దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తల నరికి తెచ్చినవారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ డిబేట్‌లో ఈ వ్యాఖ్యలు చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్జీవీ పోలీసులకు ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
(ఇది చదవండి: 'తల నరికితే రూ.కోటి'.. డీజీపీని కలిసిన ఆర్జీవీ!)
విజయవాడలో ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. 'ఓ ఛానల్‌లో కొలికపూడి శ్రీనివాసరావు నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. నన్ను చంపడానికి టీవీ లైవ్లో డైరెక్ట్‌గా కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడున్న యాంకర్ సాంబశివరావు మాటవరసకు వద్దని వారిస్తున్నా కొలికపూడి అదే మాట మూడుసార్లు చెప్పారు. అతడి వ్యాఖ్యల వల్ల వేరేవాళ్లు ఇన్‌స్పైర్ అయ్యే అవకాశం ఉంది. ఏ టీవీ ఛానల్‌లో అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడో సదరు టీవీ ఛానల్ ఎండీకి సైతం ఈ కుట్రలో భాగస్వామ్యం ఉంది.
దీనిపై కొలికపూడి, యాంకర్ సాంబశివరావు, ఛానల్ ఎండీ బిఆర్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఖండించలేదు. ఇక వ్యూహం సినిమాకు తెలుగుదేశం భయపడుతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటేనే టీడీపీ నేతలు గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారు' అని వ్యాఖ్యానించారు ఆర్జీవీ.
(ఇది చదవండి: ధనుష్‌తో లింక్ చేశారు.. రెండో పెళ్లి గురించి..: మీనా)
Comments
Please login to add a commentAdd a comment