
టాలీవుడ్ దిగ్గజం, వెండితెరపై చెరదని ముద్ర వేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తన సినీ జీవితంలో దాదాపు 250కు పైగా చిత్రాలతో ఏడు దశాబ్దాల కాలం పాటు వెండితెరపై అలరించిన నటుడు బహుదూరపు బాటసారి ఆయన. 16 ఏళ్ల వయసులోనే పుల్లయ్య చిత్రం ధర్మపత్నిలో చిన్నవేషం వేసినా.. అక్కినేని సినీ యాత్ర మొదలైంది మాత్రం 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాతోనే. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన శతజయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!)
మెగాస్టార్ ట్వీట్‌లో రాస్తూ.. 'శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి , నా సోదరుడు నాగార్జునకు, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !!' శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2023
ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని… pic.twitter.com/yrAxhk7pgb