ‘ఎవ్వరెదురైనా’ పదం ఎందుకు ఉపయోగించారు? అని ప్రశ్నిస్తే, మధుసూదనరావుగారు, ‘‘ఏ భాషకు చెందినవారు ఎదురైనా, తొణకకుండా ‘పొగడరా నీ తల్లిని’ అని చెప్పడం కోసం ఉపయోగించారు అని చెప్పారు. ఆయన కేవలం డబ్బులు పెట్టే నిర్మాత మాత్రమే కాదు, అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉన్న నిర్మాత. ‘‘వెన్నెలది ఏ మతమురా కోకిలది ఏ కులమురా/గాలికి ఏ భాష ఉందిరా నీటికి ఏ ప్రాంతముందిరా/గాలికీ నీటికీ లేవు భేదాలు/ మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు’’ అని సమానత్వం గురించి ఎంతో అందంగా వివరించారు సినారె ఈ చరణంలో. ఆఖరి చరణం ‘‘గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు/ గాంధీ చూపిన మార్గం విడవద్దు/ద్వేషాల చీకట్లు తొలగించు/ స్నేహదీపాల ఇంటింటాæ వెలిగించు/ఐకమత్యమే జాతికి శ్రీరామరక్ష/ అందుకే నిరంతరం సాగాలి దీక్ష’’అంటూ పాట ముగుస్తుంది. ఈ పాటను ఖండగతిలో, చతురస్ర మిశ్రమ తాళాలలో రాగమాలికలో స్వరపరచారు. ఆ పాటకు పనిచేయడం నాకు మంచి అనుభవం. ఈ పాట కోసం సి. నారాయణరెడ్డిగారిని హైదరాబాద్ నుంచి చెన్నై రప్పించారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ చిత్రం: అమెరికా అబ్బాయి సంగీతం: ఎస్. రాజేశ్వరరావు రచన: సినారె గానం: సుశీల సంగీత సహకారం: సాలూరి వాసూరావు సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకులు వాసూరావు సంగీత దర్శకులు -
ఎస్పీబీకి అక్కినేని – వంశీ సంగీత పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయకులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంకి అక్కినేని – వంశీ సంగీత పురస్కారం ప్రదానం చేయనున్నట్లు డా. వంశీ రామరాజు తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ– ‘‘పురస్కారంతో పాటు బాలూగారికి వంశీ చైర్మన్ డాక్టర్ కొత్త కృష్ణవేణి చేతుల మీదుగా వీణ బçహూకరణ ఉంటుంది. అమెరికాకు చెందిన గాయని శారదచే ‘నేల మీది జాబిలి .. అక్కినేని – బాలు శతగీత లహరి’ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సభ ప్రారంభంలో అక్కినేని – బాలు సినీ సంగీత విభావరి ఉంటుంది. తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య, సినీ నటి డాక్టర్ జమున, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వనాథ్, సీల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు, సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్, కేఎం రాధాకృష్ణన్, వీణాపాణి తదితరులు పాల్గొంటారు. 21న శుక్రవారం రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు. -
నా తొలి సినిమా... నాన్న చివరి సినిమా
అక్కినేని కుటుంబానికి మరుపురాని సినిమా ‘మనం’. అక్కినేని మూడు తరాల హీరోలు ఈ సినిమాలో కలిసి నటించారు. పైగా ఏఎన్నార్‌కు ఇది చివరి చిత్రం కావడంతో అక్కినేని కుటుంబానికి ఈ మూవీ ఎంతో ప్రత్యేకం. నేటికి మనం మూవీ రిలిజై నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా కింగ్ నాగ్ తన భావాల్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నాన్న నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం అంటూ ట్వీట్ చేసిన నాగ్, కొంత సమయం తరువాత.. ‘నా మొదటి సినిమా విక్రమ్, మా నాన్న చివరి చిత్రం మనం ఒకే తేదీన (మే 23) విడుదలయ్యాయి. మేము ముందుగా ప్లాన్ చేయలేదు. అలా జరిగింది. అంతేకాకుండా ఈ 23ను తిరిగేస్తే 32 వస్తుంది. నేను సినీరంగంలో అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతోంది. మా పై ప్రేమను చూపిస్తున్న వారందరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. I sometimes wonder if it is a coincidence or the universe likes numbers🤔my fathers LAST film #manam & my FIRST film Vikram released on the same date May23🙏of course we didn’t plan.. it just happened!! Reverse 23 and that becomes 32! My age as an actor😊thx for all the love❤️ pic.twitter.com/RK6yc1ITXn — Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2018