Ram Gopal Varama
-
ఆర్జీవీపై ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ
-
AI Video: అప్పుడు శోభన్ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు
ప్రస్తుతం టెక్నాలజీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త సాంకేతికతను అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) మరో మెట్టు ఎక్కించింది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త వీడియోలు, ఫోటోలు రీక్రియేట్ చేయటం ఒక ట్రెండ్‌గా మారింది. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఏఐ రీక్రియేటెడ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. INTELLIGENTLY created ARTIFICIAL ANR 🙏 pic.twitter.com/dfRUpKpEGI — Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2024 తాజాగా తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి హాలీవుడ్ హీరోలా రీక్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్ పోస్ట్ చేశారు. ఇటీవల ఆర్జీవీ.. తెలుగు చిత్రపరిశ్రమలో అందగాడు అనే పేరు సొంతం చేసుకున్న నటుడు శోభన్ బాబుకు సంబంధిచిన రీక్రియేటెడ్ వీడియోను కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Guess The Actor: ఏఐ మాయ.. దిగ్గజ హీరో లుక్ అదిరిపోయిందంతే! -
నన్ను చంపడానికి కాంట్రాక్ట్.. చంద్రబాబు, లోకేశ్ ఖండించనేలేదు!
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తల నరికి తెచ్చినవారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ డిబేట్లో ఈ వ్యాఖ్యలు చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్జీవీ పోలీసులకు ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. (ఇది చదవండి: 'తల నరికితే రూ.కోటి'.. డీజీపీని కలిసిన ఆర్జీవీ!) విజయవాడలో ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. 'ఓ ఛానల్లో కొలికపూడి శ్రీనివాసరావు నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. నన్ను చంపడానికి టీవీ లైవ్‌లో డైరెక్ట్‌గా కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడున్న యాంకర్ సాంబశివరావు మాటవరసకు వద్దని వారిస్తున్నా కొలికపూడి అదే మాట మూడుసార్లు చెప్పారు. అతడి వ్యాఖ్యల వల్ల వేరేవాళ్లు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. ఏ టీవీ ఛానల్లో అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడో సదరు టీవీ ఛానల్ ఎండీకి సైతం ఈ కుట్రలో భాగస్వామ్యం ఉంది. దీనిపై కొలికపూడి, యాంకర్ సాంబశివరావు, ఛానల్ ఎండీ బిఆర్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఖండించలేదు. ఇక వ్యూహం సినిమాకు తెలుగుదేశం భయపడుతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటేనే టీడీపీ నేతలు గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారు' అని వ్యాఖ్యానించారు ఆర్జీవీ. (ఇది చదవండి: ధనుష్‌తో లింక్ చేశారు.. రెండో పెళ్లి గురించి..: మీనా) -
ఆ హీరో హీరోయిన్ ని డైరెక్ట్ చేయడం నాకు చాలా..!
-
రామ్ గోపాల్ వర్మ గురించి ఆయన మావయ్య ఏం చెప్పాడో చూడండి
-
బాబు అరెస్ట్.. లైట్ తీసుకుంటున్న ఎన్టీఆర్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
పాపం పండింది.. పాపాల చిట్టా బయటపడింది. చేసిన పనికి ఫలితం అనుభవించాల్సిందే! అది మంచైనా, చెడైనా! చంద్రబాబు అమానుష పాలనలో అవినీతి కథలు కోకొల్లలు. అయితే దేన్నైనా మసిపూసి మారేడు కాయ చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆ అవినీతి కథలను బయటకు రానివ్వలేదు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం పండిన నాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే! టీడీపీకి దూరంగా తారక్ ఇప్పుడదే జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టయి రోజులు గడుస్తున్నా జాతీయ స్థాయిలో కనీస మద్దతు లభించలేదు. అంతదాకా ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం బాబు అరెస్ట్‌పై పెదవి విప్పట్లేదు. ఇప్పుడనే కాదు.. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్.. టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ కోసం చెల్లని నాణెం విడుదల చేసినప్పుడు, ప్రత్యేక ప్రచారాలు, సభలు నిర్వహించినప్పుడు సైతం తారక్ తనకు పట్టనట్లే ఉండిపోయాడు. ఇక దబిడి దిబిడే తాజాగా ఈ అరెస్ట్ పైనా స్పందించకపోవడంతో తారక్.. బాబును లైట్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'చంద్రబాబు అరెస్ట్‌ను ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదు, కనీసం ఖండించడం లేదు కూడా! ఇక టీడీపీ భవిష్యత్తు దిబిడి దిబిడే' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. హరికృష్ణను వాడుకొని వదిలేసిన చంద్రబాబు! ఆగస్టు వెన్నుపోటు ఎపిసోడ్లో భాగంగా నాడు అన్న ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్న చంద్రబాబు.. కుటుంబ సభ్యులను విచ్చలవిడిగా వాడేశాడు. బావ నందమూరి హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులకు మంత్రి పదవులిస్తానంటూ ఆశ పెట్టాడు. ఇక్కడ హరికృష్ణతో మరో గేమ్ ఆడుకున్నాడు. ఆగస్టు ఎపిసోడ్ నాటికి.. హరికృష్ణ ఏ చట్టసభలోనూ సభ్యుడు కాదు. అయినా ఆ విషయం పట్టించుకోకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆరు నెలలకే ఆక్ పాక్ కరివేపాక్ ఓ వైపు తన పదవికి ఇబ్బంది ఉందని, తనను ఎమ్మెల్సీగా చేయాలని హరికృష్ణ అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో ఆరు నెలల గడువు ముగియగానే హరికృష్ణ అర్ధాంతరంగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు గానీ చంద్రబాబు కొట్టిన దెబ్బ హరికృష్ణకు అర్థం కాలేదు. ఎంతైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు ఉండరని హరికృష్ణ తరచుగా చెప్పేవారని ఆయన సన్నిహితులు అంటారు. సిగ్గు మాలిన రాజకీయాలు ఇక హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోయేంత వరకు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏపీ ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. హరికృష్ణను దరిదాపుల్లోకి రానివ్వలేదు. యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత మాత్రం హరికృష్ణ కుటుంబాన్ని మరో రకంగా వాడుకున్నాడు చంద్రబాబు. ఓవైపు హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు వందల మంది వస్తుంటే.. ఆ సందడిలో.. అక్కడే తమతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించాడని స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పాపం సుహాసిని.. మామ మాటలకు నవ్వుల పాలయి హరికృష్ణ కూతురు సుహాసినిని కూకట్పల్లి నుంచి నిలబెట్టి నవ్వులపాలు చేశాడు. సానుభూతితో సుహాసిని గెలిస్తే.. ఆ క్రెడిట్ కొట్టేద్దామని ప్లాన్ చేసి మొత్తం కుటుంబాన్ని రోడ్డునపడేలా చేశాడు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సుహాసిని కూకట్‌పల్లిలో ఓడిపోగా.. ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కనబెట్టాడు. ఏపీలో అధికారంలో ఉన్నా.. దాని వల్ల ఎలాంటి ప్రతిఫలం ఎన్టీఆర్ కుటుంబానికి గానీ, హరికృష్ణ కుటుంబానికి గానీ అందకుండా చేసిన ఘనత చంద్రబాబుదే. The fact that @tarak9999 dint even care about condemning @ncbn ‘s arrest clearly proves that future of TDP is DABIDI DIBIDI — Ram Gopal Varma (@RGVzoomin) September 13, 2023 చదవండి: బాబు, పవన్ ఫెవికాల్ బంధం.. కొంచమైనా సిగ్గుండాలి కదా? అనారోగ్యంతో ఆస్తి అమ్మేయాలనుకున్న నటి.. తల్లీకూతుళ్లను చంపుతామంటూ బెదిరింపులు -
పవన్ నా సినిమాలో ఫోజు కాపీ కొట్టారు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రామదూత క్రియేషన్స్ పతాకంపై తాను తెరకెక్కిస్తున్న చిత్రం 'వ్యూహం'లోని ఒక స్టిల్‌ను పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో చేసి చూపించారంటూ ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. తన సినిమా స్టిల్స్‌తో పవన్ కళ్యాణ్ ఫోజులకు పోలిక పెడుతూ ఫోటోలను జతచేశారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి విచారణ నిమిత్తం విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించిన నేపథ్యంలో ఆయనను కలిసేందుకు హైడ్రామా నడిపాడు పవన్ కళ్యాణ్. మొదట ఫ్లైట్‌లో గన్నవరం వెళ్లి అటునుంచి విజయవాడ వెళదామనుకున్న ఆయనకి గన్నవరం ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతి నిరాకరించింది. దీంతో రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించగా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఆయనను గరికపాడు చెక్‌పోస్టు వద్దే అడ్డుకున్నారు. అక్కడ అసలు డ్రామా శురూ చేసిన పవన్ కళ్యాణ్ రోడ్డుపైనే పడుకుని నానాయాగీ చేశారు. ఇదే క్రమంలో కాలుపై కాలు వేసుకుని పడుకున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గరికపాడు చెక్‌పోస్టు వద్ద రోడ్డు మీద ఇచ్చిన ఆ ఫోజులు నెల రోజుల క్రితం తాను తీస్తున్నట్టు ప్రకటించిన వ్యూహం చిత్రంలోనివంటూ ఫోటోల మధ్య పోలిక పెడుతూ నాకంటే గొప్పగా మనుషుల మనస్తత్వాలను అర్ధం చేసుకునే వారు ఎవరుంటారని కామెంట్ పెట్టారు. పైన నేను నెల క్రితం రిలీజ్ చేసిన “వ్యుహం” సినిమా ఫొటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫోటో pic.twitter.com/ve6CLfmOUW — Ram Gopal Varma (@RGVzoomin) September 10, 2023 Who can understand a persons psychology better than me ? 😎 పైన నేను నెల క్రితం రిలీజ్ చేసిన “వ్యుహం” సినిమా ఫొటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫోటో pic.twitter.com/SHNVPxp0Lv — Ram Gopal Varma (@RGVzoomin) September 10, 2023 ఇది కూడా చదవండి: ‘స్కిల్డ్ క్రిమినల్ ఫస్ట్ టైమ్ చట్టానికి దొరికిపోయాడు’ -
ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ
నోటికొచ్చింది మాట్లాడతా.. ఎవరినైనా తిట్టేస్తా.. హద్దూఅదుపూ లేకుండా విచ్చలవిడిగా వాగుతా.. నన్ను ఆపేవాళ్లే లేరు.. ప్రశ్నించేవాళ్లే లేరు.. అంటూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు టీడీపీ నేత నారా లోకేశ్! మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నారు.. ఎప్పుడూ అడ్డగోలు ఆరోపణలు చేసే ఆయన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను విమర్శించారు. మిమ్మల్ని కనాలనుకోలే.. మీరు పుట్టారు 'ఎవడో నిర్మాత రామ్‌గోపాల్ వర్మ థర్డ్ గ్రేడ్ సినిమాలు తీస్తాడు. ఆ మహానుభావుడు సినిమాలు తీసేందుకు పర్మిషన్... ప్రజల తరపున పోరాడుతున్న లోకేశ్‌కు ఆంక్షలా..' అని పెదవి విరిచారు. దీనిపై వర్మ యూట్యూబ్ వేదికగా చెంప చెళ్లుమనేలా సమాధానమిచ్చాడు. 'లోకేశ్.. నేను థర్డ్ గ్రేడా? ఫిఫ్త్ గ్రేడా? అన్నది ముఖ్యం కాదు.. నా ప్రశ్న ఏంటంటే.. మా నాన్న ఎక్కడో చిన్న ఉద్యోగం చేసేవారు. అక్కడి నుంచి నాకు నేనుగా సినిమాల్లోకి వచ్చి డైరెక్షన్ చేశాను. హిట్లు తీశాను, ఫ్లాపులు, సూపర్ ఫ్లాపులు కూడా తీశాను. మీరేమో చంద్రబాబు నాయుడు అనే పెద్ద నాయకుడికి పుట్టారు. ఆయన మిమ్మల్నే కనాలనుకోలేదు, కానీ మీరు పుట్టారు. దాన్ని బయాలజికల్ యాక్సిడెంట్ అంటారు. షూటింగ్ పర్మిషన్‌కు, మీటింగ్ పర్మిషన్‌కు మధ్య సంబంధమేంటి? ఇంతవరకు మీరేం సాధించారు? నేనేం సాధించాను? అనేది పక్కపక్కనే ఓ జాబితా తయరు చేసుకుని చూసుకోండి. అయినా నేను థర్డ్ గ్రేడ్ అంటే మరి మీరేం గ్రేడో..! మీ తండ్రిని పక్కనపెట్టేస్తే మీరు అరవడం తప్పిస్తే ఏం చేశారు? అనేది నాకింతవరకు అర్థం కాలేదు. మీరు రాజకీయ నాయకులు.. మీ ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో నాకు తెలియదు. ప్రతిరోజు వందల సినిమా షూటింగ్స్ జరుగుతాయి. నాకొక్కరికే కాదు, అందరికీ షూటింగ్‌కు అనుమతి ఇస్తారు. షూటింగ్ పర్మిషన్‌కు, మీటింగ్ పర్మిషన్‌కు మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు. అభద్రతాభావంలో లోకేశ్! మీరు తెలియక మాట్లాడతారా? జనాలకు తెలియదని మాట్లాడతారా? జనాలు పట్టించుకోరని మాట్లాడతారా? కొందరు ఆడియన్స్‌ను టార్గెట్ చేసి మాట్లాడతారా?.. మీరు ఓ వ్యూహం ప్రకారం మాట్లాడితే నాకు ఎలాంటి సమస్యా లేదు. మీరు అబద్ధం చెప్పినా, చెప్పాలనుకున్నా అందులో ఓ ఎజెండా ఉందనుకుంటే పర్వాలేదు. అలా కాకుండా మీరు ఏదేదో మాట్లాడితే.. మీకంటూ గుర్తింపు లేదని, తండ్రికి తగ్గ కొడుకుని కాదేమోనన్న అభద్రతాభావంలో ఉన్నారనిపిస్తోంది. మీకు నిజంగా ఈ సమస్య ఉంటే సైకియాట్రిస్ట్‌కు చూపించుకుంటే మంచిది. ఇదే నేను మీకిచ్చే సలహా' అని చెప్పుకొచ్చాడు వర్మ. చదవండి: National film awards 2023: అల్లు అర్జున్... ఉత్తమ నటుడు మరి నీ సంగతేంటి లోకేషం.. ఎన్ని కేసులు పెట్టవచ్చు? -
షారుక్ ఖాన్ పని అయిపోయిందంటూ ఆర్జీవీ ట్వీట్!
బాక్సాఫీస్ పని అయిపోయింది. హిందీ సినిమాలు ఆడే రోజులు పోయాయి. స్టార్ హీరోలు రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చోవాల్సిందే! కోట్లల్లో కలెక్షన్లు రాబట్టడం కేవలం కలే.. అన్నమాటలకు చెక్ పెట్టాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. అతడు ప్రధాన పాత్రలో నటించిన పఠాన్ సూపర్ డూపర్ హిట్టయింది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్ల పైచిలుకు గ్రాస్ రాబట్టి బాయ్‌కాట్ గ్యాంగ్‌కు చెంపపెట్టు సమాధానమిచ్చింది వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దీనిపై వెరైటీగా స్పందించాడు. '1. ఓటీటీలు వచ్చాక థియేటర్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం కష్టమే. 2. షారుక్ ఖాన్ పని అయిపోయింది. 3. దక్షిణాది డైరెక్టర్స్లా.. బాలీవుడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ సాధించడం జరగని పని. 3. కేజీఎఫ్ 2 మొదటిరోజు కలెక్షన్స్ బ్రేక్ చేయడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది... ఈ అపోహలన్నింటినీ పఠాన్ పఠాపంచలు చేసింది' అని ట్వీట్ చేశాడు. వర్మ పఠాన్ మూవీని ఓవైపు విమర్శిస్తున్నట్లుగా కనిపించినా చివరాఖరికి మాత్రం మెచ్చుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 1. Theatre collections will never be great again in times of OTT 2. SRK is a fading star 3. Bollywood can never make a COMMERCIAL BLOCKBUSTER like the south masala directors 4. It will take years to break the day 1 collections of KGF 2 ALL above MYTHS broken by PATHAN — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2023 చదవండి: హనీరోజ్‌ను గుర్తుపట్టారా? 15 ఏళ్ల క్రితమే తెలుగులో! నన్ను హత్య చేసేందుకు కుట్ర: సంచలన ఆరోపణలు చేసిన నరేశ్ -
ఆర్జీవీ వల్ల కోటి రూపాయలు నష్టపోయా: నిర్మాత
రామ్‌గోపాల్ వర్మ స్పీచ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్నానంటున్నాడు ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ. సుమారు 200కు పైగా చిత్రాలు నిర్మించిన ఆయన అప్పట్లో ఆర్జీవీతో ఐస్‌క్రీమ్ తీసి నష్టపోయానని చెప్తున్నాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "2004లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, 2014లో రామ్‌గోపాల్ వర్మతో ఐస్‌క్రీమ్ సినిమా తీశాను. అప్పట్లో శాటిలైట్ హక్కులు జెమిని టీవీ వాళ్లు కొనేవారు. అలా ఈ సినిమాను కోటి 20 లక్షల రూపాయలకు కొన్నారు. కానీ రామ్‌గోపాల్ వర్మ నోరు జారుతూ ఈ సినిమాకు రూ.2. 5 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టారని చెప్పాడు" "దీంతో అనవసరంగా ఈ సినిమాను ఎక్కువ మొత్తానికి కొన్నామా? అన్న ఆలోచనలో పడ్డ జెమిని యాజమాన్యం వారి డీల్‌ను రద్దు చేసుకున్నారు. నిజానికి ఆర్జీవీ.. రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో సినిమా ప్రారంభించాం. హీరోయిన్లు, టెక్నీషియన్లు అందరం సినిమా సక్సెస్ అయ్యాక డబ్బులు తీసుకున్నాం అని చెప్పాడు. కానీ వాళ్లదంతా వినలేదు. కేవలం ఆ పెట్టుబడి గురించి మాత్రమే విని సినిమా వదిలేశారు" అని రామ సత్యనారాయణ చెప్పుకొచ్చాడు. చదవండి: కరోనాతో తమిళ నిర్మాత మృతి -
నిఖిలెవరో నాకు తెలీదు: ఆర్జీవీ
"శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయిందిగా.." అంటూ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను పరోక్షంగా కుక్కతో పోలుస్తూ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి వర్మ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అసలు నిఖిలెవరో తనకు తెలియదన్నారు. "నిఖిల్ అయినా, కిఖిల్ అయినా అందరూ పవన్ కళ్యాణ్ కింద తొత్తుల్లా ఉంటారు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్‌కు వీరిమీద మంచి అభిప్రాయం ఏర్పడుతుందని వాళ్ల ఆశ. అది బానిసత్వం అనే బుద్ధిలో నుంచి వచ్చే ఆశ. కానీ నాకు నిఖిలెవడో తెలీదు. అతనో పెద్ద స్టార్ అయిండొచ్చు. కానీ నాకు మాత్రం తెలీద"ని చెప్పుకొచ్చారు. (వర్మకు హీరో కౌంటర్: ఆడేసుకుంటున్న నెటిజన్లు) కాగా పీకేను టార్గెట్ చేస్తూ వర్మ "పవన్ కళ్యాణ్: ఎన్నికల ఫలితాల తరువాతి కథ" అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పవర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహం చేస్తూ ఆ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్‌లకు డిస్‌లైక్‌లు కొడుతూ కసి తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పవన్ వీరాభిమానులు వర్మను ఉద్దేశిస్తూ "పరాన్న జీవి" సినిమా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. దీనిపై వర్మ స్పందిస్తూ.. "నాకు మీడియా పరాన్నజీవి, మీడియాకు నేను పరాన్నజీవి" అని పేర్కొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ పరాన్న జీవులు, ఫ్యాన్స్‌కు పీకే పరాన్నజీవి అని చెప్పుకొచ్చారు. (పవన్ ‘వకీల్ సాబ్’: మరో లీక్) -
వర్మను కుక్కతో పోల్చిన నిఖిల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువే. సినీ ఇండస్ట్రీలో కూడా అతనికి వీరాభిమానులు ఉన్నారు. అందులో నిఖిల్ సిద్దార్థ ఒకరు. అయితే పవన్‌ను టార్గెట్ చేస్తూ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాతి కథ" పేరుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి 'గడ్డి తింటావా?' సాంగ్‌ను రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ లీకైపోయింది. అయితే ఇలా వర్మ పీకేను టార్గెట్ చేయడం నిఖిల్‌కు అస్సలు నచ్చలేదు. దీంతో వర్మ పేరెత్తకుండానే ఆయన్ని కుక్కతో పోల్చుతూ మండిపడ్డారు. "శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయిందిగా.." అంటూ ట్వీట్ చేశారు. (చైనా కావాలనే ఇలా చేసింది : హీరో నిఖిల్) దీనికి పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు. దీంతో వర్మకు తిక్క కుదిరిందంటూ పవన్ అభిమానులు సంతోషపడుతుంటే వారి ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు. 'అవును.. శిఖరం అంటే 120 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు అవడం ఏమో అనుకుంట', 'ఇప్పుడు పవర్ స్టార్ ఫ్లవర్ స్టార్ అయ్యాడు. అభిమానులకు పెద్ద కాలీఫ్లవర్ పెడతాడు' అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత పెద్ద మాటన్నాక వర్మ నిమ్మకు నీరెత్తనట్టు ఊరుకుంటారా? రివర్స్ కౌంటర్ ఇస్తారా చూడాలి. (‘పవర్ స్టార్’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ) -
ఆర్జీవీని ఆటపట్టించిన రాజమౌళి
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ముక్కుసూటి మనిషి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనకు నచ్చినట్లుగా సినిమాలు తీస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎప్పుడూ ఎవరికో ఒకరికి కౌంటర్ ఇస్తూ ఉండటం ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వ్యక్తికి ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి సెటైర్ విసిరాడు. ఆర్జీవీని ఏమని పిలవాలో అర్థం కావటం లేదంటూ తీవ్ర సందిగ్ధంలో పడ్డాడు. అయితే అతని గందరగోళానికి కారణం లేకపోలేదు. వర్మ కూతురు రేవతికి ప్రణవ్ అనే వైద్యుడితో 2013లో వివాహం జరిగింది. కాగా నేడు ఉదయం రేవతి అమ్మాయికి జన్మనిచ్చింది. (నా తదుపరి చిత్రం ‘దిశ’: వర్మ) ఈ సందర్భంగా జక్కన్న వర్మను ఆటపట్టిస్తూ.. ‘వర్మ తాతయ్యకు శుభాకాంక్షలు.. ఇన్నాళ్లకు ఆయనకు కళ్లెం వేసే వ్యక్తి వచ్చేసింది. ఇంతకీ నిన్ను రాము నాన్న లేదా రాము తాతయ్య.. ఏమని పిలవాలబ్బా’ అంటూ ట్వీట్ చేశాడు. ఓవైపు దీనికి ఆర్జీవీ ఏమని రిప్లై ఇస్తాడోనని కొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మరికొందరు మాత్రం నిరాశకు లోనయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా అప్డేట్ ఇచ్చాడేమోనని ఆశించి భంగపడ్డామని కొందరు అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఆర్జీవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. (రోజా పక్కన దిష్టి బొమ్మ?: వర్మ) Congratulations Ramu thaatayya garu...😂😂😂💕🤣❤️❤️ Wishing your granddaughter will be the person who will finally rein you in... btw what do you prefer Ramu tata Ramu Nanna or Grandpa Ramu...@RGVzoomin 😂😂🤣 — rajamouli ss (@ssrajamouli) February 10, 2020 -
అందుకే వర్మ ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదు
సాక్షి, విజయవాడ: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు అనుమతి నిరాకరించడంపై విజయవాడ పోలీసులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడ నగరపరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 114 సీఆర్పీసీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నాయని, అందువల్ల ప్రెస్‌మీట్ నిర్వహించుకునేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఐబీయమ్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నట్లు పోలీసులు విడుదల చేసిన ఓ నోట్లో పేర్కొన్నారు. చదవండి....(నేనేమైనా ఉగ్రవాదినా?: వర్మ సూటి ప్రశ్న ) (హే.. చంద్రబాబు ఎక్కడ ప్రజాస్వామ్యం: వర్మ) వర్మ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తూ, శాంతి భద్రతలకు పూర్తిస్థాయిలో విఘాతం ఏర్పడి, అశాంతి చెలరేగే అవకాశ ఉందని తమకు ముందస్తు సమాచారం ఉన్నట్లు తెలిపారు. బహరింగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో ఇతరులను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి దూషణలు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలకు నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ విషయాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రెస్‌మీట్ ప్రయత్నం విరమించి శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని వర్మను కోరారు. ఈ మేరకు విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో ఓ లేఖను విడుదల చేసి, రాంగోపాల్ వర్మకు అందించారు. కాగా తన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విటర్ లైవ్‌ను పోలీసులు ఆపివేశారంటూ వర్మ మరో ట్విట్ చేశారు. I can’t communicate because they blocked my insta facebook twitter live — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2019 -
సమాధానం చెప్పినా చెప్పకపోయినా.. చంపటం గ్యారంటీ
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా 28 ఏళ్ల క్రితం తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'శివ' కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున హీరోగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'కంపెనీ' పేరిట తెరకెక్కిస్తున్న చిత్రం ముహూర్తపు షాట్‌ను సోమవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ షాట్‌ను తన మార్క్ డైలాగ్‌తో వర్మ షూట్ చేశాడు. ‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా..నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావు. తక్కువ నొప్పితో చస్తావా.. ఎక్కువ నొప్పితో చస్తావా..చూస్తా’ అనే డైలాగ్‌తో తొలి షాట్ తీశాడు వర్మ. ఈచిత్రంలో నాగ్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడన్నవిషయం తెలిసిందే. ఇప్పటికే తుపాకీతో నాగ్ సీరియస్ లుక్‌తో ఉన్న ఫోటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. -
ఎమోషనల్ అయిన వర్మ.. ఏం చేశాడో చూస్కోండి
సాక్షి, సినిమా : దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి తన శైలిని ప్రదర్శించారు. నవంబర్ 20న ఉదయం 10 గం. 30 ని. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునతో తీయబోయే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ ఫేస్ బుక్‌లో ఓ సందేశం ఉంచారు. శివ ఓపెనింగ్ రోజు తన తండ్రి, నాగ్ తండ్రి నాగేశ్వరరావు హాజరయ్యారని.. కానీ, ఇప్పుడు కొత్త చిత్రం కోసం తన తల్లి, నాగ్ సోదరుడు అక్కినేని వెంకట్, మరో నిర్మాత యార్లగడ్డ సురేంద్ర హాజరవుతారన్నారు. ఆపై ప్రతీ 3 దశాబ్దాలకోకసారి తానూ ఎమోషనల్, సెంటిమెంట్ అవుతానని చెప్పారు. ఇక ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది. నంది అవార్డుల ప్రకటనపై తన అసంతృప్తిని వెల్లగక్కిన వర్మ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. కాసేపటికి నంది అవార్డులపై సెటైరిక్‌గా నంది విగ్రహం పాడిన పాట... అంటూ చేసిన ఓ పోస్ట్ హిల్లేరియస్‌గా పేలింది. ఎన్టీఆర్.. ఏఎన్నార్ ప్రధాన పాత్రలో వచ్చిన చాణక్య చంద్రగుప్త సినిమాలోని ఒకటా.. రెండా... తొమ్మిది... మరి ఒకతే తకతై చిన్నది... అని సినారె రాసిన పాట సాహిత్యాన్ని వర్మ టోటల్ గా మార్చిపడేశాడు. ఒకటా.. రెండా... తొమ్మిది... మరి ఒకటే నేనూ నందిని... అంటూ కొత్త వర్షన్ రూపొందించాడు. సైకిల్, కమ్మది, పచ్చ జెండా వంటి కొన్ని పదాలను వాడి నంది అవార్డుల కమిటీ, దాని వెనుక పెద్ద తలకాయలను ఏకీపడేశాడు. అవార్డుల విషయంలో అంతా మా ఇష్టమని కమిటీ సభ్యులు(రాజబాబు, పద్మనాభం, రావుగోపాలరావు...) అంటుంటే, నందిగా జయ మాలిని తన గోడును చెప్పుకోవటం... ప్రస్తుతం ఈ వర్మ వర్షన్ సాంగ్ వైరల్ అవుతోంది.. దానిని మీరూ ఓ లుక్కేయండి. -
విజయవాడలో `వంగవీటి` ఆడియో
విజయవాడ నగరంలో ఒకప్పుడు సంచలనం రేపిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా చేయబోతున్నాడని అనౌన్స్ చేయగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ ఈ సినిమా తీస్తున్నాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేసిన వంగవీటి ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో గ్రాండ్‌గా చేయనున్నారు. చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ .. ‘విజయవాడ రౌడీయిజంపై నా దర్శకత్వంలో రూపొందుతోన్న వంగవీటి నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. అప్పట్లో అక్కడ జరిగిన చాలా సంఘర్షణలకు నేను ప్రత్యక్షసాక్షిని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రవి శంకర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 3న వంగవీటి ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురు ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నాం. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పాడు. -
ఆఖరి షెడ్యూల్లో ఆర్జీవీ వంగవీటి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో కాంట్రవర్షియల్ మూవీ వంగవీటి. విజయవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో.. ప్రత్యేకంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు వర్మ. టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా ఎనౌన్స్ చేసిన సమయంలో వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ తెగ హడావిడి చేసిన వర్మ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. మకాం ముంబైకి మార్చేయటం, బాలీవుడ్లో వీరప్పన్ సినిమా ప్రమోషన్లో బిజీ కావటంతో వంగవీటి సినిమా ఆగిపోయినట్టే అని భావించారు. అయితే ఇప్పుడు వంగవీటి సినిమా షూటింగ్ పూర్తికావచ్చిందన్న వార్త టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఎనౌన్స్ మెంట్ సమయంలోనే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా రిలీజ్ టైంకి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి. -
ఎలాగూ చనిపోతాం... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది!
రామ్‌గోపాల్ వర్మ... ఈ పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున స్ఫురించేది ఓ విలక్షణ వ్యక్తిత్వం. ఆయన మాటలైనా, చేతలైనా ఎప్పుడూ ఏదో ఒక సంచలనమే. సినిమా హిట్టు, ఫ్లాపులతో ఆయనకు సంబంధం లేదు. వాటికి అతీతంగా అనునిత్యం వార్తల్లో ఉండడం వర్మలోని విశేషం. మరి, అలాంటి విలక్షణ వ్యక్తి ఎవరిని చూసి ప్రభావితమయ్యారు? దేన్ని చూసి, ఏం చదివి ప్రేరణ పొందారు? ఎవరి మీదైనా సరే మాటల తూటాలు పేల్చే ఈ మనిషికి బతుకు మీద భయం లేదా? రండి... రామూను అడిగేద్దాం... ఆయన మాటల్లోనే వివరణ వినేద్దాం. అతని తెలివితేటల ముందు నేనో పురుగులా అనిపించేవాణ్ణి! నన్ను ప్రధానంగా ప్రభావితం చేసిన వ్యక్తి - ఇంజినీరింగ్ కాలేజ్‌లో నాకు జూనియర్ అయిన నా స్నేహితుడు సత్యేంద్ర. అతను చాలా తెలివైనవాడు. ఇంటర్నెట్ లాంటివేవీ లేని ఆ రోజుల్లో విశాఖపట్నం నుంచి విజయవాడకు చదువుకోవడానికి వచ్చిన పద్ధెనిమిదేళ్ళ అతను ఆ తరం విద్యార్థులు ఎవరూ ఊహించని రీతిలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాడు. ఆరు నెలల పాటు నేను, అతను రూమ్మేట్లం. అతనితో మాట్లాడుతుంటే, అదో చెప్పలేని అనుభూతి. ఒకసారి పరీక్షల ముందు నేను, సత్యేంద్ర విజయవాడలోని లీలామహల్లో ఓ ఇంగ్లిషు సినిమాకు వెళ్ళాం. సత్యేంద్ర ఆ సినిమా చూడడం అప్పటికి ఏడోసారి. ఇంతలో మా కాలేజ్ ప్రిన్సిపాల్ తుమ్మల వేణుగోపాలరావు కూడా అదే సినిమాకు వచ్చారు. ‘ఏమిటి ఇలా వచ్చార’ని ఆయన అడిగితే, ‘మీరు కాలేజ్‌లో నేర్పే దాని కన్నా, ఈ సినిమాల ద్వారా నేర్చుకునేది ఎక్కువ. అందుకే, ఈ సినిమాకు ఏడోసారి వచ్చా’ అన్నాడు సత్యేంద్ర. ‘ఈ సినిమా నేను చూశాను. ఇందులో అంత ఏముంది?’ అన్నారు ప్రిన్సిపాల్. ‘మీకు కనిపించనిదేదో, నాకు కనిపించింది’ అన్నాడు సత్యేంద్ర. చూడడానికి అతని మాట తీరు అలా నిర్లక్ష్యంగా అనిపించినా, అంత తెలివైన విద్యార్థిని నేను చూడలేదంటే నమ్మండి. చివరకు, మా ప్రిన్సిపాల్ గారు కూడా ఓ సందర్భంలో ‘నేను మరువలేని విద్యార్థి’ అంటూ సత్యేంద్ర మీద చాలా గొప్పగా ఓ వ్యాసం రాశారు. దాన్నిబట్టి అతను ఎలాంటివాడో అర్థం చేసుకోండి. అవడానికి కాలేజీలో నాకు జూనియర్ అయినా, సత్యేంద్ర మాటలు, అతను ప్రస్తావించిన పుస్తకాల పఠనం నన్నెంతగానో మార్చేశాయి. అతనితో మాట్లాడితే, మనకు తెలియని ఓ అభద్రత కలుగుతుంది. ఆయన తెలివితేటల ముందు మనమంతా పురుగులలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు సత్యేంద్ర. ఈ మధ్యే మూడు నెలల క్రితం కూడా అతనితో ఫోన్లో మాట్లాడాను. అతని మాటల్లోని తార్కికత మనల్ని ఆలోచనల్లో పడేస్తుంది. మనలోని అజ్ఞానపు తెరలు ఒక్కొక్కటిగా విడిపోతూ, ఉంటాయి. ‘భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను’ లాంటి ప్రకటనల వెనుక ఉన్న మన అంతరంగాన్ని ఆయన ప్రశ్నిస్తారు. కేవలం దేశాన్ని ప్రేమిస్తున్నావా, ఇక్కడి వ్యక్తులను ప్రేమిస్తున్నావా, కులాలు - మతాలు - ప్రాంతాల లాంటి విభేదాలు ఏమీ లేకుండా వ్యక్తులను ప్రేమించగలవా అని ఆయన చెప్పే తర్కం ఆలోచనలో పడేసేది. మనలో గూడు కట్టుకున్న స్థిరమైన అభిప్రాయాలనూ, భావాలనూ అతని మాటలు ఛిన్నాభిన్నం చేసేస్తాయి. నా జీవిత తాత్త్వికత అంతా ఆ పుస్తకాల ప్రభావమే! సత్యేంద్ర తరువాత నన్ను అమితంగా ప్రభావితం చేసినవి పుస్తకాలే. ఇంటర్మీడియట్ చదువుతుండగానే నేను కాల్పనిక సాహిత్యమంతా చదివేశాను. కాల్పనికేతర సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాకే చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఫిలాసఫీ పుస్తకాలు, అందులోనూ పొలిటికల్ ఫిలాసఫీ పుస్తకాలు తెగ చదువుతుంటాను. వాటిని నాకు పరిచయం చేసింది సత్యేంద్రే. ఆయన స్నేహం వల్లే నేను జర్మన్ తత్త్వవేత్త నీషే, అయన్ ర్యాండ్ లాంటి ప్రసిద్ధులు రాసిన పుస్తకాలు చదివాను. అయన్ ర్యాండ్ రచనలన్నీ దాదాపు చదివేశాను. ముఖ్యంగా ఆమె రచనలు, నీషే రాసిన ‘దజ్ స్పేక్ జరాథుస్త్రా’ - నన్ను బాగా ప్రభావితం చేశాయి. అన్నట్లు నేను ఇందాక చెప్పిన సత్యేంద్ర కూడా ఇప్పుడు ఓ పుస్తకం రాస్తున్నాడు. అతని ఆలోచనలతో నిండిన ఆ పుస్తకం జనం ఆలోచించే తీరును మార్చి వేస్తుందని ఆయన నమ్మకం. కచ్చితంగా అది ఓ సంచలనమవుతుంది. తెలుగు పుస్తకాల విషయానికి వస్తే, నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం’ చదివాను. అలాగే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, చలం రచనలు చదివాను. చలం మంచి రచయితే కానీ, ఆ భావాలు అప్పటికి కూడా కొత్త ఏమీ కాదు. అవన్నీ ప్రపంచ ప్రసిద్ధులైన నీషే తదితరుల తాత్త్వికతలో ఉన్నవే. ఆ సినిమాల జాబితా చాలా పెద్దది! ప్రపంచ సినీ చరిత్రలో ఆణిముత్యాలని చెప్పదగ్గ చిత్రాలు కొన్ని నా మీద ప్రభావం చూపాయి. వాటి జాబితా పెద్దదే. అయితే, చటుక్కున నాకు గుర్తొచ్చే సినిమాలు - ‘గాడ్ ఫాదర్’, ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఎగ్జార్సిస్ట్’. భారతీయ సినిమాల్లోకి వస్తే ‘షోలే’, ‘అర్ధ్ సత్య’ లాంటివి నన్ను ప్రభావితం చేశాయి. అలాగే, నా మీద ప్రభావం చూపాయని అనలేను కానీ, నేను బాగా ఇష్టపడిన తెలుగు సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాసరి నారాయణరావు గారి ‘శివరంజని’, బాలచందర్ గారి సినిమాల లాంటివి నాకెంతో ఇష్టం. అలాగే, షార్ట్‌ఫిలిమ్‌లు, నేషనల్ జాగ్రఫీ చానల్లో వచ్చే డాక్యుమెంటరీలు కూడా తరచూ చూస్తూ ఉంటాను. వాటి ప్రభావం నా మీద కొంత ఉంది. నాకెప్పుడూ, దేనికీ భయం లేదు! అవతలివాళ్ళను భయపెట్టడం నాకు ఇష్టం. కానీ, చిత్రమైన విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడూ భయం అనిపించదు. చాలా ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని లాతూరులో భయంకరమైన భూకంపం వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు నేను బొంబాయిలో ఎనిమిదో అంతస్థులోని ఇంట్లో ఉన్నా. భవనమంతా ఒక్కసారిగా భయంకరంగా ఊగుతోంది. భూకంపం వచ్చిన విషయం నాకు అర్థమైంది. కిందకు వెళదామని అనుకున్నా. కానీ, వెంటనే ఈ లోపలే భవంతి కూలిపోయి చనిపోతామేమోలే... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది. అంతే! అక్కడే ఉండిపోయి, భూకంపం వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నా. భవంతి గోడలు విరిగినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చున్నా! - రెంటాల జయదేవ ఫొటోలు: శివ మల్లాల -
సినీ నిర్మాతలకు దడలక్ష్మి!
సినీ నిర్మాతలకు, సెన్సార్ బోర్డు సభ్యులకు విబేధాల నెలకొన్నాయనే వార్తలు వినిపించడం సహజమే. తమ సృజనాత్మకతపై సెన్సార్ బోర్డు అధికారులు కత్తెర వేస్తున్నారనే ఆరోపించడం మనం గమనిస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలకు, సెన్సార్ కు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు వివాదస్పద ఆరోపణలు చేయడం మీడియాలో సంచలనంగా మారాయి. సినిమాలను నిర్మించడం ఒక ఎత్తు అయితే.. ధనలక్ష్మిని ఎదుర్కోవడం మరో ఎత్తు అనే భావనలో ఉన్నారు. ఇన్నాళ్లు తమ గోడును ఎవరికి చెప్పుకోలేక...ధనలక్ష్మిని ఎదురించలేక ఊరుకున్నారు. ప్రాంతీయ సెన్సార్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ధనలక్ష్మికి, పలువురు సినీ నిర్మాతలకు మధ్య గొడవలు మీడియాకే పరిమితంగా కాగా.. తాజాగా కోర్టు మెట్లెక్కాయి. గతంలో ధనలక్ష్మి నియామకంపై కోర్టులో డీవీ శైలేంద్ర కుమారి పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 29(1) ఆర్టికల్ నిబంధనను ఉల్లంఘించి నియామకం చేపట్టారని పిటిషన్ దాఖలైంది. ధనలక్ష్మిపై చాలా మంది నిర్మాతలు ఆరోపణలు చేసినా.. వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లలేదు. అయితే ప్రస్తుతం ధనలక్ష్మికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య సత్య2 చిత్ర విషయంలో వివాదం నెలకొంది. సత్య2 చిత్ర విడుదల సమయంలో ధనలక్ష్మి తనను వేధించిందని వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా.. పలు మీడియా చానెల్లలో వెల్లడించారు. 'సత్య2' చిత్ర విషయంలో తొలగించిన సన్నివేశాలపై ధనలక్ష్మి వివరణ ఇచ్చారు. ఓ టెలివిజన్ సమర్పించిన వినతిపత్రం ఆధారంగానే స్పందించి కొన్ని సన్నివేశాలను తొలగించాం అని ధనలక్ష్మి తెలిపారు. తనను వేధించిన ధనలక్ష్మిపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదు చేస్తాను అని అన్నారు. తన పట్ల ప్రవర్తించిన తీరుతో మానసికంగా బాధను అనుభవించానని.. అంతేకాకుండా ఆర్ధికంగా కూడా నష్టపోయానని వర్మ తెలిపారు. బాలీవుడ్ చిత్రాలను నిర్మించిన వర్మకు ముంబైలో మాఫియాను మేనేజ్ చేసిన సామర్ధ్యం ఉంది. పరిస్థితులను బాలీవుడ్ లో తనకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలీకృతమైన వర్మకు ధనలక్ష్మి చుక్కలు చూపించినట్టు వర్మ మాటలతో అర్ధమైంది. గతంలో ధనలక్ష్మిని బారిన పడిన ఇతర సినీ నిర్మాతలు రాంగోపాల్ వర్మ రియాక్షన్ కు మద్దతుగా నిలిచారు. దేనికైనా రెఢీ చిత్రం విడుదల సందర్భంగా కూడా నిర్మాత మంచు మోహన్ బాబు ఇదే బాధను అనుభవించారు. ఆ సమయంలో ధనలక్ష్మిపై కేంద్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తానని మీడియాలో తెలిపారు. మోహన్ బాబు మాదిరిగానే కాలిచరణ్ దర్శకుడు ప్రవీణ్ శ్రీ, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు ఇతరులు తమ చిత్రాల విడుదల సమయంలో ఇబ్బందిని ఎదుర్కొన్నట్టు సమాచారం. వీరెవ్వరూ కూడా బయటకు చెప్పలేక.. ధనలక్ష్మితో సర్ధుబాటు ధోరణి ప్రదర్శించారు. గత కాలంగా అవకాశం ఎదురు చూస్తున్న బాధితులందరికి వర్మ ఆసరా దొరికింది. ఎందరో నిర్మాతలకు దడ పుట్టిస్తున్న ధనలక్ష్మిని వర్మ సహాయంతో ఎలా చెక్ పెడుతారో వేచి చూడాల్సిందే. a.rajababu@sakshi.com