
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా 28 ఏళ్ల క్రితం తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'శివ' కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున హీరోగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'కంపెనీ' పేరిట తెరకెక్కిస్తున్న చిత్రం ముహూర్తపు షాట్‌ను సోమవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ షాట్‌ను తన మార్క్ డైలాగ్‌తో వర్మ షూట్ చేశాడు.
‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా..నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావు. తక్కువ నొప్పితో చస్తావా.. ఎక్కువ నొప్పితో చస్తావా..చూస్తా’ అనే డైలాగ్‌తో తొలి షాట్ తీశాడు వర్మ. ఈచిత్రంలో నాగ్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడన్నవిషయం తెలిసిందే. ఇప్పటికే తుపాకీతో నాగ్ సీరియస్ లుక్‌తో ఉన్న ఫోటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment