AI Video: అప్పుడు శోభన్‌ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు | ANR AI Created Video Goes Viral On Social Media | Sakshi

AI Video: అప్పుడు శోభన్‌ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు

Jan 13 2024 1:53 PM | Updated on Jan 13 2024 2:21 PM

ANR AI Created Video Goes Viral On Social Media - Sakshi

ప్రస్తుతం టెక్నాలజీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త సాంకేతికతను అర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌(AI) మరో మెట్టు ఎక్కించింది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త వీడియోలు, ఫోటోలు రీక్రియేట్‌ చేయటం ఒక ట్రెండ్‌గా మారింది. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఏఐ రీక్రియేటెడ్‌ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి హాలీవుడ్‌ హీరోలా రీక్రియేట్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన ‘ఎక్స్’ ట్విటర్‌ అకౌంట్‌ పోస్ట్‌ చేశారు. ఇటీవల ఆర్జీవీ.. తెలుగు చిత్రపరిశ్రమలో అందగాడు అనే పేరు సొంతం చేసుకున్న నటుడు శోభన్‌ బాబుకు సంబంధిచిన రీక్రియేటెడ్‌ వీడియోను కూడా షేర్‌ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: Guess The Actor: ఏఐ మాయ.. దిగ్గజ హీరో లుక్ అదిరిపోయిందంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement